గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 July 2019

కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతం, ప్రపంచ సంగీత రీతులన్నింటిలోకీ విశిష్టతను పొందటానికి,ఆసంగీతంలోని రచనలు ఒక ప్రధాన కారణము.వాటిని రూపొందించిన వాగ్గేయకారులు మనకు సదా స్మరణీయులు.
సంగీత రచనలను రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు.1.అభ్యాస రచనలు, 2.సభా గాన రచనలు.
అభ్యాస రచనలు అంటే,విద్యార్థులు తమ ఇళ్ళలో సాధనచేసుకోవలసినవి.సభా గాన రచనలు అంటే,ఒక స్థాయికి చేరుకొన్న కళాకారులు,సభలలో గానం చేయదగినవి..
1. అభ్యాస రచనలు : సరళీవరుసలు,జంట వరుసలు,దాటు వరుసలు,స్థాయి వరుసలు,గీతములు,శూళాదులు,చిట్ట తానములు,స్వర పల్లవులు,స్వర జతులు,వర్ణములు...మొదలైనవి.

--సరళీ వరుసలు--
ఆరోహణ,అవరోహణ తో ప్రారంభించి,సప్తస్వరాలను వివిధరకాలుగా అమర్చి,పాడే అభ్యాసం
--జంట స్వరాలు--
ప్రతి స్వరాన్ని రెండు సార్లు పలుకుతూ స్ఫురిత గమకంతో చేసే స్వర అభ్యాసం
--దాటు స్వరాలు--
స్వరాల క్రమంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా వదలి,దాటుతూ చేసే అభ్యాసం
--స్థాయి వరుసలు--
స్వరాలను మంద్ర,మధ్యమ,తార స్థాయిలలో పాడే అభ్యాసం
( పైన తెలిపిన అభ్యాస రచనలను 'కర్ణాటక సంగీత పితామహులు' పురందరదసులవారు మాయామాళవగౌళ రాగంలో రూపొందించారు).
--గీతములు--
గీతములు సులభతరమైన సంగీత రచనలు.సరళీవరుసల నుండి స్థాయి వరుసల వరకూ ధాతు(స్వర) సాధన చేసిన సంగీత విద్యార్థికి,మాతు(సాహిత్యం) పరిచయం,గీతాల నుండే ప్రారంభమౌతుంది.వీటిలో పల్లవి,అనుపల్లవి,చరణం వంటి విభాగాలు ఉండవు.సంగతులుండవు.క్రియకు ఒక అక్షరం చొప్పున గమనముంటుంది.
గీతాలలో విఘ్నేశ్వర స్థుతితో కూడుకొన్న వాటికి 'పిళ్ళారి గీతాలు' అని పేరు.పురందరదాసులవారు ఇవి రచించారు.
రాగలక్షణాలను వివరించే గీతాలను లక్షణ గీతాలని, నాట,గౌళ,ఆరభి,వరాళి,శ్రీరాగము-ఈ అయిదు రాగాలలో రచింపబడిన గీతాలను 'ఘనరాగ గీతాలని', వివిధ రాగాలు ఒకే గీతములో ప్రయోగించబడితే, వాటిని 'రాగమాలికా గీతాలని' పిలవటం కద్దు.
వెయ్యికి పైగా గీతాలను రచించిన కారణంగా, పైడాల గురుమూర్తి శాస్త్రిగారిని,' వేయి గీతాల శాస్త్రి' అని పిలిచేవారు.
--సూళాదులు--
గీతాలను పోలిన రచనలు ఇవి.పురందరదాసు,అన్నమయ్య వీటిని రచించారు.వీటిలో తాళమాలికలు కూడా ఉన్నవి.
--చిట్ట తానములు--
మనోధర్మ అంశమైన తాన సాధనకు ఉపకరించే రచనలు.వీణవాదకులు,ఈరచనలను వివిధ రాగాలలో సాధన చేస్తే,తానములోని మీటు చక్కగా పలుకుతుంది.వీటికే 'కటకములు' అనికూడా పేరు ఉంది.ఘనరాగ కటకాలు కూడా వాగ్గేయకారులచే రచింపబడ్డాయి.
--స్వరపల్లవులు--
వీటికే 'జతి స్వరములు' అని పేరు కూడా ఉంది.వీటిలో స్వరము మాత్రమే ఉంటుంది.పల్లవి,చరణాలను కలిగిన రచనలివి.సాధారణంగా ఇవి,క్రియకు ఒక అక్షర కాలము కాక,నాలుగు అక్షరకాలము నడుస్తాయి.కాల,పైకాలాలు పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.
--స్వరజతులు--
వీటిలో పల్లవి,చరణాలు ఉంటాయి.మంచి రాగ,సాహిత్య భావములతో కూడి,కచేరీలలో సైతం పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రిగారు స్వరజతులు వ్రాసినవారిలో ప్రసిద్ధులు.
--వర్ణములు--
సంగీత విద్యార్థికి,రాగాలను గురించిన సంపూర్ణ అవగాహన కల్పించేది వర్ణము.పల్లవి,అనుపల్లవి,చరణము,చిట్టస్వరాలతో కూడుకొని ఉంటుంది.తాన సాధనకు ఎంతో దోహదకారి కనుక,దీనిని 'తాన వర్ణం' అని పిలుస్తారు.ఆది,అట,ఝంపె తాళాలలో వర్ణరచన ఎక్కువగా జరిగింది.సంగతులతో కూడి,స్వర సాహిత్య సహితంగా ఉండే వర్ణాలను 'పద వర్ణాలు' అంటారు.మనోధర్మ సంగీత అంశాలైన రాగాలాపన,స్వర ప్రస్థారం,నెరవు,తానం,పల్లవి-వీటిని సాధించాలంటే,సంగీత విద్యార్థికి వర్ణ సాధన తప్పనిసరి. అభ్యాస రచనలైనప్పటికీ,కచేరీలో మొదటి అంశంగా వర్ణం తీసుకుంటే, గాయకుని గాత్రం సానుకూలమౌతుంది.వాదకునికి చేయి స్వాధీనమౌతుంది.స్వరజతులు,వర్ణాలు నృత్య ప్రదర్శనకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

2. ఇక, సభాగాన రచనల విషయానికొస్తే..అవి అసంఖ్యాకాలు.వాటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...
--కృతులు--
రాగప్రధానమైన రచనలు.అనేక సంగతులతో కూడుకొని,పల్లవి,అనుపల్లవి,చరణము/లు,అనుబంధము,వంటి విభాగాలతో ఉంటాయి.కొన్ని కృతులలో చిట్టస్వరాలు,సోల్కట్టు స్వరాలు(మృదంగ జతులతో కూడుకొన్నవి) కూడా కనిపిస్తాయి.సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు,శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు కృతులు వ్రాసిన తొలి వాగ్గేయకారులు.వారు మువ్వురూ తమ కృతుల ద్వారా భగవదాకృతిని,తాము దర్శించి,మనకు దర్శింపచేశారు.వారి స్ఫూర్తితో ఎందరో మహానుభావులు కృతులు రచించారు.
--కీర్తనలు--
భక్తి ప్రధానమై,సంగీత జ్ఞానం పరిమితంగా ఉన్నవారు సైతం పాడుకోగలిగిన రచనలివి.సాధారణంగా కీర్తనలు పల్లవి,చరణాలను కలిగి ఉంటాయి.చరణలన్నీ ఒకే విధంగా పాడుకొనదగినవిగా ఉంటాయి.అన్నమయ్య తొలి సంకీర్తనాచార్యుడు.
--పదాలు--
శృంగార రస ప్రధాన రచనలు.రాగ నిధులైన పదాలు,విలంబ గతిలో పాడుకోవటానికి,నృత్యాభినయానికి కూడా అనుకూలంగా ఉంటాయి.క్షేత్రయ్య రచించిన పదాలు బహుళ ప్రసిద్ధాలు.
--జావళీలు--
పదాల వలెనే ఉండే, మరింత సులభ తరమైన శృంగార రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణాలను కలిగియుంటాయి.
పదాలు,జావళీలు తెలుగువారి సొత్తు.
--తిల్లానాలు--
మృదంగ తాళ జతులతో నడిచే అద్భుత రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణం,చరణానుపల్లవులతో కూడి,చరణములో సాహిత్యాన్ని కలిగి ఉంటాయి.నృత్యానికెంతో అనుకూలమైనవి.
--శబ్దములు--
నాట్య ప్రదర్శనకు మాత్రమే అనువైన రచనలు.సాహిత్యం,మృదంగ శబ్దం కలసి ఉండే రచనలు.
--దరువులు--
పదమును పోలియుండే నాట్య రచనలు.గేయ నాటకాలలో పాత్రధారి ప్రవేశిస్తున్నప్పుడు పాడేది ప్రవేశ దరువు,ఇద్దరు పాత్రధారుల సంభాషణను తెలిపేది సంవాద దరువు,పాత్ర స్వగతాన్ని తెలిపేది స్వగత దరువు,జతులతో ఉండేది జక్కిణ దరువు..ఈ విధంగా అనేక రకాల దరువులున్నాయి.
--సంచారి--
రాగలక్షణాన్ని తెలిపే గీతము వంటి రచన.
--రాగమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగాలతో కూడుకొన్న రచన.
--తాళమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,తాళాలతో కూడుకొన్న రచన.
--రాగతాళ మాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగ,తాళాల మాలికా రచన
--గుఛ్ఛ కృతులు--
ఒకే రచనావస్తువుపై చేయబడిన సామూహిక కృతులు.ఉదాహరణ:దీక్షితుల నవావరణ కృతులు,త్యాగరాజ పంచరత్న కృతులు.
--అష్టపదులు--
జయదేవకవి రచించిన 'గీతగోవింద' కావ్యములోని ఎనిమిది చరణములను కలిగిన సంస్కృత రచనలు.
--తరంగాలు--
శివనారాయణతీర్థు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML