గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 7 January 2017

ఆకాశలింగం ముంగిట ఆచార్య స్వామిఆకాశలింగం ముంగిట ఆచార్య స్వామి

చిదంబరంలో నటరాజ స్వామి ఆలయం ఉంది. ఇక్కడి లింగం ఆకాశలింగం అంటారు. నిజానికి అక్కడ ఒక గదిలో నటరాజమూర్తిగా శివుడున్నాడు. ప్రక్కనే మరో గదికి ఎప్పుడూ తెరవేసి ఉంచుతారు. టిక్కెట్టు తీసుకొన్న వారికి మాత్రం తెర తీసి చూపుతారు. కాని అక్కడ ఏమి ఉండదు. అందుకనే చిదంబర రహస్యం అనే నానుడి పుట్టింది.


చిదంబరంలో స్వామికి బంగారు గోపురం ఉంది. అర్చక స్వాములు కూడా బంగారు గొలుసులు ధరించి ఉంటారు. చిదంబర క్షేత్రంలో ఆది శంకరుల వారు యోగలింగం ప్రతిష్టి6చారు. ఆయన కైలాసం నుండి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలలో అదొకటి. ఇంకొకటి కామకోటి పీఠంలో ప్రతిష్ఠించబడింది. (తక్కిన మూడు శృంగేరిలో, కేదారంలో, నేపాళంలో ఉన్నాయి)

కంచి కామకోటి పీఠాధిపతులలో 48వ గురువులైన అద్వైతానందబోధులు 1116 నుండి 34 సం. పాటు కంచి కామకోటీ పీఠాన్ని అలంకరించారు. శ్రీహర్షుని సమకాలికులైన వీరు శంకర విజయం, బ్రహ్మ విద్యాభరాణం, గురు ప్రదీపిక శాంతి వివరణ మొదలయిన గ్రంథాలను రచించారు.

ఆయన చిదంబరంలో సిద్ధి పొందారు. దానితో కంచి కామకోటి పీఠం గుర్తు అలా చిదంబరంలో శాశ్వతంగా ఉండిపోయింది. అయితే 200 సంవత్సరాలుగా కంచి కామకోటి పీఠాధిపతులు చిదంబర దేవాలయాన్ని సందర్శించటం లేదు. అక్కడి అర్చకులు అందరు తమ చేతుల మీదుగా విభూదినిస్తారు. పీఠాధిపతులు కూడా తాము స్వయంగా విభూది తీసుకోరాదని తామే ఇవ్వాలని వారు పట్టు పట్టేవారు. దానిని ప్రతిష్టకు భంగకరంగా భావించి ఆచార్య స్వాములు అక్కడకు వెళ్ళడం మానేశారుట!

అయితే 1933 మే 18న శ్రీవారు చిదంబరం వెళ్ళారు. అర్చక స్వాములు వారు యెడల ఎట్లా నడుచుకుంటారో ఏమో అని శ్రీమఠంలో అందరికీ ఆందోళనగా ఉంది. స్వాములవారు మామూలుగానే తెల్లవాఝామున లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలను పూర్తి చేసుకుని గుడి తలుపులు తెరిచేవేళకే గుడి ముందున్నారు. అప్పటికి ముఖ్యులైన అర్చకులెవరూ ఇంకా గుడికి రాలేదు. గుడి తలుపులు తీసిన అర్చకుడు బయటకు వచ్చి చూసేసరికి స్వాముల వారు నటరాజస్వామి కెదురుగా ధ్యానమ్గ్నులై నిల్చొని ఉన్నారు. అతడు కంగారుపడి వెంటనే ఇతర అర్చకులకు కబురు పంపాడు. అందరూ ఆదరాబాదరా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వాములవారికి ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పాలనే పరయత్నంలో ఉన్నామని, తీరా స్వాముల వారు వచ్చే సమయం తెలియనందున వారు వచ్చే సమయానికి తామంతా వచ్చి స్వాగతం నెరపే అవకాశం పొందలేకపోయినందుకు బాధపడుతున్నామని విన్నవించుకొన్నారు. స్వాములవారు స్వామి దర్శనం ప్రధానం కాని స్వాగత సత్కారాలు కాదని వారిని తగువిధంగా అనునయించారు.

ఆ తరువాత స్వామివారు సహస్ర స్థంబమంటపంలో చంద్రమౌళీశ్వరుని అర్చించారు. ఒక ప్రక్క శంకరులు ప్రతిష్టించిన యోగలింగం. మరో పక్క శంకరులు కంచి కామకోటి పీఠంలో నెలకొల్పిన మోక్షలింగం. రెంటినీ ఒకే పర్యాయం దర్శించుకొనే అవకాశం ఆ రోజు చిదంబర దేవాలయ అర్చకులకు, యాత్రికులకు కలిగింది.

--- “శ్రీ కంచి పరమాచార్య పథం” పుస్తకం నుండి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML