గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 7 January 2017

ఆర్కాటు నవాబు - ఆస్థాన జ్యోతిష్కుడుఆర్కాటు నవాబు - ఆస్థాన జ్యోతిష్కుడు

ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన. అప్పుడు మా నాన్న గారు పి.యమ్. నటరాజ శర్మ గారు తిరుచిరాపల్లిలోని బిషప్ హెర్బర్ కాలేజిలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసేవారు. వారికి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పై అపారమైన భక్తి విశ్వాసం.

అప్పటి తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నది ఉత్తర గట్టున నాత్తం అనే ఊరిలో మహాస్వామి వారి మకాం. మా నాన్న గారికి శ్రీ త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్న మహాస్వామి వారిని చూడాలని చాలా కోరిక. మూడు రోజులు వరుసగా సెలవు కావడంతో శుక్రవారం రాత్రి వారు నాత్తం చేరుకున్నారు. ఆరోజు పూజ ముగిసింది. మా నన్నగారు ఎవరికి తెలియకపోవడం వల్ల ప్రత్యేక స్వాగతం ఏమి లేదు. నుదుటిపై స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన విభూతిని ధరించి అక్కడే పందిరిలో ఒక మూలలో పడుకున్నారు. తరువాత రెండు రోజులు ఇలాగే గడిపేసారు. అక్కడ జరిగే ఆరాధనలు పూజలు కన్నులపండువగా దర్శించుకున్నారు.

మూడవ రోజు వినాయ చవితి పండుగ. ఆనాటి విశేష పూజ అనంతరం మా నాన్న గారు స్వామి వారు ఇచ్చే ప్రసాదానికై వెళ్ళి వారి తిరుగు ప్రయాణం గురించి చెప్పారు. మహాస్వామి వారు తల ఎత్తి, “ముందు వినాయకుడి ముందు పెట్టిన మోదకాలను తీసుకుని, ఎక్కడైనా కూచుని తీరికగా తిని నా వద్దకు రా. అప్పుడు ఆలోచిదాము నీ ప్రయాణం గురించి అన్నారు”.

మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. వారు పరమాచార్య స్వామి వారితో సెలవు అడగగా స్వామి వారు ముందు మోదకాలు తిని తరువాత రమ్మన్నారు. తిన్న తరువాత స్వామి వారు రమ్మన్నారు. మా నాన్న గారు పుదుక్కుడి శ్రీనివాస జోస్యర్ (జ్యోతిష్కులు) మనుమడు అని తెలిసి స్వామి వారు చాలా ఆనందపడ్డారు. స్వామివారు వారి తాత గారి గురించి అప్పుడు జరిగిన సంఘటనల గురించి గుర్తుచేసుకున్నారు. ఆశ్చర్యపోవడం మా నాన్నగారి వంతు.

పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారు : “మీ తాత గారు మళయాళ దేశం వెళ్ళి సప్రమాణికమైన జ్యోతిష్యాన్ని నేర్చుకున్నారు. ఎన్నో మంత్రాలను ఉపాసించారు. వారు ఆర్కాటు నవాబు ఆస్థాన జ్యోతిష్కులుగా నియమితులయ్యారు. అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. అప్పట్లో తిరుచిరాపల్లి ఆర్కాటు నవాబు ఆధీనంలొ ఉండేది. నవాబు గారి వద్ద చాలా మంది జ్యోతిష్కులు ఉండేవారు. ఒకసారి నవాబు గారు వారి ఏలుబడిలో ఉన్న జ్యోతిష్కులందరినీ వారి ఆస్థానం లో ఉన్న వారిని కూడా పిలిచి సభ తీర్చారు. చలా మంది కొత్త జ్యోతిష్య పండితులు కూడా వచ్చారు. అందులో మీ తాత గారు కూడా ఉన్నారు.

నవాబు గారు కచేరికి రాగానే దివాను గారు లేచి అక్కడున్న జ్యోతిష్కులందరితో, “నవాబు గారు మీకందరికీ ఒక పరీక్ష పెట్టబోతున్నారు. ఈరోజు నవాబు గారు వేటకు వెళ్ళబోతున్నారు. వారు ఏ రాజద్వారం గుండా వెళ్తారో ఆ విషయాన్ని మీరందరూ ఒక తాటి ఆకుపై రాసి ఆ తాటి సంచుల్లో ఉంచండి. వాటినన్నీంటిని జాగ్రత్తగా భద్రపరుస్తాము. నవాబు గారు తిరిగి వచ్చిన తరువాత వాటిని తీసి చదువుతారు. సరిఅయిన సమాధానం రాసిన వారికి తగిన సత్కారం లభిస్తుంది” అని అన్నాడు. అందుకని అందరూ వారి గణన ప్రకారం తూర్పు లేదా పడమర లేదా ఉత్తరం లేదా దక్షిణ ద్వారం అని రాసి ఇచ్చారు.

చివరికి ఆ రోజు నవాబు గారు ఏ ప్రధాన ద్వారం గుండానూ బయటికి వెళ్ళలేదు. పశ్చిమ ద్వారపు ఉత్తర గోడని(ఈనాటి ప్రధాన రక్షణ ద్వారం పెట్రోల్ బంకు ఉత్తరం వైపు) కూల్చి బయటికి వెళ్ళి, పశ్చిమాన ఉన్న ఉరయ్యూర్ వైపు కొద్ది దూరం వెళ్ళారు. తరువాత ఉత్తరం వైపు తిరిగి కావేరి నది ఒడ్డుకు వెళ్ళారు. తరువాత దక్షిణం వైపు తిరిగి కూల్చిన ఉత్తర అండర్ వీధి (ఈనాటి పుడుప్పడి లేన్) కోట ఉత్తరం వైపు వెళ్ళారు. తరువాత తూర్పు తిరిగి ఎగుడుదిగుడు రాళ్ళ మార్గం ద్వారా తూర్పు అండర్ వీధికి వచ్చారు. కోట చుట్టి వచ్చి, తన కచేరి అయిన చిన్నక్కడై వీధిలోని ఆనాటి టౌన్ హాల్ కు వచ్చారు. అసలు వేటకు వెళ్ళనేలేదు. నవాబు వచ్చిన తరువాత అన్నింటిని చదవగా నవాబు గారు ఏమి చేసారో మీ తాతగారు సరిగ్గా గుణించారు. నవాబు గారు ఆశ్చర్యపోయారు. కచేరీలోని వారందరూ అవాక్కయ్యరు.

తరువాత నవాబు మీ తాత గారికి చట్టబద్దంగా పుదుక్కుడిలో 80 ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు. రాతికోట దక్షిణం వీధిలో పశ్చిమం ఒక వైపు నల్లని దేవాలం ఉంది. ఆ దేవాలయం దగ్గర్లో ఇనుప గేటు ఉన్న పెద్ద ఇల్లు ఒకటి ఉంది. దానికి ఎదురుగా అరుగు ఉన్న చిన్న ఇల్లు ఉంది. నవాబు ఆ రెండు ఇళ్లని కూడా ఇచ్చాడు. మీ తాత గారు ఆ భూమిని, ఇళ్ళనీ ఎన్నో ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించారు”

ఇవన్నీ తెలిపి పరమాచార్య స్వామి వారు మా నాన్న గరికి వీడ్కొలు చెప్పారు. మా నాన్న గారు తరచుగా ఈ విషయాన్ని నాకు చెప్పి పొంగిపోయేవారు.

--- శ్రీ పి.యన్. శంకర రామన్, కంబరసంపెట్టయ్ - శక్తి వికటన్ ప్రచురణ

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML