గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 16 June 2017

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...మీకు తెలుసా??

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...

1.Kedarnath (కేదారినాద్)


2. Kalahashti( కాళహస్తి)

3. Ekambaranatha- Kanchi(ఏకాంబరనాద్)

4. Thiruvanamalai(తిరువనమలై)

5. Thiruvanaikaval(తిరువనయ్ కావల్)

6. Chidambaram Nataraja(చిదంబర నటరాజన్)

7. Rameshwaram(రామేశ్వరం)

8. Kaleshwaram N-India(కాళేశ్వరం)

ఇవన్నీ శివుని దేవాలయాలు

కానీ దేవాలయాల్లో కామన్ గా వున్న ఒక గొప్ప విషయం.. ఈ దేవాలయాలన్నీ "79 డిగ్రీల రేఖాంశం" మీద వున్నాయి..

1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°

ఎటువంటి GPS పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ పూర్వపు రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాలు అన్ని ఒకే రేఖాంశం పైన నిర్మించిన మన పూర్వీకుల గురించి ఏంత పొగిడిన తక్కువే కదా....
Read More

త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.


స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు.ఆకాశం నుండి చూస్తే శ్రీ చక్ర ఆకారం స్పష్టంగా కనబడుతుంది.ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…
ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారు

ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి

శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు.
Read More

Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.

కానీ నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో అత్యంత నీచ రాజకీయాలు సంఘం లో చోటు చేసుకుంటున్నాయి. ఎదవలకి భాద్యతలు అప్పగించడం , మిగిలిన సంస్థలతో కలుపుకొని పోకుండా పిచ్చ రాజకీయాలు చేయడం సంఘంలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరికి అలవడింది....

వీటిని సరిచేసుకొని పోతే సంఘం మర్యాద ఉంటుంది లేకుంటే గాలిలో దీపమే!!

సంఘ కార్యం విచిత్రంగా ఉంటుంది. రోజు ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రదేశం లో స్వయంసేవకులు కలుస్తారు. గంట సేపు కార్యక్రమం. 45 నిమిషాలు శారీరక శిక్షణ, 10 నిమిషాలు ఒక దేశ భక్తిగీతం, సంస్కృత సుభాషితం,చిన్న కథ కాని, చర్చ కాని తరువాత 5 నిమిషాలు ప్రార్థన.

ఇంత విశాల సంస్థకు ఏ మనిషి గురువు కాదు. త్యాగానికి ప్రతీక అయిన భగవా పతాకమే గురువు. రోజూ పిల్లలని నిద్రలేపి, సమయానికి చేరుకునేట్టుగా చేయడానికి ఒక బృందం ఉంటుంది. శాఖా కార్యక్రమం తరువాత స్వయం సేవకుల ఇళ్లకు పోతారు. వ్యక్తుల కుటుంబాలతో సంబంధం. శాఖకు తీసుకు రావడం ఎంత ముఖ్యమో, వాళ్లకు శారీరక, మానసిక శిక్షణ తో పాటు, వారి మధ్య గరిష్ట స్నేహం కూడా అంతే ముఖ్యం.
అనేక ఇతర కార్యక్రమాల ద్వారా వారిలో దేశానికి కావలిసిన గుణాలు నేర్పిస్తారు. అటువంటి వారి మధ్య స్నేహం లో అనేక అవగుణాలు కడిగేయ బడతాయి. వారి కుటుంబాలకు కూడా సంఘం వారి సంస్థే.

ఒక సారి ఒక శిక్షా వర్గాల్లో వ్రాత పరీక్ష పేపర్ కి మార్కులు వేస్తున్నాను. ఈ పని రోజూ ఎందుకు చేయాలని ప్రశ్న. దానికి ఇంటర్ చదివే ఓ పిల్లాడు వ్రాసిన జవాబు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేశం లో 125 కోట్ల జాతీయులు మారడా నికి చేసే ప్రయత్నం రోజూ చేయక పోతే ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇది సంఘ కార్యం పట్ల స్వయంసేవకుల నిష్ఠ. పనిపై ఈ శ్రద్ధ వ్యక్తుల్లో మార్పు వారే సాధించు కుంటారు.

గుంటూరు లో పని చేస్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు నన్ను పరిచయం చేశారు మా కార్యకర్త. వీరు సంఘ పూర్తి సమయ కార్యకర్త అని చెప్పారు. RSS అంటే ఉదయం / సాయంత్రం వ్యాయామం చూస్తారే, అదేనా అన్నారు. నేను అవును అన్నాను. దానికి పూర్తి సమయ కార్యకర్త ఎందుకు? ప్రశ్న. సంఘంలో కనపడే కార్యక్రమం గంట సేపే కాని దృఢమైన సంస్థను నిర్మాణం చేయాలంటే ఇలాస్టి వారు కావాలి. పరిచయం అయిన ప్రతీ వాడు సంఘానికి నిరంతరం, జీవితాంతం పని చేయడానికి అలా కొంత మంది అయినా పని చేయాలండి, మా కార్యకర్త జవాబు. వారు కన్విన్స్ కాలేదు. ఫర్వాలేదు. వీరు లా చదువుకున్నారు అన్నాడు మా కార్య కర్త. మీరు సమయం వృధా చేస్తున్నారు, అన్నారాయన. నేను చిన్నగా నవ్వి సెలవు తీసుకున్నాను. మా జిల్లా ప్రచారక్ M Sc. Chemistry. వారు చేసే పని పిల్లలను శాఖా పనిలో నియుక్తులను చేయడం. వాళ్లకు వాళ్ళ డబ్బులతో యూనిఫామ్ కుట్టించుకునేట్లు చేయడం, పాట, ప్రార్థన కంఠస్థం చేయించడం, రోజూ శాఖకు తీసుకు రావడం. దీనికి ఇంత చదువు కున్నవాడు కావాలా? అనిపిస్తుంది. దేశం పై శ్రద్ధ నిర్మాణం చేయడం కి అటువంటి వాళ్ళు, బ్రహ్మ చారులుగా తమ జీవితం ఇస్తేనే వారి నుండి ప్రేరణ పొందే పిల్లలు శ్రద్ధా వంతులు అవుతారు. 70 సంవత్సరాల చరిత్ర అంతా అటువంటి శ్రద్ధా పూర్వక కార్య కర్తలు వల్లే.

ఒక దీపం నుండి మరొక దీపం వెలుగుతుంది. అదే చైతన్య దీప్తిని రగిలిస్తుంది. ఇది సంఘ ప్రాక్టికల్ అప్రోచ్.

నాగపూర్ లో మొదలైన ఒక శాఖ ఈ రోజు 55000 శాఖలకు చేరింది. అన్ని రాష్ట్రాలలో, వాటిల్లో అన్ని జిల్లాలలో, అన్ని తాలూకాలో, దాదాపు అన్ని మండలాల్లో స్వచ్చందంగా, వారి ఖర్చులు వారే భరించే విధంగా, మళ్లీ సంఘ పెరుగుదలకు కష్టపడి వారే గురుదక్షిణగా సమర్పించే లక్షలాది సభ్యులు ను నిరంతరమ్ తయారు చేస్తూఎదుగుతున్న సంస్థ, సంఘం. నమ్మాలనిపిస్తుందా? సంఘం లో కొచ్చిన వారికి ఈ నిజం తెలుసు. మీరూ చేరి ఈ సమార్పిత దేశ భక్తులవ్వండి.

ఇన్నేళ్ల సంఘం లో దేశం నాకేం ఇచ్చింది అని అడగడం నేర్పించదు. దేశానికి నేనేమి ఇవ్వాలో ఆలోచింప జేస్తుంది. నేనదే నేర్చు కున్నాను. అదే నేర్పుతున్నాను.
Read More

Thursday, 15 June 2017

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..
.
శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లలో స్వామి హనుమ అన్నిటా తానై మునిగి తేలుతున్నాడు. ప్రపంచము నలుమూలలనుండి రాజులు అయోధ్యకు తరలి వస్తున్నారు. వారికి రాజప్రాసాదాలలో వసతులు, ఆహారపానీయాదులు సరైన సమయానికి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ స్వామి హనుమ క్షణం తీరికలేకుండా శ్రమిస్తూన్నాడు. పైగా కోట్లాది వానర వీరులను వివి
ధ పనులలో నియంత్రించడము సామాన్యమైన విషయం కాదు గదా! ఇదంతా తల్లి సీతమ్మ గమనిస్తూ
స్వామి హనుమను పిలిచి " నాయనా శ్రీరామ పట్టాభిషేకము నీవు అనుకున్నట్లుగా సవ్యంగానే జరుగుతుంది. ముందు నీవు భోజనము చెయ్యి. నాలుగు ముద్దలు నీకు వడ్డిస్తాను. ఇలారా నాయనా! ఇలా కూర్చుని నేను వడ్డించే పదార్ధములు తృప్తిగా ఆరగించు!" అని ఆప్యాయంగా పిలిచించింది. సీతామాత అలా అప్యాయంగా పిలిచేసరికి స్వామి హనుమ కాదనలేక మాత వడ్డించిన ఆహారపదార్ధములు ఆరగించటము ప్రారంభించాడు. మాత వడ్డన, స్వామి ఆరగింపు సాగుతునే ఉన్నాయి. కోట్లాది అతిధులకై చేయించిన ఆహారపదార్ధములు " వడ్డించమ్మా! వడ్డించు" అని మెచ్చుకుంటూ స్వామి హనుమ ఇట్టే స్వాహా చేసేస్తున్నాడు. మాత సీత కంగారు పడుతూ చెలికత్తెలను పరుగులు తీయిస్తోంది. వారు ఇతర ప్రసాదాల వంటకాలు తరలిస్తూనే ఉన్నారు. అన్ని వంటకాల పాత్రలు ఖాళీ అవుతున్నాయి. శ్రీరామచంద్రుడు అక్కడ జరుగుతున్న సమాచారం తెలుసుకుని వచ్చి గోడవారగా నిలబడ్డాడు. సీతామాత ఆయన దగ్గరకు వెళ్ళి " అనంతమైన ఆహారపదార్ధములు హనుమ క్షుద్బాధ తీర్చలేక పోతున్నాయి. స్వామీ! ఏమి స్వామి! తరుణోపాయం చెప్పండి! " అని చేతులు జోడిస్తే, అప్పడు శ్రీరాముడు " సీతా! హనుమ అనుకుంటే ఎవరు అనుకున్నావు? రుద్రాంశ సంభూతుడు. నిన్ను, నన్ను కాపాడటానికి ఈ భువికి దిగిన పరమేశ్వరుడు. ఆయనకు పంచాక్షరీ మంత్రము మనస్సున తలచుకొని ఒక ముద్ద వడ్డించు. ఆయన తృప్తి పడతాడు" అని ఉపదేశిస్తాడు. సీతామాత ఒక ముద్ద చేతిలో తీసుకుని " నిన్ను సామాన్యునిగా తలచి, మాయలో పడ్డాను. నీ తల్లిని క్షమించు తండ్రీ! ఓం నమ:శివాయ" అంటూ స్వామి హనుమ విస్తరిలో వడ్డిస్తుంది. స్వామి హనుమ ఆ ముద్ద తృప్తిగా ఆరగించి " శ్రీరామా తృప్తాత్మా! " అంటూ త్రేన్చి ఉత్తారోపసనం చేసి " అన్నదాతా! సుఖీభవ! ! " అని భోజనం ముగిస్తాడు. ఆయన అలా అనగానే ఖాళీ అయిన ఆహారపదార్థాలు యధాతధంగా ఆయా పాత్రలలో వచ్చి చేరాయి.
Read More

Thursday, 23 February 2017

పంచాంగము అంటే ?? మానములు ఎన్ని రకములు వివరించండి ??

మానములు ఎన్ని రకములు వివరించండి ??

చాంద్ర మానం 
సౌర మానం 
సావన మానం 
నక్షత్ర మానం 
బార్హస్పత్య మానం 

చాంద్ర మానం = శుక్ల పాడ్యమి మొదలు చైత్రాది 12   మాసములు ఉండును. ఇందు ప్రభావాది ౬౦ నామములు కలది . 354  దినములు ఉండును 

సౌర మానం  = మేషాది ద్వాదశ రాశులందు  సూర్య సంక్రమణ చే ఏర్పడి 365  దినములు కలదు.

నక్షత్ర మానం = అశ్విని  మొదలు రేవతి వరకు ౨౭ నక్షత్రములలో చాంద్ర చారము చేత ఏర్పడి 12  నెలలు లేక 324  దినములు ఉండును. 

బార్హస్పత్య మానం = మేషాది రాశులందు గురు చారము చేత 361  దినములు ఉండును . 

పంచాంగము అంటే = 5 - అంగములు కలది . 1 . తిధి 2 .వారము 3 .నక్షత్రము 4. యోగము 5. కరణము
Read More

Sunday, 5 February 2017

వేదాలు పురాణాలువేదాలు పురాణాలు
వేదాల తరువాత అంత ప్రాముఖ్యత కలవి పురాణాలు . వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కధల రూపం లో, ఆఖ్యానాల రూపం లో సామాన్యులకు సైతం తెలియ చెప్పేవే పురాణాలు. అందుకే పురాణాలను పంచమ వేదం గా కీర్తించారు.

అసలు పురాణం అంటే : పురా అపినవం = పురాతనం అయినప్పటికీ నూతనం గా ఉండేది

అలాగే పురా ఆనతి అంటే పురాతన కాలం లో జరిగినది అని అర్ధం

వాయుపురాణం ప్రకారం = పురా ఏతత్ అభూత్ ( పూర్వం ఇలా జరిగింది అని అర్ధం )Read More

Saturday, 4 February 2017

మన రాజ్యాంగం, చట్టాలుమన రాజ్యాంగం, చట్టాలు
****************************

1) కొడుకు గాని కోడలు కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని,మరి ఎ ఇతర హిందూ బందువుల నుండిగాని,వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.


2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు ,పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు.
(సెక్షన్ 6,హిందూ మైనార్టీ &గార్డియన్ షిప్ చట్టం)
అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని,చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు ,దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు. (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం)

4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు,కూటములకు వెల్తున్నారా??
ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.
(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)

5) మతం మారిన వారు B.C -A,B,D గ్రూపుల
వారు O.C గా పరిగణించబడతారు.
అదే విధంగా క్రైస్తవ మతం పుచ్చుకున్న S.C లు B.C-C గాను ,ముస్లిం మతం పుచ్చుకున్న S.C లు O.C లుగా పరిగణింపబడుతారు.

6) మతం మార్చుకొని కూడా రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వారిపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.

7) S.C కోటాలో ఉద్యోగం సంపాదించి తరువాత చర్చికి వెల్లడం లేదా క్రైస్తవం నమ్ముకోవడం చేస్తే వారి ప్రమొషన్ వారి పిల్లల సౌకర్యాల నిమిత్తం B.C-C. మాత్రమే అవుతారు. అలాంటి వారి పైన తాసిల్దార్కు కంప్లైంట్ చేయవచ్చు.

8) మతం మార్చుకున్న వారు S.అట్రాసిటి కేసు పెట్టే హక్కు ఉండదు. పాస్టర్లు B.C- C అవుతారు వారిపై S.C.,అట్రాసిటి చెల్లుతుంది.S.C కోటాలొ వొచ్చే ఉద్యోగాలు,పెన్శల్లు ,ఆస్తి హక్కులు ,లోన్ లు ,గవర్నమెంట్ రాయితీలు మొదలగునవి పోతాయి.

9) వేరు వేరు మతాల వారు చేసుకునే పెళ్ళి చెల్లదు - మద్రాస్ హైకోర్టు

మన దేశంలో రాజ్యాంగం లోని ఆర్టికల్ 25(1) ప్రకారం మత ప్రచారం హక్కు అంటే ఇతరులను‌ మతం మార్చే హక్కు కాదు అని (AIR 1977 SC ) 908 కేసులు సుప్రీంకోర్టు తీర్చుచెప్పింది.అనేక సంధర్భాలలొ ఆశ చూపి,అబద్దం చెప్పి,భయపెట్టి ప్రలొభాలకు,వొత్తిడికి గురిచేసి మతం మార్చడం నేరమని అనేక న్యాయస్తానాలు తీర్పుచెప్పాయి...

మీరు తెలుసుకోండి అందరికి తెలియజేయండి జాగొ హిందు జాగో,
Read More

పతనానికి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ???

పతనానికి దగ్గరలో ఉన్న   తిరుమల తిరుపతి దేవస్థానం :  అన్య మతస్తుల కబంద హస్తాలలో దేవస్థానం
Read More

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో ఇంక ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. ఆ కొడుకుకి ఉన్న అధికారం ఏమిటంటే ‘ఆత్మావై పుత్రనామాసి’ – తండ్రియొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది. తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు. పుత్రగాత్ర పరిష్వంగము అని సుఖం. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో! అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతుంది భార్య. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు. కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే. అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. అటువంటి తండ్రి విడిచి పెట్టేస్తే నీకోసం ఆయన సమయం వెచ్చించాడు చిన్నప్పటి నుంచి. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినది? తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి పరమ శాంతి. అందుకే ఒక చూరు క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహద్భాగ్యవంతుడు. రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు.
వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడికి అంత కన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి లేదు. అంతేకానీ మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను. నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు. ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి. అవకాశం ఉంటే గోదానం చేయాలి.
అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి/తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు.
ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అధవా షోడశోపచారములు కూడా చేయవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి లేదు. చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.
చేయకూడనివి: నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, నిత్యపూజలో ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండుగ అని నా సంతోషం కోసం చేసుకోను. అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నాం అండీ ఎందుకది? ఎందుకా ఏటి సూతకం? అలా ఉండకూడదు. నువ్వు నేర్పాలి పిల్లలకి. నీ తాత/నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ/తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. అంటే మీరు మానేయండి మేం వెళ్తాం అంటాడా పిల్లవాడు? అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిక ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి/తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.
Read More

Saturday, 7 January 2017

అనారోగ్యం పారదోలే నీరు ఉదయ గిరి కొండల్లో ...అనారోగ్యం పారదోలే నీరు ఉదయ గిరి కొండల్లో.
అవును ఆ సెలయేరు నీరు శరీర రుగ్మతలను తొలగించును . ఉదయగిరి కొండల లో ఉన్న నీరు ఊరి ఉబికి పైకి వస్తున్నా నీరు, అనేక ఔషధ మొక్కలను తాకి వస్తున్నా సెలయేరు . ఆ నీటిని కొంత కాలం తాగిన అనారోగ్యం తొలగును .  


Read More

చర్చిలో మార్మోగిన ‘ఓం నమశ్శివాయ’...........


Read More

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములుధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. *ఆగ్నేయ (అగ్ని) పురాణము* ప్రకారము ఈ మాసము శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతిపాత్ర మైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది.

శ్రీమహావిష్ణువు పుష్ప, శ్రీగంధమాల్య, మణి మౌక్తిక, పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింప వలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో ఏ దేవాలయములో చూసినా బ్రాహ్మీముహూర్తములోనే పూజలుమొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.

ధనుర్మాస వ్రత కథ

పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని, ఆ హంసపైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ, సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని, *నీ తేజో బలము క్షీణించు గాక* యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై, తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు.
దానితో మూడులోకాలూ అల్లకల్లోలమైనవి. సూర్యుడి తేజము చాలినంత లేక, జపములు, తపములు, హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు, ఋషులకే గాక, సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులుమొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో,దేవతలు అనేక సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే, సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు.

సూర్యుడు తాను ధనూరాశిని ప్రవేశించగనే ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే అతడి శాప విమోచనము అవుతుంది.అని బ్రహ్మ తెలిపినాడు. బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు పదహారు సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడి నుండీ మొదలైన ఈ పూజ తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది, తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయ వంతంగా జరుగుటకు వారుకూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలు పెట్టినారు.

అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు,గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు, ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమునుఆచరించినారని వివిధ పురాణములలో ఉంది.

ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యము లైన వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. ఏమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును.

ముద్గాన్న నైవేద్యము
ఈ ధనుర్మాసములో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [పెసర పప్పుతో చేసిన పులగము] దీని గురించి *ఆగ్నేయ పురాణము* లో ఇలాగుంది,

ధనూరాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము,

బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే, బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము, బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను.

అంతే కాదు పెసర పప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణము తెలుపుతుంది.
అందుకే, ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [పొంగల్] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహా విష్ణువును పూజించి కృతార్థులై, ఆయన కృపకు పాత్రులు కాగలరు.

తిరుప్పావై అంటే ఏమిటి …..?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగి తేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.

తిరుప్పావై మొదటిరోజు పాశురం

తిరుప్పావై

1. పాశురము :

*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

తిరుప్పావైగీతమాలిక

అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

1వ మాలిక

(రేగుప్తి రాగము -ఆదితాళము)

ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని
నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరం
Read More

ఆకాశలింగం ముంగిట ఆచార్య స్వామిఆకాశలింగం ముంగిట ఆచార్య స్వామి

చిదంబరంలో నటరాజ స్వామి ఆలయం ఉంది. ఇక్కడి లింగం ఆకాశలింగం అంటారు. నిజానికి అక్కడ ఒక గదిలో నటరాజమూర్తిగా శివుడున్నాడు. ప్రక్కనే మరో గదికి ఎప్పుడూ తెరవేసి ఉంచుతారు. టిక్కెట్టు తీసుకొన్న వారికి మాత్రం తెర తీసి చూపుతారు. కాని అక్కడ ఏమి ఉండదు. అందుకనే చిదంబర రహస్యం అనే నానుడి పుట్టింది.


చిదంబరంలో స్వామికి బంగారు గోపురం ఉంది. అర్చక స్వాములు కూడా బంగారు గొలుసులు ధరించి ఉంటారు. చిదంబర క్షేత్రంలో ఆది శంకరుల వారు యోగలింగం ప్రతిష్టి6చారు. ఆయన కైలాసం నుండి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలలో అదొకటి. ఇంకొకటి కామకోటి పీఠంలో ప్రతిష్ఠించబడింది. (తక్కిన మూడు శృంగేరిలో, కేదారంలో, నేపాళంలో ఉన్నాయి)

కంచి కామకోటి పీఠాధిపతులలో 48వ గురువులైన అద్వైతానందబోధులు 1116 నుండి 34 సం. పాటు కంచి కామకోటీ పీఠాన్ని అలంకరించారు. శ్రీహర్షుని సమకాలికులైన వీరు శంకర విజయం, బ్రహ్మ విద్యాభరాణం, గురు ప్రదీపిక శాంతి వివరణ మొదలయిన గ్రంథాలను రచించారు.

ఆయన చిదంబరంలో సిద్ధి పొందారు. దానితో కంచి కామకోటి పీఠం గుర్తు అలా చిదంబరంలో శాశ్వతంగా ఉండిపోయింది. అయితే 200 సంవత్సరాలుగా కంచి కామకోటి పీఠాధిపతులు చిదంబర దేవాలయాన్ని సందర్శించటం లేదు. అక్కడి అర్చకులు అందరు తమ చేతుల మీదుగా విభూదినిస్తారు. పీఠాధిపతులు కూడా తాము స్వయంగా విభూది తీసుకోరాదని తామే ఇవ్వాలని వారు పట్టు పట్టేవారు. దానిని ప్రతిష్టకు భంగకరంగా భావించి ఆచార్య స్వాములు అక్కడకు వెళ్ళడం మానేశారుట!

అయితే 1933 మే 18న శ్రీవారు చిదంబరం వెళ్ళారు. అర్చక స్వాములు వారు యెడల ఎట్లా నడుచుకుంటారో ఏమో అని శ్రీమఠంలో అందరికీ ఆందోళనగా ఉంది. స్వాములవారు మామూలుగానే తెల్లవాఝామున లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలను పూర్తి చేసుకుని గుడి తలుపులు తెరిచేవేళకే గుడి ముందున్నారు. అప్పటికి ముఖ్యులైన అర్చకులెవరూ ఇంకా గుడికి రాలేదు. గుడి తలుపులు తీసిన అర్చకుడు బయటకు వచ్చి చూసేసరికి స్వాముల వారు నటరాజస్వామి కెదురుగా ధ్యానమ్గ్నులై నిల్చొని ఉన్నారు. అతడు కంగారుపడి వెంటనే ఇతర అర్చకులకు కబురు పంపాడు. అందరూ ఆదరాబాదరా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వాములవారికి ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పాలనే పరయత్నంలో ఉన్నామని, తీరా స్వాముల వారు వచ్చే సమయం తెలియనందున వారు వచ్చే సమయానికి తామంతా వచ్చి స్వాగతం నెరపే అవకాశం పొందలేకపోయినందుకు బాధపడుతున్నామని విన్నవించుకొన్నారు. స్వాములవారు స్వామి దర్శనం ప్రధానం కాని స్వాగత సత్కారాలు కాదని వారిని తగువిధంగా అనునయించారు.

ఆ తరువాత స్వామివారు సహస్ర స్థంబమంటపంలో చంద్రమౌళీశ్వరుని అర్చించారు. ఒక ప్రక్క శంకరులు ప్రతిష్టించిన యోగలింగం. మరో పక్క శంకరులు కంచి కామకోటి పీఠంలో నెలకొల్పిన మోక్షలింగం. రెంటినీ ఒకే పర్యాయం దర్శించుకొనే అవకాశం ఆ రోజు చిదంబర దేవాలయ అర్చకులకు, యాత్రికులకు కలిగింది.

--- “శ్రీ కంచి పరమాచార్య పథం” పుస్తకం నుండి
Read More

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక**'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.


అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.

అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.
Read More

ప్రదక్షిణ అనేదాని గురించి తెలుసుకుందాం.గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం. "స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని" రకరకాలుగా కోరుతూంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి తెలుసుకుందాం.

ఈ జగత్తులో సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే అవి సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. విశ్వంలో జననం నుండి మరణం వరకు ఒక ప్రదక్షిణ. ఎన్నో జన్మల కర్మ ఫలాలను అనుభవించడమే, వాటి దుష్ఫలితాలను తొలగించుకునేందుకు తాపత్రయ పడటమే ప్రదక్షిణ.


నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, ప్రాణాలను కూడ లెక్క చేయకుండా, బిడ్డకు జన్మనిచ్చి, తమకంటే బిడ్డను ఉన్నతస్థాయిలో ఉంచేందుకు తపనపడే తల్లి కి ఎంతటి ఉన్నతస్థానం ఇస్తామో, ప్రప్రధమ దైవంగా భావిస్తామో, ఏమి చేస్తే కృతఙ్ఞత ప్రకటింపబడుతుందో తెలిపే వివరణ ఇది...
మూడు సార్లు భూప్రదక్షిణ చేసినా, 100సార్లు కాశి యాత్ర చేసినా, కార్తీక,మాఘ స్నానాలు చేసినా, అమ్మకు వందనం చేసినదానితో సాటిరాదు.

ప్ర అక్షరం సమస్త పాప నాశనకారి
ద అక్షరం కోరికలన్ని తీరుతాయనే భావం
క్షి అక్షరం రాబోయే జన్మ జన్మల రాహిత్యాన్ని సూచిస్తుంది
ణం అక్షరం అఙ్ఞానం వీడి ఙ్ఞానం ప్రసాదించే ఆవృతం అని అర్ధం ( భగవాన్ శ్రీ రమణ మహర్షి వివరణ)

ప్రదక్షిణ చేసేటప్పుడు, చేతిలొ కాగితం పై లెక్కించుకుంటు, ధ్యాసంతా ఎపుడెపుడు 108 అవుతాయా, తొందరగ చేద్దాం అని, భగవంతుని మీద ధ్యాసలేకుండా త్వర త్వరగా చేయడం అనేది పద్దతి కాదు.

నిండు నెలల స్త్రీ, నిండు కుండతో నడిచే వ్యక్తి ఎలా నడుస్తారో, అంత నెమ్మదిగా, దైవ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణా విధానంలో ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఫలితం ఉంటుందని విఙ్ఞులు అంటారు.
ప్రదక్షిణ చేసేటప్పుడు ఇష్టమైన దైవాన్ని స్మరించాలి.

అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు అడుగుని అనుసరిస్తూ, చేతులు నిశ్చలంగా జోడించి, దైవ నామస్మరణతో ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. దీనినే "చతురంగ ప్రదక్షిణ" అంటారు.

సృష్టి, స్థితి, లయ కారకులను స్మరిస్తూ చేసే ప్రదక్షిణాలు 3ప్రదక్షిణాలు
పంచభూతాలలోని పరమాత్మను దర్శిస్తూ 5 ప్రదక్షిణాలు
నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదక్షిణలు :
మొదటిది...ఫలాన వ్యక్తిని ప్రదక్షిణ చేయడానికి వచ్చానని చెప్పడానికి
రెండవది...నవగ్రహాధిపతి అయిన సూర్యునకు చేసే ప్రదక్షిణ
మూడవది...ప్రదక్షిణాలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందుకు....
Read More

తిరుమలనంబి నిత్యం పాపనాశనానికి వెళ్తారు , వారికి శ్రమ. అనిపించదు ,తిరుమలనంబి నిత్యం పాపనాశనానికి వెళ్తారు ,
వారికి శ్రమ. అనిపించదు ,
స్వామి కైంకర్యమే మహాదానందం ,
నీటికుండ. నెత్తికి ఎత్తుకొని కోవెలకు చేర్చేవాడు ,
పరమభాగవతోత్తముడైన. తిరుమలనంబి శ్రమకు
స్వామికి అలసట. ! స్వామి నంబి శ్రమను
తీరదలిచాడు , వేటబాలుడైనవాడు
ధనుర్బాణాలు ధరించాడు , నంబి తీర్థం తెచ్చే
దారిలో చెట్టునీడన. కూర్చున్నాడు ....


స్వామివారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు ,
స్వామి నంబిని దాహంగా ఉంది గుక్కెడు నీళ్ళు
" పోయండి స్వామి " అన్నాడు ,..

" బాలకా ! ఇది దివ్యజలం
స్వామి అభిషేకపు జలమిది నీవు అడగరాదు
నేనివ్వరాదు , అన్నాడు నంబి ,..

తాతా ! నీరు పోసి ప్రాణం రక్షించవా ? అన్నాడు ,

నీ దాహం తీర్చాల్సినవాడు భగవంతుడు బాలకా !
ప్రార్థించు అతడే రక్షకుడు , ప్రాణరక్షకుడు ,
నాకు సమయాతీతం అవుతున్నదని
వేగంగా అడుగుసాగించాడు స్వామి ,

కుండకు బాణం కొట్టాడు దానికి చిల్లు పడింది
నీటి ధార. సాగింది ,

స్వామి దోసిటితో నీరు త్రాగసాగాడు .

కుఖడ. తేలిక అయింది తిరుమల నంబి తిరిగి చూచాడు

బాలుడు చేత. బాణం ! కుండకు రంధ్రం !
చిల్లికుండనుంచి చివరి నీటిబొట్టు !
నంబి హతాశుడైనాడు కూలబడ్డాడు ,
శ్రీస్వామికి అపచారం అని గొల్లుమన్నాడు ,
కన్నీరు కాలువ. కట్టింది ,

స్వామి నివ్వెరపోయాడు ! ఎంతటి భక్తి !
భగవంతుని కన్నీరు భగవంతుని బాష్బమైంది ,

" తాతా ! లే ! నీకు పవిత్రజలం చూపుతాను "
అన్నాడు , నంబి చేయిపట్టుకొని లేపి
రెండేరెండు అడుగుల్లో కొండచరియకు చేరాడు ,
స్వామి బాణం ఎక్కుపెట్టాడు , కొండకు కొట్టాడు ,
మిరమిట్లు మెరుపు ! కొండనుంచి జలధార. !
ఆకాశగంగ. ! ....

తిరుమలనంబికి తెలివి వచ్చింది , జలధార. !
బంగారుబిందె మరొకరు వినలేదు కనలేదు ,
కాలాతీతం కాకూడదు , తీర్థంతో ఆలయానికి
చేరుకున్నాడు , అంతా చకితులయ్యారు ,
నంబి గమనించలేదు .

నాటి నుంచి ఆకాశగంగ. తీర్థంతోనే
శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం జరుగుతుంది ,
Read More

శ్రద్ధ లేకుండా కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు.శ్రద్ధ లేకుండా కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు.

వేరువేరు కర్మలు వేరు వేరు ఫలాలనిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో పలువురు తాము ఆచరించిన కర్మలకు తామనుకున్నట్లు కలగకపోవడంతో శాస్త్రాల ప్రామాణికతను సందేహిస్తున్నారు.

గీతలో కృష్ణభగవానుడిలా అన్నాడు:


అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్!
అసదిత్యుచ్యతే పార్థ నచ త్ప్రేత్య నో ఇహ!!

శ్రద్ధలేని కర్మ కోరిన ఫలితాన్నివ్వదు. అందువలన మీరు చేసిన ఏ కర్మైనా కోరిన ఫలమివ్వలేదంటే ఆ కర్మను మీరు శ్రద్ధతో చేయలేదని అర్థం.

శ్రద్ధ లేకుండా కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు. సర్వకాలాలలోను సందేహాతీతమైన ప్రామాణ్యం కలవి శాస్త్రాలు.

అందువలన శ్రద్ధతో కర్మలనాచరించాలనేది చాలా ముఖ్యం.

అయితే శ్రద్ధ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆదిశంకరులు ఇలా సమాధానమిచ్చారు.

శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యాsవధారణా!సాశ్రద్ధా కథితా సద్భిః!! అని

శాస్త్రాలలో గురువాక్యంలో అచంచలమైన నమ్మకమే శ్రద్ధ అని. ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి. పురాణాలలో దక్షప్రజాపతి ఈశ్వరద్వేషంతో యజ్ఞంచేయ తలపెట్టాడు. యజ్ఞం సత్ఫలితాలనివ్వకపోగా, అది ఘోరమైన విధ్వంసంతో ముగిసింది.గురువుగారి ఉపదేశాన్ని శ్రద్ధతో గ్రహించేవానికే జ్ఞానం లభిస్తుంది. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” – అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అందువలన మనిషి జీవితంలో శ్రద్ధ చాలా అవసరం.

అందరూ శ్రద్ధతో కర్మల నాచరించి శ్రేయస్సును పొందుదురుగాక.
Read More

శ్రీచక్రం..శ్రీచక్రం..
శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది మాతృకలు స్థాపించబడ్డారు..వీరు అమ్మవారికి అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు
.. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం.. వీరిలో తూర్పువైపున బ్రాహ్మీ, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహీ, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు.. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్భంధనగా చేయబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు.. వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు..ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్టించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.. మళ్ళీ కలుద్దాం..శివోహం..
మీకు ఎన్నో రహస్య విద్యలు చెప్పాలని ఉంది..కానీ మాకు సమయం చాలడంలేదు శివా..అందువలననే ఎక్కువగా చెప్పలేకపోతున్నాం... కానీ అన్ని విద్యలు తెలుపుతాం...శివోహం
English language...
Sri chakra...


Sri chakra is a form of mystical diagram, this is formed by 9 interlocking triangles that surround and radiant from a central point.
Sri chakra is a symbol of hindu tantra. In this 8 directions are covered by 8 matrikas(goddesses) to protect sri vidya.
All the 8 sides are covered by....
Braahmi, maheshwari, koumari, vaishnavi, vaarahi, maahendri, chamundi, mahalakshmi.
siddhas who acqire the power of srichakra dont have equallent power opposite. They are very strong and no enchantments will harm them.
Any house or any place protected by ashtadigbandhana of srichakra is safe always. For this head of the house should perforn srichakra pooja daily with some offerings.

****om shivai paramatmane namag****


Read More

భక్త హాథిరాం బావాజీభక్త హాథిరాం బావాజీ
పర్ణ అంటే ఆకులు అని అర్థం. తిరుమల దేవాలయం నుంచి పాపనాశిని ఆకాశగంగకు వెళ్లే
మార్గంలో పరమ భక్త హాథిరాం బావాజీ సమాధి వుంది. దీన్ని హథీరాం మఠం అని అంటారు. ఈ
దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్నిఅందిస్తారు. ప్రసాదాన్ని ఆకు రూపంలో ఇస్తారు.
ఆకు అంటే సామాన్యమైన ఆకు అని అనుకోవద్దు. ఆ ఆకు సామాన్యమైంది కాదు. ఆ
ఆకు సంజీవని చెట్టుది (సంజీవని ఆకు) ఈ సంజీవిని ఆకును తింటే దేహంలోని అన్ని
రోగాలు నయమవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.


1. సంజీవిని
2. అమృత సంజీవని

సంజీవిని చెట్టు పేరు విన్నంతలోనే మీకు రామాయణంలోని యుద్ధకాండ ప్రకరణంలో
హనుమంతుడు సంజీవని అనే పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని బతికించిన
వైనం గుర్తుకు వైనం వచ్చి తీరుతుంది. ఈ సంజీవని చెట్టు ఆకులను తిని
హాథీరాం మహరాజు (బావాజీ) జీవితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నందున ఈ క్షేత్రానికి వచ్చే
భక్తులు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు.
అందుకే ఈ ప్రసాదానికి పర్ణ ప్రసాదమని పేరు ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి
రోగాలన్నీ తొలగిపోతాయి. సంజీవని ఆకుకు, అమృత సంజీవని ఆకుకు ఉన్న తేడా ఏమిటి?
సంజీవని ఆకులానే అమృత సంజీవని ఆకు కూడా ఉంటుంది. అమృత సంజీవని ఆకును నోటిలో
ఉంచుకుని పీల్చుకుంటే నోట్లో నీటి అంశం ఎక్కువ ఉంటుంది. ఈ నీరు అమృత సమానమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత నీటితో శుభ్రపరిచి
ప్రతిరోజు ఉదయం ఆరు గంటల్లోపు తింటే అసాధ్యమనుకున్న రోగాలైన క్యాన్సర్, గుండె నొప్పులు, ఆస్తమా, మధుమేహం తదితర వ్యాధులు నయం అయిన ఘటనలు చాలా ఉన్నాయి
ఈ చెట్టు బెంగళూరులోని లాల్బాగ్, కబ్బన్ పార్క్ మల్లేశ్వరంలోని అటవీ విభాగం నర్సరీలో
లభిస్తుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో
మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు. అనంతరం తమలపాకు భక్తులకు ప్రసాదం ఇస్తారు.
దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.
Read More

ఆర్కాటు నవాబు - ఆస్థాన జ్యోతిష్కుడుఆర్కాటు నవాబు - ఆస్థాన జ్యోతిష్కుడు

ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన. అప్పుడు మా నాన్న గారు పి.యమ్. నటరాజ శర్మ గారు తిరుచిరాపల్లిలోని బిషప్ హెర్బర్ కాలేజిలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసేవారు. వారికి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పై అపారమైన భక్తి విశ్వాసం.

అప్పటి తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నది ఉత్తర గట్టున నాత్తం అనే ఊరిలో మహాస్వామి వారి మకాం. మా నాన్న గారికి శ్రీ త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్న మహాస్వామి వారిని చూడాలని చాలా కోరిక. మూడు రోజులు వరుసగా సెలవు కావడంతో శుక్రవారం రాత్రి వారు నాత్తం చేరుకున్నారు. ఆరోజు పూజ ముగిసింది. మా నన్నగారు ఎవరికి తెలియకపోవడం వల్ల ప్రత్యేక స్వాగతం ఏమి లేదు. నుదుటిపై స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన విభూతిని ధరించి అక్కడే పందిరిలో ఒక మూలలో పడుకున్నారు. తరువాత రెండు రోజులు ఇలాగే గడిపేసారు. అక్కడ జరిగే ఆరాధనలు పూజలు కన్నులపండువగా దర్శించుకున్నారు.

మూడవ రోజు వినాయ చవితి పండుగ. ఆనాటి విశేష పూజ అనంతరం మా నాన్న గారు స్వామి వారు ఇచ్చే ప్రసాదానికై వెళ్ళి వారి తిరుగు ప్రయాణం గురించి చెప్పారు. మహాస్వామి వారు తల ఎత్తి, “ముందు వినాయకుడి ముందు పెట్టిన మోదకాలను తీసుకుని, ఎక్కడైనా కూచుని తీరికగా తిని నా వద్దకు రా. అప్పుడు ఆలోచిదాము నీ ప్రయాణం గురించి అన్నారు”.

మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. వారు పరమాచార్య స్వామి వారితో సెలవు అడగగా స్వామి వారు ముందు మోదకాలు తిని తరువాత రమ్మన్నారు. తిన్న తరువాత స్వామి వారు రమ్మన్నారు. మా నాన్న గారు పుదుక్కుడి శ్రీనివాస జోస్యర్ (జ్యోతిష్కులు) మనుమడు అని తెలిసి స్వామి వారు చాలా ఆనందపడ్డారు. స్వామివారు వారి తాత గారి గురించి అప్పుడు జరిగిన సంఘటనల గురించి గుర్తుచేసుకున్నారు. ఆశ్చర్యపోవడం మా నాన్నగారి వంతు.

పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారు : “మీ తాత గారు మళయాళ దేశం వెళ్ళి సప్రమాణికమైన జ్యోతిష్యాన్ని నేర్చుకున్నారు. ఎన్నో మంత్రాలను ఉపాసించారు. వారు ఆర్కాటు నవాబు ఆస్థాన జ్యోతిష్కులుగా నియమితులయ్యారు. అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. అప్పట్లో తిరుచిరాపల్లి ఆర్కాటు నవాబు ఆధీనంలొ ఉండేది. నవాబు గారి వద్ద చాలా మంది జ్యోతిష్కులు ఉండేవారు. ఒకసారి నవాబు గారు వారి ఏలుబడిలో ఉన్న జ్యోతిష్కులందరినీ వారి ఆస్థానం లో ఉన్న వారిని కూడా పిలిచి సభ తీర్చారు. చలా మంది కొత్త జ్యోతిష్య పండితులు కూడా వచ్చారు. అందులో మీ తాత గారు కూడా ఉన్నారు.

నవాబు గారు కచేరికి రాగానే దివాను గారు లేచి అక్కడున్న జ్యోతిష్కులందరితో, “నవాబు గారు మీకందరికీ ఒక పరీక్ష పెట్టబోతున్నారు. ఈరోజు నవాబు గారు వేటకు వెళ్ళబోతున్నారు. వారు ఏ రాజద్వారం గుండా వెళ్తారో ఆ విషయాన్ని మీరందరూ ఒక తాటి ఆకుపై రాసి ఆ తాటి సంచుల్లో ఉంచండి. వాటినన్నీంటిని జాగ్రత్తగా భద్రపరుస్తాము. నవాబు గారు తిరిగి వచ్చిన తరువాత వాటిని తీసి చదువుతారు. సరిఅయిన సమాధానం రాసిన వారికి తగిన సత్కారం లభిస్తుంది” అని అన్నాడు. అందుకని అందరూ వారి గణన ప్రకారం తూర్పు లేదా పడమర లేదా ఉత్తరం లేదా దక్షిణ ద్వారం అని రాసి ఇచ్చారు.

చివరికి ఆ రోజు నవాబు గారు ఏ ప్రధాన ద్వారం గుండానూ బయటికి వెళ్ళలేదు. పశ్చిమ ద్వారపు ఉత్తర గోడని(ఈనాటి ప్రధాన రక్షణ ద్వారం పెట్రోల్ బంకు ఉత్తరం వైపు) కూల్చి బయటికి వెళ్ళి, పశ్చిమాన ఉన్న ఉరయ్యూర్ వైపు కొద్ది దూరం వెళ్ళారు. తరువాత ఉత్తరం వైపు తిరిగి కావేరి నది ఒడ్డుకు వెళ్ళారు. తరువాత దక్షిణం వైపు తిరిగి కూల్చిన ఉత్తర అండర్ వీధి (ఈనాటి పుడుప్పడి లేన్) కోట ఉత్తరం వైపు వెళ్ళారు. తరువాత తూర్పు తిరిగి ఎగుడుదిగుడు రాళ్ళ మార్గం ద్వారా తూర్పు అండర్ వీధికి వచ్చారు. కోట చుట్టి వచ్చి, తన కచేరి అయిన చిన్నక్కడై వీధిలోని ఆనాటి టౌన్ హాల్ కు వచ్చారు. అసలు వేటకు వెళ్ళనేలేదు. నవాబు వచ్చిన తరువాత అన్నింటిని చదవగా నవాబు గారు ఏమి చేసారో మీ తాతగారు సరిగ్గా గుణించారు. నవాబు గారు ఆశ్చర్యపోయారు. కచేరీలోని వారందరూ అవాక్కయ్యరు.

తరువాత నవాబు మీ తాత గారికి చట్టబద్దంగా పుదుక్కుడిలో 80 ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు. రాతికోట దక్షిణం వీధిలో పశ్చిమం ఒక వైపు నల్లని దేవాలం ఉంది. ఆ దేవాలయం దగ్గర్లో ఇనుప గేటు ఉన్న పెద్ద ఇల్లు ఒకటి ఉంది. దానికి ఎదురుగా అరుగు ఉన్న చిన్న ఇల్లు ఉంది. నవాబు ఆ రెండు ఇళ్లని కూడా ఇచ్చాడు. మీ తాత గారు ఆ భూమిని, ఇళ్ళనీ ఎన్నో ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించారు”

ఇవన్నీ తెలిపి పరమాచార్య స్వామి వారు మా నాన్న గరికి వీడ్కొలు చెప్పారు. మా నాన్న గారు తరచుగా ఈ విషయాన్ని నాకు చెప్పి పొంగిపోయేవారు.

--- శ్రీ పి.యన్. శంకర రామన్, కంబరసంపెట్టయ్ - శక్తి వికటన్ ప్రచురణ
Read More

మహాస్వామి వాక్కుమహాస్వామి వాక్కు

అది ఉషోదయ కాలం. అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూటలో పల్లకిలో ఒక పల్లెనుండి మరొక పల్లెకు సంచరించేవారు. అది కుంబకోణం దగగ్ర చిన్న పల్లెటూరు. మహాస్వామివారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరి ప్రజలు కొద్దిగా త్వరపడుతూ వస్తున్నారు. మహాస్వామివారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగం చేశారు. విషయం ఏమిటని అడుగగా వాళ్లలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసానిని తీసుకుని రావడానికి వెళ్తున్నామని, ఇది ఆమెకి ఎనిమదవ కాన్పు అని నాగ దోషం వలల్ ఏడు కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు.


మహాస్వామివారు ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకొని అతనితో, “అంతా ఆ భగవంతుని అనుగ్రహం. ఏమీ దిగులు పడాల్సిన పని లేదు. భయపడకు. మంత్రసాని వచ్చే లోపలే నీ భార్య బిడ్దని ప్రసవించి ఉంటుంది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమమే. కనుక ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు. తిన్నగా ఇంటికి వెళ్ళు. బిడ్డకే దోషమూ లేదు మరియు బిడ్డకు దీర్ఘాయుష్షు కలదు.” అని చెప్పారు.

అతను చాలా సంతోషపడి, మహాస్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా, ఉత్సాహంతో స్వామికి సాష్టాంగం చేశాడు. ఇంటికి వెళ్ళగా, స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది. ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై, అపార జ్ఞానసంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు.

అతనికి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం ఉంది అనడంలో ఏమి సందేహము లేదు.

--- శ్రీ సుదర్శనానంద గారి ‘జ్ఞాని’ నుండి
Read More

కాంచీ - కామకోటి

కాంచీ - కామకోటి
కామకోట్ణీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం
శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః ||


శ్రీమద్భాగవతంలోని ‘కామకోట్ణీంపురీం’ అనీ ‘కామకోటిపురీం’ అనీ పాఠభేదాలతో కాంచీనగరంలోని కామకోటి ప్రశంస కానవస్తున్నది. దీనివలన ఈ పీఠం యొక్క ప్రాచీనత్వం తెలుస్తున్నది. అంతేకాక భారతదేశంలో ప్రసిద్ధికాంచిన అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ముఖ్యమైన పీఠత్రయంలో కామకోటికి ప్రథమస్థానం ఇవ్వబడింది. ప్రాచీన తమిళ గ్రంధాలలో కూడా కరికాలచోళుడు ‘కామకోటి’ అని ‘కామకొష్టం’ అని ఉదహరించినట్లు కనిపిస్తుంది. కామకోటికి నిలయమైన కంబలభూదేవికి కాంచీ మేఖలగా ఒడ్డాణంగా వర్ణిస్తారు.

మోక్షదాయకమైన సప్త క్షేత్రములలో కాంచి ఒకటి. భౌగోళికంగా కూడా కాంచి నాభిప్రదేశంలోనే ఉంది. బెంగాలీ విశ్వనిఘంటువులో కాంచి ఒక మాహాపీఠస్థానమనీ అక్కడ కామాక్షి ఆలయంలో నిలువెత్తు ఆదిశంకరుల విగ్రహం వుందనీ, అది వారి సమాధిస్థలమనీ వ్రాయబడివుంది. రాజచూడామణి మఖి వ్రాసిన శంకరాభ్యుదయములో గ్రంధాంతమున, ఆదిశంకరులు కంపాతీరవాసికి కామాక్షిని అర్చించి బ్రహ్మానందం పొందారని ఉన్నది. దక్షిణాదిని ప్రచారంలో ఉన్న శంకరవిజయవిలాసమనే గ్రంథంలో కాంచీనగరంలో అదిశంకరులు సర్వజ్ఞపీఠం నెలకొల్పి షణ్మతస్థాపనాచార్యులయ్యారని వ్రాయబడి వున్నది. కేరళదేశంలో గోవిందనాథ రచితమైన శంకరాచార్య చరిత్రకు బహుళప్రచారం. దానిలో ఆదిశంకరులు తమ దిగ్విజయ యాత్రలన్నీ ముగించుకొని కంచీనగరానికి చేరినట్లు చెప్పబడినది.

ఆదిశంకరులు కైలాసంనుంచి తెచ్చిన లింగ పంచకములలో ఒకదానిని శిష్యుడు సురేశ్వరాచార్యుల కిచ్చారని, కంచిలో శ్రీచక్రస్థాపన చేశారనీ, షణ్మతస్థాపన కూడా కంచినుంచే చేశారనీ స్పష్టంగా ఆనందగిరీయ శంకరవిజయంలో ఉన్నది. ఇవేకాక శివరహస్యం, మార్కండేయ సంహిత మొదలైన ప్రామాణిక గ్రంథాలు కూడా ఆదిశంకరులకూ కంచి కామకోటిపీఠానికి గల అనాది సంబంధాన్ని స్పష్టంగా వివరించినవి.

కామకోటి సమస్థమైన కోరికలకు అవధి, అంచు. ఈ విషయాన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. ఆ తల్లిని కామాక్షిని నమ్ముకుంటే సమస్తములైన కోరికలనూ పొందవచ్చు. పోగా కోరికల అవధిని, అనగా అంతమునూ పొందవచ్చు. అంటే కోరికలులేని నిష్కామస్థితి లభిస్తుందన్నమాట. పురుషార్థములలో కామము మూడవది. అది ధర్మార్థములకు పైది. అట్టి కామకోటి అనగా కామము అంచు మోక్షమే కదా అట్టి మోక్షం మోక్షపురి కంచిలో నెలకొన్న కామకోటి ప్రసాదిస్తుందని పండితార్థం. శ్రీకామకోటీని ఆశ్రయించినవారి కోర్కెలు కోటి గుణితములుగా ఫలించగలవు.

కామానాం వర్ణతాత్పర్యాత్తత్కోటి గుణసంఖ్యాయా
కామకోటోతి విఖ్యాతం కామకోష్ఠ ధరాతలమ్
అథ కామస్తృతీయోర్థం పురుషార్థేషు విశ్రుతః
తత్పరస్తా చ్ఛృతో మోక్షః కోటిశబ్ధేన శబ్దితః
కామకోటి స్మృతో మోక్షః పురుషార్థ తురీయకః

ఈ కామకోటి పీఠాధిష్ఠాతృశక్తి భగవతి కామాక్షి, ఆమె కంపానదీతట విహారిణి. ఏకామ్రనాథుని కుటుంబిని. శ్రీచక్రస్వరూపిణి. సకలలోకైక జనని. ఆమ్రతరుమూల వాసిని. ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములనే ఆ మామిడి చెట్టు శాఖాచతుష్టయములో నాలుగు రుచులలో పండించి అడిగినవారికి పంచిపెడుతుందట. ఆమె కటాక్షమునకు నోచుకున్న భాగ్యశాలి మూగియైననూ వాగ్మికాగలడు. అతడు శత్రుమిత్రులనూ, లోష్టమునూ యువతిబింబోష్ఠమునూ సమదృష్టితో చూడగలడు. ఆమె కరుణాస్రవంతికి అవధులు లేవు.

ఆ తల్లి చల్లని గొడుగు నీడలో ఇంద్రసరస్వతి బిరుదుతో శ్రీశంకరాచార్య పరంపర అవిచ్ఛిన్నంగా జగత్కల్యాణసంధాయకముగా నేటివరకూ ప్రవర్థమానమవుతూ లోకాన్ని కటాక్షిస్తూవుంది. ఈ పీఠాచార్యులు సరస్వతీ సంప్రదాయమునకు చేరినవారు. ఇంకొక భారతీ సంప్రదాయము మరొకటి ఉన్నది. ఆదిశంకరులచేత ఓడింపబడిన తరువాత మండనమిశ్రులకు అసాధ్యమైన శిరోవేదన కలిగిందట. ఎంత చికిత్స చేసినా ఉపయోగం లేకపోయింది. తర్వాత ఆచార్యులవారి కోరికపై అశ్వినీదేవతలు వచ్చి చికిత్స చేశారట. ఇంద్రుని అనుమతి వారు పొందనిదానివలన వారిపై ఇంద్రునికి ఆగ్రహం వచ్చింది. అనంతరం పశ్చాత్తాపపడి శంకరభగవత్పాదులను ప్రశంసించి వారి ధర్మ జగత్తులో తమ ఇంద్రసామ్రాజ్యాన్నీ కలుపుకోమని ఇంద్రుడు ప్రార్థించాడట. ఆనాటినుండి ఆ పీఠాధిపతులందరూ ఇంద్ర సరస్వతులని వ్యవహరింపబడుతూ వచ్చారు.

శ్రీ గీర్వాణేంద్రసరస్వతి, గంగాధరేంద్రసరస్వతి, పరమేశ్వరేంద్రసరస్వతి, సదాశివేంద్రసరస్వతి మొదలైన యతీశ్వరులీ ఇంద్రసరస్వతి సంప్రదాయానికి చేరిన మహిమాన్వితులు. ఆదిశంకరులకు గోవింద భవత్పాదులు ఉపదేశించిన మహావాక్యదీక్షా విధానమే ఇంద్రసరస్వతీ కోవకు చెందిన యతులకు కూడా ఆశ్రమస్వీకార సమయమున వరణీయమై ఉన్నది. ఈ పవిత్రమైన సంప్రదాయములో 68వ పీఠాధిపతులు పూజ్యచరణులు, పరమశివస్వరూపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములు.

ధర్మసంస్థాపనతో పాటు ఈ గురుపరంపరకు చెందిన యతీశ్వరులు చేయవలసిన మరొకకార్యమున్నది. శ్రీరంగం దగ్గర్లోని తురువనైక్కావల్ జంబుకేశ్వరాలయం కంచికామకోటి ఏలుబడిలోనిది. అక్కడి అమ్మవారు ‘అఖిలాండేశ్వరి’ . ఆదిశంకరులు ఆ మూర్తిలోని ఉగ్రకళను తీసివేసి నవరత్న ఖచితమైన శ్రీచక్రతాటంకములను ఆమె చెవులకు అలంకరించారట. అవి జీర్ణమైనప్పుడల్లా కామకోటి పీఠాధిపతులు వెళ్ళి వానిని బాగుచేయించి అమ్మవారికి అలంకరిస్తారు. శ్రీచంద్రశేరేంద్ర సరస్వతులు తమ పదునాలుగవ ఏట అనగా 1908లో అఖిలాండేశ్వరి ఆలయానికి కుంభాభిషేకం చేసి తరువాత 1922లో అమ్మవారి తాటంకముల జీర్ణోద్ధరణ క్రతువు చేశారు. ఈ శతాబ్ధిలో ఈ మహత్కార్యం చేసిన ఘనత శ్రీవారికి దక్కినది.

శ్రీకామకోటి పీఠానికి చోళదేశపు ప్రభువులేకాక కర్ణాటక రాజులు విజయనగర సామ్రాట్టు కృష్ణదేవరాయలు, గోల్కొందనవాబులు, మహామంత్రులు అక్కన్న మాదన్నలు, మధుర నాయక ప్రభువులూ, తంజావూరు మహారాష్ట్రపాలకులూ, ఆర్కాటు నవాబులూ, ఇతర ప్రభువులూ, సంపన్నులూ, ఎందరో అగ్రహారములు, ఇనాములు కానుకలు ఇచ్చి ధన్యులయ్యారు. వారిచ్చిన దానపత్రములు, రాగిరేకులు, శాసనములు ఈ విషయాలను ధృవపరుస్తున్నవి.

చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠప్రాశస్త్యమును ఈనాడు, ప్రాతః స్మరణీయులు శ్రీ చంద్రశేఖరేంద్ర సంయమీంద్రులు తమ తపః పూతమూ, పరోపకార త్యాగ సమన్వితమూ, లోకకళ్యాణ సమలంకృతమూ, జంగమ తీర్థరాజతుల్యమూ, అయిన పవిత్ర జీవితముతో కోటి గుణములు పెంపొందించుచున్నారు. గురుదేవుల శ్రీచరణములకివే మా అంజలులు.

--- రేణు, ఆంధ్రప్రభ:7.4.1968 ‘చంద్రశేఖర వచోవిభూతి’ నుండి
Read More

క్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్సక్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్స

దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడు.

వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టం అని చెప్పేవారు వైద్యులు.


గణేశ అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు.

మహాస్వామి వారు అతనితో "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. తిరుతురైపూంది సమీపములో తిరునెల్లిక్కావల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషనులో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది. ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పేరు "కనకల్" (తమిళంలో). ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే కాన్సర్ నయం అవుతుంది” అని చెప్పారు.

పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు. ఆశ్చర్యముగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి, కేవలం కొద్ది రోజులలలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది.

ఎప్పుడూ స్వామి వారిని ధ్యానించే ఆవిడ 80 సంవత్సరాలు పైగా జీవించారు. అంతే కాకుండా మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2
Read More

చెన్నై - కంచి ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..చెన్నై - కంచి

ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..

నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే.


మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.

మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాలిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను.

ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము.

కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాలికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు.

మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాల ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము.

మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన.

కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం.

--- మూలం : స్వస్తిక్ టివి
Read More

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడుఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు


తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.
మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.హనుమంతుని పయనం: రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.
Read More

భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?

దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. ఆకలివేస్తే దానితో అన్నం తింటాం. ఎండవానలనుండి కాపాడుకోవటానికి నీడ కావాలి. జంతువులకువలెకాక మనకు మానం అనేది ఒకటి ఉన్నది. కదా! అట్టి మానం కాపాడుకోవడంకోసం వస్త్రం కావాలి. అన్నమూ, వస్త్రమూ, ఇల్లూ ఈమూడూ ఒకత్రిపుటి. దీనిని సంపాదించుకోవడంకోసం ఒక ఉద్యోగం, ముందటిమూడూ అక్కరలేకపోతే మానవుడు పని యేమీ చేయవలసిన అవసరం వుండదు.


ఈమూడిటినీ వదలిపెట్టిన మనుజుడు పని యేమీ చేయకుండా వున్నాడని తెలుస్తున్నది. ఇప్పుడు కూడా అటువంటి జ్ఞానులు ఒకరిద్దరు వుండవచ్చు. కాని అది మనకు తెలియదు. ఒక పని చేయడం గాని దానివల్ల కలుగ వలసిన ఫలితం గాని వారి కేమీలేదు. ఏదైనా ఒక పని చేశాడంటే అతడు జ్ఞాని కాడు అని అర్థం.

అన్నం కోసం, ఇంటి కోసం, బట్టకోసం, మనం సతతం యత్నించి సతతమై పోతూ ఉంటాం. సదా దుఃఖరహితులమై ఆనందంగా వుండాలంటే మనము చేసే ప్రతిపనీ ఈశ్వరార్పణం చేయాలి.ఈశ్వరానుగ్రహమే దొరికితే ఇక పనితో పనిలేదు. ఆనందంగా వుండవచ్చు. ఈశ్వరానుగ్రహం దొరకనంతవరకూ ఈ మూడూ కావాలంటే కావాలి. తల వెంట్రుకలన్ని పనులు బరువు నెత్తిమీది నుండి జారిపోదు. పనులను చక్కగానూ చిత్తశుద్ధితోనూ ధర్మానుసారముగానూ చేయవలె నంటే ఈశ్వరునియెడల భక్తి తప్పదు. అందుచేత భక్తినిమాత్రం అవలంబిస్తామంటే ప్రయోజనంలేదు.పనిచేయటం అవసరమే.

ఒక ఆసామి దగ్గర ఇద్దరు సేవకులు వున్నారని అనుకుందాం. వారిలో ఒకడు ఆ ఆసామిని యెప్పుడూ ముఖస్తుతి చేస్తూ ఉంటాడు. మరియొకడు ఆసామికి ప్రేమ లేకపోయినా తానుమాత్రం ఆ ఆసామిని ప్రేమిస్తూంటాడు. ఆసామి మూర్ఖుడైతే తన్నెప్పుడూ స్తోత్రం చేసే సేవకుని ప్రేమిస్తుంటాడు. అతడు బుద్ధిమంతుడైతే ఎప్పుడూ పని చేసే వానిని గాని స్తోత్రము చేసే వానిని గాని ప్రేమించడు. 'ఇది ఆసామి పని ఇది తన పని' అని భేదబుద్ధి లేకుండా భక్తితో 'ఇది అంతా ఈశ్వరుని పని' అని కొరత యేమీ లేకుండా ఏ పని బడితే ఆ పని ప్రీతితో చేసే వానియందు ఆ ఆసామి ఎక్కువ వాత్సల్యం వుంచుతాడు. ఈశ్వరుడు కూడా అట్టి ఆసామే. సర్వజ్ఞుడైన అట్టి ఆసామిని స్తోత్రం మాత్రంచేసి తనివి నొందింప లేము. అతని ఆజ్ఞ శిరసావహింపక ఊరకే స్తోత్రం చేసినంత మాత్రాన అతడు సంతోషించి అనుగ్రహించడు. ఆయనకు కావలసిందేదీ లేదు. దానివల్ల ఆయనకు గౌరవమూలేదు అగౌరవమూలేదు. అట్లాగే మన కర్మల వల్ల గూడా ఆయనకు కావలసిన దేదీ లేదు. విహితమైన కర్మాచరణం మన చిత్త శుద్ధి కోసమే.

స్నానం, సంధ్యా, జపము, హోమము, దేవపూజ అనేవి నిత్యకర్మలు. ఈ ఆరింటినీ, తప్పకుండా చేయాలని పెద్దలు చెపుతారు. ఈ ఆరింటిలోనే అన్నీ అడగి వున్నవి. ఈ కర్మల చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది- షట్‌ కర్మాణి దినే దినే. స్నానం యెలా చేయాలో శాస్త్రంలో చెప్పబడి వుంది. అలా చేస్తేనే ఆత్మశుద్ధి. సబ్బుతో ఒళ్ళుతోముకుంటే దేహం మాత్రం శుద్ధమవుతుంది. స్నానసమయంలో చెప్పవలసిన మంత్రాలుకొన్నిఉన్నవి. మంత్రమనేమాట తెలియకపోయినా రామా! కృష్ణా! అని స్మరిస్తూనైనా స్నానంచేయాలి.
Read More

వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రాశస్త్యం...వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రాశస్త్యం...

హిందువులకు ఎంత మంది దేవుళ్లు ఉన్నా- వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం వేరు. మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు, మన రాష్ట్రంలో తిరుమలకు వెళ్లని వారు అతి తక్కువ మంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి తిరుమల గురించి, అక్కడ వెలసిన వెంకటేశ్వరుడి గురించి తెలియని గాథలెన్నో ఉన్నాయి. - ''తిరుమల చరితామృతం...' దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
...
తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా, అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజానైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి - శిలా విగ్రహం. ఎవరూ ప్రతిష్టించింది కాదు - పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెల్పి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలోనుండి తీయించి ఆలయం కట్టించమన్నాడనీ..., పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండుగోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడుండేవాడనీ... యోగులకు, దేవతలకు తపస్సంపన్నులకే కన్పడేవాడనీ... అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకూ ఇక్కడ ఉండి, పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి, లోకాలను రక్షించమని కోరాడనీ... బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీవేంకటాచలంపై ఉన్నాడనీ పురాణాలలో ఉంది.
....
ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది.
కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.

ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు.
Read More

పరమ పావనమైన ధనుర్మాస వేళలో వచ్చేటటువంటి దివ్యమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి

పరమ పావనమైన ధనుర్మాస వేళలో వచ్చేటటువంటి దివ్యమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరింపబడుతున్నది. ఈ పావనమైన ఏకాదశీ పర్వం ప్రతి మాసములోనూ సార్థకమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మాసాలలో ఒక ప్రత్యేకత దీనికి ఉన్నది. ఆ ప్రత్యేకత ప్రకారంగా ఈనాడు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి అని. అందుకే ప్రతి విష్ణ్వాలయంలో కూడా ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది. అది ఈరోజునే తెరుస్తారు. తిరుమల వేంకటేశ్వరుడు మొదలుకొని ప్రతి విష్ణ్వాలయంలోనూ మన దక్షిణాదిలో ఆ ద్వారములు తెరవడం అనేది ఒక ప్రసిద్దిగా జరుగుతున్నటువంటి అంశం ఇది. ఉత్తరం వైపు ద్వారం దీనికి వైకుంఠ ద్వారము అని పేరు కూడా ఉన్నది. జయ విజయులు ఇక్కడ కాపలాగా ఉంటారుట. మనకు పురాణములయందు కూడాను జయవిజయులు కాపలాగా ఉన్న ద్వారం వైపు వెళుతూ సనకసనందనాదులు ఆ సమయంలోనే అక్కడ జయవిజయులు అవరోధించినప్పుడు వారిని శపించడం ఈ కథ కనపడుతూన్నది. అందుకు జయవిజయులు కాపలాగా ఉన్నటువంటి ద్వారము ఉత్తర ద్వారము.
ఈరోజు విష్ణుపూజ విశేషమైన ఫలాలనిస్తుంది. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని భావిస్తాం. సౌరశక్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని చాలా మహిమ గలిగిన ఏకాదశిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఏకాదశి ముందు రోజు ఒంటిపూట భోజనం చేసి, ఏకాదశినాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారములతో శ్రీమన్నారాయణుని పూజించాలి. ద్వాదశి నాడు మరలా పూజ చేసి అన్నాదికాలు నివేదించి, పారణ చేయాలి.
ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహ మపరేహని!
భోక్ష్యామి పుండరీకాక్ష! శరణం మే భవాచ్యుత!!
అనే మంత్రాన్ని చెప్పి దేవునికి పుష్పాంజలిని సమర్పించాలి.
Read More

శ్రీ మహాభారతంలో శ్లోకములుశ్రీ మహాభారతంలో శ్లోకములు

మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి". అంటే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా, ఎక్కువ సేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట "ఏమిటి ఆ చాట భారతం" అని కదా! మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా?

మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!


ఆదిపర్వం - 9984 శ్లోకములు
సభాపర్వం - 4311 శ్లోకములు
అరణ్య పర్వం - 13664
విరాటపర్వం - 3500
ఉద్యోగ పర్వం - 6998
భీష్మ పర్వం - 5884
ద్రోణ పర్వం - 10919
కర్ణ పర్వం - 4900
శల్య పర్వం - 3220
సౌప్తిక పర్వం - 2870
స్త్రీ పర్వం - 1775
శాంతి పర్వం - 14525
అనుశాసనిక పర్వం - 12000
అశ్వమేధ పర్వం - 4420
ఆశ్రమవాస పర్వం - 1106
మౌసల పర్వం - 300
మహా ప్రస్థాన పర్వం - 120
స్వర్గారోహణ పర్వం - 200

అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి.
Read More

శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది?శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది?

మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటివారికి అవగాహన కోసం...

1. ఆదిపర్వం:
రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతోపాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధికభాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది.

2. సభాపర్వం:
పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు.

3. అరణ్యపర్వం:
దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది. దీనితోపాటు నలదమయంతుల కథ, సావిత్రిసత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతోపాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి.

4. విరాటపర్వం:
విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర - అభిమన్యుల పరిణయం ఉంటుంది.

5. ఉద్యోగపర్వం:
ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధసన్నాహాలు సమాంతరంగా సాగిపోవటం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేస్తూనే పాండవులను యుద్ధసన్నద్ధులను గావించే శ్రీ కృష్ణుని రాజనీతి... ఈ పర్వంలోని ముఖ్యాంశాలు.

6. కర్ణపర్వం:
కౌరవ సోదరులలో రెండవవాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలటం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందటం... ఇందులోని ప్రధానాంశాలు.

7. భీష్మపర్వం:
మహాభారతంలో ఆరవది భీష్మపర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారస్వతానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. పదిరోజుల యుద్ధ వర్ణన, భీష్మపితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ్య మీదనే విశ్రమించడం ఉంటాయి.

8. ద్రోణపర్వం:
ద్రోణాచార్యుల సాహసకృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన ‘అశ్వత్థామ హతః’ అనే మాట ఫలితంగా ఆయన అస్త్రసన్యాసం చేసి వీరమరణం పొందటం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు.

9. శల్యపర్వం:
మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్యపర్వం. భీమదుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించటం ముఖ్యాంశాలు.

10. సౌప్తికపర్వం:
ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉపపాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయటం ఈ పర్వంలో ప్రధానాంశాలు.

11. స్త్రీపర్వం:
వీరమరణం పొందిన కురుపాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్లకు కడుతుంది.

12, 13. శాంతి, అనుశాసనిక పర్వాలు:
ధర్మరాజు అభ్యర్థన మేరకు, వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించటం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివసహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి.

14. అశ్వమేధిక పర్వం:
శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవటం, ధర్మరాజు చేసిన అశ్వమేథయాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించటం ఇందులోని కొసమెరుపు.

15. ఆశ్రమవాసిక పర్వం:
కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వటం, అక్కడ ప్రమాదవశాత్తూ అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు.

16. మౌసలపర్వం:
యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవటం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి.

17. మహాప్రస్థానిక పర్వం:
పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది.

18. స్వర్గారోహణ పర్వం:
భీమార్జున, నకులసహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరటం ఇందులోని ప్రధానాంశం.
Read More

Mantra for Success in Studies and Examinations చదువు మరియు పరీక్షలలో విజయం కోసం మంత్రంMantra for Success in Studies and Examinations చదువు మరియు పరీక్షలలో విజయం కోసం మంత్రం
విద్యకు, జ్ఞానానికి అధిదేవతలు సరస్వతి, గణపతి మాత్రమే కాదు. విష్ణువు జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు. ఆయన విద్యలను ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహానికి ఈ స్తోత్రం చదవాలని పెద్దలు చెబుతారు.
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
ఓం శ్రీ హయగ్రీవాయ నమః


జ్ఞానానందమయుడు, స్వచ్ఛమైన స్పటికం మాదిరి తెల్లని రంగు కలవాడు, అన్ని విద్యలకూ ఆధార భూతుడు అయిన హయగ్రీవునకు నమస్కారం అని దీని అర్థం.

How to Chant:

The first two lines are Sloka. Every day in the morning, after the bath and daily prayers, read this Sloka 3 times and then chant(japaa) the mantra 11 times or 108 times or more. Chant or jaap the mantra through out the day while doing your daily work. There are no restrictions or any rules for this mantra.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML