గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

పురుష మృగం ,హనుమద్గాదాతరంగిణి అనే నా హనుమద్ లీలలనుండి , మూలము :- పరాశర సం హితపురుష మృగం ,హనుమద్గాదాతరంగిణి అనే నా హనుమద్ లీలలనుండి ,

మూలము :- పరాశర సం హిత

ధర్మ రాజు అశ్వ మేధ యాగం తల బెట్టాడు . .కృష్ణుని తో ”కృష్ణా !యాగ సమయం లో యాగ శాల లో నిరంతరం అన్న దాన ప్రక్రియ జరగుతుంది కనుక నిత్యమూ పరిశుభ్రం గా వుండే టట్లు జాగ్రత వహిస్తూ పర్యవేక్షించే బాద్య ట నీకు అప్ప గిస్తునాను ”అని చెప్పాడు .దానికి వాసుదేవుడు ”ధర్మ నందనా !పురుష మృగం అనే ఒక మృగం వుంది .అది పురుషుడు గానూ మృగం గానూ వుంటుంది .దాని మహాత్య్మాన్ని మూడు సార్లు పథిస్తే ,దుస్వప్నాలు రావు .ఆ మృగం వున్న చోట ఎంత కాలుష్యం వున్నా ,తొలగి వాతా వరణం పరి శుద్ధ మవుతుంది .ఇది పర్యా వర ణాన్ని ఎల్లప్పుడు కాపాడు తుంటూ వుంటుంది .దానికి ధైర్య సాహసాలు ఎక్కువ .యక్ష ,రాక్షస ,సిద్ధ ,విద్యాధరులు దానికి సపర్యలు చేస్తుంటారు .అది పురుషులు లేని దుర్గమ అరణ్యం లో మాత్రమే వుంటుంది .దాన్ని భీముడు మాత్రమే తీసుకొని రాగలడు .”అని చెప్పాడు .
భీముని పిలిచి ”వ్రుకోదరా ! నువ్వు హనుమ అనుగ్రహంపొందిన వాడివి .నువ్వు వెళ్లి ఆంజనేయుడుఏది చెప్తే అది చేసి ఆ మృగాన్ని సాధించి తీసుకొని రా ”అన్నాడు
భీమ సేనుడు పురుష మృగం కోసం బయలు దేరాడు .గంధ మాదనం చేరి హనుమకు నమస్కరించి వచ్చిన పని విన్న వించాడు .హనుమ ”నువ్వు ఎప్పుడూ ఇలాంటి సాహసా లే చేస్తావు .దేవతలు కూడా ఆ మృగాన్ని సమీపించ లేరు .ఒక ఉపాయం చెబుతా విను .అది వున్న చోటకు వెళ్లి దూరం గా వుండి గర్జించు .అది వెంబడి పడి తరుము తుంది .దాంతో ఎవరు పరిగెత్త లేరు .చంపనూ లేరు .నీ గర్జన విని అది నిన్ను తరుము తుంది .బలం కొద్దీ పరిగెత్తు .నేను నా వాల రోమాలను ఇస్తున్నాను .అది నీ దగ్గరకు రాగానే ఒక రోమాన్ని దాని ముందు విడిచి పెట్టు .ఆ రోమం దానికి శివ లింగం గాకని పిస్తుంది శివ లింగం కని పిస్తే అది పూజ చేయ కుండా వుండదు .నువ్వు ఓపిక కొద్దీ పరిగెత్తు .దాని పూజ అయింతర్వాత అది నీ వెంట మళ్ళీ పడుతుంది .దగ్గర్సాకు రాగానే ఇంకో రోమం విడిచి పెట్టు .అది మళ్ళీ పూజ చేస్తుంది ఇలా హస్తిన వరకు దాన్ని తీసుకొని వెళ్ళు .”అని చెప్పి కొన్ని రోమాలను భీముని చేతి లో పెట్టాడు హనుమ .వాటిని భక్తీ గా కళ్ళ కు అద్దు కోని తీసుకొన్నాడు భీముడు .హనుమ చెప్పినట్లే ఆ రోమాలను మృగం సమీపం లో విడిచాడు .అక్కడ ఒక శివాలయం వెలిసింది .ఒక మాయా లింగం సరోవరం ,రత్న మాణిక్యాలతో విరాజిల్లింది .మృగం అక్కడ ఆగి,నిష్ట తో పూజించింది .అలా మళ్ళీ రోమం విడవటం ,అది రావటం ,శివాలయం శివుడు కధ మామూలే .చివరికి హస్తిన లో వాళ్ల గృహ ద్వారం చేరింది .భీముని కాలు పట్టుకొంది దాన్ని చూసి ,ధర్మజ ,శ్రీ కృష్ణులు అక్కడికి చేరారు .ధర్మ రాజు దానితో ”వో మృగ శ్రేస్తుడా !మా శరణు జొచ్చిన వారిని తినటం న్యాయం కాదు .నీకు తెలియని ధర్మాలు లేవు .మా సోదరుడు నీ కంటే ముందుగా మా గృహ ద్వారం లోకి చేరాడు .క్రూర మృగాలు ఇంట్లోకి రావు కదా .నువ్వు ప్రాజ్నుడవు .బైట నీకు దొరికిన కాలును భాక్షిన్ చటమే నీకున్యాయం .మిగతా దాని జోలికి పోయే హక్కు నీకు లేదని నీకూ తెలుసు కదా ”అన్నాడు .ధర్మ రాజు ధర్మ బుద్ధికి మృగం సంతోషించి ”నీ సుకృతానికి సంతోషించాను .ఏ వరం కావాలో కోరుకో”అంది .దానికి యుధిష్టరుడు ”నా యజ్ఞం పూర్తి ఆయె వరకు ఇక్క దే వుండి పరిశుభ్రత ను కాపాడి మాకు మేలు చేయి ”అని కోరాడు .అతని కోర్కె మేరకు ఆ పురుష మృగం అక్కడే వుండి యాగం పూర్తి ఆయె వరకు ఉంది ,శుభ్రత విషయం లో అత్యంత శ్రద్ధ తీసు కోని అందరి మెప్పు పొందింది .వాతావరణాన్ని బాగా కాపాడి ప్రజలకు మేలు చేసింది .పాండ వాగ్రాజుని మనో భీస్టం నెర వేరింది .


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML