గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

గంగా నదిలో అద్భుత శక్తి..!

గంగా నదిలో అద్భుత శక్తి..!
----------------------------
గంగా నది పవిత్రమైనది. స్వచ్ఛమైనది. అష్టాదశ పురాణాల నుంచి ఇతిహాసాల దాకా.. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోనూ కనిపించే మాట ఇది. అందుకే.. హిందువులు తాము చనిపోయాక అస్థికలను గంగలో కలపాలని కోరుకుంటారు. అయితే.. నిజంగా గంగా నదికి అంత పవిత్రత ఉందా...? గంగ అంత స్వచ్ఛమైనదా..?
గంగా మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతిస్తుంటారు. గంగమ్మ మహిమలను మనోవాక్కాయ కర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగునని పండితులు అంటారు. గంగాదేవి మహిమను విన్నా చదివినా సకల వ్యాధులు నశించి, శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అలాంటి గంగా నది పవిత్రపై కొందరు పరిశోధనలు చేశారు. స్వచ్ఛమేనా..? కాదా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు.
చండీగడ్ కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగానది పవిత్రపై పరిశోధనలు జరిపారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన శాఖ ఆదేశాల మేరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నైరుతికి ముందు.. తర్వాత, హరిద్వార్ నుంచి గంగ దాకా రకరకాల ప్రాంతాల్లో గంగ నీటిని సేకరించి, అధ్యయనం చేశారు. ఆ నీళ్లల్లో రకరకాల బ్యాక్టీరియాలను నిర్మూలించే బ్యాకిట్రయోఫేజ్ కు చెందిన పలు వైరస్ లు ఉన్నట్లు కనుగొన్నారు. హానికారక బ్యాక్టీరియాను సంహరించడం ద్వారా ఇవి గంగనీళ్లను మురిగిపోకుండా స్వచ్ఛంగా ఉంచుతున్నట్టు గుర్తించారు.
గంగలో వైరస్ లను శాస్త్రజ్ఞులు గుర్తించడం ఇదే మొదటిసారి. అత్యంత శక్తిమంతమైన యాంటీ బయాటిక్ మందులకూ లొంగని ఇన్ఫెక్షన్లపై పోరాటానికి వీటిని ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తమ బృందం గుర్తించిన వైరస్ లో అత్యంత ఆసక్తికరమైన 20-25 రకాలను.. పలు వ్యాధులకు విరుగుడుగా వినియోగించుకోవచ్చంటున్నారు.
యమున, నర్మద నదుల నీటిని సేకరించిన మైక్రోబయాలజిస్టులు.. వాటికి, గంగ నీటికి మధ్య గల తేడాలపై పరిశోధన చేయనున్నారు. కాగా.. గంగ నీటిపై వీరు చేపట్టిన ఈ అధ్యయనంలో.. పలు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ భాగం పంచుకున్నాయి. మొత్తంగా... ఈ అధ్యయనం తాలూకూ పూర్తి నివేదికను 2016 డిసెంబరులో ప్రభుత్వానికి అందజేయనున్నారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML