గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

పుణ్యప్రదమైన తీర్థయాత్ర వైష్ణవీదేవి ఆలయం

పుణ్యప్రదమైన తీర్థయాత్ర వైష్ణవీదేవి ఆలయం
***********************************************
వరములనొసగే వైష్ణవీదేవి
మానవ జీవితానికి తీర్థయాత్రలు పుణ్యఫలాలను అందిస్తాయని విశ్వాసం. భగవంతుని కటాక్షం ఉంటేనే దేవాలయాలకు భక్తులు వెళ్లగలుగుతారు. ఇలా ఆలయాలకు వెళ్లి ఆ దేవతలను దర్శించుకుంటే వారి అభయం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. నిత్యజీవితంలో పూజలతోపాటు తీర్థయాత్రలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులుంటాయని చెప్పబడింది.
అయితే ఇవేవీ పెద్దగా తెలీనివారు ఆ విషయాలను తెలుసుకున్నా, చదివినా సగలాభం పొందుతారని అధర్వణ వేదంలో చెప్పబడింది. అటువంటి పుణ్యప్రదమైన తీర్థయాత్రగా చెప్పబడే జమ్ము-కాశ్మీర్‌లో వెలసిన వైష్ణవీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
అమ్మవారి పేరు త్రిపుట. త్రిపుట కొండపై వెలసింది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. అమ్మవారు కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపంలో ఉంటుంది. ఈ స్వరూపమే వైష్ణవి మాత. భూలోకంలో ధర్మం, న్యాయం తప్పినప్పుడు ఏ దేవతైనా, దేవుడైనా ఆవిర్భవిస్తాడని కథలు చెపుతున్నాయి. అలాంటి ఆవిర్భావమే త్రిపుటదేవి. విష్ణుమూర్తి అంశలోంచి పుట్టింది కనుక ఆమెను వైష్ణవి మాతగా పిలుస్తారు.
స్థలపురాణం
స్థలపురాణం ప్రకారం. ముందుగా ఆమె దక్షిణాదిలో వెలిసింది. అక్కడ మానవజన్మ ఎత్తింది. చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. ఎక్కువ భాగం ధ్యానంలో గడిపేది. ఓసారి తన తండ్రిని సముద్ర తీరానికి తీసుకవెళ్లమంది. అక్కడ ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు తన భార్య సీతకోసం హనుమంత, సుగ్రీవ సైన్యంతో అక్కడకు వచ్చాడు. అప్పుడు ఈమె ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆమెకు రాముని విషయం తెలిసింది. తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అయితే అది సాధ్యపడదని రాముడు చెప్పాడట.
అయితే ఆ తర్వాత ఆమెకు ఓ అవకాశం ఇచ్చాడు. తిరిగి తను మళ్లీ వస్తాననీ, అలా వచ్చినప్పుడు తనను గుర్తుపడితే చేసుకుంటానని చెప్పాడట. అప్పటివరకూ ఉత్తరాదిలోని త్రిపుట కొండల్లో ధ్యానంలో ఉండమని శ్రీరామచంద్రులవారు సూచించారట. అలా కాత్రా వైపు ఉన్న కొండల్లో మాత ధ్యానం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు ముని వేషధారణలో త్రిపుటను కలిశాడు. కానీ ఆమె గుర్తించలేదు. అలా ఆయన రాకకోసం ధ్యానముద్రలో మునిగిపోయి ఇప్పటికే అలానే ఉందన్నది భక్తుల విశ్వాసం.
బాలవైష్ణవి దేవి
త్రిపుట పర్వతాల నుంచి జమ్మూకు వెళ్లే మార్గంలో ఓ దంపతుల ఇంట దేవి పెరిగింది. అక్కడ ఐదో ఏటనే ధ్యానంలోకి వెళ్లింది. ఆమె గురించి తెలుసుకుని అప్పటి మహిళలు ఆమెను పూజించేవారు. కొందరు పరీక్షించేవారు. అటువంటి వారిలో రఘునాధ ఒకరు. అతడి నుంచి తప్పించుకుంటూ త్రిపుట పర్వతాలపైకి పారిపోయింది. అక్కడ రఘునాథ వెంబడిస్తే తన శక్తితో కోతులను రక్షణగా ఉపయోగించుకుంది. కోతులతో రఘునాధుడు ఘోరమైన యుద్ధం చేసి వాటిని చంపేశాడు. అయితే బాలవైష్ణవి తన శక్తిని ఉపయోగించి అతడిని సంహరించింది. తర్వాత తన తప్పును తెలుసుకుని మన్నించమని వేడుకోలు చేసుకుంటే. అమ్మవారిని దర్శించిన తర్వాత తనను దర్శించుకుంటే వారికి అంతా మంచే జరుగుతుందని సెలవిచ్చిందట. ఇది ఓ కథ.
పంచపాండవులు కట్టిన గుడి
పాండవులు తమ అరణ్యవాసంలో బాల త్రిపుట గురించి తెలుసుకుని వచ్చారట. ఆమె ధ్యానం, భక్తికి, ధర్మానికి మెచ్చి అనంతరం దేవాలయాన్ని కట్టించారని ప్రతీతి. జమ్మూ నుంచి కాత్రాకు వెళుతుండగా నరోలి అనే గ్రామంలో ఆమె చిన్నతనంలో ధ్యానం చేసుకున్న ప్రాంతం గుడిగా మలిచారని అక్కడి గోడలపై రాతలు చెబుతాయి.జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. దేశంలోనే తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులను ఈ దసరా పర్వదినాలలో తెలుసుకోవడం చాలా ఉత్తమం.
వైష్ణవి దేవి ఆలయం జమ్మూలో ఉంది. జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాత్రాలో నెలకొనివుంది అమ్మవారి ఆలయం. ఢిల్లీలో రాత్రి గం 10.30 నిమిషాలకు జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఎక్కితే. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు జమ్మూ స్టేషనకు చేరుకుంటారు. అక్కడ పోలీసుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. ఎవర్నీ ఎక్కువసేపు నిలుచోనివ్వరు. అలా అని కూర్చుని ఎక్కువసేపు ఉన్నా. నిద్రపోతున్నా. మొహమాటం లేకుండా రైల్వే పోలీసులు ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుని పంపించేస్తుంటారు. అంతేకాదు రైల్వే స్టేషనులో మిలటరీ చెకింగ్ కూడా బాగానే ఉంటుంది. ప్రతీ బ్యాగును చెక్ చేస్తారు.
కాత్రా ప్రయాణం
జమ్మూ నుంచి కాత్రా 70 కిలోమీటర్ల దూరం. కాశ్మీరుకు వెళ్లే మార్గంలో ఉంది. అలా కారులో వెళుతుంటే.. జమ్ముతావీ నది కనిపిస్తుంది. నీళ్లు అంతగా ఉండవు.అయితే అక్కడక్కడా చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, లోయలు. ప్రకృతిని ఆస్వాదిస్తూ.యాత్రికులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతంటారు. అక్కడినుంచి వైష్ణవి మాత ఆలయం ప్రవేశమార్గం వరకూ ఆటోలో వెళ్లవచ్చు. అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ కొండపైకి వెళ్లాలి. 16 కిలోమీటర్ల మేర నడక సాగించాలి. కొండపైకి వెళ్లేకొలదీ కోతుల సందడి ఎక్కువగా ఉంటుంది. గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే ఎవరిపైనా అవి దాడి చేయకపోవడం విశేషం. సందర్శకులు ఏదైనా ఆహారం వేస్తే తింటాయి. ప్రకృతిలో దొరికే పళ్లను ఆరగిస్తుంటాయి.
సముద్రమట్టానికి 5200 కి.మీ. ఎత్తులో
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం. ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.
శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు. కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనిం చాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బా ణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.
వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్‌ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించ టానికి. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణ పాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రి కూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడు వకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరు కుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీదపడింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML