గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

ఓంకారేశ్వర మహాక్షేత్రం.ఓంకారేశ్వర మహాక్షేత్రం.
************************

ఇండోర్ కి 77 కి.మి. దూరంలో వున్న ఈ క్షేత్రం 2 కి.మి. పొడవు 1 కి.మి. వెడల్పు కలిగిన మాంధాత అను ఒక ద్వీపం. ఈ ద్వీపం ఆకాశం నుంఢి చూసినచో ఓం ఆకారంలొ వుండుటవలన దీనికి ఈ పేరు వచ్చింది. ఇది నర్మద కావేరి నదుల సంగమ స్థానం. ఈ క్షేత్రం గురించి మూడు పురాణగాధలు వున్నాయి.
మొదటి కధ వింధ్య పర్వతం గురించి. ఒకానొకప్పుడు బ్రహ్మ కుమారుడైన నారద తన ప్రయాణంలో వింధ్య పర్వతాన్ని దర్శించెను. నారద మేరు పర్వతం యొక్క గొప్పతనాన్ని వింధ్య పర్వతానికి వివరించెను. అంతట ఈర్ష్యతో వింధ్య పర్వతం మేరు పర్వతం కన్నా ఎత్తు అవ్వాలని నిర్ణయించుకొని పరమ శివుని ప్రార్ధించ సాగెను. పార్ధివ లింగానికి ఆరు నెలలు పూజలు చేస్తూ ఘోర తపస్సును చేసిన పిమ్మట పరమ శివుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించెను. దేవతల మరియు ఋషుల కోరికమేరకు పార్ధివ లింగాన్ని రెండు బాగాలుగా విభజించెను. ఒకటి ఓంకారేశ్వర్ మరొకటి మమళేశ్వర్. వింధ్య పర్వతం తన భక్తులకు ఎటువంటి సమస్యలు తీసుకురానని పరమ శివుడు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. వింధ్య పర్వతం తన మాటను నిలబెట్టుకోకుండా పెరుగుతూ పోయి సూర్య చంద్రులకు అడ్డుగా వచ్చాడు. భక్తులంతా అగస్త్య మునిని వేడుకున్నారు. అంతట ఆయన తన భార్యతో కలిసి తాము తిరిగి వచ్చు దాకా పెరగకుండా వుండేందుకు ఒప్పించి వెళతారు. వెళ్ళిన ఋషి దంపతులు తిరిగి రాకుండా దక్షిణ కాశిగా పేరు పొందిన శ్రీశైలములో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
రెండవ కథ మాంధాతది. ఇక్ష్వాకు వంశస్థుడైన మాంధాత శివుడు ఇక్కడ జ్యోతిర్లింగా వెలిసే వరకు తపస్సు చేశాడు. అందువలన ఈ పర్వతానికి మాంధాత అని పేరు వచ్చింది.
ఇక మూడో కథ దేవ దానవులది. ఒకసారి దేవ దానవుల మధ్య యుధ్ధం వచ్చింది. ఆ యుధ్ధంలో దానవులు గెలిచారు. డానితో దేవతలు పరమ శివుణ్ణి ప్రసన్నం చేసుకోగా ఆ దయామయుడు ఓంకారేశ్వరునిగా ఇక్కడ వెలిశాడు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML