గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 10 October 2016

ముక్తి రామలింగేశ్వర ఆలయముముక్తి రామలింగేశ్వర ఆలయము


ముక్తి రామేశ్వరం కడప జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణం లో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నది గా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. ఇక్కడికి సమీపంలో, ఆలయం నుంచి 14 కి.మీ. దూరంలో గల ఎర్రగుంట్లలో రైల్వే స్టేషను ఉంది. ప్రొద్దుటూరు నుంచి, ఎర్రగుంట్ల నుంచి యాత్రీకులను ఆలయం దగ్గరకు తీసుకు వెళ్ళడానికి చాలా బస్సులు తిరుగుతున్నాయి.

స్థల పురాణము :-
పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుక తో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (=ఇసుక లింగం)గా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.
ఆలయ చరిత్ర :-
శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్థుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు.
రామలింగేశ్వర ఆలయము :-
ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీ రాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు పూజించిన "శ్రీ చక్ర యంత్రం" ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది.
శిల్పకళ :-
ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళానైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML