గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 October 2016

ధ్వాదశ జ్యోతిర్లింగ. స్తోత్రముధ్వాదశ జ్యోతిర్లింగ. స్తోత్రము
}}}}}}}}}}}}}{{{{{{{{{{{{{{{{

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం
చంద్రకాళావతంసమ్ !
భక్తిప్రదానాయ కృపావతీర్థం తం సోమనాధం
శరణం ప్రపద్యే !! ........


శ్రీశైలశృంగే విబుధాతినంగే తలాద్రితుంగేపి
ముదా వసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి
సంసారసముద్రసేతుమ్ !! ........

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ !
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే
మహాకాళమహాసురేశమ్ !! ........

కావేరికానర్శదయోః పవిత్రే సమాగమే
సజ్జనతారణాయ. !
సదైవ. మాంధాతృపురే వసంత మోంకారమీశం
శివమేకమీదే !! ........

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం
గిరిజాసమేతమ్ !
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం
తమహం నమామి !! ........

యం డాకినీశాకినీకాసమాజైః నిషేవ్యమాణం
పి శితాశనైశ్చ. !
సదైవ. భీమాదిపదప్రసిధ్దం తం శంకరం
భక్తహితం నమామి !! .........

సుతాష్రుపర్ణీ జలరాశియోగే నిబద్ద్య. సేతుం
నవిశిఖైరసంఖ్యైః !
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం
నియతంనమామి !! .........

యామ్యేసదంగే నగరేతిరమ్యే విభూషితాంగం
వివిధ్యైశ్చ. భోగైః !
సద్బక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాధం
శరణం ప్రపద్యే !! .........

సానందమానందవనే వసంత మానందకందం
హతపాపబృందమ్ !
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాధం
శరణం ప్రపద్యే !! .........

సహ్యాద్రిశీర్చే విమలే వసంతం గోదావరీతీర
పవిత్రదేశే !
యద్దర్శనాత్మతకమాశు నాశం ప్రయతి
తం త్ర్యంబమీశమీడే !! .........

మహాద్రిపార్శ్యే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః !
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారిమీశం
శివమేకమీడే !! ..........

ఇళాపురే రమ్యవిశాలకే స్మిన్ సముల్లసంతం
చ. జగద్వరేణ్యమ్ !
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం
శరణం ప్రపధ్యే !! .........

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం
ష్రోక్తమిదం క్రమేణ. !
స్తోత్రం పఠిత్వా మనోజో 2తిభక్త్యా ఫలం
తధాలోక్య. నిజం భజేచ్చ. !! .........
*************************************
Read More

శ్రీ శివ కవచమ్శ్రీ శివ కవచమ్

అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీసాంబసదాశివో దేవతా |
ఓం బీజమ్ |
నమః శక్తిః |
శివాయేతి కీలకమ్ |
మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః
ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః | నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః | మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః |
శిం శూలపాణయే అనామికాభ్యాం నమః | వాం పినాకపాణయే కనిష్ఠికాభ్యాం నమః | యమ్ ఉమాపతయే కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాది అంగన్యాసః
ఓం సదాశివాయ హృదయాయ నమః | నం గంగాధరాయ శిరసే స్వాహా | మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ |
శిం శూలపాణయే కవచాయ హుమ్ | వాం పినాకపాణయే నేత్రత్రయాయ వౌషట్ | యమ్ ఉమాపతయే అస్త్రాయ ఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానమ్%
వజ్రదంష్ట్రం త్రినయనం కాలకంఠ మరిందమమ్ |
సహస్రకరమత్యుగ్రం వందే శంభుమ్ ఉమాపతిమ్ ||
రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః పాలాంతరాలసితభస్మధృతత్రిపుండ్రః |
పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః ||
అతః పరం సర్వపురాణగుహ్యం నిఃశేషపాపౌఘహరం పవిత్రమ్ |
జయప్రదం సర్వవిపత్ప్రమోచనం వక్ష్యామి శైవమ్ కవచం హితాయ తే ||
పంచపూజా%
లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి |
హమ్ ఆకాశాత్మనే పుష్పైః పూజయామి |
యం వాయ్వాత్మనే ధూపమ్ ఆఘ్రాపయామి |
రమ్ అగ్న్యాత్మనే దీపం దర్శయామి |
వమ్ అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి |
సం సర్వాత్మనే సర్వోపచారపూజాం సమర్పయామి ||
మంత్రః

ఋషభ ఉవాచ
నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ |
వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ || 1 ||
శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః |
జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయమ్ || 2 ||
హృత్పుండరీకాంతరసన్నివిష్టం స్వతేజసా వ్యాప్తనభో‌உవకాశమ్ |
అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం ధ్యాయేత్ పరానందమయం మహేశమ్ ||
ధ్యానావధూతాఖిలకర్మబంధ- శ్చిరం చిదానంద నిమగ్నచేతాః |
షడక్షరన్యాస సమాహితాత్మా శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ ||
మాం పాతు దేవో‌உఖిలదేవతాత్మా సంసారకూపే పతితం గభీరే |
తన్నామ దివ్యం పరమంత్రమూలం ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ ||
సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తి- ర్జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |
అణోరణియానురుశక్తిరేకః స ఈశ్వరః పాతు భయాదశేషాత్ ||
యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం పాయాత్స భూమేర్గిరిశో‌உష్టమూర్తిః |
యో‌உపాం స్వరూపేణ నృణాం కరోతి సంజీవనం సో‌உవతు మాం జలేభ్యః ||
కల్పావసానే భువనాని దగ్ధ్వా సర్వాణి యో నృత్యతి భూరిలీలః |
స కాలరుద్రో‌உవతు మాం దవాగ్నేః వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ ||
ప్రదీప్తవిద్యుత్కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః |
చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రమ్ ||
కుఠారఖేటాంకుశ శూలఢక్కా- కపాలపాశాక్ష గుణాందధానః |
చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ ||
కుందేందుశంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః |
త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః సద్యో‌உధిజాతో‌உవతు మాం ప్రతీచ్యామ్ ||
వరాక్షమాలాభయటంకహస్తః సరోజకింజల్కసమానవర్ణః |
త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం పాయాదుదీచ్యాం దిశి వామదేవః ||
వేదాభయేష్టాంకుశటంకపాశ- కపాలఢక్కాక్షరశూలపాణిః |
సితద్యుతిః పంచముఖో‌உవతాన్మామ్ ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః ||
మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌలిః భాలం మమావ్యాదథ భాలనేత్రః |
నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ నాసాం సదా రక్షతు విశ్వనాథః ||
పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః కపోలమవ్యాత్సతతం కపాలీ |
వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః ||
కంఠం గిరీశో‌உవతు నీలకంఠః పాణిద్వయం పాతు పినాకపాణిః |
దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః వక్షఃస్థలం దక్షమఖాంతకో‌உవ్యాత్ ||
మమోదరం పాతు గిరీంద్రధన్వా మధ్యం మమావ్యాన్మదనాంతకారీ |
హేరంబతాతో మమ పాతు నాభిం పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే ||
ఊరుద్వయం పాతు కుబేరమిత్రో జానుద్వయం మే జగదీశ్వరో‌உవ్యాత్ |
జంఘాయుగం పుంగవకేతురవ్యాత్ పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః ||
మహేశ్వరః పాతు దినాదియామే మాం మధ్యయామే‌உవతు వామదేవః |
త్రిలోచనః పాతు తృతీయయామే వృషధ్వజః పాతు దినాంత్యయామే ||
పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం గంగాధరో రక్షతు మాం నిశీథే |
గౌరీపతిః పాతు నిశావసానే మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ ||
అంతఃస్థితం రక్షతు శంకరో మాం స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ |
తదంతరే పాతు పతిః పశూనాం సదాశివో రక్షతు మాం సమంతాత్ ||
తిష్ఠంతమవ్యాద్ భువనైకనాథః పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః |
వేదాంతవేద్యో‌உవతు మాం నిషణ్ణం మామవ్యయః పాతు శివః శయానమ్ ||
మార్గేషు మాం రక్షతు నీలకంఠః శైలాదిదుర్గేషు పురత్రయారిః |
అరణ్యవాసాది మహాప్రవాసే పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః ||
కల్పాంతకాలోగ్రపటుప్రకోప- స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః |
ఘోరారిసేనార్ణవ దుర్నివార- మహాభయాద్రక్షతు వీరభద్రః ||
పత్త్యశ్వమాతంగరథావరూథినీ- సహస్రలక్షాయుత కోటిభీషణమ్ |
అక్షౌహిణీనాం శతమాతతాయినాం ఛింద్యాన్మృడో ఘోరకుఠార ధారయా ||
నిహంతు దస్యూన్ప్రలయానలార్చిః జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య | శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్ సంత్రాసయత్వీశధనుః పినాకః ||
దుః స్వప్న దుః శకున దుర్గతి దౌర్మనస్య- దుర్భిక్ష దుర్వ్యసన దుఃసహ దుర్యశాంసి | ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తిం వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః ||
ఓం నమో భగవతే సదాశివాయ
సకలతత్వాత్మకాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వతంత్రస్వరూపాయ సర్వతత్వవిదూరాయ బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ పార్వతీమనోహరప్రియాయ సోమసూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూలితవిగ్రహాయ మహామణి ముకుటధారణాయ మాణిక్యభూషణాయ సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ దక్షాధ్వరధ్వంసకాయ మహాకాలభేదనాయ మూలధారైకనిలయాయ తత్వాతీతాయ గంగాధరాయ సర్వదేవాదిదేవాయ షడాశ్రయాయ వేదాంతసారాయ త్రివర్గసాధనాయ అనంతకోటిబ్రహ్మాండనాయకాయ అనంత వాసుకి తక్షక- కర్కోటక శంఖ కులిక- పద్మ మహాపద్మేతి- అష్టమహానాగకులభూషణాయ ప్రణవస్వరూపాయ చిదాకాశాయ ఆకాశ దిక్ స్వరూపాయ గ్రహనక్షత్రమాలినే సకలాయ కలంకరహితాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకభర్త్రే సకలలోకైకసంహర్త్రే సకలలోకైకగురవే సకలలోకైకసాక్షిణే సకలనిగమగుహ్యాయ సకలవేదాంతపారగాయ సకలలోకైకవరప్రదాయ సకలలోకైకశంకరాయ సకలదురితార్తిభంజనాయ సకలజగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వతనిజావాసాయ నిరాకారాయ నిరాభాసాయ నిరామయాయ నిర్మలాయ నిర్మదాయ నిశ్చింతాయ నిరహంకారాయ నిరంకుశాయ నిష్కలంకాయ నిర్గుణాయ నిష్కామాయ నిరూపప్లవాయ నిరుపద్రవాయ నిరవద్యాయ నిరంతరాయ నిష్కారణాయ నిరాతంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్ద్వంద్వాయ నిరాధారాయ నీరాగాయ నిష్క్రోధాయ నిర్లోపాయ నిష్పాపాయ నిర్భయాయ నిర్వికల్పాయ నిర్భేదాయ నిష్క్రియాయ నిస్తులాయ నిఃసంశయాయ నిరంజనాయ నిరుపమవిభవాయ నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణ- సచ్చిదానందాద్వయాయ పరమశాంతస్వరూపాయ పరమశాంతప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజో‌உధిపతయే జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగ చర్మఖడ్గధర పాశాంకుశ- డమరూశూల చాపబాణగదాశక్తిభిందిపాల- తోమర ముసల ముద్గర పాశ పరిఘ- భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధభీషణాకార- సహస్రముఖదంష్ట్రాకరాలవదన వికటాట్టహాస విస్ఫారిత బ్రహ్మాండమండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర నాగేంద్రనికేతన మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుభయం శమయ శమయ అపమృత్యుభయం నాశయ నాశయ రోగభయమ్ ఉత్సాదయోత్సాదయ విషసర్పభయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ త్రిశూలేన విదారయ విదారయ కుఠారేణ భింధి భింధి ఖడ్గేన ఛింద్ది ఛింద్ది ఖట్వాంగేన విపోధయ విపోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణైః సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ అశేష భూతాన్ విద్రావయ విద్రావయ కూష్మాండభూతవేతాలమారీగణ- బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ మమ అభయం కురు కురు మమ పాపం శోధయ శోధయ విత్రస్తం మామ్ ఆశ్వాసయ ఆశ్వాసయ నరకమహాభయాన్ మామ్ ఉద్ధర ఉద్ధర అమృతకటాక్షవీక్షణేన మాం- ఆలోకయ ఆలోకయ సంజీవయ సంజీవయ క్షుత్తృష్ణార్తం మామ్ ఆప్యాయయ ఆప్యాయయ దుఃఖాతురం మామ్ ఆనందయ ఆనందయ శివకవచేన మామ్ ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ
హర హర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమః ||
పూర్వవత్ – హృదయాది న్యాసః |
పంచపూజా ||
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ||
ఫలశ్రుతిః%
ఋషభ ఉవాచ ఇత్యేతత్పరమం శైవం కవచం వ్యాహృతం మయా |
సర్వ బాధా ప్రశమనం రహస్యం సర్వ దేహినామ్ ||
యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ |
న తస్య జాయతే కాపి భయం శంభోరనుగ్రహాత్ ||
క్షీణాయుః ప్రాప్తమృత్యుర్వా మహారోగహతో‌உపి వా |
సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి ||
సర్వదారిద్రయశమనం సౌమాంగల్యవివర్ధనమ్ |
యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే ||
మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః |
దేహాంతే ముక్తిమాప్నోతి శివవర్మానుభావతః ||
త్వమపి శ్రద్దయా వత్స శైవం కవచముత్తమమ్ |
ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి ||
శ్రీసూత ఉవాచ
ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివ సూనవే |
దదౌ శంఖం మహారావం ఖడ్గం చ అరినిషూదనమ్ ||
పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం పరితో‌உస్పృశత్ |
గజానాం షట్సహస్రస్య త్రిగుణస్య బలం దదౌ ||
భస్మప్రభావాత్ సంప్రాప్తబలైశ్వర్య ధృతి స్మృతిః |
స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా ||
తమాహ ప్రాంజలిం భూయః స యోగీ నృపనందనమ్ |
ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః ||
శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసే స్ఫుటమ్ |
స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ ||
అస్య శంఖస్య నిర్హ్రాదం యే శృణ్వంతి తవాహితాః |
తే మూర్చ్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః ||
ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశకౌ |
ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ ||
ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ |
ద్విషట్సహస్ర నాగానాం బలేన మహతాపి చ ||
భస్మధారణ సామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసే |
ప్రాప్య సింహాసనం పిత్ర్యం గోప్తా‌உసి పృథివీమిమామ్ ||
ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ |
తాభ్యాం సంపూజితః సో‌உథ యోగీ స్వైరగతిర్యయౌ ||
ఇతి శ్రీస్కాందమహాపురాణే బ్రహ్మోత్తరఖండే శివకవచ ప్రభావ వర్ణనం నామ ద్వాదశో‌உధ్యాయః సంపూర్ణః || ||
Read More

దారిద్ర్యదహన శివస్తోత్రందారిద్ర్యదహన శివస్తోత్రం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ ||


గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ ||

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ ||

చర్మంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండలమండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ ||

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ |
ఆనందభూమివరదాయ తమోహరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ ||

భానుప్రియాయ దురితార్ణవతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ ||

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౮ ||
Read More

క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి ద్వారక గురించి అధ్భుతమైన విషయాలు.క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి ద్వారక గురించి అధ్భుతమైన విషయాలు.
September 19, 2016 Admin 0 Comment bhakthi, dwaraka, hindu, krishna

192 కిలోమీటర్ల పొడవు…192 కిలోమీటర్ల వెడల్పు..36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..బారులు తీరిన వీధులు..వీధుల వెంట బారులు తీరిన చెట్లు..రాయల్‌ ప్యాలెస్‌లు..రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..కమర్షియల్‌ మాల్స్‌.. కమ్యూనిటీ హాల్స్‌.. క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ నగరం.. రత్నస్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్‌..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..జగన్నాథుడి జగదేక సృష్టి..క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి లెజెండ్‌ సిటీ…ద్వారక..ఇప్పుడు సాగర గర్భంలో..మన నాగరికత..మన సంస్కృతి..మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ.. ద్వారక అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి… మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు.. శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..

ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు.
అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. ఇవే కాకుండా ఆ కాలంలోనే భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ ,ఇంటింటికి కుళాయిలు నాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చు తునకలు.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..

నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి.. బ్యూటీకే.. బ్యూటీ… అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.

రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది.. న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
Read More

ఉడిపి :-ఉడిపి :-
ఉడిపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడిపిలో ఉన్నది.

ఉడిపి జిల్లాను ఆగష్టు 1997లో యేర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడిపి, కుందాపూర్ మరియు కార్కళ్) కలిపి ప్రత్యేక ఉడిపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11,12,243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు మరియు కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడిపి మరియు దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.
* కృష్ణాలయం


ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు), వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
* అష్ట మఠాలు

ఉడిపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడిపి రథవీదిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.

01. పుత్తగె
02. పేజావర
03. పలిమారు
04. అదమారు
05. సోదె
06. శీరూరు
07. కాణియూరు
08. కృష్ణాపుర

* దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు

01. కోల్లూరు ముకాంబికా దేవాలయం
02. మరవంతె బీచ్
03. మల్పే రేవు
04. కాపు దీపస్థంభం (కాపు లైటు హౌసు)
05. కార్కళ లోని గోమటేశ్వరుడు
06. వేణూరు లోని గోమటేశ్వరుడు
07. అత్తూరు లో సెయింట్ లారెన్స్ ఇగర్జి
08. సెయింట్ మేరీస్ ద్వీపం
09. మూడబిదరె లో సావిరకంబద బసది
10. మణిపాల్
11. బైందూరు కోసళ్ళి జలపాతము


Read More

శ్రీ నవ దుర్గ స్తోత్రంశ్రీ నవ దుర్గ స్తోత్రం

రచన: వాగ్దేవీ
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


ఓం శ్రీ మాత్రే నమః
Read More

శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున కలదు


శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున కలదు. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగ రాజ్యములొ అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.

చరిత్ర

శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో,ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము మరియు సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చేశాక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో, కంచి లో, బదరి లో ,ద్వారక లో మఠాలను స్థాపించారు.

దర్శించవలసిన ప్రదేశాలు

శృంగేరిలో ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి.శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు
1. శారదాంబ దేవాలయం
2. విద్యాశంకర దేవాలయం
3. ఆది శంకురల దేవాలయం
4. నరసింహవనం
5. తుంగ నది

Read More

శబరిమల యాత్ర అంటేఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఇజీగా వెళ్లి వస్తున్నారు. అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఒకేఒక్క దారి ఉండేది, దాని పేరు ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట.

శబరిమల అడవీ ప్రాంతం అవ్వడం వలన అప్పటి నుంచి ఇప్పటి వరకు బృందాలుగా వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. శబరిమల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం…

స్వామియే … శరణమయ్యప్ప ! అంటూ మొదలు పెడదాం…
1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డి తో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు.


1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది.

దేవాలయాన్ని మరలా 1909-10 వ సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది.

1909-10 వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం.

1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.
1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు, కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు తీర్మానించింది.

1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది.

1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు. అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది.

1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయ ను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.

2000 వ సంవత్సరంలో బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.

స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు.
ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.

తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.

ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.


Read More

శివ తాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన ప్రదేశముతమిళనాడులోని కుట్రాలం అనే పేరు వినగానే, అందరి మదిలో అదొక పర్యాటక స్థలం గానే మెదలుతుంటుంది. కుట్రాలంలోని కొండలు, ఆ ఒందల పైనుండి జాలువారుతున్న జలపాతలే మన మదిలో మెదలడం జహాజం. పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడడానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడు. పంచసభలలోని ఇంద్రసభ ఇక్కడ ఉన్నదని ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పుణ్య స్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళకవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేశారు. తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరుసు, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్రమహాత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. వేదవ్యాస విరచితమైన ‘తామ్రప మహాత్మ్యం’ లో ధరణీపీఠం గురించి, శెన్బగదేవి గురించి, కుట్రాలీశ్వరుని గురించి విపులంగా వివరించబడింది. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుట్రాలం యొక్క గొప్పదనం అర్థమవుతుంది.

పూర్వము ఈ పుణ్యభూమిని పృథు మహారాజు పరిపాలిస్తున్న సమయం. నీతి గ్రంథాలలో చెప్పిన నియమాలను అనుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన అపరిమితమైన అపర విష్ణుభక్తులు. అయితే, వారు అపరిమితమైన విష్ణుభక్తి పరాయణత్వంలో దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువేగొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఆ నోట, ఈ నోట ఈ విషయం పృథుమహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు, నేరుగా కైలాసానికి వెళ్ళి శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు.

“పరమేశ్వరా! నా దేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనను విన్న శివపరమాత్మ, “తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయి” అని పృథువును స్వాంతన పరిచాడు.

అందుకు తగినట్లుగానే, కొన్నాళ్ళ తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలో విష్ణు సన్నిధికి శివచిహ్నాలతో వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు అగస్త్యుని విష్ణుసన్నిధిలోకి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆరోజున తిరిగి వెళ్ళిపోయినా అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణుభక్తునివలె వేషాన్ని వేసుకుని విష్ణ్వాలయానికి చేరుకున్నాడు. అగస్త్య మునీశ్వరుని ఆవిధంగా చూసిన విష్ణుభక్తులు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఆలయం లోపలకు తీసుకెళ్ళి, ఆయన్నే పూజావిధులు నిర్వహించమని చెప్పారు.

గర్భగృహంలోకి వెళ్ళిన అగస్త్యుడు, శివుని ధ్యానిస్తూ పూదండంతో విష్ణువును తాకాడు. అంటే ఆ మరుక్షణమే, నిల్చున్న భంగిమలోనున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణ మాత్రములో శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనున్న విష్ణు పరివార దేవతలంతా శివపరివార దేవతలుగా మారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు స్తంభించిపోయారు. అక్కడున్న సురుచి ఆవేశంతో ఊగిపోయాడు. ఫలితంగా అగస్త్యునికి, సురుచికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించమని చెప్పింది.

ఆ మరుక్షణం శివుని ఎడమభాగం వైపునున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. ఆ దేవి మధ్యవర్తిత్వం వహింకాగా, అగస్త్య, సురుచిల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో, వారు గెలిచినవారి మతాని అనుసరించాలన్న నిబంధనతో సుమారు ఐదురోజులపాటు వాదన కొనసాగింది. చివరగా అగస్త్యమహామునీశ్వరుడే గెలిచాడు. ఫలితంగా అక్కడున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వార శివదీక్షను స్వీకరించారు. ఈ వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే. ఆ ధరణీపీఠ నాయకి సృష్టి, స్థితి, సంహారము అనే మూడింటిని నిర్వహిస్తుంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే మూడు వేదాల రూపంగా భాసించే ధరణీపీఠనాయకి తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో దర్శనమిస్తుంటుంది. అప్పుడు జరిగిన వాద ప్రతివాదనలకు సాక్ష్యంగా కుట్రాలంలో కొలువైన ధరణీ పీఠ నాయకి, భక్తజనులను తన కరుణాపూరిత దృక్కులతో కరునిస్తోంది.

ఇక, కుట్రాలంలో ప్రధాన నదీదేవి చిత్రానదీ దేవి. ఈ నదికి కొంచెం పైభాగంలో శెన్బగదేవి ఆలయం ఉంది. శెన్బగదేవి ఇక్కడ కొలువై ఉన్నందువల్ల పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా శెన్బగవనం అని పిలువబడుతు ఉండేదట. ఒకానొకప్పుడు ఈ ప్రాంతంలో శుంభనిశుంభులు శివునివల్ల అనేక వరాలను పొందారు. పురుషుల వలన మరణం రాకుండా వరాన్ని పొందిన వీరు, యజ్ఞభాగాలను అపహరిస్తూ, అందరినీ బాధిస్తూ ఉండటంతో, మునుల మొరలను ఆలకించిన ఆది పరాశక్తి వారిద్దరినీ సంహరిస్తుంది. ఇదంతా , చూసిన శుంభనిశుంభుల గురువు ఉదుంబరునికి వణుకు పుట్టింది. ఆదిపరాశక్తి తనను కూడ సంహరిస్తుందని వణికిపోయాడు. ఆదిపరాశక్తి కంట్లో పడకుండా ఎక్కడ తలదాచుకోవాలన్న విషయమై ఆశ్రయించాడు. ఉదుంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న మయుడు కుట్రాలం ప్రక్కనున్న ఓ పర్వతారణ్యములో దాక్కుని ఉండమని చెప్పాడు. అలా ఆ పర్వతారణ్యములో దాక్కున్న ఉదుంబరుడు పగలంతా ఎవరికీ తెలియకుండా నక్కి ఉండి, రాత్రయితే బయటకు వచ్చి అన్ని జీవులను పీడిస్తుండేవాడు. ఆ రాక్షసుని ఆగడాలకు తట్టుకోలేకపోయిన మునీశ్వరులు దేవితో మొరపెట్టు కోగా, ఆ రాక్షసుని అతని పరివారముతో సహా అంతమొందించింది.

అనంతరం ఆ ఋషిపుంగవులతో దేవి, “మీకు తోడుగా నేను కూడ ఇక్కడే కొలువై వుంటాను” అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై భక్తులను కరుణిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశం కుత్రాలము జలపాతాలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడున్న తీర్ధాన్ని దేవి పేరుతో శెన్బగతీర్థం అని పిలుస్తుంటారు. ఈ దేవికి చైత్రమాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుట్రాలీశ్వరుని ఉత్సవాలు ముందు ముందుగా ఈ అమ్మవారికే పూజలు జరుతుగుంటాయి. ఈ అమ్మవారి ఆలయానికి పైభాగాములో ‘శివమధుగంగ’ అనే జలపాతం ఉంది. ఇక్కడ గంగాదేవి శివలింగానికి తేనెతో అభిషేకం చేసినందువల్ల ఈ జలపాతదారకు ‘శివమధుగంగ’ అనే పేరు ఏర్పడిందని ప్రతీతి. ఇక్కడ పౌర్ణమి రోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుంటుందని పెద్దలు చెబుతుంటారు.

అదేవిధంగా పరమశివుడు ఐదుచోట్ల తాండవ నృత్యం చేసాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారు నృత్యం చేసిన సభచిత్రసభగా పిలువబడుతోంది. ఈ చిత్రసభ మిగతా సభల కంటే భిన్నమైనది. మిగతా నాలుగు సభలలో శివుడు వగ్రహరూపంలో గోచరిస్తుండగా, ఇక్కడ మాత్రం చిత్ర రూపంలో దర్శనమిస్తుంటాడు. శివతాండవాలలో ఒకటైన త్రిపురతాండవము ఈ చిత్రసభలో జరిగిందట.

ఈ చిత్రసభకు ముందు కోనేరు, దాని మధ్యలో ఓ మంటపం ఉంది. చిత్రసభలో పరమశివుడు దేవేరితో పాటు తాండవం చేస్తుండగా, ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఓ గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. అందువల్లనే వ్యాసభగవానుడు ఈ సభను చిత్రసభ అని పిలుచుకున్నారు. ఇక్కడ మార్గశిర మాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుత్రాలీశ్వరుని ఆలయ ప్రాంగణంలో కుళళ్ వాయ్ మొళియమ్మన్ ఆలయం ఉంది. నత్తి, మూగ తనంతొ బాధపడేవారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే చక్కని ఫలితం ఉంటుందని భక్త జనుల విశ్వాసం.

ఈ కుట్రాలీశ్వరుని ఆలయంలో రోజుకు తొమ్మది సార్లు పూజలు జరుగుతుంటాయి. చిత్రసభలో ఆరుద్ర దర్శనం జరుపబడుతుంటుంది. ఆ సమయంలో తాండవ దీపారాధన జరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి జరుపబడే ఆరుద్ర దర్శన పండుగ సమయంలో బ్రహ్మ, విష్ణువులతో పాటు సమస్త దేవతలు ఇక్కడకు వస్తారని ప్రతీతి. ఇంకా చైత్రమాసంలో వసంతోత్సవం, కార్తీకమాసములో పవిత్రోత్సవం, నవరాత్రి, స్కందషష్ఠి అంటూ అన్ని ప్రధాన పండుగలు ఈ ఆలయములో జరుపబడుతుంటాయి.

జూన్ నుంచి సెప్టెంబర్ లోపు కుట్రాలానికి వెళితే వర్షాకాలం కావడం వలన గలగల పారే నిండుజలపాతాలను చూడొచ్చు. కుట్రాలానికి రైలు ప్రయాణ సౌకర్యం లేదు. కాబట్టి బస్సులోనే అక్కడకు చేరుకోవలసి ఉంటుంది. కుట్రాలంలో బస సోకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించాలను కునే వారికి ఇదొక అపూరూప అవకాశం.

Read More

మట్టపల్లి – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.మట్టపల్లి – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.

ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన నరసింహక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాని లో సుప్రసిద్ధాలు పంచ నారసింహ క్షేత్రాలు . పంచనారసింహ క్షేత్రాల్లో ఇప్పుడు మనం మూడోదాన్ని చూడబోతున్నాం. ఈ పంచ నరసింహులకు జనులు పెట్టుకున్న ముద్దుపేర్లు ముందుగా చెపుతాను చూడండి.

మట్టపల్లి శ్రీస్వామి వారి ఆలయ రాజగోపురం

కృష్ణా నదీగర్భం లో వెలసిన వేదాద్రి యందు వెలసిన యోగానంద స్వామి. ఇచ్చట నున్న స్వామి, ఉత్తర వాహిని యైన కృష్ణానది లో స్నానం చేసి తనను దర్శిస్తే చాలు పుల కించి పో తాడట. అందుకే వేదాద్రి స్వామిని “ స్నానాలయ్య” అని పిలుచు కుంటారట భక్తులు. గుంటూరు జిల్లా మంగళగిరి లో వెలసిన నృసింహస్వామి. పానకం సమర్పించే వారంటే సంతోషిస్తాడు. సగం పానకం తీసుకొని మిగిలింది మనకే ఇచ్చేస్తాడు.అందుకే ఆ స్వామి” పానకాలయ్య”. ఆ జిల్లాలోనే కేతవరం లో వెలసిన స్వామి “వజ్రాలయ్య”. ఈ స్వామి ని త్రికరణ శుద్ధి గా నమ్మి,కొలిస్తే వజ్రాలు లభిస్తాయి. ఈ దగ్గర లోని కోళ్ళూరు లోనే కోహినూర్ వజ్రం దొరికిందని చెపుతారు. వాడపల్లి లోని” దీపాలయ్య “ను చూసేశాం కదా. ఇప్పుడు మట్టపల్లి లోని” అన్నాలయ్య “ను చూద్దాం పదండి. ఈ రెండు క్షేత్రాలు నల్గొండ జిల్లాలోనివే.

ఆలయ ప్రవేశ ద్వారం

నల్గొండ జిల్లా హుజూర్నగర్ కు 35 కి.మీ దూరం లో కృష్ణా తీరం లో శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువు తీరిన దివ్యక్షేత్రం మట్టపల్లి.

ఆలయ ధ్వజస్థంభం, శిఖరం

స్థల పురాణం.::—– పూర్వకాలమున ఈ ప్రాంతం లో ఇచ్చటి గుహలో నరసింహుని గురించి జపిస్తూ చాలకాలం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై భరద్వాజుని అనుగ్రహించాడు.

“ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.!! “

సహస్ర శేష ఫణులతో, ధక్షిణావర్త శంఖం తో, నవసాలగ్రామాలతో, కరాళ నఖ దంష్ట్రికల తో, శంఖ చక్రగదాయుధాలతో అభయ ముద్రతో,చిరునవ్వులు చిందిస్తూ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ స్వామి స్వయంభువు .ఆ కాలంలో భరద్వాజాది మహర్షు లెందరో ఈ స్వామిని సేవించి తరించారు.

గర్భాలయం లో స్వామి వారి దివ్యమంగళ రూపం

అనంతర కాలం లో సుమారు వేయి సంవత్సరాల క్రితం కృష్ణానదీ తీరం లో మట్టపల్లి కి ఆవలి ఒడ్డున గల తంగెడ జనపదమును పాలిస్తున్న తన భక్తుడైన అనుముల మాచిరెడ్డి ప్రభువునకు స్వామి స్వప్న గోచరుడై, “వత్సా! సమీప కృష్ణానదీ తీరం లో ఒకానొక గుహాగర్భం లో నా స్వయంవ్యక్త మూర్తి మునిసుర బృంద సమర్చన లందుకుంటూ గుప్తం గా ఉంది. కలియుగం లో భక్తజన సంతరణకు నాదివ్యమూర్తి సుప్రకటితం కావలసి యున్నది.కావున ఉదయమే నీవు వెళ్ళి గుహాగర్భంలో ఉన్న నా రూపాన్ని లోకానికి సువ్యక్త పరచి ధన్యుడవు కమ్ము” అని ఆజ్ఞాపించాడు. ఆ అదృష్టశాలి మహానందభరితుడై లేచి, వేదపండితులను రావించి వారితో తన స్వప్నవృత్తాంతము ను వివరించినాడు. అతడు చెపితే విన్నవారై, వారు స్వామి ఆజ్ఞను శిరసావహించ వలసిందని మాచిరెడ్డి కి ఉద్బోధించారు. అనంతరం మాచిరెడ్డి విప్ర,పుర, పరి జన సమేతుడై, స్వామి ఆదేశానుసారం మట్టపల్లి వనానికి చేరి గుహలన్నీఅన్వేషించాడు. కాని స్వామి కన్పించలేదు. చివరకు అలసి,సొలసి అందరు చెట్ల క్రింద సొమ్మగిల్లారు. ఇంతలో మాచిరెడ్డికి మరలా కలలో స్వామి కన్పించి” భక్తా! విచారించకు. చూడు. ఇక్కడే ఒక ఆరె చెట్టు. దానిపై ఒక గరుడపక్షి కనబడుతుంది. ఆ చెట్టుకు సూటి గా పొదల చాటున గుహ ఉంది. చూడ మని,అక్కడే నేనున్నానని “ చెప్పాడు.తుదకు అన్వేషణ ఫలించింది.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి

అక్కడ గుహాంతర్భాగంలో శ్రీ లక్ష్మీనృసింహుని దివ్య మంగళ రూపాన్ని దర్శించి, సేవించి , అనంతర కాలం లో ఆలయ నిర్మాణాదులు చేసి , స్వామి సేవలో తరించాడు మాచిరెడ్డి.

శ్రీ గోదాదేవి సన్నిథిఆలయ దర్శనం ::——-

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ గాలి గోపురం తూర్పు ముఖం గా ఉంటుంది .ఆలయం లో స్వామి పడమర ముఖం గా ఉంటారు. స్వామి గుహాంతర్భాగం లో ఉండటం వలన ఒక చిన్న గుహ లోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. స్వామి స్వయంవ్యక్తం. శంఖ,చక్ర గదాభయ హస్తాలతో కరాళ దంష్ట్రికలతో, వక్షస్థల కౌస్తుభం తో,చిద్విలాసుడై కొండలోనుండి వ్యక్త రూపుడై దర్శనమిస్తాడు. ప్రక్కనే రాజ్యలక్ష్మీ దేవి కొలువు తీరి ఉంటుంది.

శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం

ముఖమండపం నుండి ఒక చిన్న ద్వారం ద్వారా సరాసరి గర్భాలయం లోని స్వామి చెంత కే భక్తులు చేరుకోవచ్చు. ఆలయం ఉత్తర,దక్షిణాలు గా వ్యాపించి ఉంటుంది. తూర్పు వైపు కొండ, పడమర వైపు కృష్ణానది ఉంటాయి. శ్రీ స్వామిని దర్శించుకొని, దక్షిణ ద్వారం గుండా వెలుపలి కి రాగానే గోదాదేవి సన్నిధి, దర్శన మిస్తాయి. అనంతరము విఖనసాచార్య సన్నిధి, అద్దాలమందిరం, యజ్ఞశాలను చూసుకొని ఆలయప్రాగణం లోకి వస్తాము. ధ్వజ స్థంభం వద్ద నాగశిలలు దర్శనమిస్తాయి.

ఆలయ ప్రవేశానికి ఉన్న చిన్న ద్వారం

స్వామివారి గర్భాలయం కొండ కావున ఆలయం చుట్టు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గాన్నివేరుగా నిర్మించారు. ఇది స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న మెట్ల ద్వారా ప్రారంభమై స్వామి వెనుక నుండి కొండ చుట్టు తిరిగి స్వామి ముందుకు వస్తుంది. స్వామి ఆలయానికి ఉత్తరం గా కృష్ణానది లోకి స్నానఘట్టాలు ఉన్నాయి. ఫ్రహ్లాద,మార్కండేయ,బాలాజీ పేర్లతో ఈ స్నానఘట్టాలను పిలుస్తారు.

ఒకనాడు వరదనీటిలో మట్టపల్లి ఆలయం

మెట్లపూజ చేయడం ఇక్కడ భక్తులకు సంప్రదాయం. కృష్ణానదికి వరద వస్తే స్వామి ఆలయం మునిగి పోయిన రోజులున్నాయి. దాని నివారణ కై ఇప్పుడు కరకట్ట పనులకు అనుమతి లభించిందని తెలుస్తోంది.

32 ప్రదక్షిణాలు. :: ——- శ్రీ స్వామి వారికి 32 ప్రదక్షిణలు చేయడం ఇక్కడొక ఆచారం . మట్టపల్లి లో 11 రోజులు ఉండి, రోజూ మూడు పూటలా కృష్ణానది లో స్నానం చేస్తూ,32 ప్రదక్షిణలు చేస్తూ, మట్టపల్లి మంగళాష్టకాన్ని త్రిసంధ్యలలోను 11సార్లు పఠిస్తే భక్తులకు ఎటువంటి కోరిలున్నా తీర తాయని, ఎటువంటి మానసిక,శారీరక రుగ్మతలున్నానశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే” శ్రీ మట్టపల్లి నాథం ప్రణతోస్మి నిత్యం నమ: “ అనే మంత్రాన్ని 32 వేల సార్లు వ్రాస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయట. ఎటువంటిరుగ్మతలైనా మాయమవుతాయట. అంతేకాదు స్వామి వారికి కట్టే ముడుపు కూడ 32 రూపాయలే కట్టి హుండీలో వేయడం కూడ ఇక్కడ సంప్రదాయం.

శ్రీమాన్ ముక్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహాచార్య స్వామి ::——- 107 శ్రీ మహా నార సింహ మహామంత్ర జపహోమతత్పరులైన శ్రీమాన్ ముక్కూర్ శ్రీలక్ష్మీనరసింహాచార్య స్వామి ఈ క్షేత్రం లో3 సార్లు జపహోమాలను నిర్వహించి, స్వామి దర్శన భాగ్యాన్ని పొంది ,స్వామి తనతో చెప్పిన విషయాలన్నింటినీ తమిళం లో వివరించడం మూలంగా తమిళనాడు లోకూడ ఈ క్షేత్రం ప్రాచుర్యాన్ని పొందింది. ప్రతిసంవత్సరం అక్కడనుండి కూడ భక్తులు వందలాది గా తరలి వచ్చి స్వామిని సేవించుకుంటున్నారు .చెన్నై టి.నగర్ లో శ్రీ స్వాతి నరసింహ మహాయజ్ఞ ట్రస్టు తమిళులకు అందుబాటు లో ఉంది. మట్టపల్లి లో “ శ్రీ ముక్కూర్ నృహరి నివాసమ్ “ (శ్రీ యజ్ఞ వాటిక) భక్తులకు సేవలందిస్తున్నారు.

శ్రీ ఆంజనేయుడు. ::—— శ్రీ స్వామి వారికి ఎదురుగా ఉన్నముఖమండపం లోని ఉపాలయం లో గరుడాళ్వారు తో పాటు ఆంజనేయుడు కూడ మనకు దర్శనమిస్తాడు. ఈయనను గురించి ఒక ఐతిహ్యం ఇక్కడ ప్రచారం లో ఉంది.

ఆలయ ముఖమండపం

కొంతకాలం క్రితం అర్చక స్వాములు తీర్థపుబిందె తేవడానికి ప్రాత: కాలం లో కృష్ణానది కి వెళ్లారు. అక్కడ ఎక్కడనుంచో కొట్టుకొచ్చిన ఒక ఆంజనేయ విగ్రహం కన్పించింది. దాన్ని పట్టించుకొచ్చి, ఆలయం ప్రాంగణం లో ఒక మూల ఉంచారు. కాలం గడుస్తోంది. రకరకాల మానసిక , శారీరక రుగ్మతలతో బాధపడుతూ ,శ్రీ నరసింహుని చెంతకు చేరుతారు భక్తులు. ఆ వచ్చిన వారు కృష్ణానది లో స్నానం చేసి, పొర్లు దండాలుపెడుతూ స్వామి సన్నిథిలోనే పగలు,రాత్రి ఉండిపోయేవారు. అలా వచ్చిన భక్తులను ఈ మూలన ఉంచిన ఆంజనేయుడు విజృభించి పిడిగుద్దులతో వాళ్లను హింసించేవాడట. అసలే రకరకాల మానసిక వేదనలతోవచ్చిన భక్తులు ఆ బాధలకన్నా మన ఆంజనేయుని పిడిగుద్దుల బాధలు ఎక్కువై, తాళలేక పొయి శ్రీ నరసింహుని తో మొర పెట్టు కున్నారట. అది విన్న స్వామి, ఆంజనేయుని తెచ్చి తన ముందు ప్రతిష్ఠించమన్నారట. అంతే. స్వామి ముందు ఫ్రతిష్ఠించ బడిన అంజనీపుత్రుడు దాసాంజనేయుడై బుద్దిగా ఉండిపోయాడట,ఇప్పటికి కూడ మనం చూస్తే ఆంజనేయుని దృష్టి నరసింహుని పాదాలపై ఉండటాన్ని గమనించవచ్చు. ఈయన కోసం స్వామి వారి బంటు గరుత్మంతుడు ఉపాలయం లో కొంచెంపక్కకు జరిగి ఈయనకు చోటిచ్చినట్టు కన్పిస్తుంది.

ధ్వజస్థంభం వద్ద నున్న నాగదేవతలు

అన్నాలయ్య ::– శ్రీ స్వామి వారి ఆలయం లో దక్షిణావృత శంఖం ఉంది. దీనిప్రభావం అనిర్వచనీయమైనది.భరద్వాజ మహర్షి ఈ శంఖం తోటే స్వామివారికి నిత్యం అభిషేకం చేసేవారని చెపుతారు. ఈ శంఖం ఉండబట్టే ఇక్కడ నిత్యాన్నదానం నిరాటంకంగా జరుగు తోందని జనశృతి.ఎక్కడా లేని విధంగా ఈ మట్టపల్లి మహా క్షేత్రం లో 23 ఎకరాల స్థలం లో ఎన్నో అన్నదాన సత్రాలు వెలిశాయి. అందరూ తమ తమ కులాల పేరున అన్నదాన సత్రాల నెలకొలిపి, అన్న దానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. అన్నదానం శ్రీమట్టపల్లి నరసింహునికి ప్రీతి పాత్రమవ్వటయే ఇందులకు కారణం గా కన్పిస్తుంది. ఇక్కడ మొత్తం 13 అన్నదాన సత్రాలున్నాయి. కళ్యాణోత్సవ సమయంలో వీరందరూ వచ్చిన యాత్రికులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తారు.

శ్రీ స్వామి వారి అద్దాలమందిరం

ప్రత్యేక ఉత్సవాలు. ::—- ప్రతి శుక్రవారం అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మీ దేవి కి ప్రత్యేక కుంకుమార్చనలు, పర్వదినాలలో లక్ష మల్లికా పుష్పార్చనలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ద చతుర్ధశి నృసింహ జయంతి సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం పాంచాహ్నిక దీక్ష తో వైఖానసాగమాను సారం గా ఐదు రోజులు నిర్వహించ బడుతుంది.

ఉపాలయం లో శ్రీ విఖనసాచార్య

రవాణా వసతి సౌకర్యాలు .;;—- కోదాడ, హుజూర్ నగర్ నుండి బస్సు సౌకర్యం ఉంది. దేవాలయం వారి వసతి గదులు ఉన్నాయి. అన్న దాన సత్రాలలో ఆయాకులాల వారికి ఆయా సత్రాలు సేవ లందిస్తూనే ఉన్నాయి . కాఫీ, టీ, టిఫిన్లు దొరుకుతాయి.

శ్రీ స్వామి వారి కళ్యాణమండపం

“ రాజ్యలక్ష్మా సమేతాయ రాగద్వేష వినాశినే !
మట్టపల్లి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళమ్.

Read More

శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయిశనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి. అన్ని వారాల్లోను మంద వారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః” అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయినాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కల్గి మిత్రసమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.

మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్టమాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడుకాని శనివార వ్రతం చేయాలి. శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమకు అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యధావిథిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా వుంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు, హనుమను సమీపించి “మారుతీ! నేను శనిని, అందర్నీ పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.’’ అన్నాడు. దానికి హనుమ “శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?’’అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమ శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు హనుమ. “కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకున్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేలమీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి “మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజ లాడిపోతున్నావే?’’అని ప్రశ్నించాడు. “ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను’’అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.

హనుమ “శనీ! నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏకాలంలోనైనా ముట్టుకోకూడదు. నువ్వు బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను”అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు. అందుకే శనివారం ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు.

“మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా”

శని వారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమపూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.


Read More

ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శుక్రకవచం సమ్పూర్ణమ్ఈ శుక్ర కవచాన్ని శుక్ర వారం ఉదయం పారాయణ ప్రారంబించాలి రోజు 6నిమిషాలు గాని 60 నిమిషాలు గాని 6సార్లు గాని 60సార్లు గాని పారాయణ చేయచ్చు.ఈ శుక్ర కవచ పారాయణ వల్ల వివాహనికి అడ్దంకులు తొలుగుతాయి షుగరు వ్యాది నయం అవుతుంది అప్పుడె పుట్టిన శిశివు యెక్క ఆరోగ్యం బాగుపడుతుంది .చర్మ వ్యాదులు తొలుగుతాయి ఐతే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏంటంటే గురు ముఖత ఉపదేశం లేనిదే పారాయణ చేయరాదు

శ్రీగణేశాయ నమః|
మృణాలకున్దేన్దుపయోజసుప్రభం పీతామ్బరం ప్రసృతమక్షమాలినమ్|
సమస్తశాస్త్రార్థవిధిం మహాన్తం ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే|| ౧||
ఔమ్ శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః|
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చన్దనద్యుతిః|| ౨||
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవన్దితః|
వచనం చోశనాః పాతు కణ్ఠం శ్రీకణ్ఠభక్తిమాన్|| ౩||
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః|
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః|| ౪||
కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః|
జానుం జాడ్యహరః పాతు జఙ్ఘే జ్ఞానవతాం వరః|| ౫||
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరామ్బరః|
సర్వాణ్యఙ్గాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః|| ౬||
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః|
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః|| ౭||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శుక్రకవచం సమ్పూర్ణమ్||
Read More

కర్మ పరిపక్వతకర్మ పరిపక్వత

పార్వతి " నాధా ! మానవులు నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు కదా. వారికి కర్మలు విధించారు కదా ! ఆ కర్మలు ఎలా పరిపక్వము ఔతాయి. వివరించండి ? " అని అడిగాడు. పార్వతి " మానవులను వర్ణములుగా విభజించిన తరువాత వారి వారికి తగిన కర్మలు విభజించబడ్డాయి. ఆ కర్మలు శ్రద్ధతోచేయు మానవులు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. అలా కాకుండా తమ వృత్తి ధర్మాలను వదిలి ఇతర ధర్మాలు ఆచరించిన మానవులు మరణం తరువాత ఆయాకులములలో తిరిగి జన్మిస్తారు. తరువాత తిరిగిరాని లోకాలు పొందుతారు. దేవతాంశలలో జన్మించిన వారు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. గర్వంతోమదించరు. తన శౌర్యంతో పాపులను గెలుస్తారు. తమ బంధుమిత్రులతో సఖ్యతతో మెలగుతారు. దీనులను కరుణతో చూస్తారు. వారిని రక్షిస్తారు. దైవాంశతో పుట్టిన వారికి కోపం రాదు. సౌమ్యంగా ఉంటారు " అని మహేశ్వరుడు చెప్పాడు.


సంపదలు దరిద్రము

పార్వతీదేవి " నాధా ! మానవ లోకములో కొంతమంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగుతుంటారు. సుఖాలను అనుభవిస్తుంటారు. కాని కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. పరమశివుడు " గతజన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా పిడికెడు భిక్షము వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యంచుట్టుకుంటుంది. తినడానికి తిండి కట్టడానికి బట్టలేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్నవాడికి మరుజన్మలో సిరిసంపదలు కలుగుతాయి. సుఖంగా జీవిస్తారు. కనుక సుఖదుఃఖములు వారి వారి పూర్వజన్మ కర్మపరిపక్వత వలన కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషము ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపములఫలము అని తెలుసుకోవాలి. పార్వతీ ! కొంత మందికి సంపదలు ఉంటాయి కాని వారు కడుపునిండా తినరు, అనుభవించరు అలా సంపదఉన్నా దరిద్రము అనుభవిస్తుంటారు. ఎందుకో తెలుసా ! వీరు పూర్వ జన్మలో ఎవరికీ పిడికెడు అన్నము పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరిసంపదలు ఉన్నా అనుభవించలేరు. కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటులేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దానధర్మములు చేయవలెనని మనసులో ఘాఢంగా కాంక్షిస్తుంటాడు. అందువలన ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తుంటారు. ఈ జన్మలో కొంతమంది అయాచితంగా ధనము లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనము సంపాదించే వారు పూర్వ జన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు. కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనముచేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపి ఉంటారు. కొంత మందికి ముసలితనంలో అలాంటి వారు యవ్వనంలో ఉన్నప్పుడు దానధర్మములు చెయ్యకుండా ముసలితనంలో దానధర్మములు చేసినవారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనము కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండికూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచిస్థితిలో ఉన్నప్పుడు దానము చేయకుండా వ్యాధిపీడితుడైన తరువాత దానధర్మములు చేసి ఉంటారు. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్నీవ్రతుడై ఉన్న వాడికి ఈ జన్మలో సౌందర్యవతీ, సౌశీల్యవతీ, గుణవతీ అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్ట పెట్టినవాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమౌతుంది. ఈ జన్మలో విద్యా, విజ్ఞానము, జ్ఞానము కలిగి ఉండికూడా పేదరికంతో బాధపడే వాడు క్రితం జన్మలో దానధర్మములు చేయాలి అని తెలిసి కూడా దానధర్మములు చేయని వాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించిన వాడు. కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైనా పేదసాదలకు దానధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు మేధావి అయిన వాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. కొంత మందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. ఈ జన్మలో ఏరకమైన బాధలు లేకుండా రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్న వారు పూర్వ జన్మలో సత్యము పలుకుచూ ఇతరుల మీదదయ చూపుతూ దానధర్మములు చేసినవారు. ఈ జన్మలో మాటవినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగముతో నిండా బాధపడే వారు కిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్థికత్వముతో విర్రవీగిన వారు. ఈ జన్మలో పుట్టుగుడ్డి వాడు లేక మధ్యలో చూపుపోయిన వాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడుభావనతో చూసిన వాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడే వాడు పోయిన జన్మలో మంచి వారిని పరుషమైన మాటలతో బాధపెట్టినవాడై ఉంటాడు. ఉదరవ్యాధులతో బాధపడేవాడు పోయినజన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడే వాడు పోయిన జన్మలో కన్యలను, పర కాంతలను శీలము కాజేసిన వాడు. ఈ జన్మలో క్షయరోగముతో బాధపడుతున్న వాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుష్టురోగముతో బాధపడే వాడు పూర్వ జన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళుచేతులు విరిచిన వారై ఉంటారు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడే వారు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయినజన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేద వారిని, అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవారే. ఈ జన్మలో కడుపులో రోగములతోను, జ్వరముతోనూ, శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయినజన్మలో జంతువులను చంపినవారు గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు, మరగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను బాధపెట్టినవాడు. ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవారు. ఈ జన్మలో సంతానము లేనివారు పోయిన జన్మలో తల్లితండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయినజన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యము పొందిన వనిత పోయిన జన్మలో భర్తనుమోసగించి ధనము సంపాదించినది, తనభర్తను వదిలి మరియొకరి భర్తనుకోరింది. ఈ జన్మలో గొప్పవంశంలో పుట్టి కూడా చేయకూడని పనులు అందరూ ఏవగించుకునే పనులు చేసిన వారు పూర్వజన్మలో అహంకారంతో, గర్వంతో, మదంతో ఇతరులను అవమానించిన వారు. ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్న వారు పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించినవారే. ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించినవాడే. ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్న వాడు పూర్వజన్మలో తనదగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసము చేసి అపహరించిన వాడు. పార్వతీ నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకము అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మ ఫలము అనుభవిస్తున్న వారే. క్రితము జన్మలో తక్కువ పాపములు చేసిన వాడు మానవుడుగా జన్మిస్తాడు. ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.
Read More

ఉంతకల్లులో పాండురంగ మాల ధారణ చేసినవారు మళ్ళీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని చెబుతారు.పాండురంగ మహాత్మ్యంలో దుర్వ్యసనాలకు లోనైన వ్యక్తిని పాండురంగడు ఆ అలవాట్ల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి విముక్తి కల్పించే దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వున్నారు. ఆయనే ‘ఉంతకల్లు పాండురంగ స్వామి’. అనంతపురం జిల్లా రాయదుర్గానికి సమీపంలోని బొమ్మనహాల్ అనే ప్రదేశానికి దగ్గర్లోనే ‘ఉంతకల్లు’ శ్రీ పాండురంగ దేవాలయం వుంది. ఈ ఊరిలోనివారంతా పాండురంగడి భక్తులే. శతాబ్దాల క్రితం ఈ ఊరికి చెందినవారు మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని స్థాపించారు. మద్యానికి బానిస అయినవారు ఈ దేవాలయం ఆవరణలో ‘పాండురంగ మాల’ ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం జోలికి వెళ్ళరన్న నమ్మకం భక్తుల్లో వుంది. ఈ నమ్మకాన్ని రుజువు చేసే తార్కాణాలు కూడా వున్నాయి. అయితే పాండురంగ మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు. ప్రతి నెలలో రెండు రోజులు మాత్రమే మాల ధారణకు అనువైనవి. అవి శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజులు. ఆ రెండు రోజుల్లో పాండురంగ మాల ధరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉంతకల్లు గ్రామానికి వస్తూ వుంటారు. అనంత పురం జిల్లా రాయదుర్గానికి దగ్గరలో బొమ్మన హాల్ అనే చోటికి సమీపం లో ‘’ఉంతకల్లు ‘’లో శ్రీ పాండురంగ దేవాలయం ఉంది. ఇక్కడి వారంతా పాండు రంగని భక్తులే.


పూర్వం వీరు పండరీ పురం వెళ్లి రంగని దర్శనం చేసుకొనే వారు ఇప్పుడు స్వంతం గా రంగడికి గుడి కట్టుకొన్నారు మద్యానికి బానిస లైన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మ లో దాని జోలికి పోరు .మాల ధారణా నిర్వహణ నెలలో రెండు రోజులు మాత్రమె ‘శుక్ల ఏకాదశి ,కృష్ణ ఏకాదశి రోజుల్లోనే . మన రాష్ట్రం టో పాటు మహా రాష్ట్ర ,కర్నాటక తమిళ నాడు వాళ్ళు కూడా ఆ రెండు రోజుల్లో వేలాదిగా వస్తారు. పాండురంగ మాల ధరించాలని అనుకున్న వారు వంద రూపాయల టోకెన్ తీసుకుని ఆలయానికి వెళ్ళాలి. పాండురంగ మాలలను ముందురోజు అర్ధరాత్రి నుంచి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వుంచి పూజలు, భజనలు నిర్వహిస్తారు. మాల ధారణ చేయాలని అనుకున్నవారు తెల్లవారుఝామునే స్నానాదికాలు ముగించుకుని, దేవాలయానికి వచ్చి తమకు ఇచ్చిన టోకెన్ నంబర్ ప్రకారం వరుసలో నిలబడాలి. ఆలయ ప్రధాన అర్చకుడు వీరందరికీ పూజ చేసిన పాండురంగ మాలలు మెడలో వేస్తారు. ఆ రెండు రోజుల్లో మాల ధరించడానికి గ్రామానికి వచ్చే భక్తులందరికీ గ్రామస్థులే ఉచిత భోజన వసతి, సౌకర్యాలు కల్పిస్తారు. టోకెన్ కోసం 100 రూపాయలు మినహా మరే ఇతర అవసరానికీ ఇక్కడ డబ్బులు తీసుకోరు. మాల ధారణ చేసినవారు వరుసగా మూడు ఏకాదశి రోజుల్లో ఉంతకల్లు గ్రామానికి వచ్చి నిద్ర చేయాలి. మూడు ఏకాదశులు పూర్తయిన తర్వాత మాల తీసేయాలి. ఇలా ఉంతకల్లులో పాండురంగ మాల ధారణ చేసినవారు మళ్ళీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని చెబుతారు.Read More

హైదరాబాద్ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దైవం చిలుకూరి బాలాజీహైదరాబాద్ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లో ఉండే ఈ దేవాలయం ప్రతి రోజు భక్తులతో కళకళ లాడుతూ ఉంటుంది.

500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు V.I.P దర్శనం, టిక్కెట్ దర్శనం అంటూ ఏమి ఉండవు. ప్రధాన మంత్రి అయినా సరే మాములు దర్శనం చేసుకోవలసిందే.

ప్రస్తుతం ఏ దేవాలయంలో చుసిన హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు.


ఇతర దేవాలయాలలో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ కానుకలు వేయరు.

చిలుకూరు బాలాజీని కొంత మంది వీసాల స్వామి అంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు స్వామి వారిని వేడుకుంటే వెంటనే వీసా వస్తుందట.

ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఇక్కడ దర్శనం,అభిషేకం వంటి వాటికీ టిక్కెట్ ఉండదు.

ఈ దేవాలయంలో కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది.

హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరి బాలాజీని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు.

టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఈ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతుంది.
Read More

భగవద్గీత అంటే ఏమిటి?భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
– ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో
రాత మార్చుకో
Read More

లింగాకారంలో కనిపించే త్రిమూర్తులం క్షేత్రం సుచీంద్రంలింగాకారంలో కనిపించే త్రిమూర్తులం క్షేత్రం సుచీంద్రం
తమిళనాడు కన్యాకుమారికి పన్నెండు కిలో మీటర్ల దూరంలో సుచీంద్ర క్షేత్రం ఉంది .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచ్రీందం అయింది .ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపంలో దర్శనమిస్తాడు. అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ, సరస్వతి పార్వతీదేవిలకు కనువిప్పు కల్గించింది ఇక్కడే. శైవులకూ వైష్ణవులకూ కూడా దర్శనీయ క్షేత్రం సుచీంద్రం. పెద్ద శివలింగం ప్రక్కనే విష్ణుమూర్తి ఉంటారు గర్భ గుడిలో. ఏప్రిల్, మే నెలలలో ఒకసారి డిసెంబర్, జనవరిలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద జలాశయం మనకు ఆలయం ముందే కనిపించి ఆశ్చర్య పరుస్తుంది.

ఇక్కడి అలంకార మండపం ఎన్నదగినది. నాలుగు పెద్ద రాతి స్తంభాలు వాటికి అనుబంధ స్తంభాలతో ఒకఏక రాతి నిర్మితం. మరి రెండు స్థంభాలకు ముప్ఫై మూడు చిన్న స్తంభాలు కలిసి ఉంటాయి. ఇంకో రెండు స్థంభాలకు ఇరవై అయిదు చిన్న స్తంభాలు జత చేయబడి ఉంటాయి. ఇవన్నీ సంగీత స్తంభాలే. ఏ స్తంభాన్ని మీటినా సంగీత స్వరం వినిపించటం ప్రత్యేకత. ప్రతి చిన్న స్థంభం ఒక్కొక్క రకమైన సంగీత ధ్వని చేయటం ఆకర్షణీయంగా విశేషంగా ఉంటుంది.ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం విశ్వ రూప సందర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.134 అడుగుల గోపురం చాలా దూరానికే కనిపిస్తుంది. ముఖ ద్వారమే ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా శిల్ప శోభితంగా ఉంటుంది. శైవులకూ వైష్ణవులకూ కూడా దర్శనీయ క్షేత్రం సుచీంద్రం. పెద్ద శివలింగం ప్రక్కనే విష్ణువు ఉంటారు గర్భ గుడిలో. ఏప్రిల్ మే నెలలలో ఒక సారి, డిసెంబర్ జన వరిలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి . పెద్ద జలాశయం ముందే కనిపించి ఆశ్చర్య పరుస్తుంది.

ఒకే రూపంలో త్రిమూర్తులు

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలో’సుచీంద్రంలో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి మధ్యభాగంలో శివుడు క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు.

హనుమంతుడి తోకకు వెన్నపూస

ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా ‘వెన్నపూస’ రాస్తుంటారు. ఈ ఆచారం రామా యణ కాలంతో ముడిపడివుందని ఇక్కడి వాళ్లు చెబుతుం టారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు.

ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి వెన్నపూస రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన, ఆ స్వామి ఆయురారోగ్యాలను … అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

యజ్ఞోపవీతధారణ ప్రాముఖ్యం గురించి వివరించిన ఋషులలో అత్రి ఒకరు. యజ్ఞోపవీతానికి మూడు ముడులు వేయటం వెనుకగల ప్రాము ఖ్యాన్నీ, ఆ మూడు ముడులూ బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు, ఆ ముడులే ‘ఓమ్’ శబ్దంలోని మూడు అక్షరాలు అ,ఉ,మలకు ప్రతీకలనీ అత్రి వివరిం చాడు. ఋగ్వేదంలోని 5వ మండలానికి ద్రష్టగా అత్రి మహామునిని పేర్కొం టారు. ఈ మండలంలో భూమి గురించిన వర్ణన ఉంది. సప్తర్షి మండలం లోని ఏడు నక్షత్రాలలో ఒకటి అత్రి. ఉర్సా మేజర్ నక్షత్రమండలంలోని ఏడు నక్షత్రాలలో ఇది నాలుగోది. దీనినే ‘డెల్టా’ అని అంటారు.

అత్రి మహాముని ఆశ్రమం చిత్రకూట పర్వతంలో ఉన్నట్లు అక్కడి స్థల పురాణం చెప్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న చిత్రకూట పర్వతం 25 డిగ్రీలు ఉత్తరంలో ఉంది. అయితే, మరొక చోట, అత్రి ఆశ్రమం ఆలీఘర్ ప్రాంతంలో, అత్రావళి పర్వత ప్రాంతంలో ఉన్నట్లుగా ఉంది. అది 28 డిగ్రీల 1 నిమిషం 16 సెకన్లు, 78 డిగ్రీలు 16 నిమిషాలు, 52 సెకన్లుగా ఉంది. ఈ పర్వతశ్రేణి పేరుకూడా ‘అత్రావళి’ అని ఉండటం గమనించాలి!! అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుడు. నవ ప్రజాపతులలో ఒకడు. కర్దమ ప్రజాపతి కుమార్తె, పతి వతలలో ఒకరైన అనసూయకు భర్త. అత్రి మహర్షి ఋగ్వేదంలోని 5వ మండలం ద్రష్ట. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల అవతారా లుగా పేరుగాంచిన ఆ ముగ్గురు: 1. దత్త, 2. దుర్వాసో 3.. సోమ. దత్తుడినే ‘దత్తాత్రేయ’ అనీ, దుర్వాసో మహామునినే ‘కృష్ణాత్రేయ’ అనీ, సోముడినే ‘చంద్రాత్రేయ’ అనీ అంటారు. ఈ సోమేశ్వరుడు స్థాపించినదే ‘సోమేశ్వర జ్యోతిర్లింగం’.

ఈ దంపతులు కన్యాకుమారి వద్దగల ‘సుచీంద్ర ఆశ్రమం’లో ఉండేవా రని అంటారు. అయితే, మరికొందరి అభిప్రాయంలో – లక్నో నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో సతీ అనసూయ ఆశ్రమం ఉంది. అదే అత్రి, అనసూయ, వారి ముగ్గురు కుమారులు తపస్సు చేసిన ప్రాంతమని అం టారు. అక్కడే, అనసూయ తపోఫలంవల్ల మందాకిని నది జన్మించిందం టారు. ‘మందాకిని’ అనేది గంగకుగల అనేక నామధేయాల్లో ఒకటి అన్నది తెలిసిందే! అత్రి, అనసూయ దంపతులకు అనేకమంది శిష్యులు ఉండే వారు. వారిలో గండ అనే ఒక శూద్ర మహిళ, పశుసఖ అనే పేరుగల ఆమె భర్త కూడా ఉండేవారు. ఈ మహర్షి దంపతులున్న కన్యాకుమారి వద్ద ఇప్పుడు సుప్రసిద్ధమైన దత్తాత్రేయ ఆలయం ఉంది.


Read More

Monday, 10 October 2016

గరుడపురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీ గా ఉండాలంటే ఏమి చెయ్యకూడదో తెలుసా?గరుడపురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీ గా ఉండాలంటే ఏమి చెయ్యకూడదో తెలుసా?

ప్రతీ మనిషికీ ఆనందగా బ్రతకాలని ఉంటుంది. జీవితమంతా ఆనందంగా ఏలోటు లేకుండా, కష్టాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటారు. కాని అందరికీ అనికున్నట్టుగా అన్ని సమకూరి ఆనందంగా ఉండటం అంటే జరగదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటారు. కాని కష్టపడితే, కృషి చేస్తే మనమనుకున్నది రీచ్ అయ్యి ఆనందంగా ఉంటాము నిజమే కాని కృషితో పాటు మనం కొన్నిటికి దూరంగా ఉంటె మంచిది.

గరుడపురాణం లో మనం తప్పనిసరిగా ఈ క్రిందవాటిని విడిచిపెట్టాలి. వాటిని వదిలేస్తే మనం ఆనందగా, సంతోషంగా ఉంటామని గరుడపురాణం పేర్కొంది.
…డబ్బు అప్పు తీసుకోవడం…


ఎంత ఉంటె అంతలో బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే కాని బందువుల , స్నేహితులు, మరియు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఇవ్వలేకపోతే, ప్రతీ క్షణం టెన్క్షన్ తో బ్రతకాలి. అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవమానాలు,అలజడి మిగిలుతాయి. అందుకని అప్పు చెయ్యవద్దని గరుడపురాణం చెప్పింది.
…స్త్రీలను గౌరవించకపోవడం..

ప్రతీ పురుషుడు స్త్రీని గౌరవించాలి. స్త్రీని గౌరవించకపోతే ఆ పురుషుడి జీవితంలో ఆనందం అనేది ఉండదు. ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని అంటారు. అందుకే గరుడపురాణంలో స్త్రీని గౌరవించే పురుషుడి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పింది.
…జూదం ఆడడం…

జూదం ఆడడం వలన మనిషి జీవితం లో సంతోషం అందే ఉండదు కాని, శత్రువులు ఉంటారు. వీరి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. శారీరికంగా మానసికంగా కూడా క్షీణిస్తారు. అందుకని గరుడపురాణం జూదం ఆడకూడని చెబుతుంది.

అందుకని ఈ మూడింటిని వదిలి జీవితాంతం ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అందరికి తెలియజేసి వారి జీవతంలో సంతోషానికి మీరు ఎంతోకొంత కారణం అవ్వండి
Read More

ఆ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదే కాని గర్భగుడిలో దేముడి విగ్రహం ఉండదు. అయినా నిత్య ఆరాధన, విశేష పూజలు, నైవేద్యాలు అన్నీ జరుగుతాయి.ఆ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదే కాని గర్భగుడిలో దేముడి విగ్రహం ఉండదు. అయినా నిత్య ఆరాధన, విశేష పూజలు, నైవేద్యాలు అన్నీ జరుగుతాయి. ఎక్కడ ఉంది ఇలాంటి వింత ఆలయం అనుకుంటున్నారా. ఈ ఆలయం తమిళనాడులోని పుదుకోట్టాయ్ లో ఉంది. దీనిని అవుడయర్ కోయిల్ అంటారు. ఇక్కడి శివుడిని ఆత్మానంద స్వామి అని పిలుస్తారు. మన శరీరంలో ఉండే ఆత్మ ఎలాగయితే కనపడదో ఇక్కడి శివుని విగ్రహం కూడా అలాగే కనపడదు. ఆత్మ కళ్ళకి కనపడదని మనం ఆత్మని నమ్మటం మానం కదా అలాగే ఇక్కడ విగ్రహం కనపడకపోయినా ఆత్మస్వరూపుడైన శివునికి నిత్యం పూజలు జరుగుతూనె ఉంటాయి.


ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దంలో మనికవసాగర్ అనే నయనారు కట్టించారని ప్రతీతి. ఇక్కడ అన్ని ఆలయాలలోలాగా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు , ధ్వజస్తంభం కనపడదు, చండికేస్వరుడు కూడా కనపడడు. ఇక్కడి అమ్మవారిని యోగంబాల్ అని అంటారు అయితే ఈ అమ్మవారు కూడా మనకి విగ్రహ రూపంలో దర్సనమీయరు.

ఇక్కడి ఆలయంలోని పైగోడపై పంచభూతాలని చెక్కారు. నవగ్రహాలకి మండపం లేదు గాని ఈ నవగ్రహాలని మనం ఇక్కడ ఉన్న స్తంభాలపై చూడచ్చు. ఎక్కడా లేని విధంగా 27 నక్షత్రాలకి విగ్రహరూపాలని కూడా ఇక్కడి ఆలయంలో మనం చూడచ్చు. త్యాగరాజ సన్నిధిలో ఉన్న రాతి చైనులు, పంజస్తర మండపంలోని సప్తస్వర స్తంభాలు ఇక్కడ చూడదగ్గవి. శిల్పకళా అణువణువునా పొంగిపొరలే ఈ ఆలయం దర్శించుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది.

ఇక్కడి స్వామి ఆత్మనందుడు బ్రహ్మదేమునికి గాయత్రీ మంత్రాన్ని ఈ సన్నిధిలోనే ఉపదేశించాడని ప్రతీతి. విగ్రహం లేకపోయినా నైవేద్యం పెట్టె అన్నం ఆవిరినే శివుడిగా కొలిచే ఇలాంటి ఆలయం ఇంకోటి ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆలయంలో జరిగే శివాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.Read More

ముక్తి రామలింగేశ్వర ఆలయముముక్తి రామలింగేశ్వర ఆలయము


ముక్తి రామేశ్వరం కడప జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణం లో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నది గా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. ఇక్కడికి సమీపంలో, ఆలయం నుంచి 14 కి.మీ. దూరంలో గల ఎర్రగుంట్లలో రైల్వే స్టేషను ఉంది. ప్రొద్దుటూరు నుంచి, ఎర్రగుంట్ల నుంచి యాత్రీకులను ఆలయం దగ్గరకు తీసుకు వెళ్ళడానికి చాలా బస్సులు తిరుగుతున్నాయి.

స్థల పురాణము :-
పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుక తో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (=ఇసుక లింగం)గా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.
ఆలయ చరిత్ర :-
శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్థుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు.
రామలింగేశ్వర ఆలయము :-
ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీ రాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు పూజించిన "శ్రీ చక్ర యంత్రం" ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది.
శిల్పకళ :-
ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళానైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి.
Read More

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం
అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ
వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా
వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా పాలిత భక్తి రాజి రనిశం అంబాష్టకం యః పఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
Read More

దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పoడుగ
🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)
ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి" అనికూడా అంటారు.
అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలు.
Read More

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తిప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి..! ఆ దేవాలయ ఫోటోలు ..చూసి హిందూ ధర్మ/మతం గొప్పదని తెలుసుకొని .. గర్వపడుదాం..!!

Angkor Wat (లేదా Angkor Vat) ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.

భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.

పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్‌ సాప్‌ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్‌ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి.

ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.

భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి.


Read More

------------------------------------------------------------- .ఆత్మకూరు సద్గురు కాశినాయన ఆశ్రమం యొక్క విశిష్టత.

నెల్లూరుజిల్లా ,ఆత్మకూరు పట్టణంలో సద్గురు కాశినాయన ఆశ్రమంలో నవరాత్రులలో భాగంగా మూడవ రోజు ధనలక్ష్మి దేవి అలంకారం లో దర్శనమిచ్చిన జ్ఞాన సరస్వతి దేవి మరియు కనకదుర్గ దేవి అమ్మ వార్లు.
-------------------------------------------------------------
.ఆత్మకూరు సద్గురు కాశినాయన ఆశ్రమం యొక్క విశిష్టత.
-------------------------------------------------------------
ఈ ఆశ్రమ నిర్వాహకులు సద్గురువు పట్ల గల నిరంతర ప్రేమ, భక్తి, విశ్వాసాలుతో అన్నివేళలా సర్వజీవుల పై ప్రేమ,దయ చూపగలుగుతున్నారు.
'అన్నాద్ధ్యేవా ఖల్విమానాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవన్తి' అని వేదము చెప్పు చున్నది.
సృష్టిలోని సర్వప్రాణులు అన్నము నుండే పుట్టుచున్నవి.పుట్టినవన్నీ అన్నము వలననే జీవించుచున్నవి. అన్నము లేకుండా జీవనం సాగదు, అందుకే జగము అన్నమయము అని చెప్పబడును.అందుచేత అన్నము పెట్టడము వలన జీవికి ప్రాణం పోసినట్లగును.
ఈ ఆశ్రమములో నిరతాన్నదానము జరుగుతుంటుంది. అర్ధరాత్రి వచ్చినా ఇక్కడ ఎంతో భక్తితో అన్నదానం చేస్తారు. సర్వరోగాలను నయము చేసే 'సర్వరోగ నివారిణి' అనే 'కషాయము' తయారుచేసి వచ్చిన వారికి ఉచితంగా అందచేస్తారు. పేద విద్యార్థుల కోసం 'కాశినాయన పాఠశాల'ను స్థాపించి పిల్లలకు అన్నదానంతో పాటు,పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
జై సద్గురు కాశినాయన..జై సద్గురు రామచంద్ర నాయన....
Read More

ఓంకార ప్రణవానికి భౌతిక రూపమే గణనాధుడు........ఓంకార ప్రణవానికి భౌతిక రూపమే గణనాధుడు........

వినాయక స్వరూపానికి తాత్విక వివరణ

వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.


* వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

* వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
* ఏనుగు తల - జ్ఞానానికీ, యోగానికీ చిహ్నము.
* మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
* చేతిలో పరశువు - అజ్ఞానమును ఖండించడానికి సంకేతము
* చేతిలో పాశము - విఘ్నాలు కట్టిడవసే సాధనము
* విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
* మాల - జ్ఞాన సముపార్జన
* పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
* పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
* ఎలుక వాహనము - జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.....
Read More

హిమాలయాల చెంత ఉన్న కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది.హిమాలయాల చెంత ఉన్న కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది.
సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేపపిల్ల రూపంలో మనువు చెంతకి చేరాడు. ఆ చేప పిల్ల అంతంతకూ అమాంతంగా పెరిగిపోవడం చూసిన మనువు అది సాక్షాత్తూ దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి, మహాప్రళయం తరువాత తిరిగి సృష్టి కొనసాగేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు.


ఆ రోజు నుంచి ఏడో నాటికి జల ప్రళయం సంభవిస్తుందనీ, ఆ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమనీ మనువుని ఆదేశించాడు విష్ణుమూర్తి. ఆ ఓడలోకి మునులనూ, ఔషధాలను, జీవజాతులనూ ఎక్కించుకుని సిద్ధంగా ఉండమని సూచించాడు.
విష్ణుమూర్తి మాటప్రకారమే మహా ప్రళయం సంభవించడం, ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం అందరికీ తెలిసిన కథే! జలప్రళయం ముగిసేనాటికి మనువు ఎక్కడైతే అడుగుపెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని స్థానిక ఐతిహ్యం. అడుగుపెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాసస్థానంగా మార్చుకునే అక్కడే తపస్సునాచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి 'మనువు ఆలయం' అన్న పేరు స్థిరపడింది. అదే క్రమంగా మనాలిగా మారింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఓ అరుదైన ఆలయం కూడా ఉంది! మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ దిశగా వచ్చారనీ. ఇక్కడే భీముడు, హిడిండిని వివాహం చేసుకున్నారనీ చెబుతారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో అరుదైన హిడింబి ఆలయం కూడా ఉంది.
Read More

చండీ హోమము ఎందుకు చేస్తారు..?చండీ హోమము ఎందుకు చేస్తారు..?

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

1. చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు :
చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.

2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.
Read More

రంగులు మారే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం

రంగులు మారే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం'. ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన 'వినాయకుడు' ఆరు నెలలకు ఒకసారి రంగు మారడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మారడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాక, ఇక్కడ మరో విచిత్రం
కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగు మారతాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది.
ఆలయ చరిత్ర
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, చరిత్రకారుల అంచనా . నిజానికిది 'శివాలయం'. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్' ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికో చారిత్రక చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో 'కేరళపురం' రాజుగారు తీర్థయాత్రలకని 'రామేశ్వరం' వెళ్లడం జరిగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..'దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం' అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని 'కేరళపురం' రాజుకే ఇస్తూ, మరొక 'మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మిగిలింది.
ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం.
Read More

పుణ్యప్రదమైన తీర్థయాత్ర వైష్ణవీదేవి ఆలయం

పుణ్యప్రదమైన తీర్థయాత్ర వైష్ణవీదేవి ఆలయం
***********************************************
వరములనొసగే వైష్ణవీదేవి
మానవ జీవితానికి తీర్థయాత్రలు పుణ్యఫలాలను అందిస్తాయని విశ్వాసం. భగవంతుని కటాక్షం ఉంటేనే దేవాలయాలకు భక్తులు వెళ్లగలుగుతారు. ఇలా ఆలయాలకు వెళ్లి ఆ దేవతలను దర్శించుకుంటే వారి అభయం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. నిత్యజీవితంలో పూజలతోపాటు తీర్థయాత్రలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులుంటాయని చెప్పబడింది.
అయితే ఇవేవీ పెద్దగా తెలీనివారు ఆ విషయాలను తెలుసుకున్నా, చదివినా సగలాభం పొందుతారని అధర్వణ వేదంలో చెప్పబడింది. అటువంటి పుణ్యప్రదమైన తీర్థయాత్రగా చెప్పబడే జమ్ము-కాశ్మీర్‌లో వెలసిన వైష్ణవీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
అమ్మవారి పేరు త్రిపుట. త్రిపుట కొండపై వెలసింది కనుక ఆమెకు ఆ పేరు వచ్చింది. అమ్మవారు కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపంలో ఉంటుంది. ఈ స్వరూపమే వైష్ణవి మాత. భూలోకంలో ధర్మం, న్యాయం తప్పినప్పుడు ఏ దేవతైనా, దేవుడైనా ఆవిర్భవిస్తాడని కథలు చెపుతున్నాయి. అలాంటి ఆవిర్భావమే త్రిపుటదేవి. విష్ణుమూర్తి అంశలోంచి పుట్టింది కనుక ఆమెను వైష్ణవి మాతగా పిలుస్తారు.
స్థలపురాణం
స్థలపురాణం ప్రకారం. ముందుగా ఆమె దక్షిణాదిలో వెలిసింది. అక్కడ మానవజన్మ ఎత్తింది. చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. ఎక్కువ భాగం ధ్యానంలో గడిపేది. ఓసారి తన తండ్రిని సముద్ర తీరానికి తీసుకవెళ్లమంది. అక్కడ ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు తన భార్య సీతకోసం హనుమంత, సుగ్రీవ సైన్యంతో అక్కడకు వచ్చాడు. అప్పుడు ఈమె ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆమెకు రాముని విషయం తెలిసింది. తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అయితే అది సాధ్యపడదని రాముడు చెప్పాడట.
అయితే ఆ తర్వాత ఆమెకు ఓ అవకాశం ఇచ్చాడు. తిరిగి తను మళ్లీ వస్తాననీ, అలా వచ్చినప్పుడు తనను గుర్తుపడితే చేసుకుంటానని చెప్పాడట. అప్పటివరకూ ఉత్తరాదిలోని త్రిపుట కొండల్లో ధ్యానంలో ఉండమని శ్రీరామచంద్రులవారు సూచించారట. అలా కాత్రా వైపు ఉన్న కొండల్లో మాత ధ్యానం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరాముడు ముని వేషధారణలో త్రిపుటను కలిశాడు. కానీ ఆమె గుర్తించలేదు. అలా ఆయన రాకకోసం ధ్యానముద్రలో మునిగిపోయి ఇప్పటికే అలానే ఉందన్నది భక్తుల విశ్వాసం.
బాలవైష్ణవి దేవి
త్రిపుట పర్వతాల నుంచి జమ్మూకు వెళ్లే మార్గంలో ఓ దంపతుల ఇంట దేవి పెరిగింది. అక్కడ ఐదో ఏటనే ధ్యానంలోకి వెళ్లింది. ఆమె గురించి తెలుసుకుని అప్పటి మహిళలు ఆమెను పూజించేవారు. కొందరు పరీక్షించేవారు. అటువంటి వారిలో రఘునాధ ఒకరు. అతడి నుంచి తప్పించుకుంటూ త్రిపుట పర్వతాలపైకి పారిపోయింది. అక్కడ రఘునాథ వెంబడిస్తే తన శక్తితో కోతులను రక్షణగా ఉపయోగించుకుంది. కోతులతో రఘునాధుడు ఘోరమైన యుద్ధం చేసి వాటిని చంపేశాడు. అయితే బాలవైష్ణవి తన శక్తిని ఉపయోగించి అతడిని సంహరించింది. తర్వాత తన తప్పును తెలుసుకుని మన్నించమని వేడుకోలు చేసుకుంటే. అమ్మవారిని దర్శించిన తర్వాత తనను దర్శించుకుంటే వారికి అంతా మంచే జరుగుతుందని సెలవిచ్చిందట. ఇది ఓ కథ.
పంచపాండవులు కట్టిన గుడి
పాండవులు తమ అరణ్యవాసంలో బాల త్రిపుట గురించి తెలుసుకుని వచ్చారట. ఆమె ధ్యానం, భక్తికి, ధర్మానికి మెచ్చి అనంతరం దేవాలయాన్ని కట్టించారని ప్రతీతి. జమ్మూ నుంచి కాత్రాకు వెళుతుండగా నరోలి అనే గ్రామంలో ఆమె చిన్నతనంలో ధ్యానం చేసుకున్న ప్రాంతం గుడిగా మలిచారని అక్కడి గోడలపై రాతలు చెబుతాయి.జమ్మూ - కాశ్మీర్ ప్రాంతంలో వెలసిన వైష్ణవిమాత దర్శనభాగ్యంకోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. దేశంలోనే తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి తర్వాత స్థానంగా చెప్పబడే వైష్ణవి మాత ఆశీస్సులను ఈ దసరా పర్వదినాలలో తెలుసుకోవడం చాలా ఉత్తమం.
వైష్ణవి దేవి ఆలయం జమ్మూలో ఉంది. జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాత్రాలో నెలకొనివుంది అమ్మవారి ఆలయం. ఢిల్లీలో రాత్రి గం 10.30 నిమిషాలకు జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఎక్కితే. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు జమ్మూ స్టేషనకు చేరుకుంటారు. అక్కడ పోలీసుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. ఎవర్నీ ఎక్కువసేపు నిలుచోనివ్వరు. అలా అని కూర్చుని ఎక్కువసేపు ఉన్నా. నిద్రపోతున్నా. మొహమాటం లేకుండా రైల్వే పోలీసులు ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుని పంపించేస్తుంటారు. అంతేకాదు రైల్వే స్టేషనులో మిలటరీ చెకింగ్ కూడా బాగానే ఉంటుంది. ప్రతీ బ్యాగును చెక్ చేస్తారు.
కాత్రా ప్రయాణం
జమ్మూ నుంచి కాత్రా 70 కిలోమీటర్ల దూరం. కాశ్మీరుకు వెళ్లే మార్గంలో ఉంది. అలా కారులో వెళుతుంటే.. జమ్ముతావీ నది కనిపిస్తుంది. నీళ్లు అంతగా ఉండవు.అయితే అక్కడక్కడా చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, లోయలు. ప్రకృతిని ఆస్వాదిస్తూ.యాత్రికులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతంటారు. అక్కడినుంచి వైష్ణవి మాత ఆలయం ప్రవేశమార్గం వరకూ ఆటోలో వెళ్లవచ్చు. అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ కొండపైకి వెళ్లాలి. 16 కిలోమీటర్ల మేర నడక సాగించాలి. కొండపైకి వెళ్లేకొలదీ కోతుల సందడి ఎక్కువగా ఉంటుంది. గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే ఎవరిపైనా అవి దాడి చేయకపోవడం విశేషం. సందర్శకులు ఏదైనా ఆహారం వేస్తే తింటాయి. ప్రకృతిలో దొరికే పళ్లను ఆరగిస్తుంటాయి.
సముద్రమట్టానికి 5200 కి.మీ. ఎత్తులో
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం. ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.
శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు. కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనిం చాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బా ణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.
వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్‌ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించ టానికి. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణ పాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రి కూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడు వకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరు కుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీదపడింది.
Read More

గంగా నదిలో అద్భుత శక్తి..!

గంగా నదిలో అద్భుత శక్తి..!
----------------------------
గంగా నది పవిత్రమైనది. స్వచ్ఛమైనది. అష్టాదశ పురాణాల నుంచి ఇతిహాసాల దాకా.. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోనూ కనిపించే మాట ఇది. అందుకే.. హిందువులు తాము చనిపోయాక అస్థికలను గంగలో కలపాలని కోరుకుంటారు. అయితే.. నిజంగా గంగా నదికి అంత పవిత్రత ఉందా...? గంగ అంత స్వచ్ఛమైనదా..?
గంగా మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతిస్తుంటారు. గంగమ్మ మహిమలను మనోవాక్కాయ కర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగునని పండితులు అంటారు. గంగాదేవి మహిమను విన్నా చదివినా సకల వ్యాధులు నశించి, శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అలాంటి గంగా నది పవిత్రపై కొందరు పరిశోధనలు చేశారు. స్వచ్ఛమేనా..? కాదా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు.
చండీగడ్ కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగానది పవిత్రపై పరిశోధనలు జరిపారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన శాఖ ఆదేశాల మేరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నైరుతికి ముందు.. తర్వాత, హరిద్వార్ నుంచి గంగ దాకా రకరకాల ప్రాంతాల్లో గంగ నీటిని సేకరించి, అధ్యయనం చేశారు. ఆ నీళ్లల్లో రకరకాల బ్యాక్టీరియాలను నిర్మూలించే బ్యాకిట్రయోఫేజ్ కు చెందిన పలు వైరస్ లు ఉన్నట్లు కనుగొన్నారు. హానికారక బ్యాక్టీరియాను సంహరించడం ద్వారా ఇవి గంగనీళ్లను మురిగిపోకుండా స్వచ్ఛంగా ఉంచుతున్నట్టు గుర్తించారు.
గంగలో వైరస్ లను శాస్త్రజ్ఞులు గుర్తించడం ఇదే మొదటిసారి. అత్యంత శక్తిమంతమైన యాంటీ బయాటిక్ మందులకూ లొంగని ఇన్ఫెక్షన్లపై పోరాటానికి వీటిని ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తమ బృందం గుర్తించిన వైరస్ లో అత్యంత ఆసక్తికరమైన 20-25 రకాలను.. పలు వ్యాధులకు విరుగుడుగా వినియోగించుకోవచ్చంటున్నారు.
యమున, నర్మద నదుల నీటిని సేకరించిన మైక్రోబయాలజిస్టులు.. వాటికి, గంగ నీటికి మధ్య గల తేడాలపై పరిశోధన చేయనున్నారు. కాగా.. గంగ నీటిపై వీరు చేపట్టిన ఈ అధ్యయనంలో.. పలు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ భాగం పంచుకున్నాయి. మొత్తంగా... ఈ అధ్యయనం తాలూకూ పూర్తి నివేదికను 2016 డిసెంబరులో ప్రభుత్వానికి అందజేయనున్నారు.
Read More

దుర్గా దేవి అనుగ్రహం కోసం రాముడు తన కంటిని అర్పించాడని మీకు తెలుసా..?దుర్గా దేవి అనుగ్రహం కోసం రాముడు తన కంటిని అర్పించాడని మీకు తెలుసా..?
********************************************************************************
దేవీ నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గా దేవి ఇప్పటికే అనేక రూపాల్లో గత కొద్ది రోజులుగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా దేవీ శరన్నవరాత్రుల్లో అత్యంత వైభవం కూడా కనిపిస్తోంది. అయితే విజయదశమి ముందు 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించడం ఇప్పుడు కాదు పురాణాల కాలం నుంచే వస్తోంది. ఆ 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, అష్టైశ్వరాలు కలుగుతాయని, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో రామాయణంలో రాముడితోపాటు, మహాభారతంలో పాండవులు కూడా దుర్గాదేవిని పూజించి యుద్ధాల్లో విజయాలు సాధించినట్టు పురాణాల చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..?


రాముడు దుర్గాదేవిని పూజించే సమయంలో తన కంటిని దేవికి అర్పించాడని..? అవును, మీరు విన్నది నిజమే. ఆ ఘటన వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతమ్మను రావణుడు లంకకు అపహరించుకుపోయాడని అందరికీ తెలిసిందే కదా. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో కలిసి రావణుడి పైకి దండెత్తి వెళ్తాడు. యుద్ధం మరో రోజుల జరుగుతుందనగా రాముడు విజయం కోసం దుర్గాదేవిని పూజిస్తాడు. అయితే 100 తామరపూలతో దేవిని అర్చిస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెప్పడంతో రాముడు అలాగే చేస్తాడు. కానీ ఎటు చూసినా, ఎక్కడ వెతికినా అతనికి 99 తామర పూలు మాత్రమే లభిస్తాయి. దీంతో కమల నయనుడిగా పిలవబడే రాముడు కమలాల లాంటి తన కన్నుల్లో ఓ కన్నును దేవికి అర్పిస్తాడు. రాముడు పూజకు మెచ్చిన దుర్గా దేవి ప్రత్యక్షమై అతనికి వరాలిస్తుంది. దీంతో రాముడు రావణుడిపై యుద్ధంలో విజయం సాధిస్తాడు.
అయితే కేవలం రాముడే కాదు, పాండవులు కూడా దుర్గాదేవిని పూజించేవారు. వారు విరాట రాజు కొలువులో అజ్ఞాత వాసం ముగిశాక శమీ (జమ్మి) చెట్టు వద్దకు చేరుకుని తమ అసలు రూపాలను పొందుతారు. ఆ వృక్షం కొమ్మలపై అంతకు ముందు వారు ఉంచిన తమ ఆయుధాలను కూడా తిరిగి తీసుకుని యుద్ధంలో విజయం సాధిస్తారు. ఇది జరిగింది కూడా విజయదశమి రోజునే. అందుకే ఆ రోజున అందరూ జమ్మిని కూడా పంచుకుంటారు. పిన్నలు పెద్దల దీవెనలు అందుకుంటారు. ఒకే ఈడు వారైతే అలయ్ బలయ్ చేసుకుంటారు.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML