గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 8 September 2016

ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు.

ప్రాఛీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తోంది. ఆయా కాలలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చి దిద్దేవారు. తమ గొప్పతనం చాటుకోనేవారు. ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు.

1.వారణాసి:

మిస్టరీ టెంపుల్స్ వారణాసిలోని సిందియా ఘాట్ కు సమీపంలో, లీనింగ్ టవర్ అఫ్ పైజా వలే ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ కలదు. ఈ టెంపుల్ కూడా దూరం నుండే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించిన అక్కడి ఘాట్ కారణంగా నది లో మునిగిందని చెపుతారు. నేడు ఈ శివ టెంపుల్ ను మూసి వేశారు. ఎలా మునిగింది ? ఎందుకు మునిగింది ? అనేది ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.
2.ఒకే ఒక బ్రహ్మ దేవాలయం:

ఇదొక గొప్ప ఆసక్తికల టెంపుల్. బ్రహ్మ దేముడికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్ లో కలదు. ఈ టెంపుల్ ను 14 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో నాలుగు తలల బ్రహ్మ దేముడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆసక్తి కర కధ కలదు.
3.చైనీయుల కాళి టెంపుల్:

కలకత్తా లో చైనా టవున్ అనే పేరుతో తాన్గ్రాలో ఒక చిన్న టవున్ కలదు. ఈ ప్రదేశంలో వుండేవారు చైనా వారు అవటంతో ఈ ప్రదేశానికి చైనా టవున్ అని పేరు వచ్చింది. చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్, చౌప్సూ వంటి పదార్ధాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదం గా పంచుతారు. ఈ చైనీయులు కాళి మాత భక్తులు.
4.అదృశ్యం లో టెంపుల్:

ఒక టెంపుల్ అదృశ్యం అవటం మరల కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా ? వదోదర కు 40 మైళ్ళ దూరంలో స్తంబెశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ అరే బియా మహాసముద్రంలో వుంటుంది. అలలు తక్కువగా వుండే సమయంలో దీనిని చూడగలం, అంటే అది సముద్రంలో మునిగి వుంటుంది అన్నమాట. అలలు ఎత్తులో వుంటే టెంపుల్ కనపడదు.
5.బులెట్ దేముడు:

రాజస్తాన్ లోని జోద్ పూర్ లో బులెట్ బాబా లేదా ఓం బన్న గుడి కలదు. ఇక్కడ గుడి లో రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంటుంది. దానినే ఇక్కడి వారు ఒక దేముడిగా పూజిస్తారు. ఈ దేముడికి లిక్కర్ కూడా నైవేద్యం గా పెడతారు. గ్రామస్తులు ఈ దేముడు తమను రోడ్ ఆక్సిడెంట్ ల నుండి కాపాడతాడని నమ్ముతారు.
6.పూజించబడే ఎలుకలు:

రాజస్తాన్ లోని బికనీర్ కు దక్షిణంగా 30 కి. మీ. ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కర్ని మాత టెంపుల్ కలదు. ఈ ఎలుకలు కర్ని మాత అవతారంగా అంటే దుర్గా మాత అవతారంగాను, ఆమె కు గల నలుగురు పిల్లల అవతారాలుగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి పాలు, ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.
7.పగోడా ఆకారం దేవాలయం:

మనాలి లోని నాలుగు అంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడా ఆకారంలో వుంటుంది. దీని శిల్ప తీరు తెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా వుంటాయి. ఈ టెంపుల్ లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదరి విగ్రహం వుంటుంది. ఈ దేవతను ఆనాటి కుల్లు రాజ వంశీయులు కుల దేవతగా పూజించేవారు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML