శనిమహాదశ 19సంవత్సరాలలో అంతా అర్ధం అవుతుంది....!!
వింశోత్తరీ దశా విధానంలో శని దశ 19సంవత్సరాలు ఉంటుంది. అతి పెద్ద దశ అయినశుక్ర దశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ.సామాన్యంగా శని దశ అంటే మనకు భయంఉంటుంది. అది చాలా వరకూ నిజమే.
సహజజ్యోతిశ్చక్రములో ఈయనకు 10,11 స్థానములు అయిన మకరం కుంభం స్వక్షేత్రములు. కనుక కర్మ, లాభ స్థానములకారకత్వములు ఈయనకు ఉంటాయి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.అనుభవించాల్సిన కర్మను అనుభవింప జేయటం, ఇవ్వ వలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు.ఈయన యొక్క సహజ లక్షణాలైనబద్ధకం, సోమరితనం, పనులు కాకపోవటం, నిరాశా నిస్పృహలు, నరాల, ఎముకల రోగాలు, పెద్దల మరణాలు,చికాకులు, అంగ వైకల్యం కలగటం, ఏక్సిడేంట్లు కావటం మొదలైనవి జరుగుతాయి. చర రాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశ సాధారణంగా అనేక బాధలను ఇస్తుంది. మేషరాశి వారు ఏలినాటి శని బాధలకు ఎక్కువగా గురి అవుతారు. ఇది చర రాశి. చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు.
సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు.
‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు.ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.
శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు.]

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment