గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 7 June 2016

సంకటాలు తొలగించే విఘ్నేశ్వరుడు🍀సంకటాలు తొలగించే విఘ్నేశ్వరుడు🍀

వినాయకుని ప్రార్ధిస్తే అంతా విజయమని...నమ్మకం. అలాగే విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నములు తొలగించి ముందుకు నడిపే వాడని... వినాయక చవితిని కూడా చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ ఎంతో ఇష్టంగా చేయటం పరిపాటి. వినాయకుని ప్రార్ధిస్తే సకల శుభాలు జరుగుతాయని బలమైన నమ్మం.అసలు నమ్మకం అనే కాదు అది నూటికి నూరు పాళ్ళు నిజం... అలాంటి వినాయకునికి సంబంధించినదే '' సంకష్ట హర చతుర్ధి.''

🍀 సంకష్ట హర చతుర్థి: 🍀

సంకష్ట హర చతుర్ధి లేక సంకష్ట చతుర్ధి లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి అనేది ప్రతి మాసం కృష్ణ పక్షంలో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.

🍀 ప్రాముఖ్యత: 🍀

అసలు ఈ సంకట చతుర్ధి ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట అంటే కష్టములు లేక ఇబ్బందులు... సమస్యలు హర అంటే హరించటం...రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు. అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.

విమానయానం: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

🍀 పాప దృష్టి: 🍀

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

🍀 పాపాత్మురాలు: 🍀

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు.

🍀 వ్రత ఫలితం: 🍀

ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గానీ స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అప్పుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
Read More

శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸ ♨ ☸ 🍀🌷🍀 దేవ వ్రతుడు ( భీష్ముడు ) 🍀🌷🍀శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸ ♨ ☸

🍀🌷🍀 దేవ వ్రతుడు ( భీష్ముడు ) 🍀🌷🍀

🍀 శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు. ☸ HDC☸

🌷 అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది. ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.☸ HDC☸

🍀 ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - ఆమెనే గంగాదేవి.

💢 పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.☸ HDC☸

🍀 చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.☸ HDC☸

🌷 వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.☸ HDC☸

🍀 " పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.☸ HDC☸

💢 ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.☸ HDC☸

🍀 " వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.

🌷 అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి !' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.☸ HDC☸

💢 " ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.☸ HDC☸

🌷 ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

🍀 వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.

విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.☸ HDC☸

🌷 ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.🌷
Read More

వైశాఖ పురాణం - హిందూ ధర్మచక్రం.🌷 🍀 20వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి 🍀వైశాఖ పురాణం - హిందూ ధర్మచక్రం.🌷

🍀 20వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి 🍀

🌷 నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము.

☘ పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.

🌷 వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.

☘ రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.

🌷 బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.

☘ నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.

🌷 అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.

☘ నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.

🌷 రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.

☘ రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.

🌷అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.
Read More

శనిమహాదశ 19సంవత్సరాలలో అంతా అర్ధం అవుతుంది....!!

శనిమహాదశ 19సంవత్సరాలలో అంతా అర్ధం అవుతుంది....!!
వింశోత్తరీ దశా విధానంలో శని దశ 19సంవత్సరాలు ఉంటుంది. అతి పెద్ద దశ అయినశుక్ర దశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ.సామాన్యంగా శని దశ అంటే మనకు భయంఉంటుంది. అది చాలా వరకూ నిజమే.
సహజజ్యోతిశ్చక్రములో ఈయనకు 10,11 స్థానములు అయిన మకరం కుంభం స్వక్షేత్రములు. కనుక కర్మ, లాభ స్థానములకారకత్వములు ఈయనకు ఉంటాయి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.అనుభవించాల్సిన కర్మను అనుభవింప జేయటం, ఇవ్వ వలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు.ఈయన యొక్క సహజ లక్షణాలైనబద్ధకం, సోమరితనం, పనులు కాకపోవటం, నిరాశా నిస్పృహలు, నరాల, ఎముకల రోగాలు, పెద్దల మరణాలు,చికాకులు, అంగ వైకల్యం కలగటం, ఏక్సిడేంట్లు కావటం మొదలైనవి జరుగుతాయి. చర రాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశ సాధారణంగా అనేక బాధలను ఇస్తుంది. మేషరాశి వారు ఏలినాటి శని బాధలకు ఎక్కువగా గురి అవుతారు. ఇది చర రాశి. చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు.
సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు.
‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు.ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.
శని దశ తరువాత మానవుల అధీనంలో పెద్దగా ఏమి లేదని మనిషి అర్థంచేసుకుంటాడు.]
Read More

మక్కా లో కనిపించే శివలింగము

మక్కా లో కనిపించే శివలింగము

Read More

వైశాఖ పురాణం -వైశాఖ పురాణం -

🌷 23వ అధ్యాయము - కిరాతుని పూర్వజన్మ 🌷

🍀 నారదుడంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

🌷 కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

🍀 గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

🌷 శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

🍀 కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

🌷 అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

🍀 నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.

🌷 అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

🍀 ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

🌷 ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

🍀 ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

🌷 ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.

🍀 నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

🌷 అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.
Read More

హనుమాన్ జయంతి - హిందూధర్మచక్రం.హనుమాన్ జయంతి - హిందూధర్మచక్రం.
ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ... ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో ... అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే ... ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, 'పుంజికస్థల'అనే అప్సరస ... బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన 'వానర స్త్రీ'గా జన్మించమని శపించాడు.

తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ముడైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో 'పుంజికస్థల'భూలోకాన 'అంజనాదేవి'గా జన్మించి, కాలక్రమంలో 'కేసరి'అనే వానరుడిని వివాహమాడింది. శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్ధించింది.

ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ - విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో , వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు 'వైశాఖ బహుళ దశమి' రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.

తల్లి ఆలనాపాలనలో పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి 'ఎడమ దవడ'కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు.

అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ ... లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను ... వారధి నిర్మించడంలోను ... యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు 'సంజీవిని' పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం.

'త్రిపురాసుర సంహారం' సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు ... ఆంజనేయస్వామిగా అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్టపడతారు.

ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది ... ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన ఈ హనుమజ్జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం ... ఆకు పూజలు చేయించడం ... ఆయనకి ఇష్టమైన 'వడ' మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం ... హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

హనుమాన్ జయంతి:

యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.

విశేషాలు:

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:

తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది

కలువలు:

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

పంచముఖ హనుమాన్:

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలాచేయాలి?:

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత:

హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది. అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది.

వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా "జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర " వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు. మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే 'మూడవ దోహా' ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది. చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి. 14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి.

మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు. 11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది. 16వ మరియు 17 ఛౌపయిస్ చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు. 20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. 24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?

ఈ ఆనుమానం, సందేహం చాలామందికి వుంది. దీనికో పౌరాణిక కధ వుంది. రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.

ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.

ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.

అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.

ఇంకొక విషయం తెలుసా ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.
Read More

ఆంజనేయు స్వామి గురించి పూర్తి సమాచారం.ఆంజనేయు స్వామి గురించి పూర్తి సమాచారం.


జననం: వైశాఖ మాసం , బహుళ దశమి

నివాస ప్రాంతం : కిష్కింధ

ఇతర పేర్లు: వాయుపుతృడు,అంజనీసుతుడు ఇంకా చాలా

వృత్తి : అష్టసిద్ధులు, వ్యాకరణ పండితుడు

ప్రసిద్ధి : శ్రీరామబంటు

మతం : వైష్ణవం

భార్య / భర్త సువర్చల

పిల్లలు : మత్సవల్లభుడు

తండ్రి : కేసరి - వాయుదేవుని అనుగ్రహము

తల్లి : అంజనీదేవి

🌷🍀🌷 హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

🌷🍀🌷 వానర జాతి 🌷🍀🌷

ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.

🌷🍀🌷 వివిధ గాధలు 🌷🍀🌷

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.

🌷🍀🌷 జననం, బాల్యం 🌷🍀🌷

సూర్యుని పండు అని భ్రమపడుతున్న హనుమంతుడు

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది.శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాదనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

🌷🍀🌷 జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

🌷🍀🌷 ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.

🌷🍀🌷 వజ్ర ఘాతం 🌷🍀🌷

ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు , మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.

అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ , ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని , మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.

🌷🍀🌷 విద్యాభ్యాసం 🌷🍀🌷

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీర్యలు చింపివేయడం , అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.

🌷🍀🌷ఉద్యోగం 🌷🍀🌷

విద్యముగిసింది. ఇక ఉద్యోగం వితుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.

🌷🍀🌷 వాలి సుగ్రీవులకు వైరం 🌷🍀🌷

వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయవి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధవచ్చి గలాబా సౄష్టిచాడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయవికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయప్ది పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో " నువ్వు ఇక్కడే నాకోసం వేచు ఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను. " అని బిలంలోకి దూరాడు. ఏడాది పాతు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయతకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసు విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి.అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.

🌷🍀🌷 హనుమంతుడి మత్రిత్వం 🌷🍀🌷

నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడింతో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశౄంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని సుగ్రీవుడికి ఆ సలహా నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.

🌷🍀🌷 రామ లక్ష్మణులతో స్నేహం 🌷🍀🌷

రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారి ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.

హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిధి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు" చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తూంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేరపిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.

హనుమంతుడి దళంలో అంగదడుకూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో కదలలేని స్థితికి చేరుకొన్నారు.

🌷🍀🌷 స్వయంప్రభా సర్శనం 🌷🍀🌷

డస్సి పోయి ఉన్న వారికి ఒక బిలం , ఆ బిలంలోనుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉన్నది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వౄత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడుగనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను.కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషన్నవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.

🌷🍀🌷 కిష్కింధ కాండ 🌷🍀🌷

సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి

వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.

రాముని చేత వాలి హతుడవ గా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.

వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.

హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.

🌷🍀🌷 సుందర కాండ 🌷🍀🌷

అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు

హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.

హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

🌷🍀🌷 యుద్ధకాండ 🌷🍀🌷

ఇంద్రజిత్తు వేసిన బాణానికి గాయపడ్డ లక్ష్మణుడు

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.

వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.

రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు.
Read More

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు* 💢నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు* 💢


01. *రవి[సూర్యుని]* *తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ*
.
02. *చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి*
.
03. *కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి*

04. *బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి*

05. *గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి*

06. *శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి*

07. *శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి*

08. *రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి*

09 *కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి*

*నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి*

🌝 *రవి*
జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!!
తమో‌రిం సర్వపాపఘ్నం!
ప్రణతోస్మి దివాకరం !!

🌜 *చంద్ర*
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

🔴 *కుజ*
-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

💚 *బుధ*--
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం

💛 *గురు*
- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

⚪ *శుక్ర*
-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం

⚫ *శని*
- నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

🐍 *రాహు* - అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

🐍 *కేతు*
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్.
.......✍ *హిందూ ధర్మచక్రం*☸
Read More

శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸

దేవ వ్రతుడు ( భీష్ముడు )

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు. ☸ HDC☸

అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది. ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.☸ HDC☸

🍀 ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - ఆమెనే గంగాదేవి.

💢 పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.☸ HDC☸

🍀 చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.☸ HDC☸

🌷 వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.☸ HDC☸

🍀 " పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.☸ HDC☸

💢 ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.☸ HDC☸

🍀 " వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.

🌷 అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి !' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.☸ HDC☸

💢 " ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.☸ HDC☸

🌷 ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

🍀 వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.

విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.☸ HDC☸

🌷 ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.🌷
Read More

అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ........!!అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ........!!

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.
అర్ధనారీశ్వరుడు -
లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.
అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు ఆది దంపతులు - జగత్పితరులు
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు
బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.
సృష్టి ఆవిర్భావం
స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.
లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా. -
తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . అందుకే " అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !. అంటుంది శ్లోకము
Read More

పాదాల మండపంపాదాల మండపం

కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .


ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయి .స్వామివారు కొండ దిగి వచ్చి పాదరక్షలు వేసుకొని అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి మరల కొండ ఎక్కే వేళా పాదరక్షలను స్వామి వారు ఇక్కడ వదిలి వెళ్ళతరాని పురాణ ఇతిహాసం

పాదాల మండపం తరువాత ముందుగా సోపాన మార్గంలో కనిపించే ప్రధమ గోపురాన్ని `మొండి గోపురం`అని అంటారు .ఇది విజయనగర రాజుల కాలం నాటిది .పిడుగు పడి శిధిలమైనది .తి.తి.దే వారు 1982 సo,,లో పుననిర్మానం చేశారు .దిన్ని సాళువ నరసింహరాయలు కట్టించాడు .ఇది పాదాల మండపం దాటగానే ఉండే గోపురం

మొదట్లో స్వామి వారికీ సాగిలబడి మొక్కుతున్నట్లు ఉన్న శిల్పలు ఉన్నాయి .వీటిలో పెద్దది కొండయ్య కుమారుడు

లకుమయ్యది
Read More

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రంశ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం

1::ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం


2::భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్

3::భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్

4::కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్
జయశ్రీ సమేతం భజే రామదూతమ్

5::చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం
భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్

6::రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే

7::ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్

8::మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం
మహారోగపీడాం మహతీవ్రపీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ

9::సుధాసింధు ముల్లంఖ్యనాధో ప్రదీప్త
స్సుధా చౌషధీస్తా ప్రగుప్తప్రభావా
క్షణద్రోణశైలస్య సారేణసేతుం
వినా భూస్వ్యయం కస్సమర్థః కపీంద్రాః

10::నిరాతంక మావిశ్యలంకాం విశంకో
భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం
విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్

11::రమానాధరామా క్షమానాధరామా
మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం
విపాత్యప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా

12::జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢా గాఢప్రతాపే
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురుశ్రీ హనూమాన్ ప్రభోమే దయాళో

13::మహాయోగినోం బ్రహ్మరుద్రాదయోవా
నజానంతి తత్త్వం నిజం రాఘవస్య
కధం జ్ఞాయతే నీద్పషేనిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే |13|
14::నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం

15::నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం

16::హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః
పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో
సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]
Read More

ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు.......!!ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు.......!!

1.సోమనాథుడు - - విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్>> (పొగడ మొక్క).

2.మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్>> (తెల్ల జిల్లేడు మొక్క).


3.మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్>>. (ఆకాశమల్లి మొక్క).

4.ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్>>> (సంపంగి మొక్క).

5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్>> (గరిక లేక రుద్రాక్ష మొక్క).

6.భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర>>> ( నల్లకలువ మొక్క).

7.రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు>> (మల్లె మొక్క).

8.నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర>> (గోరింట మొక్క).

9.విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్>>> (మారేడు మొక్క).

10.త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర>>> (మరువము మొక్క).

11.కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్>>> (తుమ్మి మొక్క).

12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర>>> (గన్నేరు మొక్క).
Read More

ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా...........?ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా...........?
శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో
మీకు తెలుసా.........?

అయితే ఒక్కసారి దీనిని చదవండి.


దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.

కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది.

క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.

హరిహరాదుల క్షేత్రం
*******************
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.

చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో
ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .

వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన
శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
Read More

జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?


హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం అని కూడా పిలుస్తారు. అయితే ఇలా జంధ్యం ధ‌రింప‌జేయ‌డం వెనుక మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ఉప‌యోగ‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


హిందువులు పాటించాల్సిన 16 సంస్కారాల్లో 10వ సంస్కారంగా జంధ్యం ధ‌రించ‌డాన్ని చెబుతారు. జంధ్యం ధ‌రించిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ట‌. వారు అమిత‌మైన తెలివితేట‌ల‌ను ప్ర‌దర్శిస్తార‌ట‌. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌వ‌ట‌.

జంధ్యం ధరింప‌జేసే స‌మ‌యంలో నేల‌పై కాళ్ల‌ను మ‌డ‌త పెట్టి కూర్చుంటారు. ఇలా కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌.


జంధ్యంలో ఉండే మూడు దారాలు ముగ్గురు దేవ‌త‌ల స్వ‌రూపాల‌ని భావిస్తారు. ఒక‌రు శ‌క్తినిచ్చే పార్వ‌తి, మ‌రొక‌రు ధ‌నాన్నిచ్చే ల‌క్ష్మి, ఇంకొక‌రు చ‌దువునిచ్చే స‌ర‌స్వ‌తి. ఈ క్ర‌మంలో జంధ్యం ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ముగ్గురు దేవ‌తల అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చ‌ట‌. దీంతో జీవితం ఎంతో సుఖ‌మ‌యంగా ఉంటుంద‌ట‌.

జంధ్యం ధ‌రించిన వారికి నెగెటివ్ ఆలోచ‌న‌లు రావ‌ట‌. వారు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థాన్నే క‌లిగి ఉంటార‌ట‌. దీనికి తోడు వారికి పాజిటివ్ శ‌క్తి కూడా అందుతుంద‌ట‌.

జంధ్యం ధ‌రించిన వారికి బీపీ వంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ వారు ముందుంటార‌ట‌. ఎల్ల‌ప్పుడూ విజ‌యాన్ని సాధిస్తార‌ట‌.

శుభకార్యాలలో, మామూలు సమయాల్లో జంధ్యాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్టు వేసుకుంటారు. మలమూత్రం చేసేట‌ప్పుడు మెడలో దండ లాగా ఉండే విధంగా వేసుకుంటారు. అలా జంధ్యం వేసుకోకుంటే వారికి అరిష్టం క‌లుగుతుంద‌ని చెబుతారు.
Read More

శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸శ్రీ మహాభారతంలో కథలు - హిందూ ధర్మచక్రం☸

దేవ వ్రతుడు ( భీష్ముడు )

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు. ☸ HDC☸

అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది. ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.☸ HDC☸

🍀 ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - ఆమెనే గంగాదేవి.

💢 పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.☸ HDC☸

🍀 చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.☸ HDC☸

🌷 వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.☸ HDC☸

🍀 " పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.☸ HDC☸

💢 ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.☸ HDC☸

🍀 " వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.

🌷 అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి !' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.☸ HDC☸

💢 " ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.☸ HDC☸

🌷 ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

🍀 వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.

విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.☸ HDC☸

🌷 ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.🌷
Read More

*పురాణ విజ్ఞానం* - *హిందూ ధర్మచక్రం* .

*పురాణ విజ్ఞానం* - *హిందూ ధర్మచక్రం* .
1. రామాయణంలో రాముని భార్య పేరు సీత. మరి లక్ష్మణ - భరత - శతృఘ్నుల భార్యల పేరు ఏంటి ?
జ.*లక్ష్మణుని భార్య ఊర్మిళ* . *భరతుని భార్య మాండవి* . *శత్రుఘ్నుని భార్య శ్రుతకీర్తి* .
*వీరంతా సీతమ్మవారి సొంత సోదరీలు కారు*.
2. రాముని కులగురువు ఎవరు ?
*వశిష్ఠుడు*.
3. దశరథుని తండ్రి & తాతల పేరు ఏంటి ?
*రఘుమహారాజు తాత*. *అజ మహారాజు తండ్రి*
4. అయోధ్యలో ఉన్న నది పేరు ఏమిటి ?
*సరయూ నది* . *ఇది గంగానదికి ఉపనది* .
5. బాలకాండ ప్రకారం విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామ లక్ష్మణులు ఎంతమంది రాక్షసులను హతమార్చిరి ?
*తాటకి సుబాహువులు* మొదలగువారు.
సరైన సమాధానాలు ఇచ్చినవారికి అభినందనలు.
మళ్ళి రేపు కలుద్దాం ...✍ *మీ హిందూ ధర్మచక్రం* .☸
Read More

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?


కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.అందరికి పంపించండి
Read More

బ్రాహ్మి ముహూర్తంబ్రాహ్మి ముహూర్తం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచిచదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యంఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతాచెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లోమనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారిసంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపునుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartmentculture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు.వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.
Read More

దర్భ యొక్క ప్రాముఖ్యందర్భ యొక్క ప్రాముఖ్యం

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే:సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు).కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనఃనాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరంఅని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ దాతయగునె వసుధలోనఅవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచినవిశ్వదాభిరామ వినర వేమ!అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణింఅన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజనుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.
Read More

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.
మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.

8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
Read More

అఖండ భారతం ! అలాంటి తల్లి .. ఎందుకు ముక్కలైంది ?అఖండ భారతం ! అలాంటి తల్లి .. ఎందుకు ముక్కలైంది ?

ఒకప్పుడు మన దేశం అఖండ భారత దేశంగా యుండేది.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేడి నడక నేర్పింది నా తల్లి భారతి. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ భారతం, ఇలాంటి తల్లి భారతి ఎందుకు ముక్కలైంది. కాదు.! ముక్కలు చేసారు. చేయడానికి కారణం ఎవరు కారకులు ఎవరని మనందరికీ తెలిసిందే.
తన స్వంత ప్రాభల్యం కోసం తల్లి భరతమాతను ముక్కలు చేసారు. ఒకప్పటి భరతమాత భూభాగం 39,47,700 చదరపు కిలో మీటర్లు కాగ ప్రస్తుతం మనకున్న భూభాగం 32,93,200 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం.


మనము కోల్పోయిన భూ భాగ ప్రాంతాలు
• గాధారదేశం ( ఆఫ్ఘనిస్తామ్ )
విడిపోయిన సంవత్సరం 1739
చదరపు కిలో మీటర్లు 6,52,100

• సింహళము ( శ్రీ లంక )
విడిపోయిన సంవత్సరం 1912
చదరపు కిలో మీటర్లు 65,600

• బ్రహ్మదేశం ( మయన్మార్ )
విడిపోయిన సంవత్సరం 1937
చదరపు కిలో మీటర్లు 6,76,600

• సింధుదేశం ( పాకిస్తాన్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 8,80,300

• వంగదేశం ( బంగ్లాదేశ్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,42,600

• నేపాలం ( నేపాల్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,47,200

• భూటాన్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు46700
• పాక్ ఆక్రమిత కాశ్మీర్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 78,000

• త్రివిష్టానం ( టిబెట్ )
విడిపోయిన సంవత్సరం 1960
చదరపు కిలో మీటర్లు 12,21,000

• చైనా ఆక్రమిత లడర్
విడిపోయిన సంవత్సరం 1962
చదరపు కిలో మీటర్లు 37,600

కోల్పోయిన భూభాగం మొత్తం
39,47,700

ప్రస్తుత భూభాగం భారతదేశం ది
32,93,200

మనం కోల్పోయిన భూభాగం అంతా ఇంతా కాదు.ఒక్కసారి ఆలోచించండి. మనం మన ఎకరం పొలం దగ్గర గొడవ ఐతే గొడ్డల్లు, గడ్డ పారలు పట్టుకుని గొడవకు దిగుతాం. ఇది భరతమాత భూభాగమే మనం కోల్పోయింది భరతమాత భూభాగమే. కానీ దేశభక్తి ఉన్నోళ్ళకే ఈ బాధ అర్ధం అవుతుంది.

దేశభక్తి అంటే ప్రతీ ఒక్క భారతీయుడికి పుట్టుకతో రావాలి. ఈనాడు మన ధౌర్భాగ్యం ఏంటంటే, కన్నతల్లికి జై కొట్టడానికి కూడా వీళ్ళు అదే “భారత్ మాతా కీ జై” అనడానికి నోరు రావడం లేదు.

ఇక్కడి తిండి తింటారు, ఇక్కడి గాలి పీలుస్తారు, ఇక్కడే జీవిస్తారు కానీ కన్న తల్లి ఋణం తీర్చుకోరు. ఇలాంటి వాళ్ళ వల్లే ఈ తల్లి భారతి ఇన్ని ముక్కలు అయ్యింది. ఇంకా ఇప్పటికీ చేపకింద నీరులా ఎన్నో కుతంత్ర చర్యలు మన దేశాన్ని సర్వ నాశనం చెయ్యడానికి చూస్తున్నాయి. అదీ మత పరమైన వివక్షతో ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి. వీటిని ఆపడం భారతీయుడిగా మనందరి ప్రథమ లక్షణం.
Read More

నేను నేటి నుండి అమెజాన్ ఆన్ లైన్ కొనుగోళ్లను బహిష్కరిస్తున్నాను.. మీరంతా ఇదే మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను.ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశం మనది.. మూడో అతిపెద్ద మతం హైందవం.. కోట్లాది మంది భారతీయులు, హిందువుల విశ్వాసాలను అవమానించింది అమెజాన్ కంపెనీ..
గణనాథుని చిత్రాలతో ఉన్న డోర్ మాట్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.. అమెజాన్ కంపెనీ ఇదే దుస్సాహసాన్ని అన్యమత దైవాలతో ప్రదర్శించగలదా?..
గతంలో కొన్ని దేశాల్లో హిందూ మత విశ్వాసాలతో ఇదే రకంగా వ్యవహరించిన ఘటనలు జరిగాయి.. మనలో ఐక్యత, చీము నెత్తురు లేక పోవడం వల్ల ఇంకా జరుగుతూనే ఉంటాయి..
నేను నేటి నుండి అమెజాన్ ఆన్ లైన్ కొనుగోళ్లను బహిష్కరిస్తున్నాను.. మీరంతా ఇదే మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను.

Read More

జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం అని కూడా పిలుస్తారు. అయితే ఇలా జంధ్యం ధ‌రింప‌జేయ‌డం వెనుక మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ఉప‌యోగ‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులు పాటించాల్సిన 16 సంస్కారాల్లో 10వ సంస్కారంగా జంధ్యం ధ‌రించ‌డాన్ని చెబుతారు. జంధ్యం ధ‌రించిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ట‌. వారు అమిత‌మైన తెలివితేట‌ల‌ను ప్ర‌దర్శిస్తార‌ట‌. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌వ‌ట‌.

జంధ్యం ధరింప‌జేసే స‌మ‌యంలో నేల‌పై కాళ్ల‌ను మ‌డ‌త పెట్టి కూర్చుంటారు. ఇలా కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌.

జంధ్యంలో ఉండే మూడు దారాలు ముగ్గురు దేవ‌త‌ల స్వ‌రూపాల‌ని భావిస్తారు. ఒక‌రు శ‌క్తినిచ్చే పార్వ‌తి, మ‌రొక‌రు ధ‌నాన్నిచ్చే ల‌క్ష్మి, ఇంకొక‌రు చ‌దువునిచ్చే స‌ర‌స్వ‌తి. ఈ క్ర‌మంలో జంధ్యం ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ముగ్గురు దేవ‌తల అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చ‌ట‌. దీంతో జీవితం ఎంతో సుఖ‌మ‌యంగా ఉంటుంద‌ట‌.

జంధ్యం ధ‌రించిన వారికి నెగెటివ్ ఆలోచ‌న‌లు రావ‌ట‌. వారు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థాన్నే క‌లిగి ఉంటార‌ట‌. దీనికి తోడు వారికి పాజిటివ్ శ‌క్తి కూడా అందుతుంద‌ట‌.

జంధ్యం ధ‌రించిన వారికి బీపీ వంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ వారు ముందుంటార‌ట‌. ఎల్ల‌ప్పుడూ విజ‌యాన్ని సాధిస్తార‌ట‌.

శుభకార్యాలలో, మామూలు సమయాల్లో జంధ్యాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్టు వేసుకుంటారు. మలమూత్రం చేసేట‌ప్పుడు మెడలో దండ లాగా ఉండే విధంగా వేసుకుంటారు. అలా జంధ్యం వేసుకోకుంటే వారికి అరిష్టం క‌లుగుతుంద‌ని చెబుతారు.
Read More

చిదంబర రహస్యంచిదంబరం
తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు. దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు. ముఖ్యంగా చోళులు. శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం, వెలకట్ట లేనిది. ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.
ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం. అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి. అలాంటి ఎన్నో కోవెలలో ఇప్పుడ నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం గురించి తెలుసుకుందాము.
నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ ప్రదేశానికి కోయిల్, తిల్లయ్ వగైరా రకరకాల పేర్లు. ఇదివరకు ఈ ప్రదేశంలో తిల్లయ్ వృక్షాలు ఎక్కువగా వుండేవట. అందుకని ఆ పేరు. ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారానుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారు. పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి అనే ఐదు క్రియలను ఉద్దీపనం చేస్తారు.
ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాలు పైన 13 పెద్ద రాగి కలశాలతో విశాలమైన వాకిళ్ళతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారుతూ వుంటాయి.
ఈ దేవాలయంలో ఐదుసభలున్నాయి - చిత్రాబంళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ. చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వున్నాడు. చిత్రాంబళానికి ముందు వున్నది పొన్నాంబళం. ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తారు. పెరాంబళం అంటే దేవ సభ. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు వుంటాయి. నృత్యసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వతాండవ నృత్యం చేశారు. ఇక్కడ స్వామి నృత్య భంగిమ విగ్రహం ప్రతిష్టించబడింది. రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారు. ఆణి, మార్గళి మాసాలలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని ఇతర దేవతలను ఐదు రధాలలో ఊరేగించిన తర్వాత ఇక్కడ విశ్రమింప చేస్తారు. మర్నాడు పూజాదికాల తర్వాత మధ్యాహ్నం స్వామిని, అమ్మవారిని నాట్యరీతిలో చిత్రాంబళానికి తీసుకు వెళ్తారు. ఈ వైభవాన్ని చూసితీరవలసినదేగానీ మాటలలో చెప్పనలవికాదంటారు చూసిన భక్తులు.
ఇక్కడ అమ్మవారు శివ కామ సుందరీదేవి. వెలుపలి ప్రాకారంలో ఈవిడకి ప్రత్యేక ఆలయం వున్నది. ఇక్కడే చిత్రగుప్తుని మందిరమున్నది. ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ బహు సుందరం.
నటరాజ ఆలయంలో తప్పక చూడవలసిన స్వామి మూలాట్టనేశ్వరార్. ఈయన స్వయంభూ. ఈ స్వామికి ఈ పేరు రావటానికి కారణం అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలో గల స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనం కావడమేనని చెబుతారు. ఇక్కడ అమ్మవారు ఉమాదేవి. 8 అడుగుల ఎత్తు వున్న ముక్కురుని వినాయకర్, ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడేకాకుండా, ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడదగ్గవి.
ఆలయ విశేషాలు
నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో.
రవాణా సౌకర్యాలు
ఈ ఆలయం చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగున్నాయి. చెన్నై, తిరుచిరాపల్లి మెయిన్ రైల్వే లైనులో చిదంబరం స్టేషనులో రైలు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఆలయం వుంది. తమిళనాడు రాష్ర్టంలోని వివిధ ప్రదేశాలనుంచి బస్సు సౌకర్యం కూడా వుంది.
ఇతర సౌకర్యాలు
వసతికి ఆలయ సమీపంలోనే హోటళ్ళున్నాయి. అద్దె రూ. 300 నుంచీ పైన. చాలాహోటల్స్ లో రూమ్ సర్వీసు వుండదు. భోజనానికి ఆలయ సమీపంలోనే కుమరన్ భవన్ (మధ్యాహ్నం 12-30 నుంచీ 3 గం. ల దాకా మాత్రమే భోజనం దొరుకుతుంది –మిగతా సమయాలలో టిఫెన్లు మాత్రమే వుంటాయి), హోటల్ శ్రీ కృష్ణా వున్నాయి (ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం వుండదు అయితే రైస్ ఐటమ్స్ లభిస్తాయి).
తమిళనాడులో ఏ ఆలయంలోనైనా అర్చన టికెట్ల ధర తక్కువ వుంటుంది గానీ నైవేద్యానికి తప్పనిసరిగా ఫలములుండాలి (కొబ్బరికాయైతే మంచిది. వేరే ఊరిలో కొబ్బరి ఏంచేసుకోవాలంటారా ప్రసాదం ఎపరికైనా ఇవ్వచ్చు. స్వామి దగ్గర మనం తీసుకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారంటే మనకీ సంతోషం కదా). అది లేకపోతే అర్చన షోడశ నామాలకే పరిమితమవుతుంది.
సాయంత్రం 6 గం. లకి చాలా ఆలయాలలో అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో చందనాభిషేకం తర్వాత దైవ ప్రతిమ కళ్ళు, కనుబొమలు, నోరు దగ్గర చందనం తుడుస్తారు. అప్పుడు దేవుళ్ళ దివ్య సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది.
చిదంబర రహస్యం

******************
చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేసారు. ఈ విషయాన్ని తన గ్రంధం “తిరుమందిరం” లో ప్రసిద్ద తమిళ స్కాలర్ “తిరుమూలర్” చెప్పారు.

ఆలయ విశేషాలు తెలుసుకుందాం.!.

ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత కేంద్ర బిందువుగా ఉంది. “పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమి ) కి ప్రతీక అనీ అంటారు.

ఈ ఆలయం ఒక అధ్భుతం…అయితే ఇక్కడ విచిత్రమైన అధ్భుతం ఏమిటంటే. . . !

ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. అవునండీ.! అవును. . 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద ఉన్నాయి… ఇది ఆశ్చర్యం కదూ.!

చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడికి నవ రంద్రాలు ఉంటాయి.చిదంబరం దేవాలయం పైన 21600 బంగారపు రేకులు తాపడం చేసారు. మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు. ( 15*60*24 = 21600 ). ఆ బంగారపు రేకులు తాపడం చెయ్యడానికి 72000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది…దేవాలయంలో ‘పొన్నాంబలం’ కొంచెం ఎడమ వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి ” పంచాక్షర పడి ” ఎక్కాలి… అది న+మ+శి+వ+య. పంచాక్షరిని సూచిస్తుంది.”కనక సభ” లో నాలుగు స్థంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు.

పొన్నాంబళంలో 28 స్థంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు – శివారాధనా పద్దతులు. ఇవి 64 X 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని ఋజువు ఇది. అంతేకాదు అడ్డుదూలాలు రక్త ప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్థంభాలూ 6 శాస్ర్తాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మంటపంలోని 18 స్ధంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజ నృత్యాన్ని పాశ్చాత్యులైన శాస్త్రవేత్తలు “కాస్మిక్ డ్యాన్స్” అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్ర్త సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.చూసారుగా దీని వెనుక ఎంతటి నిగూఢార్ధం దాగి ఉందో. .
రథం
Read More

Powered By Blogger | Template Created By Lord HTML