ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 29 March 2016

తండ్రులు-పుత్రులుతండ్రులు-పుత్రులు

జన్మనిచ్చిన తండ్రితో సమానంగా మరొక నలుగురు తండ్రివలె పరమహితాన్ని కాంక్షిస్తూ పరమాదరణీయులై ఉంటారని
జనితా చోపనీతాచ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
అన్నదాతా భయత్రాలూ పంచైతే పితరః స్మృతా:॥


అనే శ్లోకం పేర్కొంటున్నది. పీటల మీద కూర్చొని వటువుకు ఉపనయనం చేసిన వ్యక్తి, విద్యాదా నం చేసిన గురువు, ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి సంరక్షకుడిగా నిలిచిన వ్యక్తి, ప్రాణభయం నుంచి కాపాడిన వ్యక్తి (ఈ నలుగురు) తండ్రితో సమానంగా భావించి గౌరవించవలసిన వారని నీతిశాస్త్రం పేర్కొంటున్నది.

కన్నతండ్రితో సమానమైన స్థానాన్ని అన్నకు విద్యనేర్పిన గురువుకు కూడా ఇవ్వాల ని అందుకే ధర్మశాస్త్రం తండ్రిని అన్నను గురువును కలిపి ముగ్గురు తండ్రులను ఉపదేశిస్తున్నది. ఈ విషయాన్ని ధర్మాచరణ పరులందరూ గుర్తించాలి.

జ్యేష్ఠో భ్రాలూచాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మేచ పరివర్తనః॥

అని శ్రీరామచంద్రుడు వాలితో పలికెను. అట్లే తమ్ముణ్ణి సద్గుణవంతుడైన శిష్యుణ్ణి కూడా పుత్రుడితో సమంగా భావించాలి అని ధర్మశాస్త్రమే ప్రబోధిస్తున్నది.

యవీయానాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః
పుత్రవత్ తేత్రయః చింత్యాః ధర్మశ్చైవాత్ర కారణమ్॥

అని శ్రీరామచంద్రుడు వాలితో పలికిన విషయాన్ని శ్రీ మద్రామాయణంలోని కిష్కింధకాండలో దర్శించవచ్చు. ఓ వాలీ! పుత్రసముడైన తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టావు. సనాతన ధర్మాన్ని వది లి సోదరుడైన సుగ్రీవుని భార్యను అతడు జీవించియుండగానే పాపాత్ముడవైన నీవు కామం వల్ల కోడలితో సమానంగా భావించాల్సిన రుమను పొందావు

అసత్యం ధరమానస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తసేకామాత్ స్నుషాయాం పాపకర్మకృత్॥

అని వాలికి శ్రీరామచంద్రమూర్తి ధర్మోపదేశం చేసే సందర్భంలో ఎవరెవరు తండ్రితో సమానమైన వారో ఎవరెవరిని పుత్ర సమానులుగా భావించాలో తెలియపరిచెను.

ప్రస్తుత కాలంలో తండ్రీ కొడుకుల మధ్యనే సత్సంబంధాలు కొరవడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అన్నకు, పోషకుడికి, సంరక్షకుడికి, ప్రాణభయం నుంచి కాపాడిన వారికి కూడా దీర్ఘకాలం గౌర వ మర్యాదలను ఇవ్వాలని చెబితే పాటించేవారు ఎవరు? అనే సందేహం కలగొచ్చు. ధర్మమేంటో చెబితే ఒకరు కాకపోతే మరొకరో ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా పాటించే అవకాశం ఉంటుందని భావించడంలో తప్పులేదు కదా.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML