గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 29 March 2016

సూర్య గ్రహణంసూర్య గ్రహణం

చంద్రుడు ఎప్పుడైతే భూమికి,సూర్యునికి మధ్యగా ప్రయాణిస్తాడో అప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఐతే గ్రహణం ఏర్పడటానికి మాత్రం సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖ లో ఉండాలి.
సూర్య గ్రహణం అమావాస్య నాడు ఏర్పడుతుంది.కానీ ప్రతి అమావాస్య రోజూ సూర్య గ్రహణం ఏర్పడదు.దానికి కారణం ప్రతి అమావాస్య రోజూ భూమి,చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో లేకపోవడమే.సూర్య గ్రహణం ఏర్పడిన సందర్భం లో సూర్యుని వైపు ఉన్న చంద్రుని భాగాన్ని కాంతి పూర్తిగా ఆక్రమిస్తుంది. అంటే భూమి వైపు ఉన్న చంద్రుని భాగం పూర్తిగా చీకటి అనమాట (చంద్రుడు కనిపించని రోజునే కదా మనం అమావాస్య అంటాం!)


సూర్య గ్రహణం ముఖ్యం గా నాలుగు రకాలుగా ఏర్పడుతుంది.

1) సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.

2) అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

3) సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.

4) పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

09-03-2016న పాక్షిక సూర్యగ్రహణం :-
స్వస్తిశ్రీ మన్మధనామ సం.ర మాఘ బ.అమావాస్య తేదీ 09-03-2016 బుధవారం పూర్వాభాద్ర నక్షత్రయుక్త కుంభ మీన లగ్నములందు కేతుగ్రస్తము దక్షిణశరం నీలవర్ణము అపసవ్య గ్రహణము పాక్షిక కించిన్యూన పాదగ్రాస గ్రహణము సంభవించును.

స్పర్శ కాలము:- ఉ. 5-45 ని.లు
మధ్య కాలము:- ఉ.6-13 ని.లు
మోక్షకాలము:- ఉ.7-25 ని.లు
ఆద్యంత పుణ్యకాలము:- ఉ.1-40 ని.లు

వేధ ప్రారంభము :- ఇది ఖగ్రాస సూర్య గ్రహణము ( గ్రస్తోదిత ) కావున 8 వ తేది , మంగళవారము సూర్యాస్త సమయము నుండి గ్రహణ మోక్షము వరకు గ్రహణ వేధ నియమాలను పాటించాలి.

రాశుల వారిగా గ్రహణ ఫలితములు
మేష , వృషభ , కన్యా , ధనుస్సు ఈ రాశుల వారికి శుభ ఫలితము.

మిథున , సింహ , తులా , మకర ఈ రాశుల వారికి మిశ్రమ ఫలము.

కర్కాటక , వృశ్చిక , కుంభ , మీన ఈ రాశుల వారికి ఈ గ్రహణము అనిష్ట ఫలమును ఇచ్చును.

అనిష్ట ఫలము గల రాశుల వారు మరియు గర్భవతులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ గ్రహణమును చూడరాదు.

గ్రహణ కరి దినము :-
గ్రహణము మరుసటి రోజు అనగా తేది : 10-03-2016 , గురువారము - గ్రహణ కరి దినము.

పాక్షిక సూర్యగ్రహణం దక్షణ ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం పై కనిపించును.
ఈ గ్రహణం సుమారు 28 ని.లు మాత్రమే కనిపించును.

ఈ గ్రహణమును పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి, మీనరాశి వారు చూడకూడదు. గ్రహణానంతరము యధావిధిగా కార్యక్రమములను జరుపుకోవచ్చు.

గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, కేతు వెండి చంద్రబింబములను పూజించి, నెయ్యితో నిండిన కంచుగిన్నెను, వస్త్రములను, నువ్వులతో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలప్రదము. ఇష్టదేవతా మంత్రమును, గాయత్రీ మంత్రమును జపించవలయును. వానివలన మంత్రములు పరిశుద్ధమగును. జపం చేయకున్న మంత్రములు మాలిన్యమగును. వేదమంత్రమునకు మాలిన్యముండదు.

జాతాశౌచ మృతాశౌచములు కలిగియున్ననూ గ్రహణ స్నానాదికములు చేయవలయును.

గ్రహణ సమయమునందు సర్వ జలములు గంగా జలములు. సర్వ ద్విజులు వ్యాస భగవానులు. సర్వ దానములు భూదాన సమానమగును.

గ్రహణ సమయమున శయనించిన రోగము. మలమూత్ర విసర్జన, మైధునము చేసిన నరకము కలుగును.

గ్రహణమునకు ముందు వండిన వంటలను భుజించరాదు. ముడి పదార్థములు, పచ్చళ్ళు మొదలగు నిల్వ ఉంచిన పదార్ధములపై దర్భలను పరువవలెను.

గ్రహణము వదిలిన తరువాత శుద్ధ సూర్య బింబమును దర్శించుకుని, స్నానము చేసి వంటలు చేసుకొనవచ్చును. బాలలు, వృద్ధులు, అశక్తులు, పుత్రవంతులగు గృహస్థులు గ్రహణ ఘడియలు విడిచి భుజించవచ్చును.

గ్రహణ కాల దాన మంత్రము :-
మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! అను మంత్రముచే చదివి

గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమీయవలయును.

సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.

జ్యోతిష్య సలహాలు :
1) గర్భవతులు ప్రత్యేకించి గ్రహణ అనిష్ట ఫలము గల గర్భవతులు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాల పేరిట నిష్ఠావంతులైన బ్రాహ్మణులచే
" గర్భ రక్షణ స్తోత్రము " పారాయణము చేయించాలి.
2) పిల్లలు , వయో వృధ్ధులు ఉన్న వారు వారి పేరిట
" మృత్యుంజయ స్తోత్ర పారాయణము " చేయించాలి.
3) అందరూ ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
4 ) సూర్య గ్రహణ సమయంలో నర్మదా నదీ స్నానము అత్యంత పుణ్యదాయకం కావున నర్మదా నదీ స్నానము చేయాలి.వీలు కాని వారు స్నాన సమయంలో నర్మదా నదీ స్మరణం చేస్తూ స్నానమాచరించాలి.
వల్లూరి పవన్ కుమార్

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML