గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 March 2016

శ్రీ బమ్మెర పోతనామాత్య విరచిత భాగవత మహాకావ్యము లో అష్టమ స్కందము లోని గజేంద్రమోక్షము ఘట్టము లోని కొన్ని మధుర పద్యములు.శ్రీ బమ్మెర పోతనామాత్య విరచిత భాగవత మహాకావ్యము లో అష్టమ స్కందము లోని
గజేంద్రమోక్షము ఘట్టము లోని కొన్ని మధుర పద్యములు.


శ్రీ కృష్ణ పరమాత్మనే నమః

ఉ!! ఎవ్వనిచే జనించు జగ -- మెవ్వనిలోపల నుండి లీనమై
యెవ్వనియందుడిందు ? బరమేశ్వరుఁడెవ్వడు ? మూలకారణం
బెవ్వ ? డనాదిమధ్యలయుఁ -- డెవ్వడు ? సర్వముఁ దానైన వాఁ
డెవ్వఁడు ? వానినాత్మభవు - నీశ్వరు నే శరణంబు వేఁడెదన్ !!

తా !! ఎవనిచే ప్రపంచము బుట్టిపెఱిగి హరించుచుండునో ! ఎవ్వడు సమస్త మునకును
మూలకారణండునై ప్రభువై యుండునో, ఎవనికి చావు పుట్టుక అనునవి లేవో
ఎవ్వండు బరమాత్మ స్వరూపముగలవాడో అట్టి పరమేశ్వరుడు నన్ను కాపాడుట కొఱకు
శరతము వేడుకుందును.

క !! కలడందురు దీనులయెడఁ
గలడందురు పరమయోగి - గణములపాలన్
గలఁడందు రన్ని దిశలను
గలఁడు కలండనెండువాడు - గలఁడో ? లేఁడో ?

తా !!
ఆ పన్నులు, యోగులు, మున్నగువారియెడను, సమస్త దిక్కులందును, పరాత్పరుడు
నిండి యుండెనని పెద్దలందురు. అట్టి పలమేశ్వరుని గూర్చి నేనెన్ని రీతుల
బ్రార్ధించిననూ రాకయుండెను. అట్టి పరమాత్ముడు నాపాలిట నుండెనో లేదో
సందేహమగుచున్నది. ఉండినచో ---------.

శా !! లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె, బ్రాణంబులన్,
ఠావుల్దప్పెను, మూర్ఛవచ్చెఁ, దనువున్, - డస్సెన్ శ్రమం బయ్యెడిన్,
నీవో తప్పని తఃపరం బెఱుఁగ మ - న్నింపనుందగున్ దీనునిన్
రావేయీశ్వర ! కావవేవరద ! సంరక్షింపు భద్రాత్మకా !!

తా !! ఓ ఈశ్వరా, యింతవఱకును ధీరత్వముతో మొసలిఁతో బోరితిని.
నా బలము నశించినది.దీనిని గెలువగలనను ధైర్యము పోయినది.
నీవుదక్క నా కింకొక దిక్కులేదు. నేను ఇదివర కెన్ని నేరములు చేసితినో
వానిని క్షమించుము. ఓ భగవంతుడా ! నా వద్ద కేతెంచినా కష్టములను బాపి
నన్ను కాపాడుము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML