గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 March 2016

జ్ఞాన ప్రదాతగా సరస్వతీదేవి గాథ ...జ్ఞాన ప్రదాతగా సరస్వతీదేవి గాథ ...

పూర్వకాలంలో ఒక సారి సనత్కుమారుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి విపులంగా తెలుపమని కోరాడు. అప్పుడు బ్రహ్మ శ్రీకృష్ణుని సూచన మేరకు సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అని పురాణాలు చెబుతున్నాయి. అటు తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. పూర్వ భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని కోరింది. అనంతుడు కష్యపుతి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. అటు తరువాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదంబ సరస్వతిని స్మరించాడు. అలా ఆయన సరస్వతీదేవి దయను పొంది పురాణస్తూత్ర జ్ఞానాన్ని పొందాడు. వాసుడు కూడా వంద సంవత్సరాలపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడు అయ్యాడు. అటు తరువాతనే ఆయన వేదం విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని ప్రార్థించగా శివుడు కూడా దివ్యవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడట. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్య సంవత్సరాల పాటు వాగ్దేవిని ధ్యానించి ఆ తల్లి కరుణాకటాక్షాలతో శబ్దశాస్త్రం పొందగలిగాడు. అలాగే పొరపాటున గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్క మహర్షి తాను చదువుకున్న చదువంతా కోల్పోయాడు. అప్పుడు ఆయన శోకార్తుడై పుణ్యప్రతమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదంవేదాంగాలను చదివించాడు. కానీ జ్ఞాపకశక్తి లేని యాజ్ఞవల్క్యుడిని చూసి సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలిపాడు. యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ స్తుతిని క్రమం తప్పకుండా స్తుతించాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు భోధించే శక్తిని, గ్రంథరచనా శక్తి, ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమని సరస్వతీదేవిని ప్రార్థించాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాదిష్టాతృరూపిణి అయిన సరస్వతీదేవిని పదేపదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML