గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 March 2016

వృత్రాసురుడు -వృత్రాసురుడు -
సురాపానం చేసే శిరస్సు ఆడపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది.అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, మాసిక నియమం.


తన కుమారుడైన విశ్వరూపుడి మరణవార్త త్వష్ట ప్రజాపతికి తెలుస్తుంది. త్వష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించే కొడుకు కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞపరిసమాప్తి సమయానికి యజ్ఞ గుండం నుండి ఒక పెద్దరూపం ఆ యజ్ఞ గుండంలో నుండి బయటకు వచ్చింది. ఆ విధంగా పుట్టిన వేంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా వ్యాపించేసింది. బ్రహ్మాండం అంతా నిండి పోయింది కావున దానికి వృత్రాసురుడు అని నామకరణం జరిగింది. ఆ వృత్రాసురుడు ఆకాశాన్ని చప్పరించాడు, గ్రహాలను నాకాడు, ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని గర్జనచేశాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన సైన్యాన్ని అంతా తీసుకొని వృత్రాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. దిక్పాలురు వేసిన అస్త్రాలన్ని వృత్రాసురుడు గుర్రిటితో తీసుకొని నోటిలోవేసుకొని చప్పరించాడు.అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలొ పాలుపోక బ్రహ్మ వద్దకు వెళ్ళాడు.

అది చూసి నిశ్చేష్టులై ఏమి చేయాలొ తోచక మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ బాధ మొర పెట్టుకొన్నారు. ఆ ఆర్తత్రాణ పరాయణుడు గదా, శంఖ, చక్రముతో కౌస్తుభంతో, పద్మాలతో, శ్రీవత్సంతో, వనమాలతో వారికి ప్రత్యక్ష్యమైయ్యాడు అభయ ప్రకటన చేశాడు. వారి రాకకు కారణాన్ని వివరించమనగా జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. ఆప్పుడు మహావిస్ణువు వృత్రాసురుడి వధ దధీచి మహర్షి వెన్నుముక నుండి తయారు చేసిన వజ్రాయుధం వల్ల మాత్రమే జరుగుతుంది అని తెలిపాడు.

ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీ మహవిష్ణువు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి వెన్నెముక కోరవలసిందిగా చెబుతాడు. ఆ మాట విని ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించడం వల్ల మళ్ళి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంటుందని ఆలోచిస్తుండగా దిక్పాలురు శ్రీమహావిష్ణువు చెప్పినట్లు చేయవలసినదని, వచ్చిన బ్రహ్మహత్యపాతకం అశ్వమేధయాగం చేయడం వల్ల పోయేటట్లు తాము చేస్తామని ఊరట పరుస్తారు. ఇంద్రుడు దిక్పాలురతో దధీచీ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. దధీచీ మహర్షిని శరీరాన్ని కోరడానికి ఇంద్రుడు ముందుకు వెళ్లక పోవడం చూసి , దిక్పారులు ఇంద్రుడుని ముందుకు తోస్తారు. అప్పుడు ఇంద్రుడు వృత్తాంతాన్ని చెప్పి తనకు దధీచి శరీరాన్ని ఇవ్వవలసినదిగా కోరుతాడు. దధీచీ మహర్షి అప్పటికే రెండు సార్లు జన్మ పొందినవాడు. ఇదివరలొ అశ్వనీ దేవతలు దధీచి మహర్షీ వద్దకు వెచ్చి అశ్వశిరము అనే విద్య కోరుతారు, అప్పుడు దధీచీ తాను యాగం చేసుకొంటున్నాని కొంతకాలం తరువాత వస్తే ఆ విద్య ఉపదేశం చేస్తానని చెప్పగా వారు వెళ్ళిపోతారు. అశ్వనీదేవతలు అట్లా వెళ్ళిన వేంటనే ఇంద్రుడు వచ్చి "వారికి విద్యని భోధిస్తే వారు అమరులు అవుతారు ఆ విద్యని భోధిస్తే నిన్ను సంహరిస్తాన"ని దధీచి తో చెబుతాడు. తరువాత అశ్వనీదేవతలు దధీచి వద్దకు రాగా దధీచీ ఇంద్రుడు వచ్చి వెళ్ళిన కథ చెబుతాడు. అప్పుడు అశ్వనీదేవతలు తరుణోపాయంగా వారు ముందే తాము దధీచి తలనరికేటట్లు , ఆ గుఱ్ఱం తలని అక్కడ అమర్చేటట్లు చేస్తానని , అప్పుడు అశ్వశిరస్సుతో అశ్వశిర విద్య భోదించిన వేంటనే తాము దధీచి తమకు విద్య భోధించనట్లు అరుస్తామని , ఆ మాట విని ఇంద్రుడు వచ్చి అశ్వశిరాన్ని నరికి వేస్తాడని, ఆ తరువాత దేవవైద్యులమైన మేము దధీచీ అసలు శిరస్సు ఉంచి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెబుతారు. ఆ విధంగా దధీచి అప్పటికే రెండు సార్లు జన్మ ఎత్తినవాడు. దధీచి ఎల్లకాలము నందు నారాయణ కవచమును స్తుతిస్తూ నరనరాలలో, ఎముకలలో నారాయణ మంత్ర ప్రభావితమైనది. అప్పుడు ఇంద్రుడు తన వృత్తాంతం చెప్పి శరీరాన్ని కోరగా దధీచి మహర్షి ఎవరైన తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగిన ఇచ్చేస్తాడా, సత్వ గుణ సంపద కలిగిన తన శరీరాన్ని తునకలు చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆఏముకలని హింస చేయడానికి వాడుతారా! అని అనగా దేవేంద్రుడు తమకు ఇప్పుడు గత్యంతరము లేదని తమని కాపాడమని అర్థిస్తాడు. అప్పుడు దధీచీ మహర్షి ఏదో పరిహాసానికి ఆ ప్రశ్న వేశాను కాని ఈ శరీరం తనది కాదని ఈశ్వరుడిదని , తన యోగ విద్యతో తనలో ఉన్న ప్రాణావాయువును పైకి లేపి అనంతంలో కలిపి, శరీరాన్ని పడగొట్టేశాడు. అప్పుడు ఇంద్రాదులు ఆ శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మ కిచ్చి ఆ విశ్వకర్మ చేత నూరంచులు కలిగిన వజ్రాయుధం తయారు చేయించారు.

అలా తయరు చేసిన వజ్రాయుధం తీసుకొని తన సైన్యముతో ఐరావతం ఎక్కి వృత్రాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వచ్చిన ఇంద్రునిచూచి వృత్రాసురుడు ఇంద్రుడితో నువ్వేనా ఇంద్రుడివి,నువ్వేనా నా అన్న విశ్వరూపుడుని సంహరించింది, నువ్వు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దధీచి ఎముకలతో వజ్రాయుధం చేయించుకోవడానికి వచ్చావు. ఈ రోజు నిన్ను సంహరిస్తాను, లేదు లేదు, నీకు శ్రీమన్నారాయణుడి అండఉండడం వల్ల నేనే మరణిస్తాను అని అనగా ఇంద్రుడు ఆశ్చర్యపోయి తన శూలంతో ఐరావతాన్ని ఒక పోటు పొడుస్తాడు. అలా పోటు పొడవడం వల్ల ఇంద్రుడు ఐరావతం నుండి క్రిందపడి పోతాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML