గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 March 2016

రామకృష్ణ పరమహంస జయంతిరామకృష్ణ పరమహంస జయంతి
అది బెంగాల్ ప్రాంతంలోని దక్షిణేశ్వరం.అక్కడొక ధర్మాచర్యుడు..... ఒక రోజు ఒక మహిళ ఆయన వద్దకు వచ్చింది. ఆమె వెంట ఆరేళ్ల ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. "స్వామీ! నా కుమారుడు మిక్కిలి అల్లరివాడు. చెప్పినట్లు వినడు. నిరంతరం తీపి పదార్థాలు తింటూనే ఉంటాడు. దాంతో తరచు అనారోగ్యం.... వీడిచేత ఇలా విపరీతంగా మిఠాయిలు తినే అలవాటు మాన్పించండి.!" అని ఆ మాతృమూర్తి ధర్మాచార్యుణ్ని ప్రార్థించింది. "రేపు రండి!" అని ఆచార్యుడు సమాధానం చెప్పాడు. వారిద్దరూ మరుసటి రోజు వచారు. "రేపు రండి!" మళ్లీ ఆచార్యుని సమాధానం.

ఇలా అనేక 'రేపు 'లు గడిచిపోయాయి. ఆ ఇల్లాలికి దిగులు పట్టుకొంది. చివరకు విసుగు వచ్చింది. అయినా ఆయన మహానీయుడు. ధర్మాచార్యుడు, ఆయనని గట్టిగా అడుగలేదు! అలా రోజులు గడిచాయి. ఒకరోజున ధర్మాచార్యుడు హఠాత్తుగా బాలుడ్ని దగ్గరకి తీసుకున్నాడు. తల నిమిరాడు. "బాబూ! మిఠాయిలు విపరీతంగా తినవద్దు. అలా తినడం వల్లనీకు జబ్బుచేస్తుంది జబ్బుచేస్తుంది!" అని చేప్పాడు. తల్లితో "ఇక మీరు వెళ్లవచ్చు" అన్నాడు.

ఇదేమిటి స్వామీ! ఈ మాటలు చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందా! ఇవి ఎవరైనా చెప్పేమాటలే! తమరు మహానీయులు ఏదైనా మంత్రమో, మహిమో వేసి పిల్లవాడి 'తిండియావాపోగొడుతారని ఆశపడ్డాను. ఒకతాయెత్తు అయినా ఇచ్చారు కాదే!" అన్నది ఆమె."అమ్మా! నాకు కూడ మిఠాయిలపై అమిత వ్యామోహం ఉంది. అందువల్ల మిఠాయిలను తినకుండా నిగ్రహించుకోవడం గత కొద్ది రోజులుగా నేను సాధన చేశాను. ఐదురోజులనుండి మిఠాయిలు తినకుండా ఉండగలుగుతున్నాను. అందువల్ల పిల్లవాడికి ఇప్పుడు చెప్పాను. చేయలేని దాన్ని, ఆచరించలేని దాన్ని ఆచరించి ఉపదేశించడం తప్పు. అందుకే ఈ మాటలు చెప్పుటకు ఇన్నిదినాలు పట్టింది" అని అన్నాడు ధర్మాచార్యుడు. మనోవాక్కాయ కర్మలయందు ఇలా ఒకే ప్రవర్తించడమే మానవుని జీవన విధానం కావాలని నిరూపించిన ఆ మహానీయుడు రామకృష్ణ పరమహంస. అతడు, సనాతన (శాశ్వత) తత్వాన్ని మరో రూపంలో ఆవిష్కరిచిన అధునాతనుడు, నివృత్తి మార్గం ద్వారా ఆత్మతత్వంతో దైవత్వంబును మును సాధించిన జీవన్ముక్త బ్రహ్మవిదుడు. సనాతన విలువల సమిష్టితత్వం ప్రాతిపదికగా భారతీయ సంస్కృతిసౌధం వెలసింది. సనాతనం పాతదికాదు. 'ఆద్యంత రహితంగా' ఎల్లప్పుడూ వుండేదే సంస్కృతిని మళ్లీ పరిష్కరించడం ఏమిటి? అలా ఆవిష్కరించడానికి మహనీయులు ఎందుకు? శాశ్వతంగాయుగాలతరబడి వెలుగొందే సూర్యుడు చీకటి తరువాత అవిష్కృతుడు అవుతున్నాడు. ప్రతినెల శిశిరం తరువాత వసంతం సమావిష్కృత సృష్టిస్తున్నాడు. "ధాతా యథపూర్వం కల్పయేత్" అన్నది వేదం.
బంగారుతో నిర్మించిన భవంతిలొ కూడా ఋజుచేరుకొంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ప్రక్షాళన అవసరం. ఈ ప్రక్షాళన జరిగిన తర్వాత స్వర్ణమయ శోభలు పునరావిష్కృతమౌతాయి. ప్రకృతిలోను, సృష్టిలోను వికృతులు పొడసూపుతాయి. మేఘాలు తొలగిపోయి దివాకరుడు మళ్లీ యధాపూర్వవైభవంతో వెలుగొందుతాడు. భారతీయ సంస్కృతి, సనాతన వైదిక సంస్కృతి వికృతులకు తొలగించి సంస్కృతి యధార్ధ ప్రకృతిని పునరావిష్కరించారు. ఇది యుగాలుగా జరుగుతుంది. ద్వాపరయుగాంతంలో కృష్ణుడు, కృష్ణ ద్వెపాయనుడూ ఇదే చేశారు. ఈ యుగంలో, దాదాపు రెండూ వేల ఐదువందల సంవత్సరాలకు పూర్వం ఆది శంకరాచార్యులవారు అదేపనిచేశారు. నూట యాభె ఏళ్లకు పూర్వం రామకృష్ణ పరమహంస కూడా అదే చేశారు.అది శంకారాచార్యులు కొత్తమతం కనిపెట్టాలేదు. కొత్త సిద్ధాంతం సృష్టించలేదు. సనాతన సత్య సిద్ధాంతాలపై కలిగిన భ్రమలు తొలగించి ప్రేమను చూపించారు. రామకృష్ణ పరమహంస కూడ కొత్తమతం కనిపెట్టలేదు. కొత్త వైదిక సిద్ధాంతరాద్ధాంతం సృష్టించలేదు. కర్మజీవనమార్గాన్ని చేపెట్టే మనో సమజ్వల దీపంగా భాసించాడు. కొత్తది కనిపెట్టామని ఆరాధించడం పాశ్చాత్య జీవన పరిమిత బుద్ధికి జనించిన అపరిమిత అహంకారం, సనాతన రీతిని వివిధ కాలాలలో వినూతనంగా ఆవిష్కరించడం భారతీయ సంస్కారం. ఎందుకంటే సనాతన తత్వానికంటే కొత్తదీ, భిన్నమైనదీ సృష్టిలోనే లేదు. "నాన్యః పంథా అయనాయ విద్యతే" అందుకే 'డార్వినిజమ్' లాగా 'మార్కృజం'లాగా మనదేశంలో 'శ్రీకృష్ణాయిజమ్' 'ఆదిశంకరాయిజమ్' 'రామకృష్ణ పరమహంసాయిజమ్' 'వివేకానందాయిజమ్' పుట్టలేదు. శాశ్వతమైన భారతీయమైన వేద, వేదాంత మార్గంలో అప్పుడ్ప్పుడు అక్కడ ఏర్పడే 'ఋజూను, దుర్గంధాన్ని తొలగించి మార్గాన్ని సుగమం చేయడమే భారతీయ ఋషి మునుల గొప్పతనం. ఇలాంటి ఋషి రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస జన్మించిన కాలం. భారత్దేశంలొ విదేశీయదాస్య భావసామ్రాజ్యం విస్తరిస్తుండీన నిశీధినీ సమయం. బ్రిటిస్ ప్రభువుల పెత్తనం చీకటి సిద్ధాంతాలను వెలయిస్తుండిన శిథిల యుగం. హిందూ జాతీయతకు, వైదిక ఆచారాలకు తెల్లదొరలు వికృతభాస్యాలు చెప్పి, దివాంధ స్వరాలు పలికిస్తుండినవేళ, కారు చీకటిని తరిమే కాంతి పుంజంలాగ శ్రీరామకృష్ణ పరమహంస ప్రభవించాడు, వివేకానంద విజ్ఞాన ధవళిమను వ్యాప్తిచేశాడు!

శ్రీరామకృష్ణ పరమహంస జన్మించి ఇప్పటికి నూట అరవై ఏడు సంవత్సరాలైంది. కలియుగం 4,936వ సంవత్సరం చాంద్రమాన మన్మధ ఫాల్గుణ శుక్ల విదియ నాడు ఆయన జన్మించాడు. ప్రస్తుతం కలియుగం 5103వ సంవత్సరం నడుస్తోంది. సాధారణ శకం ప్రకారం ఆయన 1836 ఫిబ్రవరి 18వ తేదీన పుట్టాడు. కలియుగం 4,987 వ్యయనామ సంవత్సరం భాద్రపద బహుళ విదియనాడు పరమపదం పొందాడు. సాధారణ శకం ప్రకారం అది 1886 ఆగస్టు 16వతేది. శ్రీరామకృష్ణుని తల్లి చంద్రమణీదేవి, తండ్రి క్షుదీరామ్. వంగప్రదేశంలోని హుగ్లీ జిల్లాలోని దేరేపూర్ వారి స్వగ్రామం. సనాతన సంప్రదాయ నిష్టమైన వేదపండిత వంశం వారిది. వారిది మిక్కిలి కుటుంబం. క్రీస్తుశకం 1814 నుండీ ఆ కుటుంబానికి కామార్పు కూర్ స్వగ్రామమైంది. అక్కడే రామకృష్ణుడు జన్మించాడు. రామకృష్ణ పరమహంసకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్. ఆయనకు రామకుమార్ అనే అనే అన్న, కాత్యాయని అనే అక్కయ్య ఉండేవారు. గదాధర్‌కు తొమ్మిదవ ఏటా ఉపనయనమైంది. గదాధర్‌కు చిన్నపటి నుండీ సాధుసంతులన్నా గోసాయిలన్నా ఏంతో ఇష్టం. ఒళ్లంతా విభూతి పులుముకొని కౌపీనం ధరించి తాను కూడ అప్పుడే గోసాయి అయిపోయినట్లు మురిసి పోయాడు బాల గదాధర్. ఆ బాలుడు మంచి గాయకుడు. అద్భుత చిత్రకారుడు, పదునైదవ గదాధరుడు తన చెల్లెలు సర్వమంగళ, ఆమెభర్త చిత్రాన్ని యధాతథంగా గీచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడవయేట గదాధర్‌కు పితృవియోగం కలిగింది. పదునైదవ ఏట కలకత్తా చేరి అన్న రామకుమార్‌తో నివసించసాగాడు. కలకత్తా శివారు ప్రాంతంలో దక్షిణేశ్వరంలో రాణి రాసమణి అనే మత్స్యకార మహిళ ఒక కాళికా మందిరాన్ని రాధామాధవ ఆలయాన్ని నిర్మించింది. రామకుమార్ అక్కడ ప్రధాన అర్చకుడు గదాధర్ అన్నకు సహాయకుడు. అప్పుడే ఆయన 'రామకృష్ణ 'అన్న పేరు స్థిరపడింది. బాల్యంలోనే వైరాగ్యభావం సిద్థించిన రామకృష్ణ భౌతిక సుఖాలపట్ల, ఇంద్రియ వాంచల పట్ల పూర్తిగా విముఖుడయ్యాడు.
కానీ తల్లి, అన్నల బలవంతమ్మీద రామకృష్ణునికి ఇరవైమూడవ ఏట, ఐదేళ్లవయస్సు గల శారదామణీదేవి అన్న వధువుతో వివహం జరిగింది. తనపద్దెనిమిదవ శారదాదేవి దక్షిణేశ్వరానికి వచ్చి భర్తతోకలిసి జీవించడం ఆరంభించింది. శారదా రామకృఅష్ణుల దాంపత్య విషయ వాంచలకు అతీతమైన ఇంద్రియ ధర్మ దివ్య జీవనం. పరాశక్తితో వారు అద్వైతం సాధించారు. వారు లక్ష్మీనారాయణులు, కాళికాపరమశివులు. "శివో భూత్వా శివం యజేత్" తమ దాంపత్యం గురించి శ్రీరామకృష్ణుడు ఒకసారి ఇలా వివరించాడటా ఆమె నాపాదాలు ఒత్తుతుంది. నేను ఆమెపాదలకు నమస్కరిస్తాను" కృష్ణుడుగా మారి శివారాధన చేయడం తత్త్వంలో అద్వైతం ఆచరించడమే. అయితే జీవుని ప్రస్థానంలో చివరిమజిలీ అయిన అద్వైతస్థితిని సాధించడానికి వేదోక్త కర్మ పథమే రాజమార్గంద్వైత భ్రాంతీ నివృత్తి కాక పూర్వమే అద్వైతస్థితి వస్తుందని భావించడాం అధఃపతనానికి కారణాం. అనాదిగా ఆర్యులు దీన్ని ధ్రువీకరించినారు. రామకృష్ణ పరమహంస జీవన ప్రస్థానం ఇందుకు మరో సజీవ సాక్ష్యం. వర్ణభేదాలు, లక్ష్యసాధనలూ ఇవన్నీ మానవునికి గతజన్మ పాపపుణ్యాల ప్రాతిపదికగా ప్రారబ్ధమయ్యేవి. ఈ జన్మలో సంచితమయ్యే పాపపుణ్యాలు వచ్చే జన్మకు ప్రారబములు ఇలా అనేక జన్మల ప్రారబ్ద సంచితాల సమాహారం జీవుని ప్రస్థానం. కొబ్బరిచెట్లు ఎదిగే కొద్దీపాతమట్టలు తమంతతామే రాలిపోతాయి. ఆత్మవికాసం పొందే కొద్దీ కులభేదం వంటివి తొలగిపోతాయి. పుండు మానిపోతే పుండుపై కట్టు పొలసంతట అదే తొలగిపోతుంది. కానీ పుండుమానక ముందు పొలుసును లాగివేస్తే మాత్రం పుండు త్రీవ్రమై రక్తం కారుతుంది....! జీవుడు అద్వైతస్థతిని సాధించే పద్ధతి గురించి రామకృష్ణ పరమహంస ఇచ్చిన వివరణ ఇది. మేము ఏమీ చేయనక్కరలేదు... "దేవుడు ఇక్కడ ఉన్నాడు" అంటూ గుండెను గుద్దుకొని మెట్ట వేదాంత ధోరణిలో అకర్మణ్యతను బోధించే వారికి ఇది మొట్ట వేదాంత ధోరణిలో అకర్మణ్యతను బోధించే వారికి ఇది మొట్టికాయవంటిది. వేదోక్త మార్గాన్ని విడిచి పెట్టమని ప్రోత్సహించే వారికి చెంపపెట్టు వంటిది. అందుకే అద్వెతానుభూతిని అనుక్షణం అనుభవించిన అ మహనీయుడు ఏనాడు కూడ సంధ్యావందనము, దేవతార్చనము వంటి నిత్యకర్మలను వదలి పెట్టలేదు. అద్వైత తత్వమే తానుగా భాసించిన ఆదిశంకరుడు కూడ ఇదే బోధించాడు. 'భూగర్భ మంతటా నిండి ఉన్ననీటిని ప్రయత్నించి తవ్వి తీసినప్పుడే తాగవచ్చును.'

రామకృష్ణ పరమహంస తనను దేవుడని చాటుకోలేదు. "అనంత విశ్వవ్యాపకుడైన దేవుడు తన దేహంలో కూడ వ్యాపించాడు. అందరి దేహాలలోను వ్యాపించి ఉన్నాడు. అదిమధ్యాంతర రహితుడ్ని ఆరడుగుల మానవ దేహానికి ఎలా పరిమితం చేస్తారు?ఏమి చూసి, ఏమి గ్రహించి నన్ను అవతార పురుషుడని చాటుతున్నారు? అని అయన శిష్యులను మందలించేవారత. వైదిక సంప్రదాయ పరంపరకు చెందిన అసలుసిసలైన ధర్మాచార్యుడు ఆయన. అందుకే ఆయన అద్భుతాలు, 'ఇంద్రజాలాలూ ప్రదర్శించలేదు. విభూతులు, తాయెత్తులు, రుద్రాక్షలు "సృష్టంచి" అందరినీ ఆశ్చర్యంతో ముంచలేదు. ఆదిశంకరులు తరతరాలకు దారిచూపేందుకు ఒక శిష్య పరంపరను రూపొందించారు. అదే ఆయన చూపించిన మహామహిమ. హైందవ సంస్కృతి కేతనాన్ని విశ్వగగన వీధులలో పరమోన్నతంగా విహరింపచేసిన వివేకానందుడు ఆయన సృష్టించిన అత్యద్భుతం.
ధర్మబద్ధ కర్మజీవనుడు అతిసామాన్యుడైనప్పటికీ అసమాన్యుడుగా విరాజిల్లుగలడని నిరూపించి నిరుపమానుడు రామకృష్ణుడు. పదునైదవ ఏట కేవలం ఒక గుడి పూజారి. ముప్ఫైఏళ్ళ తరువాత జాతీయ మహామందిరంలో సకల దేవతా ఆరాధకుడు. అయిన భరతమాతృ సమారాధకుడు. తరతరాలకు స్ఫూర్తి దాయకుడు. ఆది శంకరుని శిష్యులతో సమ ఉజ్జీగా వివేకానందుణ్ని ఆయన తీర్చిదిద్దాడు.ఆదిశంకర శిష్యులు హైందవ జాతీయ మౌలికతత్వాన్ని భారతదేశ నలుచెరగులా పునఃప్రతిష్ట చేశారు. రామకృష్ణుని శిష్యులు హైందవ జాతీయ పరిమళాన్ని అవనీతలమంతా వ్యాపింపచేశాడు. హిందూత్వపు ఔన్నత్యాన్ని పాశ్చాత్యులు అంగీకరించనిదే స్వజాతీయులు అంగీకరించని దుస్థితిలో ఉన్న తరుణంలో, 'వివేకానంద ' కిరణాలతో పాశ్చాత్య భారతీయ సంస్కృతీ సత్యాన్ని భాసింపచేసిన ధర్మ భాస్కరుడు శ్రీ రామకృష్ణ పరమహంస.

🙏🏻🙏🏻🚩181 వరామకృష్ణ పరమహంస జయంతి🚩🙏🏻🙏🏻

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML