గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 March 2016

"సాలగ్రామ మహిమ""సాలగ్రామ మహిమ"

"న తధా రమతే లక్ష్యాం న తధా స్వపురే హరిః,
సాలగ్రామశిలాచక్రే యధా హి రమతే సదా"


- "సాలగ్రామశిలాచక్రంలో నివసించడం అంటే శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో ఆటలాడటంకన్నా, వైకుంఠంలో విహరించడంకన్నా ఇష్టమైన విషయం"
ప్రతీరోజు సాలగ్రామంలో శ్రీహరిని పూజించినవారు వెయ్యి రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. సాలగ్రామశిలలు అర్చనచేస్తే చాలు ముక్తి లభించడం తధ్యం. ఇది సకల పాపాలకు విరుగుడు. దీక్షా స్వీకారంతో మంత్రపూర్వకంగా ఈ శిలాచక్రంలో శ్రీహరిని అర్చించినవాడు విష్ణులోక నివాసం పొందుతాడు. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం చేసి, ఆ నీటిని శిరస్సున జల్లుకున్న భక్తుడు సకల పుణ్యతీర్థములలో స్నానం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎందుకంటే....

"గంగాగోదావరిరేవానద్యో ముక్తిప్రదాయకాః,
నివసంతి సతీర్ధస్ధాః సాలగ్రామ శిలాజలే"
- గంగా, గోదావరి, రేవ మొదలైన సకల నదులు సాలగ్రామ శిలోదకంలో ఉంటాయి.
సాలగ్రామ శిలాసాన్నిధ్యంలో శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే, పితృదేవతలు పరిపూర్ణంగా సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే, పంచగవ్యాన్ని వెయ్యిసార్లు పుచ్చుకున్న ఫలం దక్కుతుంది. యోగ్యుడైన బ్రాహ్మణునికి సాలగ్రామం దానం చేస్తే సమస్త భూగోళాన్నీ దానం చేసిన పుణ్యం దక్కుతుంది.

"వైష్ణవః పురుషో వైశ్య శివనిందాం కరోతి యః,
న యాతి వైష్ణవం లోకం స యాతి నరకం పునః"
- నేను వైష్ణవుణ్ణి, పరమ భక్తుడిని అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే, వారికి విష్ణులోకం దక్కదు సరికదా మా నరకానికి వచ్చి పడతారు".

(యమదూత వికుండలుడికి చెప్పిన విషయాలు. హేమకుండలోపాఖ్యానం, శ్రీదత్తాత్రేయ గురుచరిత్ర, 3-14-23 నుండి58)

"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో నారాయణాయ"
"ఓం నమో నారాయణాయ"

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML