గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 12 March 2016

రథసప్తమిరథసప్తమి

ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది, సూర్యుడు తన దిశానిర్దేశాన్ని ఈ రోజునుండే మార్చుకుంటాడు. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడిగానూ, సాయంత్రం విష్ణు స్వరూపుడిగానూ ఉంటాడు కాబట్టి మనం సూర్యుడిని త్రిసంధ్యలలో ప్రార్థించినంత మాత్రమునే త్రిమూర్తులకు పూజ చేసినంత ఫలితం ఉంటుంది. శీతాకాలం నుండి వేసవి కాలపు సంధిస్థితిలో వచ్చే పండుగ ఇది. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది. సూర్యుడికి ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, సూర్యుడి రథానికి పూన్చినవి ఏడు గుర్రాలు, వారంలో రోజులు ఏడు, వర్ణాలలో రంగులు ఏడు, తిథులలో ఏడవది సప్తమిరోజు. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని స్నాన, జప, అర్ఘ్యం, తర్పణ, దానాలు అనేక కోట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంది. సప్తమిరోజున షష్ఠి తిథి ఉన్నట్లయితే షష్టీ సప్తమీ తిథుల యోగానికి పద్మం అని పేరు. ఈ యోగం సూర్యుడికి అత్యంత ప్రీతికరం. సూర్యుడికి 'అర్కః' అనే నామం కూడా వుంది. అర్క అంటే జిల్లేడు ఆకు అందుకే సూర్యుడికి జిల్లేడు అంటే అమిత ప్రీతి. రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై పెట్టుకుని

జననీ త్వంహి లోకానాం సప్తమీ సపసప్తికే !
సప్తంయా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే !!

అని జపిస్తూ నదీస్నానం చేసినట్లయితే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రభోదించాడు. స్నానం అయిదు రకాలు నదీ స్నానం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి సూక్తము, సంకల్పము, మార్జనము, అఘవర్షనము, తర్పణము. తెల్లవారు ఝామున నాలుగు నుండి ఐదు గంటల లోపల స్నానం అది ఋషిస్నానం అంటారు. ఐదు నుండి ఆరు లోపల చేస్తే అది దైవస్నానం, ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేస్తే అది మానుష స్నానఫలం, అటు తరువాత చేసేదే రాక్షస స్నానం. భార్యాభర్తలు నదీ స్నానం చేసే సమయంలో కొంగును ముడివేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత నాలుగు గుప్పిళ్ళ మట్టిని నదిలోనుంచి తీసి గట్టుపై వేయాలి. దీనివల్ల మనం చేసిన స్నాన ఫలం ఆ నది త్రవ్వించిన వారికీ కొంత చెందుతుంది, పూడిక తీసిన ఫలితం మనకు దక్కుతుంది. రథసప్తమిరోజున సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. బంగారు, వెండి, రాగి, వీటిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదలో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పట్టుకొని, నది లేదా చెరువు దగ్గరకు వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదలి, ఎవరూ నీటిని తకకకుందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి. సూర్యుడి ముందు ముగ్గు వేసి, ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగానూ ఉంటుంది. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.
రథసప్తమి రోజున సూర్యుడికి పూజలు, దానధర్మాలు, వ్రత పారాయణ, ఉత్తములు, అర్హులైన వారికి దానం ఇవ్వాలి అని ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్నీ కృష్ణుడు, ధర్మరాజుకు చెప్పాడట. ఆ కాంభోజ రాజు కథ ఏమిటంటే …
పూర్వకాలం కాంభోజ దేశాన్ని యశోవర్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడు అన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే దక్కింది. పుట్టిన బిడ్డ ఎప్పుడూ ఎదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. అలా జబ్బుపడిన కొడుకునుచూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి వివరించి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గతజన్మను వీక్షించారు. గతజన్మలో ఎంతో సంపన్నుడు అయినా ఎవరికి కూడా ఎటువంటి దానం కూడా చేయలేదు. అయితే అతడి జీవితం చరమాంకంలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు కాబట్టి ఆ పుణ్యఫలం కారణంగా రాజు ఇంట జన్మించాడు. సంపదలు ఉండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు తెలియజేశారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమని మహారాజు ఋషులను వేడుకున్నాడు. అంతట ఋషులు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడికి సంక్రమించిన రోగాలు నశిస్తాయని చెప్పారు. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని చెప్పారు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు అంటూ విధివిధానాలను వివరించారు. కాంభోజ మహారాజు కూడా తన బిడ్డతో రథసప్తమి వ్రతాన్ని చేయించిన తరువాత ఆ బిడ్డ సర్వ రోగాలనుండి విముక్తి పొంది తరువాతి కాలంలో రాజ్యానికి రాజయ్యాడు. ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమినాడు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని నదీస్నానం చేసి దగ్గరలోని సూర్యదేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటివద్దనే ఆరాధించుకోవచ్చు. ఈ వ్రతానికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్యజీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML