గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 31 March 2016

కదిలే శివలింగం, అద్బుతం ఈ ఆలయ చరితం


Read More

నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి(( :నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్


2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ ..
Read More

Tuesday, 29 March 2016

భోగి పండుగభోగి పండుగ

దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ముందురోజు భోగి పండుగగా ప్రసిద్ధి. ఈ భోగి పండుగనాడు పాత వస్తువులను, పాతచీపుర్లను, ఎండిపోయన కొబ్బరి మట్టలను, తాటాకులను పోగుచేసి తెల్లవారు ఝామున వేసే మంటలనే భోగిమంటలు అంటారు. ఇలా చేయడం వల్ల శని దూరమవుతుందని అంటారు.

ధనుర్మాసారంభంనుంచి గోదాదేవితో పాటు పాండురంగడి పూజ, కాత్యాయనీ వత్రం చేసిన భక్తులందరూ శ్రీ పాండురంగనికి గోదాదేవికి కల్యాణం ఈ రోజున జరుపుతారు.ప్రతినెలా సంక్రాంతి వచ్చినా మకర సంక్రాంతికి ప్రాముఖ్యం ఏర్పడి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనుచానంగా వస్తున్న ఆచారం.

ఈ సంక్రాంతి వేళలో శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం వంటి నాలుగు విధులను ఆచరిస్తే పునర్జన్మ వుండదని శాస్త్ర వచనం - ఉత్తరాయణంలో మరణిస్తే ఉత్తమగతి కలుగుతుందని అంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో దక్షిణాయనంలో నేలకొరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి వుండి స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు. సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి లభిస్తాయని అంటారు.

సంక్రాంతి రైతులకు పంట వచ్చే కాలం. ఈ రోజున ఇంటికి సున్నాలు వేసుకొని, గుమ్మాలకు మామిడితోరణాలు, బంతి మాలలు అలంకరించి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. కనె్నపిల్లలందరూ వాకిళ్లను అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పసుపుకుంకుమలతో వాటిని అర్చిస్తారు. తంగేడు పూలు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలను అలంకరించి ‘గొబ్బియలో,’ ‘గొబ్బియలో’ అంటూ గొబ్బిపాటలు పాడుతారు.

తెలతెలవారుతుండగానే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, పగటివేషగాళ్లు ఇలాంటి జానపద కళాకారులు ఇంటింటికి తిరిగి వారి కళను ప్రచారం చేసుకొంటారు. ఆ కళాకారులను రైతులు, గృహస్థులు గౌరవించి వారు పండించుకొన్న ధాన్యాదులను, కొత్తబట్టలు ఇచ్చి వారిని సంతోషపరుస్తారు. పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తారు. పక్షుల కోసం వరికంకులను వాకిళ్లకు కట్టి వాటికి విందుచేస్తారు. ఈ భోగిపండుగ మూడవ నాడు కనుమను జరుపుతూ పశువులను అలంకరించి, పొంగళ్లను పెట్టి పశుపూజను చేస్తారు. ఇలా సంక్రాంతి మూడురోజులు జరుపుకుంటూ తమ జీవితాలలో నూతన కాంతి తెస్తుందని ఆబాలగోపాలం సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు.

శుచి శుభ్రతలను పాటించమనే ఈ భోగిపండుగ శాస్తర్రీత్యా కూడా ఆరోగ్యాన్నిస్తుందంటారు. మూగజీవాలను కూడా కాపాడమనే ఈ భోగి మానసిక శాంతిని కలుగచేస్తుందంటారు కొందరు. జప తప ధ్యానాది ఆధ్యాత్మిక సాధనలు, పురాణ పఠనాదులు, దానధర్మాలు, మొదలైన సత్కర్మల ద్వారా విముక్తి లభింపచేసే శక్తి ఈ పండుగకు ఉందని పెద్దలంటారు.
Read More

మాండుక్యోపనిషత్మాండుక్యోపనిషత్

1 ఓమిత్యేతదక్షకరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం
భవిద్భవిష్యదితి సర్వమోంకార ఏవ !
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ !!


ఈ మొత్తం లోకం ఓంకారమే. గతించినవి, వున్నవి, రాబోయేవి అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైంది ఏదైతేవుందో అది కూడా ఓంకారమే.

2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా
సో యమాత్మా చతుష్పాత్

విశ్వంలో వున్నవన్నీ భగవంతుడే. ఈ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిణామాలు కలది.

3. జాగరికస్థానో బహి: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవింశతి ముఖ:
స్థూలభుగ్ వైశ్వానర: ప్రథమ: పాద: !

ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్మముఖంగా వుంది. 7 అవయవాలు, 19 నోళ్లుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.

4. స్వప్న: స్థానో న్త: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవింశతిముఖ:
ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ: పాద: !!

ఆత్మలో రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైంది. 7 అవయవాలు, 19 నోళ్లుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు.

5. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం
పశ్యతి తత్ సుషుప్తమ్ ! సుషుప్తస్థాన ఏకీభూత: ప్రజ్ఞానఘన
ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖ: ప్రాజ్ఞస్తృతీయ: పాద: !!

కోర్కెలు, కలలలో ఏదీలేని నిద్రాస్థితి ఆత్మలో మూడవ పరిమానమవుతుంది. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞాడు. ఈ స్థితిలో ఎటువంటి అనుభవాలుండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా వుంటుంది. అందువల్ల ఇది జాగ్రత్, స్వన్నస్థితి చేతనలకు ద్వారంగా వుంటుంది. ఆనందస్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు.

6. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష యోని:
సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ !!

ఇతడే సర్వేశ్వరుడు. సర్వం తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణులలో కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూలకారకుడు. ప్రాణుల ఉత్పత్తికి, వారి వినాశనానికి కారకుడు ఇతడే.
Read More

శనిత్రయోదశిశనిత్రయోదశి
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.


శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శని మహత్యం
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం
శనీశ్వరుడి జప మంత్రాలు
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
వల్లూరి పవన్ కుమార్
Read More

చొల్లంగి అమావాస్యచొల్లంగి అమావాస్య

పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.


నాగోబా జాతర
పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన ‘నాగోబా’ పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం. ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉంది. మనరాష్ట్రం నుంచే కాకుండా పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.
ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.
Read More

మాఘ మాస విశిష్టతమాఘ మాస విశిష్టత

"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
"దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!"
అని చేసిన తరువాత
"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!"
అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. "మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే.
Read More

శ్రీచక్ర ప్రథమావరణదేవతాఃశ్రీచక్ర ప్రథమావరణదేవతాః

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


श्रीचक्र प्रथमावरणदेवताः

अणिमासिद्धे, लघिमासिद्धे, गरिमासिद्धे, महिमासिद्धे, ईशित्वसिद्धे, वशित्वसिद्धे, प्राकाम्यसिद्धे, भुक्तिसिद्धे, इच्छासिद्धे, प्राप्तिसिद्धे, सर्वकामसिद्धे, ब्राह्मी, माहेश्वरी, कौमारि, वैष्णवी, वाराही, माहेंद्री, चामुंडे, महालक्ष्मी, सर्वसंक्षोभिणी, सर्वविद्राविणी, सर्वाकर्षिणी, सर्ववशंकरी, सर्वोन्मादिनी, सर्वमहांकुशे, सर्वखेचरी, सर्वबीजे, सर्वयोने, सर्वत्रिखंडे, त्रैलोक्यमोहन चक्रस्वामिनी, प्रकटयोगिनी,Read More

విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.

తెలంగాణ లో జరిగే అతిపెద్దదైన, విశిష్టమైన గిరిజన జాతర "మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర." ఈ జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకువస్తారు.

వరంగల్ జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, తెలంగాణ లోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క-సారలమ్మలు!

"దేశం లోనే అతి పెద్ద గిరిజన జాతర" గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడ లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

ఎవరీ సమ్మక్క-సారలమ్మలు?

12వ శతాబ్ధంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని 'పొలవాస' (పొలాస) ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తినాడు.

ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుండగా మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోయాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తినా డు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేసినారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు! కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

🔹జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు.

నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు.

వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనలే కాక అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర!
Read More

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని(నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయి కి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజు కి కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది. విష్ణు వర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడి కి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.. ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో కి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు. విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు. శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-"సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది." ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్టించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.
Read More

స్వామి దయానంద సరస్వతి (1824-1883) ఆర్యసమాజ్ స్థాపకుడు

స్వామి దయానంద సరస్వతి (1824-1883) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం లో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
జీవిత చరిత్ర : మూల శంకర్ 1824 లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.
ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు.
భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు.
ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 దీపావళి సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు. ఆయన తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అథర్వణ, యజుర్వేదం వంటివి భాష్యం చేసిన వేదభాష్యకారుడు.
వల్లూరి పవన్ కుమార్
Read More

బమ్మెర పొతన : శ్రీమద్బాగవథంఅంబ, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!


అంబ = తల్లీ; నవ = అప్పుడే పుట్టిన; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కనబడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శృతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావాలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ.

భావము:
తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!

@బమ్మెర పొతన : శ్రీమద్బాగవథం
Read More

శ్రీ పంచమి/వసంత పంచమి

శ్రీ పంచమి/వసంత పంచమి

మాఘ మాసం శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ! విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!!
ఇంతకీ ''శ్రీ పంచమి'' లేదా ''వసంత పంచమి'' అంటే చదువులతల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకుని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్ళలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మక్కువైన పండుగ ఇది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ ! పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః !!
అనగా మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో అర్చించాలి
ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అనగా అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్ధం కూడా ఉంది. శబ్దమనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురమే. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాంద్యం, మతిమరపు, వాక్కు లోపాలు మొదలైన జాడ్యాలను సమూలంగా నశింపచేస్తుంది కనుక ‘నిశే్శష జాడ్యాపహా” అని ఈ విద్యాదేవిని పేర్కొన్నారు.
వేదం సరస్వతీ దేవిని ‘ప్ర(ణో)దేవి సరస్వతీ! వాజే భిర్వాజినీ వతీ ధీనా మవిత్య్రవతు’ అని ప్రశంసించింది. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుందని వర్ణించారు. అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి.
వల్లూరి పవన్ కుమార్
Read More

భీష్మాష్టమిభీష్మాష్టమి

రధ సప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమి గా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణ గా విడువమని చెప్పింది శాస్త్రం
తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్
తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం


సంకల్పం: మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ భౌమవాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ!!

భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే – అపపౌ స్పృశ్య

భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!

వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!

వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!

అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

భీష్ముడి విశిష్టత
శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం " తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని....." ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?
" నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని.....ఆ భక్తుడే భీష్మపితామహుడు" అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.
అవును....భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు.
భీష్ముడి జన్మ రహస్యం :
శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు.
అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది.
ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.
వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - గంగాదేవి.
పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.
ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.
చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.
వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.
" పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.
ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.
" వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.
అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.
కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి!' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.
" ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.
ఆ పిల్లవాడే దేవవ్రతుడు.
వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.
శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.
విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.
ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.అటువంటి భీష్మున్ని తలుచుకుని తరిద్దాం.
వల్లూరి పవన్ కుమార్
Read More

రథ సప్తమిరథ సప్తమి

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు.
రధసప్తమి నాడు సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకొని స్నానం చేయాలి.


స్నాన విధానం:
వ్రతచడామణిలో "బంగారు, వెండి, రాగి, ఇనుము, వీనిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో (నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, ఉప్పనూనె - వీనిలో ఏదో ఒకదానితో) దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికిగానీ, చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో వదలి, ఎవరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి.
సప్తమీవ్రతం:
రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి!
పంచాంగకర్తలు రధసప్తమిని ' సూర్యజయంతి ' అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈ రోజు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు ఏడవమనువు. సూర్యుడు వివస్వంతుడు. ఇతనికొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే). ఇతని మన్వంతరానికి రధసప్తమియే సంవత్సరాది - అనగా ఉగాది. మన్వంత రాదిపర్వదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు - మకర సంక్రాంతివలనే - పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కల్గించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:
రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.

రుద్రాక్ష చెట్టు:
ఈ చెట్టు ఎక్కువగా ఉత్తరహిందూస్ధాన్లో వున్నాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీని భేధాలూ, ప్రభావాలూ జగద్విదితం. వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నానబెట్టి, ఆ నీళ్లు సేవిస్తే మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి.

జిల్లేడు(అర్క):
శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ, బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.

రేగు చెట్టు:
(బదరీ) దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా తెలిసికొని ఉపయోగించాలి.)

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,
సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.
"సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం"- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది - పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా - రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం:
య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.
జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!
వల్లూరి పవన్ కుమార్
Read More

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.

శ్రీ కృష్ణదేవ రాయలు జయంతి

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
సాహిత్య పోషణ
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు
ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము
కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయంఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
కులము
శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడుఅని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
వల్లూరి పవన్ కుమార్
Read More

సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, తెలంగాణాలోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశములోనే అతి పెద్ద గిరిజన జాతర" గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
ఎవరీ సమ్మక్క-సారక్కలు?
12వ శతాబ్ధములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాస' ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.


సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.
తెలంగాణా కుంభమేళా
తెలంగాణా లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమె జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుకుమ భారినేలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతర కు తెలంగాణా నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
Read More

సూర్య గ్రహణంసూర్య గ్రహణం

చంద్రుడు ఎప్పుడైతే భూమికి,సూర్యునికి మధ్యగా ప్రయాణిస్తాడో అప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఐతే గ్రహణం ఏర్పడటానికి మాత్రం సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖ లో ఉండాలి.
సూర్య గ్రహణం అమావాస్య నాడు ఏర్పడుతుంది.కానీ ప్రతి అమావాస్య రోజూ సూర్య గ్రహణం ఏర్పడదు.దానికి కారణం ప్రతి అమావాస్య రోజూ భూమి,చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో లేకపోవడమే.సూర్య గ్రహణం ఏర్పడిన సందర్భం లో సూర్యుని వైపు ఉన్న చంద్రుని భాగాన్ని కాంతి పూర్తిగా ఆక్రమిస్తుంది. అంటే భూమి వైపు ఉన్న చంద్రుని భాగం పూర్తిగా చీకటి అనమాట (చంద్రుడు కనిపించని రోజునే కదా మనం అమావాస్య అంటాం!)


సూర్య గ్రహణం ముఖ్యం గా నాలుగు రకాలుగా ఏర్పడుతుంది.

1) సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.

2) అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

3) సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.

4) పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

09-03-2016న పాక్షిక సూర్యగ్రహణం :-
స్వస్తిశ్రీ మన్మధనామ సం.ర మాఘ బ.అమావాస్య తేదీ 09-03-2016 బుధవారం పూర్వాభాద్ర నక్షత్రయుక్త కుంభ మీన లగ్నములందు కేతుగ్రస్తము దక్షిణశరం నీలవర్ణము అపసవ్య గ్రహణము పాక్షిక కించిన్యూన పాదగ్రాస గ్రహణము సంభవించును.

స్పర్శ కాలము:- ఉ. 5-45 ని.లు
మధ్య కాలము:- ఉ.6-13 ని.లు
మోక్షకాలము:- ఉ.7-25 ని.లు
ఆద్యంత పుణ్యకాలము:- ఉ.1-40 ని.లు

వేధ ప్రారంభము :- ఇది ఖగ్రాస సూర్య గ్రహణము ( గ్రస్తోదిత ) కావున 8 వ తేది , మంగళవారము సూర్యాస్త సమయము నుండి గ్రహణ మోక్షము వరకు గ్రహణ వేధ నియమాలను పాటించాలి.

రాశుల వారిగా గ్రహణ ఫలితములు
మేష , వృషభ , కన్యా , ధనుస్సు ఈ రాశుల వారికి శుభ ఫలితము.

మిథున , సింహ , తులా , మకర ఈ రాశుల వారికి మిశ్రమ ఫలము.

కర్కాటక , వృశ్చిక , కుంభ , మీన ఈ రాశుల వారికి ఈ గ్రహణము అనిష్ట ఫలమును ఇచ్చును.

అనిష్ట ఫలము గల రాశుల వారు మరియు గర్భవతులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ గ్రహణమును చూడరాదు.

గ్రహణ కరి దినము :-
గ్రహణము మరుసటి రోజు అనగా తేది : 10-03-2016 , గురువారము - గ్రహణ కరి దినము.

పాక్షిక సూర్యగ్రహణం దక్షణ ఆఫ్రికా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం పై కనిపించును.
ఈ గ్రహణం సుమారు 28 ని.లు మాత్రమే కనిపించును.

ఈ గ్రహణమును పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి, మీనరాశి వారు చూడకూడదు. గ్రహణానంతరము యధావిధిగా కార్యక్రమములను జరుపుకోవచ్చు.

గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, కేతు వెండి చంద్రబింబములను పూజించి, నెయ్యితో నిండిన కంచుగిన్నెను, వస్త్రములను, నువ్వులతో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలప్రదము. ఇష్టదేవతా మంత్రమును, గాయత్రీ మంత్రమును జపించవలయును. వానివలన మంత్రములు పరిశుద్ధమగును. జపం చేయకున్న మంత్రములు మాలిన్యమగును. వేదమంత్రమునకు మాలిన్యముండదు.

జాతాశౌచ మృతాశౌచములు కలిగియున్ననూ గ్రహణ స్నానాదికములు చేయవలయును.

గ్రహణ సమయమునందు సర్వ జలములు గంగా జలములు. సర్వ ద్విజులు వ్యాస భగవానులు. సర్వ దానములు భూదాన సమానమగును.

గ్రహణ సమయమున శయనించిన రోగము. మలమూత్ర విసర్జన, మైధునము చేసిన నరకము కలుగును.

గ్రహణమునకు ముందు వండిన వంటలను భుజించరాదు. ముడి పదార్థములు, పచ్చళ్ళు మొదలగు నిల్వ ఉంచిన పదార్ధములపై దర్భలను పరువవలెను.

గ్రహణము వదిలిన తరువాత శుద్ధ సూర్య బింబమును దర్శించుకుని, స్నానము చేసి వంటలు చేసుకొనవచ్చును. బాలలు, వృద్ధులు, అశక్తులు, పుత్రవంతులగు గృహస్థులు గ్రహణ ఘడియలు విడిచి భుజించవచ్చును.

గ్రహణ కాల దాన మంత్రము :-
మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! అను మంత్రముచే చదివి

గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమీయవలయును.

సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.

జ్యోతిష్య సలహాలు :
1) గర్భవతులు ప్రత్యేకించి గ్రహణ అనిష్ట ఫలము గల గర్భవతులు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాల పేరిట నిష్ఠావంతులైన బ్రాహ్మణులచే
" గర్భ రక్షణ స్తోత్రము " పారాయణము చేయించాలి.
2) పిల్లలు , వయో వృధ్ధులు ఉన్న వారు వారి పేరిట
" మృత్యుంజయ స్తోత్ర పారాయణము " చేయించాలి.
3) అందరూ ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
4 ) సూర్య గ్రహణ సమయంలో నర్మదా నదీ స్నానము అత్యంత పుణ్యదాయకం కావున నర్మదా నదీ స్నానము చేయాలి.వీలు కాని వారు స్నాన సమయంలో నర్మదా నదీ స్మరణం చేస్తూ స్నానమాచరించాలి.
వల్లూరి పవన్ కుమార్
Read More

ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది.ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గుని బుద్ది వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం. వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ మాసం.


శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.

శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.

పౌర్ణమి - మహా ఫల్గుని అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. ఉత్తర భారతదేశం లో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది.ఈ రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు.

అమావాస్య - ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.
వల్లూరి పవన్ కుమార్
Read More

పుత్రగణపతి వ్రతంపుత్రగణపతి వ్రతం

ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.


గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక . మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుడు ఆది , అంతం లేని ఆనందమూర్తి , సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి , ఆ నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా " గణపత్యధర్వశీర్షం " కూడా పేర్కొన్నది . దేవతాగణాలకు ఆదిపురుషుడై , అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాధుడని , గణేశుడని , గణపతి అని పేర్లు వచ్చాయి . ఆకృతిని బట్టి కొన్నిపేర్లు , ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానము గా ఈ దైవం గణాలకు నాయకుడు .

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు ... చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా ... రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ... శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు ... జ్ఞానవంతుడు ... ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
వల్లూరి పవన్ కుమార్
Read More

తండ్రులు-పుత్రులుతండ్రులు-పుత్రులు

జన్మనిచ్చిన తండ్రితో సమానంగా మరొక నలుగురు తండ్రివలె పరమహితాన్ని కాంక్షిస్తూ పరమాదరణీయులై ఉంటారని
జనితా చోపనీతాచ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
అన్నదాతా భయత్రాలూ పంచైతే పితరః స్మృతా:॥


అనే శ్లోకం పేర్కొంటున్నది. పీటల మీద కూర్చొని వటువుకు ఉపనయనం చేసిన వ్యక్తి, విద్యాదా నం చేసిన గురువు, ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి సంరక్షకుడిగా నిలిచిన వ్యక్తి, ప్రాణభయం నుంచి కాపాడిన వ్యక్తి (ఈ నలుగురు) తండ్రితో సమానంగా భావించి గౌరవించవలసిన వారని నీతిశాస్త్రం పేర్కొంటున్నది.

కన్నతండ్రితో సమానమైన స్థానాన్ని అన్నకు విద్యనేర్పిన గురువుకు కూడా ఇవ్వాల ని అందుకే ధర్మశాస్త్రం తండ్రిని అన్నను గురువును కలిపి ముగ్గురు తండ్రులను ఉపదేశిస్తున్నది. ఈ విషయాన్ని ధర్మాచరణ పరులందరూ గుర్తించాలి.

జ్యేష్ఠో భ్రాలూచాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మేచ పరివర్తనః॥

అని శ్రీరామచంద్రుడు వాలితో పలికెను. అట్లే తమ్ముణ్ణి సద్గుణవంతుడైన శిష్యుణ్ణి కూడా పుత్రుడితో సమంగా భావించాలి అని ధర్మశాస్త్రమే ప్రబోధిస్తున్నది.

యవీయానాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః
పుత్రవత్ తేత్రయః చింత్యాః ధర్మశ్చైవాత్ర కారణమ్॥

అని శ్రీరామచంద్రుడు వాలితో పలికిన విషయాన్ని శ్రీ మద్రామాయణంలోని కిష్కింధకాండలో దర్శించవచ్చు. ఓ వాలీ! పుత్రసముడైన తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టావు. సనాతన ధర్మాన్ని వది లి సోదరుడైన సుగ్రీవుని భార్యను అతడు జీవించియుండగానే పాపాత్ముడవైన నీవు కామం వల్ల కోడలితో సమానంగా భావించాల్సిన రుమను పొందావు

అసత్యం ధరమానస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయాం వర్తసేకామాత్ స్నుషాయాం పాపకర్మకృత్॥

అని వాలికి శ్రీరామచంద్రమూర్తి ధర్మోపదేశం చేసే సందర్భంలో ఎవరెవరు తండ్రితో సమానమైన వారో ఎవరెవరిని పుత్ర సమానులుగా భావించాలో తెలియపరిచెను.

ప్రస్తుత కాలంలో తండ్రీ కొడుకుల మధ్యనే సత్సంబంధాలు కొరవడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అన్నకు, పోషకుడికి, సంరక్షకుడికి, ప్రాణభయం నుంచి కాపాడిన వారికి కూడా దీర్ఘకాలం గౌర వ మర్యాదలను ఇవ్వాలని చెబితే పాటించేవారు ఎవరు? అనే సందేహం కలగొచ్చు. ధర్మమేంటో చెబితే ఒకరు కాకపోతే మరొకరో ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా పాటించే అవకాశం ఉంటుందని భావించడంలో తప్పులేదు కదా.
Read More

గాయత్రి ముద్రలు= ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమఃగాయత్రి ముద్రలు

ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః

ఓం భూర్బువ స్సువః 5
తత్స వితుర్వ రేణ్యం 7
భర్గో దేవస్య ధీమహి 8
ధియో యోనః (ప్రచోదయాత్) 4
24
గాయత్రి ముద్రలను గురు ముఖంగా సాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.ముద్రా విజ్ఞానాన్ని తత్త్వయోగం అంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయని రుజువైంది. మన ప్రాచీనులు ఈ విశ్వంలో 24 నిర్ధారణ మూలకాలు ఉన్నాయని విశ్వసించారని, గాయత్రి మంత్రంలో 24 పదాలు ఉండడం, 24 మంది జైన తీర్ధాంకరులు, సనాతన ధర్మంలో 24 అవతారా లు ఉండడం యాధృచ్ఛికం కాదని పలువురు అంటుంటారు.


మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకా శం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు. గాయత్రి మంత్రం కూడా ముద్రలు ఎంత విలువైనవో తెలియజేస్తుంది.

ఏత ముద్రన జానాతి గాయత్రి నష్ఫల భవత్‌ (ముద్రల గురించి తెలియనివారు గాయత్రీ మంత్ర ఫలాన్ని పొందలేరు).

గాయత్రి మంత్రం 24 ముద్రలను చెప్తుండగా, యోగాలోని అనేక రూపాలలో పలు ముద్రలను వివరిస్తుంది. కాగా, ఆధునిక వ్యాధులను నియంత్రించడం లో తోడ్పడే విధంగా అనేక ముద్రలకు కూడా రూపకల్పన చేయడం జరుగుతోంది. మన సంప్రదాయం లోనే అనేక ఆరోగ్య సూత్రాలు ఇమిడున్నాయి.

కాళ్ళు ఊపుతూ కూచున్నప్పుడో, వేళ్ళు ఊరుకే విరుచుకుంటుంటేనో ఇంట్లో పెద్దలు అరు స్తుంటారు. అలా చేయవద్దనడానికి కారణం ఆ చ ర్యల వల్ల ప్రాణశక్తి వృధా అవుతుందనే. అనవసరంగా ప్రాణశక్తి వృధా అవడమనేది మెద డుకు నష్టం జరుగుతుంది. ముద్రా విజ్ఞానం వ్యక్తికి ఉపశమనం కలిగించేందుకు ఈ శక్తిని తట్టి లేపుతుం దంటారు దీనిని సాధన చేసే వారు. మానవ సంక్షేమానికి యోగా ఇచ్చిన అద్భుతమైన బహుమతులలో ఈ ముద్రా విజ్ఞానమొకటని కూడా భావిస్తా రు. ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు. అయితే ఈ సాధన చేసే సమయంలో పద్మాసనం వేసుకోవడం మంచిది. అలాగే నడిచేటప్పుడు కూడా ముద్రలను సాధన చేయవచ్చు.

ముద్రలు అధిక శక్తిని పుట్టించవు, ప్రాణ శక్తిని సమతులం చేస్తాయి అంతే. ఆరోగ్యాన్ని, మేధస్సును పెంచడమే కాదు సిద్ధులు సాధించడం కోసం, మన చుట్టూ ఉండే ఆరాను ఆరోగ్యవంతం చేయడం, కుండలినినిలోని ప్రాణ కుండలిని, చిత్‌ కుండలిని, పరా కుండలినిని ఉత్తేజితం చేసి మరింత క్రియాశీలకమయ్యేందుకు దోహదం చేస్తాయి. ముద్రలను సాధన చేసేటప్పుడు చేతుల సున్ని తత్వాన్ని పెంచుకునేందుకు, వేళ్ళ చక్రాలను క్రియాశీలకం చేసేం దుకు మన చేతివేళ్ళ పై, అరచేతిపై దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి.

ఈ వ్యా యామం చేతిలో ఉండే చక్రాలను పెద్దవి చేసే శక్తి అవసరమైనట్టుగా ఇరువైపులా ప్రవహించేలా చేస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు ముందుగా, ప్రతి వేలి చివరి మీద కనీసం ఒక నిమిషం పాటు దృష్టి కేంద్రీకరించాలి. వేలి చివర్లలో రక్తం ప్రవహించడం, స్పందనలు అనుభవంలోకి రావాలి. ముందుగా ఒక చేతితో ప్రారంభించి, తరువాత మరో చేతి వేళ్ళ మీద దృష్టి కేంద్రీకరించాలి. తరువాత దృష్టిని మూడు నిమిషాలపాటు అరచేతిపై కేంద్రీకరించాలి. అరచేతిలో పువ్వు వికసిస్తున్న అనుభూతిని పొందాలి. ఈ సాధనను కనీసం 40 రోజుల పాటు సాధన చేస్తే, మన చేతులలో ఉండే చక్రాలు శాశ్వతంగా పెద్దవై, మరింత సున్నితత్వం వస్తుంది. ఈ సమయంలో ముద్రలను సాధన చేయడం మంచిది.

ముద్రల సాధనను ప్రారంభించే ముందు వ్యక్తి మనస్సును, శరీరం కొంతమేరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ముద్రలను కొన్ని బీజ మంత్రాలను ఉచ్ఛరిస్తూ కూడా సాధన చేయవచ్చు. ఈ మంత్రాలు చక్రాలను ఉత్తేజి తం చేయడమే కాక సూక్ష్మ వాహకాలను విస్తరింపచేస్తాయి. అంటే మానసిక, భౌతిక ప్రబావాన్ని చూపిస్తాయి. బీజ మంత్రాన్ని ఉచ్ఛరించేటప్పుడు బలం గా ఉచ్ఛరించాలి. అప్పుడే ఆ మంత్ర బలం మనలోని వివిధ మానసిక కేంద్రాలకు అనుభవంలోకి వస్తుంది. మంత్రాన్ని బలంగా ఉచ్ఛరించడం అంటే బిగ్గరగా చదవడమని కాదు అందులోని అక్షరాలను ఉచ్ఛరించవలసినట్టుగా ఉచ్ఛరించడం. అందుకే బీజ మంత్రాలను ఎప్పుడూ గురు ముఖంగా పొందాలంటారు.


Read More

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైనగురువు.శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైనగురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్నిఅవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు(పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.


విజయనగర సామ్రాజ్యము లోని ఒక పండిత కుటుంబానికి చెందినవారు రాఘవేంద్రులు . విజయనరగర సామ్రాజ్య పతనము తరువాత వీరి పూర్వీకులు కావేరీ తీరములోని కుంభకోణానికి చేరారు. అక్కడి మఠాధిపతి " సురేంద్రతీర్ధులు" వీరి కుటుంబ గురువులు. తిమ్మణ్ణ భట్ట,గొపికాంబలకు 1519లో మన్మధనామ సంవత్సరం పాల్గుణశుద్ద సప్తిమి గురువారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని భువనగిరి గ్రామంలో ''వెంకన్నభట్టు''గా జన్మించారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతో జన్మించినవాడు . బాల్యములోనే ప్రతిభ కలవాడుగా గుర్తింపు పొందారు. వ్యాకరణము , సాహిత్య , తర్క , వేదాంతాలనన్నింటినీ అధ్యయనం చేశారు. సంగీత శాత్రము అభ్యసించి స్వయముగా కృతులను కన్నడ భాషలో రచించారు. చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఉన్నత విధ్యను అభ్యసించడానికి కుంబకోణానికి వెళ్ళి అక్కడ శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విధ్యను అభ్యసించారు. అక్కడే శ్రీ మాన్ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించారు. మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు. తంజావురిలో యజ్క్షానారాయణ దీక్షీతులకు ఆయనకు మధ్వద్వైత సిద్దాంతలపై జరిగిన వాదానలో వెంకటనాధుడే విజయం పొంది భట్టచార్యులు అనే బిరుదును కైవసం చేసుకున్నారు.

ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్ధస్వామి మఠం ప్రతిష్టను వెంకన్నభట్టు నిలిపేవారు. సుధీంద్రతీర్ధస్వాములకు వయసు పైబడింది. ఆయన వారసుడుగా మఠం కీర్తిని నిలిపే ఉత్తరాధికారిగానియమించే ఆలోచన మొదలైంక్ది. సుధీంద్రతీర్ధస్వామి వారి దృష్టి వెంకణ్ణభట్టు మీద ఉండేది. కానిఆయన సంసారి. సన్యాస దీక్షకు సిద్ధము గాలేడు . అయినా తగిన వారసుడు వెంకన్నభట్టు అనే నిర్ణయానికి వచ్చి తంజావూరు తీసుకువెళ్ళి భార్యకు తెలియకుండా వెంకన్నభట్టుకు సన్యాసదీక్ష ఉప్పించి " రాఘవేంద్రతీర్ధులు " గా నామకరణము చేశారు. భర్త సన్యాసదీక్ష తీసుకున్న వార్త విన్న భార్య సరస్వతి ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించి బావిలో దూకి బలవన్మరణము చెందింది.

తంజావురు రాజు రాఘునాధ్ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621 ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. ఆ తరువాత మఠ సంప్రదాయల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళవిధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ ఆద్భుత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందవనం నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా ,కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు.
భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలుస్తే సకల సంపదలు ఫలిస్తాయని భక్తులు నమ్మకంతో ఎందరో కొలుస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారిపుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి వసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.

రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు : పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. 'గురు సుధీంద్ర తీర్థ' వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు.
ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది. మద్రాసు, ముంబై, బెంగుళూరు, హైదరాబాదు మొదలుకొని పలు ప్రాంతాలనుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది. మద్రాసు నుండి 595 కిలోమీటర్లు, ముంబై నుండి 690 కిలో మీటర్లు, హైదరాబాదునుండి 360 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది. ఇక్కడ యాత్రికులు బస చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది. ఆ స్టేషన్ పేరు "మంత్రాలయం రోడ్డు". రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6గంటలనుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణ. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది. దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.

ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసే బృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్ధరు స్ధాపించారు. పర్యాటకులు ఇక్కడి పంచ బ్రిందావనం కూడా చూడవచ్చు. దీనిలో అయిదుగురు రుషులు అంటే శ్రీ సుజనేంద్ర తీర్ధ, శ్రీ శుబోధేంద్ర తీర్ధ, శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, శ్రీ సుజనానేంద్ర తీర్ధ మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల అవశేషాలుంటాయి.

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మీద దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న భక్తి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన మంత్రాలయా రాఘవేంద్ర పీఠానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించినట్లు మఠం అధికారి సుయమీంద్ర చార్ ఈ విషయం తెలిపారు. ఈ విరాళంతో సర్వజ్ఞ మందిరం వద్ద 125 కొత్త గదులు నిర్మిస్తారు. అందులో 25 ఏసీ గదులు ఉంటాయి. సంస్కృత విద్యాలయం మైదానంలో ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామిగా కూడా నటించారు. దాన, ధర్మాలు చేయడంలో రజనీ మొదటి నుండి ముందుంటారు. తాజాగా ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడం కూడా సంచలనమే.
వల్లూరి పవన్ కుమార్
Read More

మంత్ర తంత్ర గ్రంధములు.......మంత్ర తంత్ర గ్రంధములు.......
భారతదేశంలో కొన్ని లక్షల సంవత్సరములనుండి మంత్రసాధన బహుళ ప్రచారములోవుంది.మంత్ర, తంత్ర సాహిత్యము ఏంతో విస్తారముగా లభించుచున్నది .భౌద్ధమతము భారతదేశములో బహుముఖముగా విస్తరిస్తున్న సమయములో మంత్ర,తంత్ర శాస్త్రములను ప్రజలు విరివిగాసాధనచేయుచుండిరి.ఈ శాస్త్రము చైనా,టిబెట్, శ్రీలంక,భూటాన్,నేపాల్,కంభోడియా తదితర దేశములతోపాటు లాటిన్ అమెరికా,మెక్సికో,ఉగాండా, జర్మనీ, ఇరాన్ ,ఇరాక్,గ్రీస్,టర్కీ ,ఈజిప్ట్ తదితర దేశాలలో భారతీయ మంత్ర ,తంత్రాలే విభిన్న పద్ధతులలో అనుసరించబడుతున్నాయి.


మంత్ర,తంత్ర గ్రంధములన్నీ ఊమా మహేశ్వర సంవాద రూపముగా సాధకుల ప్రయోజనార్ధము శివ విరచితములై భువిలో భాసిల్లుచున్నవి. భౌద్ధ మంత్ర, తంత్రములు మాత్రము "వజ్రసత్వశుద్ధ" తెలిపినట్లుగా ఉండును.భౌద్ధ మంత్ర,తత్ర సాహిత్యములో వారాహీ తంత్రము,క్రీయాకల్పద్రుమము,క్రీయాసముచ్చయము,గుహ్యసిద్ధి,తత్వజ్ఞానసిద్ధి,గుహ్యసమాజతంత్రము,హేమవజ్రతంత్రము,మొదలైనవి ప్రముఖ మంత్ర,తంత్రగ్రంధరాజములు. వైదిక ధర్మములో మంత్ర,తంత్రములన్నిటికి ఋగ్వేద,అధ్వరణవేదములే మూలము.ఈ వేద రుక్కులను అనుసరించి పలు మంత్ర,తంత్ర గ్రంధములను జిజ్ఞాసువులు రూపొందించిరి. ఈ గ్రంధములలో యోగినీ తంత్రము ప్రముఖమైనది.ఇది రెండు భాగములు.వీటినే యోగినీతంత్రము ప్రధమఖండము,యోగినీతంత్రము ద్వితీయఖండము అంటారు. ప్రధమఖండములో 19 సర్గలున్నవి.ద్వితీయఖండములో 9 సర్గలున్నవి
Read More

మంత్రశాస్త్రము---అధర్వవేదముమంత్రశాస్త్రము---అధర్వవేదము

వైదిక ధర్మములోని మంత్ర,తంత్ర ప్రయోగములన్నిటికి అధర్వవేదమే మూలము.అధర్వవేదము ఇరవైకాండములతోవున్నది.భృగుమహర్షి శిష్యుడు అధర్వుడు అతని ఇరవైమంది కుమారులుఅధర్వవేదములోని ఇరవైకాండలను దర్శించారు.ఈ ఇరవై కాండలలో 760 సూక్తములు,5,987 మంత్రములు వున్నాయి.తపస్సు చేస్తున్న బ్రహ్మ శరీరమునుండి అధర్వడు,అంగీరసుడు జన్మించారని వీరి వంశములవారిచేతనే అధర్వవేదము దర్శించబడిందని గోపధ భ్రహ్మణంలో చెప్పబడింది. ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం

ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదములెక్కువుగా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి.కానీ అధర్వవేదము మాత్రము ఇహలోకంలో భాధలు నివృత్తి చేసుకోవటానికి భౌతికసుఖాలుసాధనకు,ధనలభ్ధికి,ఇష్టకామ్యసాధనకు,శారీరక,మానసిక ఆరోగ్యప్రాప్తికి మంత్ర,తంత్ర ఔషధంగా ఉపయోగపడుతుంది.అంతేకాకుండా అభౌతికమైన పరలోక మోక్షప్రాప్తికి కూడా అధర్వవేదము మానవాళికి ఎంతో ఉపయోగకరము.

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదు. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

చరణవ్యూహ అథర్వణవేదము (శౌనక మహర్షికి ఆపాదించబడింది) తొమ్మిది శాఖలు, లేదా పాఠశాలలు జాబితా:

పిప్పలాద, దక్షిణ నర్మదా నది ప్రాంతాలు

1. స్తౌద

2. మౌద

3. శౌనకీయ, ఉత్తర నర్మదా నది ప్రాంతాలు

4. జాజల

5. జలద

6. కుంతప

7. బ్రమవాద

8. దేవదర్శ

9. చారణవైద్య
అధర్వవేదములో మొత్తము తొమ్మిదిశాఖలున్నాయి.ప్రస్తుతము రెండు శాఖలుమాత్రమే మనుగడలో వున్నాయి.ఆ రెండే పిప్పలాద,శౌనక శాఖలు. పిప్పలాదశాఖ కాశ్మీరంలో ఎక్కువవ్యాప్తిలోవున్నది.శౌనకశాఖ నాధారము చేసుకోని మేధావులెందరో మహానిర్వాణతంత్రము.రసతంత్రము వంటి మంత్ర,తంత్ర గ్రంధములను వెలువరించారు
Read More

21 మార్చి అంతర్జాతీయ వర్ణవివక్ష నిర్మూలనా దినోత్సవము21 మార్చి అంతర్జాతీయ వర్ణవివక్ష నిర్మూలనా దినోత్సవము

దక్షిణాఫ్రికాలోని షర్పెవిలే అనే నగరం‌ళొ వర్ణవివక్షా చట్టానికి వ్యతిరేకంగా మార్చి 21వ తేదీ (1960)న నల్ల జాతీయులు చేస్తున్న ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 69 మంది అక్కడికక్కడే మరణించారు. వర్ణవివక్షణను నిరసిస్తూ ఆ సంఘటన సంస్మరణార్ధం దక్షిణాఫ్రికాలో సెలవుగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షాదినంగా జరుపుకోవాలని 1966లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను కోరింది.

ప్రత్యక్షంగా వివక్షలేవీ కన్పించనప్పటికీ అనేక ప్రత్యామ్నాయ రూపాల్లో నేటికీ అది కొనసాగుతూనే ఉంది. ఈర్షాసూయ ద్వేషాల్లెని శాంతియుత సమాజాన్ని నిర్మించాలంటే జాతి వివక్షతతోపాటు కుల మత లింగ వర్ణ వివక్షతలను సైతం పారదోలాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
Read More

లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ.
3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ,
4. తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7. వైవస్వత మన్వంతరంలో కీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.


ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో -

భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను.

ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన.

ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో -
పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై - 'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించెను. శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యముకాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

క్షీరసాగరమధనం :- మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు".
క్షీరసాగర మధనం జరిగినప్పుడు - ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం "శివరాత్రి" అయింది.

ఇదియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది.
ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో 'సురభి' అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణ శుద్ధపూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే ''లక్ష్మీజయంతి"గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం.
ప్రాదుర్భవమే కాదు... పరిణయం కూడా !
ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగినదినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే!
సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు
నాదుడయ్యేనేసి నడప నోపు
నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు
బుష్పదామకమున బూజ సేసె !
'వక్షో నివాస మకరోత్ పరమం విభూతే / యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్' ... లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది.
లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి - ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!
శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటూ ...
వల్లూరి పవన్ కుమార్
Read More

ప్రత్యంగిరా ఉపాసన ......!ప్రత్యంగిరా ఉపాసన ......!

త్రేతాయుగములో రాక్షసరాజు రావణాసురుని తనయుడు ఇంద్రజిత్తు మహాగొప్ప మహాప్రత్యంగిరా సాధకుడు.ఆయన ఆ రోజుల్లో నికుంబలాదేవి పేరుతో ప్రత్యంగిరా ఉపాసనచేసాడు.అయితే ఈ ఉపాసన సిద్ధిస్తే ఇంద్రజిత్త్ ను యుద్ధంలో నిలవరించటం కష్టం అని తెలిసిన హనుమంతుడు ఇంద్రజిత్త్ సాధనను నిర్వీర్యం చేసాడని వాల్మీకి రామాయణంలో పెర్కోనబడింది.అయితే శ్రీ లలితా సహస్రనామాలలో ఈ తల్లిని జగజననీ లలితాంబికకు సేనాధిపతిగా వర్ణించారు విజ్ఞులైన అగస్త్య, లోపాముద్ర దంపతులు.
తత్వపరంగా ప్రత్యంగిరామాత రూపం దుష్టత్వంపై శిష్టత్వం సాధిచే విజయానికి ప్రతీక. మాత చేతి లోని ఆయుధాలు మానవాళి రక్షణకు సంకేతం అమె సిం హా ముఖం ఈ ప్రపంచాన్ని ఋణాత్మక శక్తి నుండి అంటే అభిచార కర్మలనుండి [ నెగిటీవ్ పవర్] రక్షించగలనని అభయమిస్తున్నట్లుంటుంది.
ప్రత్యంగిర సాధన గురించి మహామేరు తంత్రములో అత్యంత వివరంగా ఇవ్వబడింది.ప్రత్యంగిరను బాలాత్రిపురసుందరి చైతన్యాన్ని తత్వపరంగా మహాకాళి తో మిళితం చేసి మహాకాళిగానూ అలానే మహాలక్ష్మీ చైతన్యాన్ని తత్వపరంగా కమలాత్మికతో సంగమింపచేసి మహాకమలగానూ ,రాధాదేవి చైతన్యాన్ని తత్వపరంగా తారాదేవితో కలగలిపి మహాతారగానూ ఉపాసన చేయచ్చు అని "మహోదధి "అనే తంత్ర గ్రంధంలో పేర్కొనబడింది
ప్రత్యంగిరా సాధకులు అమావాస్యనాడు ,పౌర్ణమినాడుఎండు మిరపకాయలతో స్మశానంలో హోమంచేస్తారు ఉపాసనా తదనంతరం ఒ నల్లని కోడిని బలి ఇచ్చి రక్తాన్ని పారే నీటిలో కలుపుతారు కోడి మృతదేహాన్ని స్మశానంలో దక్షణ దిశలో పాతిపెడతారు. వేదోక్తంగా సాదన చేసేవారు నల్ల మిరియాలతో,కానీ నల్లనువ్వులతో కానీ హోమము చేస్తారు.కూష్మాండాన్ని అంటే మంచి గుమ్మడిని బలిగా సమర్పిస్తారు.తంత్రోక్తంగా సాధన చేసేవారు అమ్మవారి భీజాక్షరాలను ఓ సమర్ధుడైన శిల్పి చేత రాగిరేకు పై చెక్కించి ఆ ప్రత్యంగిరా యంత్రాన్ని షోడశొపచారంగా పూజించి ముద్రా సహితంగా వెయ్యసార్లు మంత్రాన్ని సాధనచేయ్యాలి. నలబైరోజుల పాటు దీక్షగా చేయ్యాలి. అందరూ సర్వసాధారణంగా జపించగల సాధారణ ప్రత్యంగిరా మంత్రాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ మంత్రం నూట ఇరవై ఐదు భీజాక్షరాలతోకూడినది
అమ్మవారి ఒక మంత్రాన్ని తెలియజేస్తున్నాము..
||ఓం హ్రీం నమః కృష్ణవాసనే విశ్వసహస్రహింసినీ సహస్రవదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోచ్ఛాదిని సర్వభూతదమని సర్వదేవాన్ బంధ బంధ సర్వవిద్యా ఛింది ఛింది క్షోభయ క్షోభయ పరతంత్రాణి స్పోటయ స్పోటయ సర్వశృంఖలాన్ త్రోటయ త్రోటయ జ్వల జ్వల జిహ్వే కరాళవదనే ప్రత్యంగిరే హ్రీం నమః||.. దీనిని 10000సార్లు జపించిన తరువాత 1000సార్లు మంత్రం జపిస్తూ నల్ల నువ్వులతో హోమం చేస్తే సిద్ధి అవుతుంది..
మీ ఒక్కొక్క కోర్కెను తలుచుకుంటూ 108 సార్లు నల్ల నువ్వులతో హోమం చేస్తే మీ కోరికలు ఎలాంటివైనా అమ్మ అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి...
ప్రత్యంగిర ఉపాసన వలన అనారోగ్యం నుండి విముక్తి లబిస్తుంది శత్రువులపై విజయం లభిస్తుంది సంపదలు సమకూరుతాయి.అభిచారకర్మల నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఈ మంత్ర సాధన చేసేవారు విధిగా పంచాక్షరి అక్షర లక్షలు జపంచేయాలి
న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!
సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యముకాబట్టి
హెచ్చరిక ఈ ప్రత్యంగిరా మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశంతీసుకుని సాధన చేస్తే త్వరగా మంచి పలితాలను సాధించ వచ్చు ముఖ పుస్తకంలోచూసి మంత్రసాధన చేసేవారు వారి బాగుగోలుకు వారే భాధ్యులు
Read More

ప్రత్యంగిరామాతకధ.....!

ప్రత్యంగిరామాతకధ.....!
ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది .
ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు.కానీ నరసిం హ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు.శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.
మహాప్రత్యంగిరరూపవర్ణన;- నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసిం హపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సిం హల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సు కు ఎల్లప్పుడు సిం హాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు
మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసిం హ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసిం హ అవతారాన్ని చాలించి యోగ నరసిం హ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసిం హిక అంటూ వర్ణించారు.
Read More

Monday, 28 March 2016

పంచముఖ అంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం

పంచముఖ అంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయస్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. రామ-రావణ యుద్ధంలో రావణుడు పాతాళానికి అధిపతి అయిన మహిరావణుడి సాయం కోరుకుంటాడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయనమందిరము (తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను వెదకడానికి పాతాళానికి వెళతాడు. పాతాళంలో వివిధ దిక్కులలో వున్న ఐదు దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేస్తా మహిరావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకున్న ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయస్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా, గరుడం వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేసి (ఆర్పి) శ్రీరామలక్ష్మణులను కాపాడుకుంటాడు.
ఆంజనేయస్వామి తూర్పుకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు గరుడు, పడమటి దిక్కువైపు ఆసీనుడై ఆయుర్ధాయ కాలాన్ని పెంపొందించేవాడు వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు నరసింహ, దక్షిణాముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. హయగ్రీవుడు, నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు. భక్తీ, జ్ఞాన వృద్ధికి కారకుడు. పరమగురు శ్రీ గురురాఘవేంద్ర స్వామికి ఆరాధ్యుడు పంచముఖ ఆంజనేయుడు కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు.
Read More

లలితా సహస్ర నామం ఎవరు పడితే వారు చదువకూడదు, ఎందుకంటే ?? లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదా ???లలితా సహస్ర నామం ఎవరు పడితే వారు చదువకూడదు, ఎందుకంటే ?? లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదా ???

ఇది ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చేయకూడదు. గురోపదేసం పొంది మాత్రమే  చేయాలి. కారణం నామం ఎక్కడ ఆపాలో, ఎక్కడ వరకు చదవాలో తెలియకపోతే, వ్యతిరేకార్ధము ఏర్పడి, దైవ దూషణకు కారణం అవుతుంది . అనుస్టుక్  ఛందస్సులో 2,4,8,16, అక్షరాల నామాలు మధ్యలో ఆపకుండా, విడువకుండా, చదువ వలసి వస్తుంది. ఇలా కాక ఎక్కడ పడితే అక్కడ ఆపి, చదివితే అది వ్యతిరేకార్డం పొంది చెడు ఫలితాలు పొందుతారు . లలితా సహస్ర నామం నిలబడి చదువ చదువకూడదు. ఎవరయినా  గురువు గారు పారాయణం చేయునపుడు జాగర్తగా విని, ఏ విధం గా యింతే వారు లలితా సహస్ర నామం పారాయణం చేసేరో చూసి అదే విధం గా పారాయణం చేసిన  మంచి ఫలితములు దక్కును . అంటే  కాని తెలిసి తెలియక, విని  వినక,  ఎలా పడితే అలా పారాయణం చేయకూడదు . ఏదయినా మంచి MP3 Audio  ద్వారా సహస్రనామం విని  అదే విధం గా పారాయణం చేయవచ్చు . ఎలా చేసిన భక్తీ తో ఆరాధన చేయండి . 


Read More

ఓ మనిషి ఇది నీ కొరకే.

నీ దగ్గర నైపుణ్యత ఉన్నప్పుడు, మీ MD/GM/....etc వంటి అధికారులు నిన్ను ఉద్యోగం నుండి తీసివేసిన పెద్దగ బాధ పడనక్కర్లేదు. ఎందుకంటే నిప్పు ఎక్కడున్నా మండుతూనే ఉంటుంది, ఎటువైపు తిప్పినా పైకి ఎగసి పడుతుంది . పెద్ద కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, ఏ ఉద్యోగం అయినా నెలకు ఒక సారే జీతం ఇస్తాడు, కాని రెండు సార్లు కాదు, ఎక్కడయినా రోజుకు 8- గంటలు పనిచేయాలి, అటువంటప్పుడు ఎక్కడ పని చేస్తే ఏమిటి ???? (నిప్పును వంట వండటానికి వాడుకోవచ్చు, సరిగ్గా వాడుకుంటే మంచి ఆహారాన్ని తయారుచేసుకుని కడుపు నిండా తింటావు, అదే నిప్పు వాడుకోవటం రానప్పుడు నీ చేతిని, నీవే కాల్చుకుంటావు. అలాగే, మంచి ఉద్యోగిని పనిచేయిన్చుకోవటం, చేయించుకోలేక పోవటం GM/MD..etc ల పై ఆధారపడి ఉంటుంది. రెండిటి వల్ల నష్టపోయేది GM/MD లే .) ఉద్యోగికి ఏమి కాదు, ఎందుకంటే వాడు ఎక్కడో అక్కడ పని చేసుకుంటూ బ్రతికేస్తాడు. పని చేసేవాడు ఎక్కడయినా పని చేస్తాడు. పని చేయకుండా చాడి లు చెప్పే వాడు, ఎక్కడున్నా అదే పని చేస్తాడు .
Read More

వైట్‌హౌస్ ఈస్టర్ వేడుకల్లో యోగా సెషన్స్ 2016వైట్‌హౌస్ ఈస్టర్ వేడుకల్లో యోగా సెషన్స్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఏడాది  2016  ఈస్టర్ వేడుకలను ప్రత్యేక రీతిలో జరుపుకుంటున్నారు సోమవారం జరిగే ఈ వేడుకల్లో యోగాకు విశేష స్థానం కల్పించారు. వైట్‌హౌస్‌లోని 10 వేర్వేరు జోన్లలో యోగాకు ప్రత్యేక జోన్‌ను కేటాయించారు
Read More

ఇవి మీకు తెలుసా ??. తెలియకపోతే ఒక సారి తెలుసుకోండి
Read More

Powered By Blogger | Template Created By Lord HTML