గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 February 2016

వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community … భారతీయ సమాజం

వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community … భారతీయ సమాజం
॥ వజ్రసూచికా ఉపనిషత్ ॥
ఇది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. వజ్ర సూచిక అంటే వజ్రముతో చేసిన సూది Diamond edged sharp pointed needle . అతి కఠినమైన పదార్థం వజ్రాన్ని మొనగా, అంచుగా కలిగియున్న సూక్ష్మమైన సూది. కఠినాతి కఠినమై ఉంటేనే ఆ సూచిక యొక్క సూక్ష్మత్వం నిలిచి ఉంటుంది. మొద్దుబారదు. వంగదు. ఇది ధర్మము యొక్క లక్షణానికి ప్రతీక. ధర్మాన్ని పాటించడం కత్తి అంచుపై నడక వంటిది. దాని పరీక్షకు కావలసినది వజ్ర సూచిక. వర్ణాశ్రమ ధర్మము అటువంటి ధర్మమే. ఆ ధర్మమును నిర్వచించి పరీక్షించగల సాధనమే ఈ ఉపనిషత్తు. ఈ వర్ణాశ్రమ ధర్మము కలిలో పాటించుటకు అతి కఠినమైనది. బహుళంగా అపార్థం చేసుకొనబడినది. గీతలో భగవంతుని వాక్యం - గుణముల, కర్మల ప్రాతిపదికపై నేను చతుర్వర్ణాలను సృష్టించాను - అనేదాన్ని విపులంగా భగవంతుని తత్త్వానికి అనుగుణంగా వేదభాగమైన ఈ ఉపనిషత్తు వివరిస్తుంది..
చిత్సదానన్దరూపాయ సర్వధీవృత్తిసాక్షిణే । నమో వేదాన్తవేద్యాయ బ్రహ్మణేఽనన్తరూపిణే ॥
ఓం వజ్రసూచీం ప్రవక్ష్యామి శాస్త్రమజ్ఞానభేదనమ్ । దూషణం జ్ఞానహీనానాం భూషణం జ్ఞానచక్షుషామ్ ॥ 1॥
మొదటి మంత్రం - ఇది అజ్ఞానాన్ని నశింపచేసే శాస్త్రం. జ్ఞాన హీనులను దూషించి జ్ఞాన దృష్టి కలవారికి భూషణముగా పనిచేస్తుంది.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రా ఇతి చత్వారో వర్ణాస్తేషాం వర్ణానాం బ్రాహ్మణ ఏవ ప్రధాన || ఇతి వేదవచనానురూపం స్మృతిభిరప్యుక్తమ్ ॥2॥
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలున్నాయి. అందులో బ్రాహ్మణులు ప్రధానులు అనే వేదవాక్యములకు అనుగుణంగానే స్మృతులుకూడా చెబుతున్నాయి. ఇది కొంత విచారించవలసిన విషయం. ఈ ఉపనిషత్తు ఇలా చెప్పేసరికి వేయి ప్రశ్నలు పుట్టాయి.
తత్ర చోద్యమస్తి కో వా బ్రాహ్మణో నామ కిం జీవః కిం దేహః కిం జాతిః కిం జ్ఞానం కిం కర్మ కిం ధార్మిక ఇతి ॥
అసలు ఎవరు బ్రాహ్మణుడు? జీవుడా? దేహమా? జాతి (పుట్టుక) వలనా? జ్ఞానం వలనా? కర్మ వలనా? ధర్మాచరణ వలనా? బ్రాహ్మణుడు ప్రధానమనే పలుకు చోద్యంగా ఉన్నది.
తత్ర ప్రథమో జీవో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । అతీతానాగతానేకదేహానాం
జీవస్యైకరూపత్వాత్ ఏకస్యాపి కర్మవశాదనేకదేహసమ్భవాత్ సర్వశరీరాణాం
జీవస్యైకరూపత్వాచ్చ । తస్మాత్ న జీవో బ్రాహ్మణ ఇతి ॥
జీవుడు బ్రాహ్మణుడా? కాదని తెలుస్తూనే ఉన్నది. “అతీతానాగతానేకదేహానాం” - గడచినవి రాబోయేవీ ఐన అనేకదేహాలలో జీవుడు సమానముగానే ఉండునుకదా? ఆ జీవునికి బ్రాహణత్వము ఎందుకు ఎక్కడ, వస్తుంది?. అవస్థాభేదములేని జీవునకు వర్ణమే లేదు.
తర్హి దేహో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । ఆచాణ్డాలాదిపర్యన్తానాం మనుష్యాణాం
పఞ్చభౌతికత్వేన దేహస్యైకరూపత్వాత్ |
జరామరణధర్మాధర్మాదిసామ్యదర్శనత్ బ్రాహ్మణః శ్వేతవర్ణః క్షత్రియో
రక్తవర్ణో వైశ్యః పీతవర్ణః శూద్రః కృష్ణవర్ణః ఇతి నియమాభావాత్ ।
పిత్రాదిశరీరదహనే పుత్రాదీనాం బ్రహ్మహత్యాదిదోషసమ్భవాచ్చ ।
తస్మాత్ న దేహో బ్రాహ్మణ ఇతి ॥
పోనీ దేహము బ్రాహ్మణుడందామా? అదీ సరికాదు. బ్రాహ్మణునినుండి చండాలుని వరకు అదేదేహము, అదే రక్త మాంసములు అదే చర్మము. అవే పంచ భూతములతో నిర్మాణము చేయబడిన దేహము. వర్ణము పదానికి రంగు అనే అర్థము తీసికొంటే బ్రాహ్మణుడు శ్వేత వర్ణముతోనూ, క్షత్రియుడు రక్తవర్ణముతోనూ, వైశ్యుడు పీత వర్ణముతోనూ శూద్రుడు కృష్ణ వర్ణముతోనూ లేరు కదా? పోనీ దేహము బ్రాహ్మణుడే అయితే మృతదేహాన్ని దహనంచేసిన పుత్రునకు బ్రహ్మహత్యాదోషం రావాలి కదా? అందుచేత దేహానికి బ్రాహ్మణత్వం లేదు.
తర్హి జాతి బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । తత్ర జాత్యన్తరజన్తుష్వనేకజాతిసమ్భవాత్ మహర్షయో బహవః సన్తి ।
ఋష్యశృఙ్గో మృగ్యాః, కౌశికః కుశాత్, జామ్బూకో జామ్బూకాత్, వాల్మీకో
వాల్మీకాత్, వ్యాసః కైవర్తకన్యకాయామ్, శశపృష్ఠాత్ గౌతమః,
వసిష్ఠ ఉర్వశ్యామ్, అగస్త్యః కలశే జాత ఇతి శృతత్వాత్ । ఏతేషాం
జాత్యా వినాప్యగ్రే జ్ఞానప్రతిపాదితా ఋషయో బహవః సన్తి । తస్మాత్
న జాతి బ్రాహ్మణ ఇతి ॥
ఈ శ్లోకం అనేకరకాలుగా ముఖ్యమైనది. అర్థం కనబడుతోనే ఉన్నది. జాతి (పుట్టుక) వలన బ్రాహ్మణులు అంటే వేద ద్రష్టలైన బ్రహ్మర్షుల, మహర్షుల జన్మ వృత్తాంతాలు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వైదిక సాహిత్యాన్ని విభజించి ఇతిహాస పురాణ వేదాంత గ్రంథాలను రచించిన వ్యాసుని తల్లి జాలరి వనిత. అందుచేత జన్మ బ్రాహ్మణత్వానికి కారణము కాదు. ఈ శ్లోకం ఇంకా చర్చించాలి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML