గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 February 2016

దేశం కోసం, ధర్మ కోసం అపూర్వ బలిదానం - గురుతేగ్ బహదూర్దేశం కోసం, ధర్మ కోసం అపూర్వ బలిదానం - గురుతేగ్ బహదూర్

గురు తేగ్ బహదూర్

అది 1669 ఏప్రిల్ మాసం. ఔరంగజేబు సైనికులు కాశీలో విధ్వంసకాండ సాగిస్తున్నారు. కాశీలో సంస్కృత విద్యాలయాన్ని ధ్వంసం చేశారు. కాశీ విశ్వనాథ మందిరాన్ని నాశనం గావించారు. ఇదంతా ఎందుకు? కాశీ పండితులను మతం మారిస్తే దేశంలోని హిందువులంతా మతంమారుతారని ఔరంగజేబు విశ్వాసం. కాశీ పండితులు ఔరంగజేబు హింసలను తట్టుకోలేక కాశ్మీర్ పండితుల వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు.
కాశ్మీర్ పండితులు కాశీ పండితులతో 'కాశ్మీరు పండితులను మతం మార్చగలిగితే మేము కూడా మతంమారతామని ఔరంగజేబుతో చెప్పండి' అన్నారు. వెంటనే ఔరంగజేబు కాశీ పండితులను వదిలి, కాశ్మీరు పండితులను వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులను ఊహించలేని కాశ్మీరు పండితులు వాటికి తట్టుకోలేక 1672లో పంజాబులోని సిక్కు సంప్రదాయ గురువైన గురు తేగ్ బహదూర్ వద్దకు వచ్చి ఔరంగజేబు తమను హింసిస్తున్న విషయాన్ని విన్నవించుకొని, తమకు దారిచూపమని వేడుకున్నారు.
గురుతేగ్ బహదూర్ కు పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నట్లు కనబడ్డాయి. ఏమి చేయాలో ఆలోచించసాగాడు. 'ఎవరైనా ఒక మహాపురుషుడు బలిదానం కావటానికి సిద్ధపడాలి' అని అన్నాడు. ఆ సమయంలో అతని ప్రక్కనే కూర్చుని ఉన్న 9 ఏళ్ళ వయసున్న అతని కుమారుడు గోవింద్ సింగ్ 'నాన్నా! మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?, ధర్మం ఇప్పుడు త్యాగాన్ని కోరుతున్నది' అన్నాడు. ఇది విన్న తేగ్ బహదూర్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. కాశ్మీర్ పండితులతో ఇలా చెప్పాడు 'గురు తేగ్ బహదూర్ ను మతం మార్చగలిగితే మేమందరం మతంమారతామని ఔరంగజేబుకు చెప్పండి'.
ఈ వార్త ఆఘమేఘాలమీద ఔరంగజేబుకు తెలిసింది. వెంటనే ఔరంగజేబు నుండి గురుతేగ్ బహదూర్ కు ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చింది. గురు తేగ్ బహదూర్ తనతో పాటు మరొక ఐదుగురు శిష్యులను వెంట తీసుకొని ఢిల్లీ బయలుదేరాడు. దారిలో ప్రజలకు ధైర్యం చెబుతూ, విశ్వాసం కలిగిస్తూ ప్రయాణం సాగుతుండగా దారిలోనే ఔరంగజేబు సైనికులు గురుతేగ్ బహదూర్ బృందాన్ని నిర్బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళారు.
ఢిల్లీలో ఔరంగజేబు గురుతేగ్ బహదూర్ ముందు మూడు షరతులు పెట్టాడు. 1) ఇస్లాం మతం స్వీకరించటం, 2) ఏదైనా మహత్తు చూపించి తన గురుత్వాన్ని నిరూపించుకోవటం, 3) ఆ రెండు అంగీకరించకపోతే మరణశిక్షకు సిద్ధం కావటం.
ఔరంగజేబు విధించిన మొదటి రెండు షరతులకు తేగ్ బహదూర్ ఒప్పుకోలేదు. ఇక మూడవ షరతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. గురుతేగ్ బహదూర్ ను భయభ్రాంతులకు గురిచేసి ఎలాగైనా మతం మార్చాలనే ఉద్దేశంతో, కుట్రతో ఉన్నాడు ఔరంగజేబు. ఔరంగజేబు సైనికులు ముందుగా తేగ్ బహదూర్ శిష్యుడైన భాయి దయాళ్ ను సలసలా కాగే నూనెలో వేసి అతి క్రూరంగా హతమార్చారు. రెండవ శిష్యుడైన భాయిసతిదాస్ ను రగ్గులతో చుట్టి ఎండలో వేసి, నూనెపోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మూడవ శిష్యుడైన భాయిమతిదాస్ ను చెక్కలమధ్య నిలువుగా బంధించి, జీవంతో ఉన్న మనిషిని పై నుండి క్రిందకు నిలువుగా రంపంతో కోసి చంపారు. మిగిలిన ఇద్దరు శిష్యులను కూడా ఇదేవిధంగా అనేక చిత్రహింసల పాలు చేసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఐదుగురి అనంతరం చివరిగా గురుతేగ్ బహదూర్ వంతువచ్చింది.
అది 1675 నవంబరు మాసం. చివరిసారిగా మతంమారమని గురుతేగ్ బహదూర్ ను మరోమారు హెచ్చరించాడు ఔరంగజేబు. మౌనమే తేగ్ బహదూర్ సమాధానమయ్యింది. ఔరంగజేబు ఆగ్రహంతో తేగ్ బహదూర్ తలను నరికివేయమని తలారికి ఆదేశమిచ్చాడు. తలారి ఔరంగజేబు ఆదేశానుసారం కత్తితో ఒక్కసారిగా గురుతేగ్ బహదూర్ తలను ఖండించాడు. ఖండించబడిన తల మొండెం నుండి వేరయి దూరంగా ఎక్కడో ఉన్న మోచీ (చెప్పులు కుట్టుకునే మనిషి) పట్టాపై పడింది.
అతను (మోచీ) వెంటనే అప్రమత్తమై ఆ తలను తీసుకొని పరుగెత్తుకుంటూ ఆనందసాహెబ్ చేరి, అక్కడ ఉన్న తేగ్ బహదూర్ కుమారుడు గురుగోవింద్ సింగ్ కు అందచేశాడు. గురుగోవింద్ సింగ్ తన తండ్రి గురుతేగ్ బహదూర్ తలకు అంతిమసంస్కారం నిర్వహించాడు.
ఈ విధంగా మహాపురుషుడైన గురు తేగ్ బహదూర్ బలిదానమయ్యాడు. ఆ బలిదానం వృధా పోలేదు. అతని తరువాత అతని కుమారుడైన గురు గోవింద్ సింగ్ ధర్మరక్షణ కోసం సైన్యాన్ని తయారుచేసి, ఔరంగజేబుపై వీరోచిత పోరాటం చేశాడు. సనాతన ధర్మ రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ఉదాహరణలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి ధార్మిక నిష్ఠ కలిగిన దేశం మనది.
ఇస్లాం వికృత రూపం ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా కనబడుతున్నది. నేడు కూడా మతం పేరుతో అనేకమందిని ఇస్లాం తీవ్రవాదులు హతమారుస్తున్నారు. 1675లో పరిస్థితులు ఒకరకంగా ఉంటే, 2014లో మరొకరకంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇస్లాం సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని విస్తరించటం కోసం అందరిని మతం మార్చాలని ప్రయత్నించేవారు. ఈ రోజున ఇస్లాం సామ్రాజ్య నిర్మాణం కోసం ప్రపంచమంతా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏ కాలంలోనైనా ఇస్లాం లక్ష్యం - ఇస్లాం సామ్రాజ్య స్థాననే, అంతటినీ ఇస్లామీకరించటమే.
పరిస్థితులను అర్థం చేసుకొని దానికి తగినవిధంగా సమాధానం చెప్పలేని నాయకత్వం కొరవడిన కారణంగా ఆ రోజున బలిదానాలు చేయవలసి వచ్చింది. ఇస్లాం నుండి సమస్యలను ఎదుర్కొంటున్న నేటి కాలంలో దానికి సరియైన సమాధానం చెప్పగలిగిన, ధీటుగా ఎదుర్కోగలిగిన సరైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉన్నది. అటువంటి నాయకత్వం కోసం నేడు ప్రపంచం ఎదురుచూస్తున్నది. అంతకుముందుగా వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియచేసి వారిని జాగృతం చేయవలసి ఉన్నది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML