గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 17 February 2016

మొదటి బిడ్డ ఆడపిల్ల పుడితే ????

మొదటి బిడ్డ ఆడపిల్ల పుడితే
రెండవ బిడ్డకు దేవుడిచ్చిన
రెండో అమ్మనే అక్క....!!!


Read More

ఆయుర్వేదం నీటిని ఎలా త్రాగాలి అనేది చెప్పింది.............!!!

ఆయుర్వేదం నీటిని ఎలా త్రాగాలి అనేది చెప్పింది.............!!!
ఈ మధ్యకాలంలో జపాన్ వారు 200కోట్ల డాలర్ల ఖర్చుతో ఒక పరిశోధన నిర్వహించారు. ఆ పరిశోధన నిరూపించిన విషయమేమిటంటే ఉదయాన్నే నిద్ర లేవడంతోనే పళ్ళుతోముకోకుండా ఒక లీటరు నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయి అని.
నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ఆయుర్వేద శాస్త్రవేత్త ఈ విషయాన్ని మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకుండా చెప్పాడు.
దాన్ని ఉషఃపానం అనే పేరుతో పిలుస్తారు. నీళ్ళు ఎలా త్రాగాలో ఇప్పుడు చూద్దాం.
రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచుకోవాలి.
ఉదయాన్నే నిద్ర లేవడం తోనే ఆ లీటరు నీళ్ళు త్రాగాలి. ఈవిషయం అందరూ చెబుతారు కానీ ఇక్కడ ఒక్క నియమం పాటించాలి.
ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి, పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి. అంతేకాదు నీళ్ళు గడ గడా త్రాగకూడదు. క్రిందకూర్చుని కొంచెం కొంచెంగా(సిప్ చేస్తూ) టీ త్రాగినట్టు, కాఫీ త్రాగినట్టు త్రాగాలి. అంతేకానీ నీళ్ళు ఒక్కసారిగా గ్లాసు ఎత్తి పట్టుకుని గడ గడా త్రాగకూడదు. ఇదీ నీళ్ళు త్రాగే విషయంలో పాటించాల్సిన ఖచ్చితమైన విషయం.
మరోవిషయం, నీళ్ళు ఎన్నిత్రాగాలి...
అందరూ ఏం చెబుతున్నారంటే, రోజూ ఖచ్చితంగా 5 లీటర్ల నీరు త్రాగాలి అని . ఇది చాలా అసంబద్దమైన విషయం. మన బరువును 10తో భాగించి దానిలో నుండి రెండు తీసివేస్తే ఎంత అంకె వస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి.
ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకుంటే, 60 ని 10 తో భాగిస్తే 6, దీనిలో 2 తీసివేస్తే 4. అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి.
మరో విషయం ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి. "భోజనాంతే విషం వారి". అనేది సూత్రం.
అంటే భోజనం తరువాత నీరు త్రాగండం విషంతో సమానం అని. కొద్దిగా గొంతు తడుపుకోవడానికి, తిన్నతరువాత రెండు లేదా మూడు గుటకల నీరు త్రాగవచ్చు. నీటి విషయంలో ఈ నియమాన్ని పాటిస్తే మలబద్దకం, గ్యాస్ మొదలైన ఉదర సంబంధరోగాలకు దూరంగా ఉండవచ్చు.
మంచినీళ్ళకు మట్టి కుండలు వాడండి
Read More

అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితయా? ఆమె దైవస్వరూపం ఎలా అయ్యారు? ఆమె కధ ఏమిటో చూద్దాం.
బీబీ నాంచారమ్మ! `నాచియార్` అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తిన కి బయలుదేరాడు.
హస్తిన కి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం… అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తిన కి ప్రయాణమయ్యారు.
రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.
మరొక కధ ఏమిటంటే…ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !
Read More

ఉడిపి ( శ్రీ కృష్ణదేవాలయం )-దేవాలయాలు

ఉడిపి ( శ్రీ కృష్ణదేవాలయం )-దేవాలయాలు
ఉడిపి కర్ణాటక రాష్ట్రంములోని ఒక జిల్లా. మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది.
ఆధ్యాత్మిక ఆనందాన్ని, అద్వితీయ అనుభవాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చే క్షేత్రం ఉడిపి. పశ్చిమ కనుమలలో అందమైన ప్రకృతి వడిలో ఉంది. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు.
స్థల పురాణం:
ఈ కృష్ణదేవాలయం , విగ్రహం ఏర్పాటు వెనుక ఎన్నో గాధలు ఉన్నాయి. గోపీ చందనం పూతతో ఉన్న ద్వారకలోని శ్రీ కృష్ణవిగ్రహం ఒకటి మిగతా కలపతో పాటు ఒక ఓడలో కలిసిపోయింది. ఆ ఓడ పశ్చిమ తీరం వైపు ప్రయాణిస్తోంది. ఇంతలో తుఫాను రాగా ఆ ఓడ పశ్చిమతీరంలోగల 'మాల్పె' పట్టణం వద్ద చిక్కుకుపోయింది. ఉడిపిలో తపస్సు చేస్తున్న మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో ఈ ఓడ గురించి తెలుసుకుని తన వద్ద ఉన్న కాషాయ కండువాను ఊపగా తుఫాను శాంతించింది. ఓడ తీరాన్ని చేరిన తర్వాత విషయం తెలుసుకున్న ఓడ కెప్టెన్‌ మధ్వాచార్యుల వద్దకు వచ్చి సాష్టాంగ పడి ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా ఏదైనా కోరుకోమని అడిగాడు. ఆ ఓడలో చందన పూతతో ఉన్న కృష్ణవిగ్రహం ఒకటి ఉంది దానిని ఇమ్మని మధ్వాచార్యులు కోరారు. తర్వాత ఆయన దీన్ని సరస్సులో శుభ్రం చేసి, అభిషేకించిన అనంతరం మఠంలో ప్రతిష్టించారు.
మరో కథనం ప్రకారం, తుఫానులో చిక్కుకున్న ఓడతో పాటు కృష్ణవిగ్రహం కూడా నీళ్లలో మునిగింది. కొన్నేళ్ల తరువాత ఉడిపి వచ్చిన మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో సముద్రంలో మునిగిన కృష్ణవిగ్రహాన్ని కనుగుని ఉడిపి తీసుకువచ్చి సంక్రాంతి నాడు ప్రతిష్టించారని చెబుతారు. కృష్ణ విగ్రహానికి అభిషేకం చేయించిన సరస్సును ఇప్పుడు 'మాధవ సరోవరం ' గా పిలుస్తున్నారు. కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించిన గుడిని ఉడిపి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మధ్వాచార్యులు 13వ శతాబ్ధంలో లేదా 16వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు చెబుతారు.
దేవాలయ విశిష్టత:
భక్తులు కిటికీ గుండా కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి గల కారణాలపై మరో కథనం ఉంది. వాధిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు కృష్ణునికి మహాభక్తుడు. ఎలాగైనా ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని అతను తహతహలాడుతుండేవాడు. కాని అతను కడజాతి వాడు కనుక అతన్ని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుక వైపున గోడకు చిన్న కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఆ కిటికీకి 'కనకనకిండి ' అనే పేరు వచ్చింది. అయితే అక్కడ నుంచే కృష్ణుణ్ణి దర్శనం ముగ్ధమనోహరంగా లభిస్తుండడం మరో విశేషం.
ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది.
ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవడు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షణం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది.
ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
ఉత్సవాలు:
ఇక్కడ ఉదయం 5 నుంచి ఎన్నో పూజలు, సేవలు మొదలవుతాయి. మధ్య నవమి, రామ నవమి, నృసింహ జయంతి, భాగీరథ జన్మదినం, కృష్ణలీలోత్సవం, గణేష్ చతుర్థి, అనంత చతుర్థి, సుబ్రహ్మణ్య షష్టి, నవరాత్రి, దసరా, హోలి, వసంత పూజ, జాగరణ సేవ, తులసీ పూజ, లక్షదీపోత్సవం, ధనుపూజ ఇంక ఎన్నో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు ఏడు రోజులు సప్తోత్సవం పేర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున ఇక్కడ నిర్వహించే చర్నోత్సవ సేవలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని తరిస్తారు.
ప్రతీ రెండేళ్లకోసారి పర్యోత్సవం నిర్వహిస్తారు. ఈ రెండు ఉత్సవాలను చుడ్డానికి భక్తులు ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ బంగారు రథంలో శ్రీకృష్ణునికి నిర్వహించే ఉత్సవం చూసి తీరాల్సిందే. ఈ రథంలో ఊరేగుతున్న కృష్ణుడు నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చి మరీ ఊరేగుతున్నాడా అన్నంత అనుభూతిని అందిస్తుంది.
ఇతర దేవాలయాలు:
ఈ ఉడిపిలో కృష్ణాలయంతో పాటూ చంద్రేశ్వర, అనంతేశ్వర ఆలయాలను కూడా తప్పనిసరిగా దర్శించాలి. ఈ యాత్రలో మొదటి సారిగా చంద్రేశ్వర, అనంతేశ్వరాలయాలను దర్శించిన తర్వాత ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకుంటారు.
చంద్రేశ్వరాలయాం: దక్షప్రజాపతి ఇచ్చిన శాపవిముక్తికి చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశంలో చంద్రేశ్వరాలయాన్ని నిర్మీంచినట్లు చెబుతారు.
అనంతేశ్వరాలయం: పరశురాముని శిష్యుడు రామభోజరాజు అనంతేశ్వరున్ని ప్రతిష్టించారని చెబుతారు.
ఉడిపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు (కృష్ణ మఠాలు) ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడిపి రథవీదిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.
అవే పుత్త్తిగె ,పేజావర ,పలిమారు ,అదమారు ,సోదె ,శీరూరు ,కాణియూరు ,కృష్ణాపుర మఠాలు.
Read More

శ్రీ జ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్శ్రీ జ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్

విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్ ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్ బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్
పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధికామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్
తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్
నమోస్తు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో
నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో
నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై
నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై
నమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
నమోస్తు సర్వపాప సంహరికాయై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి
శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహస్తు!!
Read More

చంద్రదర్శనం

చంద్రదర్శనం
మన ప్రాచీనులు ఉపవాస దీక్షలను తమ ప్రాపంచిక జీవితంలో ఓ బాగంగా మలచుకున్నారు. ఈ ఉపవాసాలు ఎన్నో సత్ఫలితాలు కలిగించడమే కాక భగవంతుడి కృపకు పాత్రులను చేస్తాయని వారు గుర్తించడం జరిగింది. చంద్రదర్శనం రోజు ఉపవాసాన్ని పాటిస్తే పితృదేవతలకు (చనిపోయిన వారి బంధువులకు) సంతృప్తి కలుగుతుందని భావింపబడింది. అలా పితృదేవతలను సంతుష్ట పరచడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని సంపదను మరియు శుభాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ఉపవాసం ఉన్న రోజుల్లో పుణ్య తీర్థాలలో స్నానం చేస్తున్నప్పుడు పితృదేవతలను స్మరిస్తూ నైవేధ్యాలను వారికి అర్పించాలని చెప్పబడింది. అలాంటి రోజుల్లో ఒంటి భోజనాన్ని గ్రహిస్తుండాలి. అలాగే దీక్షలో ఉన్న క్రితం రోజు కూడా ఒంటి పూట భోజనమే చేయాలని నిర్దేశించబడింది. చంద్రదర్శనం రోజు వెలుగని చంద్రుడి భాగం భూమివైపు ముఖాన్ని ఉంచి ఉంటుంది. దీని ప్రబావం మన శరీరంపై కూడా వుంటుంది. ఉపవాసం ఉండటం వల్ల చంద్ర ప్రభావం మన శరీరంపై చెడును కలిగించకుండా ఉంటుంది. ఆ చంద్రుడి ప్రభావం వల్ల సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయనే వాస్తవం నిరూపింతమైనదే !
Read More

మాఘశుక్ల నవమి ‘మధ్వ నవమి’ గా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం

మాఘశుక్ల నవమి ‘మధ్వ నవమి’ గా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం- శ్రీమధ్వాచార్యుల శ్రీవారి అవతారం. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ పజక క్షేత్రంలో జన్మించారు. వాసుదేవుడని నామకరణం చేశారు. పన్నెండో ఏట అక్షితప్రేక్ష తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. ఆ వయస్సులోనే సకల శాస్త్ర జ్ఞానం సంపాదించుకున్నందువల్ల గురువులు వాసుదేవుడికి పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యే మార్గానికి చిహ్నంగా- శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.
శూన్యవాదం, నిరీశ్వరవాదం ప్రబలి, జాతిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఆయన సదాచారాన్ని ప్రబోధించారు. ప్రభువుకు సత్కర్మలను నివేదించమని భక్తులకు ఆదేశించారు. వేదం కేవలం కర్మకాండ కాదు, నిత్య జీవన విధానానికి అన్వయించదగ్గ ఒక దివ్య ప్రబంధమని నిర్వచించారు. ఒక అనుష్ఠాన వేదాంతిగా భగవద్గీత, బ్రహ్మసూత్ర, మహాభారత, భాగవత పురాణ ఇత్యాది గ్రంథాలకు విపుల వ్యాఖ్యానాలు సమకూర్చారు. ప్రథమ హనుమ, ద్వితీయ భీమ, తృతీయ పూర్ణప్రజ్ఞ అన్న విశ్వాసం మేరకు శ్రీమధ్వాచార్యులు ఎన్నో మహిమలను ప్రదర్శించారంటారు. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.
రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యులవారే. నేటికీ అనునిత్యం సుప్రభాత సేవలతో శ్రీకృష్ణ సేవా కార్యక్రమాలు ఆ క్షేత్రంలో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. అలా జరగటానికి అనువుగా, ఎనిమిది మఠాలను శ్రీమధ్వాచార్యులు ఏర్పాటుచేసి, ఎనమండుగురు తీర్థులను ప్రతినిధులుగా చేశారు. హృషీకేశ తీర్థులు పాలకూర్ మఠానికి, నరసింహ తీర్థులు అడమారు మఠానికి, జనార్దన తీర్థులు కృష్ణపుర మఠానికి, ఉపేంద్ర తీర్థులు పుట్టిగె మఠానికి, వామన తీర్థులు షిరూర్ మఠానికి, విష్ణుతీర్థులు సోడె మఠానికి, రామతీర్థులు కనిమార్ మఠానికి, అధోక్షజ తీర్థులు పెజావర మఠానికి అధిపతులై, గురువు ఆజ్ఞ మేరకు ‘పర్యాయ’ క్రమంలో కృష్ణుణ్ని కొలవటం గమనించదగ్గ విశేషం. ఈ పర్యాయ కార్యక్రమం ఇప్పటికీ క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉంది.
శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవిత కాలంలో మూడు పర్యాయాలు బదరీ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరి యాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వనవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అటు అతివాదానికి ఇటు మితవాదానికి మధ్యే మార్గంగా శ్రీమధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ఒక హితవాదమనే చెప్పాలి. అహం బ్రహ్మాస్మి అయితే నువ్వెవరివి అన్న ప్రశ్నకు, కేవలం శరణాగతి అయితే నీ గతేమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా తత్వవాదాన్ని ఆచార్యులవారు అనుసంధించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలతోపాటు కర్తవ్య కర్మ ఆచరణ ద్వారా శ్రీచరణాలు చేరవచ్చునని మార్గదర్శనం చేశారు.
జగత్తు మాయా మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వతంత్రుడు. జీవోత్తముడు ఆచార్యుడు. ధర్మమార్గంలో, ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యం.
జీవిత కాలంలో ఆనందానుభూతి పొందగల సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన బోధించారు. అందుకే ఆచార్యులవారికి ఆనంద తీర్థులన్న నామధేయం బహుళ ప్రచారంలో ఉంది.
వల్లూరి పవన్ కుమార్
Read More

తమిళనాడులో వర్ణ వినాయకుడు తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది.

తమిళనాడులో వర్ణ వినాయకుడు తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...‘పిట్ట కొంచం కూత ఘనం’ అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే.... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాకా, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. ఈ ఆలయానికో చారిత్రక చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లడం జరుగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.


Read More

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.
అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .
4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.
5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలో.మాత్రమే
6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.
7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.
8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది .
ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి
9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.
10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.
11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.
13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.
14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
Read More

మనకు పురాణాల్లో చాలా పాత్రలు కనిపిస్తుంటాయ్.. అయితే ప్రతి పాత్ర పేరుకు ఓ పరిపూర్ణ అర్థం ఉంటుంది. వీరి పేరులోని అర్థాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే వారి పుట్టుకకు కారణమైన అంశాలు,

మనకు పురాణాల్లో చాలా పాత్రలు కనిపిస్తుంటాయ్.. అయితే ప్రతి పాత్ర పేరుకు ఓ పరిపూర్ణ అర్థం ఉంటుంది. వీరి పేరులోని అర్థాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే వారి పుట్టుకకు కారణమైన అంశాలు, వారి స్వభావం ఇత్యాదివి వెంటనే స్పురిస్తాయి. వారి నామం వెనుకున్న హిస్టరీ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి, భారతీయ పురాణాలను తెల్సుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
అనసూయ – అసూయ లేనిది
అర్జునుడు – స్వచ్చమైన చాయ కలవాడు
అశ్వత్థామ – గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
ఆంజనేయుడు – ‘అంజన’కు పుట్టినవాడు.
ఇంద్రజిత్తు – ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
ఊర్వశి – నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
కర్ణుడు – పుట్టుకతో ‘కర్ణ’కుండలాలు కలవాడు.
కుంభకర్ణుడు – ఏనుగు యొక్క ‘కుంభస్థల’ ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
కుచేలుడు – చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
కుబేరుడు – నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
గంగ – గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
గరుత్మంతుడు – విశిష్టమైన రెక్కలు కలవాడు
ఘటోత్కచుడు – కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
జరాసంధుడు – ‘జర’ అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
తుంబురుడు – తుంబుర (వాద్య విశేషము) కలవాడు
దశరధుడు – దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
ధృతరాష్ట్రుడు – రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
త్రిశంకుడు – 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
శంకువులు(పాపాలు) చేసినవాడు.
దమయంతి – 1. ‘దమనుడు’ అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
దుర్వాసుడు – దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
దుర్యోధనుడు – (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
దుశ్శాసనుడు – సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
ద్రోణుడు – ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
ధర్మరాజు – సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
నారదుడు – 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
ప్రద్యుమ్నుడు – ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
ప్రభావతి – ప్రభ (వెలుగు)కలది.
ప్రహ్లాదుడు – భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
బలరాముడు – బలముచే జనులను రమింపచేయువాడు.బృహస్పతి – బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)
భరతుడు – అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
భీముడు – భయమును కలిగించువాడుభీష్ముడు – తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను
వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
మండోదరి – పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
మన్మధుడు – మనస్సు కలత పెట్టువాడు
.మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
2. ‘మహిష్మతి’ అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
యముడు – యమము (లయ)నుపొందించువాడు.
యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
రాముడు – రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
రావణాసురుడు – కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు
రుక్మిణి – రుక్మము(బంగారము) కలది
వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.
వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
విదురుడు – బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
విభీషణుడు – దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
శంతనుడు – శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
శకుంతల – శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
శూర్పణఖ – చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
సగరుడు – విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
సత్యభామ – నిజమైన కోపము కలది ( భామ – క్రోధే)
సీత – నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది.
Read More

అలంపురం అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అలంపురం అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అలంపురం క్షే త్రంలో నవ బ్రహ్మల ఆలయాలున్నాయి. ప్రపంచ చరిత్రలోనే నవ బ్రహ్మల దివ్యధామం గా ఈ క్షేత్రం వెలుగొందుతోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపూరంలో వెలసిన జోగుళాంబా దేవీ 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతుంది. క్షేత్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, మహాగణపతి పూజ, ఋ త్విక్వరణం, మహా కలశ స్థాపన, ఆవాహిత దేవతా హోమం, బలిహరణ, నీరాజ మంత్ర పుష్పములు మొదలగునవి నిర్వహిస్తారు. శనివారం శ్రీపంచమి రోజు అమ్మ వారికి నిత్యహోమములు, మహా పూర్ణహుతి, కలశ ఉద్వాసన, అనంతరం అవబృత స్నానం, పంచామృతాబిషేకములు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం స్వామి అమ్మ వార్ల శాంతి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించున్నట్లు ఆలయ ఈఓ గురురాజా, పాలక మండలి అధ్యక్షురాలు లక్ష్మీనారాయణరెడ్డి చెప్పారు.
Read More

వసంత పంచమి

వసంత పంచమి
సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది.
అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.
సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. అందుచేత వసంత పంచమి నాడు విద్యాభ్యాసం మొదలెడితి జ్ఞానులవుతారు. విద్యాభ్యాసమే కాకుండా శుభకార్యాలకు వసంతపంచమి మంచి రోజు అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
బాసర ప్రత్యేకత
బాసర ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన గ్రామము. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి.
హిందూ మతం పురాణాల ప్రకారం, వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వారు సరస్వతి, లక్ష్మీ మరియు కాళి. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు.
ఈ ఆలయమును చాళుక్య రాజులు నిర్మించారు.శ్రీ పంచమి మరియు నవరాత్రి పండుగలు ఆలయం వద్ద పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము వుంటుంది.


మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి, శ్రీ పంచమి అని పేర్లు.
అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి.
సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. ‘యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥
మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలనీ, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.
బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు. గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.
వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి, పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.
పరాపర విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహంవలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు, మాంద్యం తొలగుతాయి. మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. అందుకే ‘‘నిశే్శష జాడ్జాపహా’’ అన్నారు. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు.
Read More

ప్రపంచ గణితానికి మూలం " వేదం "


Read More

రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు::

రథసప్తమి విశిష్టత :: ఆరోగ్య కారణాలు :: ఆధ్యాత్మిక కారణాలు::
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి.. రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది.. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా.. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది... శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది.. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు... వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు.... అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట... దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట..
ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు.. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి.. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది.. అలా ఈ సంవత్సరం వచ్చింది.. రేపు ఉదయం దాకా సప్తమి ఘడియలు ఉన్నాయి.. కాబట్టి ఈ రోజు అవకాశం దొరకని వారు కనీసం రేపైనా సూర్యునికి అంజలి ఘటించి నమస్కరించండి!!
మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు!!
Read More

మాఘశుద్ధ సప్తమి. రథసప్తమిమాఘశుద్ధ సప్తమి. రథసప్తమి
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.
ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.
ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.
సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.
రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.
రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

పుణ్య తిథి రథ సప్తమి
మాఘ శుద్ద సప్తమినే రథ సప్తమి అంటారు. రథ సప్తమి అంటే, సూర్య భగవానుడి పుట్టినరోజు.
సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమే చీకటిమయంగా ఉంటుంది. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్యహృదయం చదువుతూ పూజలు చేయాలి.
కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్ లో జరిగే ఈ రథోత్సవాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు తండోపతండాలుగా వస్తారు.
రథ సప్తమినాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రథ సప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని చేస్తే మంచిది.
భాస్కరునికి ఇష్టమైన రథసప్తమినాడు స్నానం ఆచరిస్తూ, సూర్య భగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడంవల్ల శారీరక, మానసిక బాధలన్నీ తొలగిపోతాయి.
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథ సప్తమినాడు చేస్తే మరీ మంచిది.
ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది.
సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం.
రథ సప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్ధించాలి.
రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం. కనుక రేగిపళ్ళను, పరమాన్నాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి.

పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.
పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒక చోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే నెత్తి మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.
యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం . ' గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాకా' అని దీనర్ధం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రధం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....
పురాణాల ఆధారంగా...
ఈ రోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు పూంచిన ఏకచక్ర రథం పై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టిన రోజు. రామాయణ , భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమేం ఉంది.
రాముడిది రఘువంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్నమాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ' ఆదిత్య హృదయం 'గా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.
అటు భారతం లోనూ కర్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకపణిని , ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.

ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది, సూర్యుడు తన దిశానిర్దేశాన్ని ఈ రోజునుండే మార్చుకుంటాడు. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడిగానూ, సాయంత్రం విష్ణు స్వరూపుడిగానూ ఉంటాడు కాబట్టి మనం సూర్యుడిని త్రిసంధ్యలలో ప్రార్థించినంత మాత్రమునే త్రిమూర్తులకు పూజ చేసినంత ఫలితం ఉంటుంది. శీతాకాలం నుండి వేసవి కాలపు సంధిస్థితిలో వచ్చే పండుగ ఇది. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది. సూర్యుడికి ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, సూర్యుడి రథానికి పూన్చినవి ఏడు గుర్రాలు, వారంలో రోజులు ఏడు, వర్ణాలలో రంగులు ఏడు, తిథులలో ఏడవది సప్తమిరోజు. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని స్నాన, జప, అర్ఘ్యం, తర్పణ, దానాలు అనేక కోట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంది. సప్తమిరోజున షష్ఠి తిథి ఉన్నట్లయితే షష్టీ సప్తమీ తిథుల యోగానికి పద్మం అని పేరు. ఈ యోగం సూర్యుడికి అత్యంత ప్రీతికరం. సూర్యుడికి 'అర్కః' అనే నామం కూడా వుంది. అర్క అంటే జిల్లేడు ఆకు అందుకే సూర్యుడికి జిల్లేడు అంటే అమిత ప్రీతి. రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై పెట్టుకుని
జననీ త్వంహి లోకానాం సప్తమీ సపసప్తికే !
సప్తంయా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే !!
అని జపిస్తూ నదీస్నానం చేసినట్లయితే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రభోదించాడు. స్నానం అయిదు రకాలు నదీ స్నానం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి సూక్తము, సంకల్పము, మార్జనము, అఘవర్షనము, తర్పణము. తెల్లవారు ఝామున నాలుగు నుండి ఐదు గంటల లోపల స్నానం అది ఋషిస్నానం అంటారు. ఐదు నుండి ఆరు లోపల చేస్తే అది దైవస్నానం, ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేస్తే అది మానుష స్నానఫలం, అటు తరువాత చేసేదే రాక్షస స్నానం. భార్యాభర్తలు నదీ స్నానం చేసే సమయంలో కొంగును ముడివేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత నాలుగు గుప్పిళ్ళ మట్టిని నదిలోనుంచి తీసి గట్టుపై వేయాలి. దీనివల్ల మనం చేసిన స్నాన ఫలం ఆ నది త్రవ్వించిన వారికీ కొంత చెందుతుంది, పూడిక తీసిన ఫలితం మనకు దక్కుతుంది. రథసప్తమిరోజున సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. బంగారు, వెండి, రాగి, వీటిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదలో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పట్టుకొని, నది లేదా చెరువు దగ్గరకు వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదలి, ఎవరూ నీటిని తకకకుందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి. సూర్యుడి ముందు ముగ్గు వేసి, ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగానూ ఉంటుంది. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.
రథసప్తమి రోజున సూర్యుడికి పూజలు, దానధర్మాలు, వ్రత పారాయణ, ఉత్తములు, అర్హులైన వారికి దానం ఇవ్వాలి అని ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్నీ కృష్ణుడు, ధర్మరాజుకు చెప్పాడట. ఆ కాంభోజ రాజు కథ ఏమిటంటే …
పూర్వకాలం కాంభోజ దేశాన్ని యశోవర్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడు అన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే దక్కింది. పుట్టిన బిడ్డ ఎప్పుడూ ఎదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. అలా జబ్బుపడిన కొడుకునుచూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి వివరించి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గతజన్మను వీక్షించారు. గతజన్మలో ఎంతో సంపన్నుడు అయినా ఎవరికి కూడా ఎటువంటి దానం కూడా చేయలేదు. అయితే అతడి జీవితం చరమాంకంలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు కాబట్టి ఆ పుణ్యఫలం కారణంగా రాజు ఇంట జన్మించాడు. సంపదలు ఉండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు తెలియజేశారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమని మహారాజు ఋషులను వేడుకున్నాడు. అంతట ఋషులు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడికి సంక్రమించిన రోగాలు నశిస్తాయని చెప్పారు. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని చెప్పారు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు అంటూ విధివిధానాలను వివరించారు. కాంభోజ మహారాజు కూడా తన బిడ్డతో రథసప్తమి వ్రతాన్ని చేయించిన తరువాత ఆ బిడ్డ సర్వ రోగాలనుండి విముక్తి పొంది తరువాతి కాలంలో రాజ్యానికి రాజయ్యాడు. ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమినాడు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని నదీస్నానం చేసి దగ్గరలోని సూర్యదేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటివద్దనే ఆరాధించుకోవచ్చు. ఈ వ్రతానికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్యజీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.
Read More

భీష్మాష్టమిభీష్మాష్టమి
మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి పూజామందిరాన్ని, ఇంటికి శుభ్రం చేసుకోవాలి. ఇంటి వాకిలి, పూజామదిరంలో ముగ్గులతో అలంకరించాలి. గుమ్మానికి తోరణాలు కట్టి, గడపలకు పసుపుకుంకుమలు అద్దుకోవాలి. తరువాత తలంటు స్నానం చేసుకుని తెలుపురంగు దుస్తులను ధరించాలి. ఈ దినం అంతా ఉపవాసం ఉండి, మహాభారత గ్రంథాన్ని పఠించాలి, లేకపోతే వినాలి. రాత్రి జాగరణ ఉండాలి. పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలతో తీర్చిదిద్దాలి, తామలపువ్వులు, తులసీ దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యం కోసం పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత సంకల్పం ఈ విధంగా చెప్పాలి … మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రాహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శాకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ భౌమవాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే అపపౌస్పృశ్య.
విష్ణు సహస్రనామాలను మనకు అందించిన భీష్మాచార్యుల వారి అష్టమి రోజున భీష్ముడిని తలచుకుని, ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా 'ఓం నమోనారాయణాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తరువాత ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి.
భీష్మాష్టమి:
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద పొందు పరచిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అందురు. ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.
సంకల్పం: మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ భౌమవాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే – అపపౌ స్పృశ్య
౧. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
౨. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
౩. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
Read More

Tuesday, 16 February 2016

సుబ్రమణ్య స్వామి ఆలయం:సుబ్రమణ్య స్వామి ఆలయం:
===================
. ప్రముఖమైన ఈ ఆలయాలలో ఒకటిగా వెలుగొందుతున్నది కుక్కి" లోని సుబ్రమణ్య స్వామి ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్ల స్యళ్యా తాలుక లోని మలెల నాడులో వున్నది. ఇది ఆద్యాత్మిక కేంద్రమే కాదు అందమైన ప్రకృతి లో ఒలలాడు తున్నది. పురాణ ప్రస్థానం: తారకాసుర సంహారం తార్వాత సుబ్రమణ్య స్వామి తన కత్తిని ఒక నదిలో కడగడం వల్ల ఈ నదికి కుమార ధార అనే పేరు వచ్చిందట. సుబ్రమణ్యా స్వామికే కుమార స్వామి అని కూడ పేరు వున్నది. ఆ తర్వాత కుమారస్వామి ఇక్కడున్న పర్వతంపై ఒక గుహలో నివసించినందున ఆ పర్వతానికి కుమార పర్వతం గా పేరు వచ్చింది. సర్ప రాజు వాసుకికి పక్షిరాజు గరుడికి జరిగిన యుద్దంలో గరుడి ప్రతాపానికి తట్టుకోలేని సర్ప రాజు ఈశ్వరున్ని గురించి ఈ పర్వతంపై తపస్సు చేశాడు. వాసుకి తపస్సు కు మెచ్చి వాసుకిని ఈ క్షేత్రంలో వెలసిన కుమారస్వామిలో ఐక్యం కమ్మని ఆదేశించాడు. కుక్షి అంటే గుహ అంతర్బాగం అనే ఆర్థం వున్నది. కాలక్రమాన అదె కుక్కి గా రూపాంచరం చెందింది.

స్వామి వారిని దర్శించు కునే ముందు భక్తులు తప్పని సరిగా కుమార నదిలో స్నానం చేయాలి. మయూరి వాహనుడైన కుమారస్వామి వాసుకు తలపై వున్నట్టు దర్శన మిస్తాడు. ఈ షణ్ముకుణ్ణి నిత్యం అభిషేకాలతో, మహా మంగళ హారతులతో సేవిస్తారు. ఒక ఏనుగు మంగళ హారతి సమయంలో గంట వాయించి మహాద్వారం ముందు మోకరిల్లి తొండం పైకెత్తి అభివాదం సేస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడానికే వేలాది మంది భక్తులు వస్తుంటారు. జాతక రీత్యా కాల సర్ప దోషం వున్నవారు,, పిల్లలు లేని వారు, పెళ్లి కాని వారు, కుజ దోషం వున్న వారు ఇలాంటి సమస్యలున్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ శివాలయం, భైరవ, ఉమా మహేశ్వర, దుర్గాదేవి, గణపతి దేవుళ్ల ఆలయాలు కూడ వున్నాయి. ఇక్కడ నిత్యాన్నదాన జరుగు తుంది. ఈ ఆలయ ఆదర్యంలో చాల సామాజిక కార్య క్రమాలు కూడ జరుగు తున్నాయి భక్తుల వసతి కొరకు ఇక్కడ అనేక వసతి గృహాలు, కాటేజీలు మరియు ప్రైవేటు వసతి గృహాలు, భోజన శాలలు చాలనె వున్నాయి
Read More

Wednesday, 10 February 2016

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా? పురాణగాధ :

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా?
పురాణగాధ :
పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు.
అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగడతాడు. పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి, అతని అహంకారాన్ని అణిచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకుని.. ‘‘మహాదేవా! మీరు, పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని వేడుకుంటాడు.
దానికి సమాధానంగా శివుడు.. ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదంటాడు. అలాగే పార్వతీదేవి కూడా ‘‘భర్త రానిదే నేను రాను’’ అని చెబుతుంది. కుబేరుడు మళ్లీ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరకుంటాడు. రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో.. ‘‘అమ్మా! నాకు చాలా ఆకలేస్తోంది. ఏదైనా వుంటే వడ్డించు’’ అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతివైపు కనుసైగ చేసి.. ‘‘కుబేరా! మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాం కాబట్టి.. మా గణపతిని మీ విందుకు తీసుకెళ్లు’’ అని చెబుతుంది. శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకుని.. ‘‘అవును కుబేరా! గణపతిని తీసుకెళ్లు. అతనికెలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం. మాకు బదులుగా గణపతిని నీ విందు కార్యక్రమానికి తీసుకెళ్లు’’ అని చెబుతాడు.
కుబేరుడు ఆ బాలవినాయకుడిని చూసి తన మనసులో.. ‘‘ఈ పసిపిల్లాడా.. సరే! ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే’’ అని అనుకుంటూ.. గణపతిని అలకాపురిలో వున్న తన భవనానికి తీసుకుని వెళతాడు. తన భవనంలో వున్న సౌకర్యాలు, అందాలు, ఇతర సంపదలను ఆ వినాయకునికి చూపించాడు. అయితే వినాయకుడు.. ‘‘ఇవన్నీ నాకు వ్యర్థం. వీటితో నాకు ఎటువంటి అవసరమూ లేదు. నాకు చాలా ఆకలిగా వుంది. త్వరగా ఆహారం పెట్టండి’’ అని కసురుకుంటాడు. అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్నవారికి ఆజ్ఞాపిస్తాడు.
కుబేరుని పనివాళ్లందరు వెంటనే గణపతి ముందు ఒక కంచెం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు, ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు. కుబేరుడు పక్కనే వుండి చూస్తుండగా.. గణపతి కంచంలో వున్న ఆహారంతోపాటు అక్కడే వున్న పాత్రల్లో వున్న ఆహారాన్ని మొత్తం తినేసి.. ఇంకా భోజనాన్ని తీసుకురండని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సేవకులు వంటశాలలో వున్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు. అయినా గణపతికి ఆకలి తీరలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు. కొద్దిసేపటిలోనే కుబేరుడు దేవతల కోసం తయారుచేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోతుంది.
ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు. తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు. దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థంకాక అలాగే వుండిపోతాడు. ఇంతలోనే గణపతి ఆగ్రహంతో.. ‘‘నన్ను నీ ఇంటికి విందు భోజనాలకు రమ్మని, ఆహారం పెట్టకుండా అవమానిస్తావా’’ అని పలుకుతాడు. కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని, తన అహంకారాన్ని అణచడానికే శివుడు ఇలా చేశాడని గ్రహించి.. వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు. అప్పుడు కుబేరుడు, శివునితో.. ‘‘శంకరా! నువ్వు నాకు సిరిసంపదలు ప్రసాదించి, అధిపతిని చేసిన విషయాన్ని మరచి.. నీతో అహంకారంగా ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు. బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేకపోయాను. దీనికి ఏదైనా పరిష్కారమార్గం చూపించండి’’ అంటూ వేడుకున్నాడు.
అప్పుడు శివుడు.. ‘‘కుబేరా! నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలను వడ్డించావు. అందుకే అతను సంతృప్తి చెందలేదు. నీ దగ్గర ఎంత సంపద వుందన్నది గణపతికి ముఖ్యం కాదు.. ఎంత భక్తితో సమర్పించావోనన్నది మాత్రమే చూస్తాడు. కాబట్టి నీ అహంకారాన్ని మరిచి.. ఈ గుప్పెడు బియ్యం తీసుకునివెళ్లు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని భక్తితో బియ్యాన్ని ఉడికించి, భోజనం పెట్టు’’ అని అన్నాడు. కుబేరుడు, శివుడు ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని.. వాటిని ఉడికించి, భక్తితో గణపతికి వడ్డించాడు. దాంతో గణపతి కడుపు నిండి, సంతృప్తి చెందుతాడు. ఇలా ఈ విధంగా పరమశివుడు.. కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు.
Read More

మాఘమాసం విశిష్టత

మాఘమాసం విశిష్టత
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.
మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.
మాఘమాసం మహిమ
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.
మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.
తిథులు:-
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12. మాఘ పూర్ణిమ 13. కృష్ణపాడ్యమి 14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి 17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.
మాఘస్నానానికి సంబంధించిన కథ :-
మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.
అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.
మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :-
పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు.
కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.
కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.
మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే కథ :
పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది.
తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.
సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.
మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం :-
మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.
ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు.
తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.Read More

అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ?అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ?

భారతీయ పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .
పురాణ చిరంజీవులు :


1. అశ్వద్ధామ ,
2. బలిచక్రవర్తి ,
3. వ్యాసమహర్షి ,
4. హనుమంతుడు ,
5. విభీషణుడు ,
6. కృపాచార్యుడు ,
7 . పరశురాముడు ,
8. మార్కండేయ ,Read More

వైశాఖ మాసంవైశాఖ మాసం

మనము -వైశాఖ స్నానం-వైశాఖ వైశిష్ట్యం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

స్నానము ఎప్పుడు చేసినా ఎలా చేసినా శరీర మలినాలను తొలగించుకునే మార్గాలలో ఒకటి. ఆది మానవుడు ఆచరించడానికి స్నానానికి దైవత్వాన్ని మిలితం చేసి మన పూర్వికులు మనకందించిన ఆత్యాద్మిక ఆరోగ్యసూత్రాలే ఈ స్నానవ్రతాలు .

సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.

వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు. తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే. ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు. ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ల్లను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు. తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినే్యకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. ఆ జమదగ్ని రేణుకల పుత్రుడైన పరశురామజయంతిని పరశురామ ద్వాదశిగా జరుపుతారు. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు. ఇంకా బుద్ధ జయంతి, కూర్మజయంతి, నారద జయంతి ఇలా ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి.Read More

వ్రతాల మాసం చైత్రంవ్రతాల మాసం చైత్రం

సంప్రదాయబద్ధంగా మనకున్న పన్నెండు మాసాల్లో తొలి మాసం చైత్రమాసం. వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి సౌందర్యం ఈ మాసంలో అలరారుతుంటుంది. పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు, పూజలతో ప్రజలలో భక్తి భావం పరిఢవిల్లుతూ ఉంటుంది. దశావతారాలలోని వరాహ, రామ, మత్సా్యవతారాల జయంతులు ఈ మాసంలోనే వస్తాయి. అన్నిటినీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకొంటారు అంతా. చైత్రసోయగానికి చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమన పత్రాలతో నెలలోని మొదటి పదిహేను రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయటం ఓ ఆచారంగా ఉంది. తొలి రోజు సృష్టికర్త, చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు దమన పత్రాలతో పూజ చేస్తారు. మరునాడు విదియనాడు ఉమ శివ అగ్నులకు, తదియనాడు గౌరీ శంకరులకు, చతుర్దినాడు గణపతికి, పంచమినాడు నాగులకు, షష్ఠి నాడు కుమారస్వామికి, సప్తమినాడు సూర్యుడికి దమన పత్రాలతో పూజ చేస్తారు. అష్టమినాడు మాతృ దేవతలకు, నవమినాడు మహిషాసుర మర్దనికి, దశమినాడు ధర్మరాజుకు, ఏకాదశినాడు మునులకు, ద్వాదశినాడు మహావిష్ణువుకు, త్రయోదశినాడు కామదేవుడికి, చతుర్దశినాడు శంకరుడికి, పూర్ణిమనాడు శనికి, ఇంద్రుడికి దమన పత్రాలతో పూజలు చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చెయ్యటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తున్నారు. చైత్రశుద్ధ విదియనాడు నేత్ర ద్వితీయ, ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు చేస్తారు. ఉమ, శివ, అగ్నులకు పూజ జరుగుతుంది. మరి కొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు. చైత్ర శుద్ధ తదియనాడు శివడోలోత్సవం, సౌభాగ్య వ్రతం జరుపుతారు. చవితినాడు గణేశపూజ, పంచమినాడు శాలిహోత్రహయ పంచమి నిర్వహిస్తుంటారు. గుర్రాలకు పూజ చేయటం పంచమినాటి విశిష్టత. శ్రీవ్రతం పేరున ఇదే రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు. దీంతో పాటు పంచమూర్తి వ్రతం, సంవత్సర వ్రతం, పంచమహభూత వ్రతం, నాగపూజ తదితరాలు చెయ్యటం ఉంది. షష్ఠినాడు కుమార షష్ఠి వ్రతం చేస్తుంటారు. శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యసంబంధమైన వ్రతాలు జరపటం కనిపిస్తుంది. అష్టమినాడు అశోకాష్టమి, అశోక రుద్రపూజ, భవానీ అష్టమి జరుపుతారు. శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది. ఇదే రోజు శ్రీరామ నవమి పర్వదినం జరుగుతుంది. దశమినాడు ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి చెయ్యడం ఉంది. చైత్ర శుద్ధ ఏకాదశినాడు ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ రోజునే కామదైకాదశిని జరపటం కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలు తమ కోర్కెలను సిద్ధింపచేసుకోవటానికి ఈ వ్రతాన్ని చేస్తుంటారు. శుద్ధ ద్వాదశినాడు వాసుదేవార్చన, లక్ష్మీనారాయణ పూజ జరుగుతాయి. త్రయోదశినాడు అనంగత్రయోదశీ వ్రతం లేక మదన త్రయోదశీ వ్రతం జరుపుతారు. శుద్ధ చతుర్దశినాడు శైవచతుర్దశి కర్దమ క్రీడలాంటివి జరుగుతాయి. చైత్ర పూర్ణిమనాడు మహాచైత్ర వ్రతం జరుపుతారు. దీంతోపాటు చిత్రగుప్త వ్రతం లాంటివి ఉంటాయి. ఇప్పటికి మాసంలో సగభాగం అయిపోయినట్టవుతుంది. చైత్ర బహుళ పాడ్యమి నాడు జ్ఞానావాప్తి వ్రతం, పాతాళ వ్రతం ఉంటాయి. ఆ తర్వాత బహుళ పంచమి నాడు మత్స్య జయంతి, ఏకాదశినాడు వరూధిని ఏకాదశి, త్రమోదశినాడు వరాహ జయంతి జరుపుతుంటారు. చైత్ర బహుళ చతుర్దశినాడు గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. బహుళ అమావాస్యనాడు పరశురాముడి పూజలు చేస్తుంటారు. ఇలా పలు వ్రతగ్రంథాలు చైత్ర మాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి వివరించి చెబుతున్నాయి.
Read More

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని(నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయి కి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజు కి కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది. విష్ణు వర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడి కి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.. ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో కి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు. విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు. శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-"సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది." ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్టించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.
Read More

ప్రస్తుతం మనుధర్మాన్ని బూచిగా చూపి గొంతులు చించుకునే మేధావులు అసలు మనుధర్మానికి , ప్రస్తుతం ఉన్న కలియుగానికి సంబందమే లేదు అన్న విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోరు!

అంటరానితనం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందా అన్నది ఒక్క మారు గమనిస్తే ఇది బైబిల్ లో నుంచి వచ్చింది అని చెప్పవచ్చు ! తర్వాత బ్రిటీషు పుణ్యాత్ములు దేశం లో చొరబడిన తర్వాత వైదిక ధర్మ వ్యవస్థని నాశనం చేసే యోచనలో చాలా మటుకు సనాతన ధర్మ గ్రంధాల్లో లేని విషయాలు జొప్పించి , ఉన్న విషయాలని మార్చి రాసి ధర్మం లో లేని పంచమ జాతి అంటరాని తనం అనే అంశాలని పెంచి పేంపొందించారు అన్నది సత్యం ! ఎందుకంటే చరిత్రలో మనుధర్మం లో చెప్పినట్టు నాలుకలు కోసినట్టు కానీ చెవిలో సీసం పోసిన ఘటనలు మచ్చుకు కనపడవు అన్నది వాస్తవం పైగా చాలా మండి ఋషులు కూడా శూద్రవర్ణం వారే అన్నది గమనించాల్సిన విషయం!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
అని ఋగ్వేదం అంటోంది !

కానీ ఇస్లాం , క్రైస్తవ రాజ్యాలా ఆక్రమణల తర్వాత దేశం లో ఆయా మతాల గ్రంధాల్లో భోదించినదే , అన్యులని దూరంగా ఉంచాలి అని , వారి పట్టణాలు తగలపెట్టాలి అని , అన్యదేవతల ని పూజించే వారిని చంపాలి అని సుస్పష్టంగా బైబిల్ గ్రంధం లో ఉన్నది జగమెరిగిన సత్యం ! క్రైస్తవులు యహోవా అనే దేవుడు పాత నిభందన లో చేసిన అరాచకాలని కప్పిపుచ్చటానికి నిత్యం తర్జనభర్జన పడుతూనే ఉంటారు ! నిర్గమకాండం 21 , 34 ,సంఖ్యాకండం 31 అధ్యాయాలు , ద్వితియోపదేశకాండము 17,20,13 అద్యయాలలో అన్యులు , అన్యదేవతారాదకులను ఎలా చంపాలో బహు చక్కగా వివరించాడు ! యహోవా చెప్పిన బానిసత్వానికి , అంటరానితనానికి , క్రూరత్వానికి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు ! మనుధర్మ శాస్త్రం లో నేడు ఉన్నవి చాలా రకాల మార్పులకి లోనూ అయినవి అని రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో మార్లు చెప్పారు! మనుస్మృతిలో చెప్పినవి 17 వ శతాబ్దానికి ముందు ఎక్కడన్న జరిగాయ అంటే సరైన ఆదరాలు లేవు అన్నది నిజం ! ఈ అంతరానితనం లేదా తక్కువగా చూడటం అన్నది బ్రిటీషు పాలకులు దేశం లో అడుగుపెట్టిన తర్వాతనే కనపడుతుంది!
బాల్యవివాహాలు , సతీసహగమనం లాంటివి కూడా ఇస్లాం పాలన తర్వాత వచ్చినవే తప్ప వేదాల్లో వీటి ప్రస్తావనే లేదు ! ఇస్లాం రాజుల విచ్చలవిడి మానభంగాలకి బయపడి చిన్న వయసులో ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయటం అలవరచుకున్నారు ! ఇస్లాం సామంతుల క్రూరత్వం నుంచి తప్పించుకోవటానకి వచ్చిన పద్దతులే కానీ ఇవి వైదిక ధర్మం లో చెప్పినవి కాదు !
ప్రస్తుతం మనుధర్మాన్ని బూచిగా చూపి గొంతులు చించుకునే మేధావులు అసలు మనుధర్మానికి , ప్రస్తుతం ఉన్న కలియుగానికి సంబందమే లేదు అన్న విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోరు! పోనీ చరిత్ర లో మనుధర్మం లో చెప్పిన సీసం పొయ్యటం , నాలుకలు కోయటం జరిగిన ధాఖలాలు మాత్రం చూపరు! హిందువులలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే బేధ భావం రేకెత్తించి తమ పనులు సులువు చేసుకున్నారు పైగా తెలుపు , నలుపు వర్ణం ని బట్టి హీనంగా చూసే బుద్ధి కేవలం క్రైస్తవ దేశాలకే చెల్లింది ! అదే వ్యవస్థను ఇక్కడ కూడా పెట్టచూశారు బ్రిటీషు కుక్కలు ! వారి ఆలోచనకి మన ఉద్దండుల కుతంత్రాలు , పేరుకొసం పాకులాటల్లో ధర్మ వినాశనానికి పూనుకున్నారు! ప్రస్తుతం మనుధర్మం మీద ఎడిచే ఉద్దండులు ఒక మారు చరిత్రని పరికించి , క్రైస్తవులు జొప్పించిన వారి సిద్దాంతలని గమనిస్తే అసలు దొంగలు బయటపడతారు!
Read More

దేశం కోసం, ధర్మ కోసం అపూర్వ బలిదానం - గురుతేగ్ బహదూర్దేశం కోసం, ధర్మ కోసం అపూర్వ బలిదానం - గురుతేగ్ బహదూర్

గురు తేగ్ బహదూర్

అది 1669 ఏప్రిల్ మాసం. ఔరంగజేబు సైనికులు కాశీలో విధ్వంసకాండ సాగిస్తున్నారు. కాశీలో సంస్కృత విద్యాలయాన్ని ధ్వంసం చేశారు. కాశీ విశ్వనాథ మందిరాన్ని నాశనం గావించారు. ఇదంతా ఎందుకు? కాశీ పండితులను మతం మారిస్తే దేశంలోని హిందువులంతా మతంమారుతారని ఔరంగజేబు విశ్వాసం. కాశీ పండితులు ఔరంగజేబు హింసలను తట్టుకోలేక కాశ్మీర్ పండితుల వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు.
కాశ్మీర్ పండితులు కాశీ పండితులతో 'కాశ్మీరు పండితులను మతం మార్చగలిగితే మేము కూడా మతంమారతామని ఔరంగజేబుతో చెప్పండి' అన్నారు. వెంటనే ఔరంగజేబు కాశీ పండితులను వదిలి, కాశ్మీరు పండితులను వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులను ఊహించలేని కాశ్మీరు పండితులు వాటికి తట్టుకోలేక 1672లో పంజాబులోని సిక్కు సంప్రదాయ గురువైన గురు తేగ్ బహదూర్ వద్దకు వచ్చి ఔరంగజేబు తమను హింసిస్తున్న విషయాన్ని విన్నవించుకొని, తమకు దారిచూపమని వేడుకున్నారు.
గురుతేగ్ బహదూర్ కు పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నట్లు కనబడ్డాయి. ఏమి చేయాలో ఆలోచించసాగాడు. 'ఎవరైనా ఒక మహాపురుషుడు బలిదానం కావటానికి సిద్ధపడాలి' అని అన్నాడు. ఆ సమయంలో అతని ప్రక్కనే కూర్చుని ఉన్న 9 ఏళ్ళ వయసున్న అతని కుమారుడు గోవింద్ సింగ్ 'నాన్నా! మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?, ధర్మం ఇప్పుడు త్యాగాన్ని కోరుతున్నది' అన్నాడు. ఇది విన్న తేగ్ బహదూర్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. కాశ్మీర్ పండితులతో ఇలా చెప్పాడు 'గురు తేగ్ బహదూర్ ను మతం మార్చగలిగితే మేమందరం మతంమారతామని ఔరంగజేబుకు చెప్పండి'.
ఈ వార్త ఆఘమేఘాలమీద ఔరంగజేబుకు తెలిసింది. వెంటనే ఔరంగజేబు నుండి గురుతేగ్ బహదూర్ కు ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చింది. గురు తేగ్ బహదూర్ తనతో పాటు మరొక ఐదుగురు శిష్యులను వెంట తీసుకొని ఢిల్లీ బయలుదేరాడు. దారిలో ప్రజలకు ధైర్యం చెబుతూ, విశ్వాసం కలిగిస్తూ ప్రయాణం సాగుతుండగా దారిలోనే ఔరంగజేబు సైనికులు గురుతేగ్ బహదూర్ బృందాన్ని నిర్బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళారు.
ఢిల్లీలో ఔరంగజేబు గురుతేగ్ బహదూర్ ముందు మూడు షరతులు పెట్టాడు. 1) ఇస్లాం మతం స్వీకరించటం, 2) ఏదైనా మహత్తు చూపించి తన గురుత్వాన్ని నిరూపించుకోవటం, 3) ఆ రెండు అంగీకరించకపోతే మరణశిక్షకు సిద్ధం కావటం.
ఔరంగజేబు విధించిన మొదటి రెండు షరతులకు తేగ్ బహదూర్ ఒప్పుకోలేదు. ఇక మూడవ షరతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. గురుతేగ్ బహదూర్ ను భయభ్రాంతులకు గురిచేసి ఎలాగైనా మతం మార్చాలనే ఉద్దేశంతో, కుట్రతో ఉన్నాడు ఔరంగజేబు. ఔరంగజేబు సైనికులు ముందుగా తేగ్ బహదూర్ శిష్యుడైన భాయి దయాళ్ ను సలసలా కాగే నూనెలో వేసి అతి క్రూరంగా హతమార్చారు. రెండవ శిష్యుడైన భాయిసతిదాస్ ను రగ్గులతో చుట్టి ఎండలో వేసి, నూనెపోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మూడవ శిష్యుడైన భాయిమతిదాస్ ను చెక్కలమధ్య నిలువుగా బంధించి, జీవంతో ఉన్న మనిషిని పై నుండి క్రిందకు నిలువుగా రంపంతో కోసి చంపారు. మిగిలిన ఇద్దరు శిష్యులను కూడా ఇదేవిధంగా అనేక చిత్రహింసల పాలు చేసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఐదుగురి అనంతరం చివరిగా గురుతేగ్ బహదూర్ వంతువచ్చింది.
అది 1675 నవంబరు మాసం. చివరిసారిగా మతంమారమని గురుతేగ్ బహదూర్ ను మరోమారు హెచ్చరించాడు ఔరంగజేబు. మౌనమే తేగ్ బహదూర్ సమాధానమయ్యింది. ఔరంగజేబు ఆగ్రహంతో తేగ్ బహదూర్ తలను నరికివేయమని తలారికి ఆదేశమిచ్చాడు. తలారి ఔరంగజేబు ఆదేశానుసారం కత్తితో ఒక్కసారిగా గురుతేగ్ బహదూర్ తలను ఖండించాడు. ఖండించబడిన తల మొండెం నుండి వేరయి దూరంగా ఎక్కడో ఉన్న మోచీ (చెప్పులు కుట్టుకునే మనిషి) పట్టాపై పడింది.
అతను (మోచీ) వెంటనే అప్రమత్తమై ఆ తలను తీసుకొని పరుగెత్తుకుంటూ ఆనందసాహెబ్ చేరి, అక్కడ ఉన్న తేగ్ బహదూర్ కుమారుడు గురుగోవింద్ సింగ్ కు అందచేశాడు. గురుగోవింద్ సింగ్ తన తండ్రి గురుతేగ్ బహదూర్ తలకు అంతిమసంస్కారం నిర్వహించాడు.
ఈ విధంగా మహాపురుషుడైన గురు తేగ్ బహదూర్ బలిదానమయ్యాడు. ఆ బలిదానం వృధా పోలేదు. అతని తరువాత అతని కుమారుడైన గురు గోవింద్ సింగ్ ధర్మరక్షణ కోసం సైన్యాన్ని తయారుచేసి, ఔరంగజేబుపై వీరోచిత పోరాటం చేశాడు. సనాతన ధర్మ రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ఉదాహరణలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి ధార్మిక నిష్ఠ కలిగిన దేశం మనది.
ఇస్లాం వికృత రూపం ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా కనబడుతున్నది. నేడు కూడా మతం పేరుతో అనేకమందిని ఇస్లాం తీవ్రవాదులు హతమారుస్తున్నారు. 1675లో పరిస్థితులు ఒకరకంగా ఉంటే, 2014లో మరొకరకంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇస్లాం సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని విస్తరించటం కోసం అందరిని మతం మార్చాలని ప్రయత్నించేవారు. ఈ రోజున ఇస్లాం సామ్రాజ్య నిర్మాణం కోసం ప్రపంచమంతా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏ కాలంలోనైనా ఇస్లాం లక్ష్యం - ఇస్లాం సామ్రాజ్య స్థాననే, అంతటినీ ఇస్లామీకరించటమే.
పరిస్థితులను అర్థం చేసుకొని దానికి తగినవిధంగా సమాధానం చెప్పలేని నాయకత్వం కొరవడిన కారణంగా ఆ రోజున బలిదానాలు చేయవలసి వచ్చింది. ఇస్లాం నుండి సమస్యలను ఎదుర్కొంటున్న నేటి కాలంలో దానికి సరియైన సమాధానం చెప్పగలిగిన, ధీటుగా ఎదుర్కోగలిగిన సరైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉన్నది. అటువంటి నాయకత్వం కోసం నేడు ప్రపంచం ఎదురుచూస్తున్నది. అంతకుముందుగా వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియచేసి వారిని జాగృతం చేయవలసి ఉన్నది.
Read More

మహాభారత కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అది 13వరోజు.దీనికి ముందు రోజు

మహాభారత కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అది 13వరోజు.దీనికి ముందు రోజు అభిమన్యుడిని ద్రోణాచార్యుడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్యాసనుడు, కృపాచార్యుడు చుట్టుమిట్టి చంపేసారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు గురువులు. గురువులే తప్పు చేస్తే శిష్యులకి దిక్కేక్కడ? అయినా సరే ఒంటరిగా పోరాడి అందరి దెబ్బలు తిని, చివరికి దుశ్యాసనుడి కొడుకు, అభిమన్యుడు తీవ్రమైన పోరాటం చేసి ఇద్దరు ఒకేసారి ప్రాణాలు విడిచారు.
అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించడానికి ధర్మరాజు, భీముడు మొదలైనవారు ప్రోత్సహించి "పద్మవ్యూహం ఎలా చేధించాలో మాకు తెలియదు. నీకు ప్రవేశించడం తెలుసు. కనుక నువ్వు పద్మవ్యుహాన్ని చేధిస్తూ వెళ్ళు. మేము నీవేనకే వచ్చి వారి సంగతి చూస్తాం. అని చెప్పగా, అభిమన్యుడు తనదైన శైలిలో దూసుకుంటూ వెళ్ళాడు. ఐతే వెనుకే వెళుతున్న పాండవులను సైంధవుడు శివుడు ఇచ్చిన "జీవితంలో ఏదైనా ఒక్కరోజు మాత్రమే ఆర్జునుడిని తప్ప మిగిలినవారిని నిలబెట్టగలవు" అనే వరం వలన అర్జునుడు లేని పాండవులను అడ్డగించి నిలిపెస్తాడు. వీరిమధ్య కూడా తీవ్రాతి తీవ్రమైన పోరాటం జరుగుతుంది. అయినా ఎవరు ఓడిపోలేదు. అలాగని గెలవలేదు. సాయంత్రం వరకు జరిగిన పోరాటంలో వేలమందిని సంహరించిన అభిమన్యుడు మరణించిన తరువాత సైంధవుడు వెళ్ళిపోతాడు.
ఈవిషయం అర్జునుడికి తెలిసి అడ్డుపడిన సైంధవుడిని రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు సంహరిస్తాను అని శపథం చేస్తాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు "ఎవరిని అడిగి శపథం చేసావు? అని ప్రశ్నిస్తే "నువ్వు ఉన్నావనే ధైర్యంతో అన్నాడు.
తెల్లారింది. యుద్ధానికి సిద్ధమై దాదాపుగా 25 కిలోమీటర్ల దూరం లక్షమందికి పైగా ఉన్న శత్రు సేనలను చీల్చి చెండాడుతూ నాలుగు వ్యూహాలను భేదిస్తూ సాయంత్రానికి అంటే సూర్యుడు మరొక్క గంటలో అస్తమిస్తాడు అనగా వ్యూహం లోపలి భాగాన్ని చేరుకున్నాడు అర్జునుడు. సైంధవుడు ఎక్కడా కానరాలేదు. అర్జునుడు డీలా పడిపోతున్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడు "అర్జునా! నేను ఒక తిమిరాన్ని ఏర్పాటు చేస్తాను. దీంతో సైంధవుడు బయటికి వస్తాడు. అప్పుడు వాడిని నువ్వు సంహరించు అన్నాడు. అప్పుడు అర్జునుడు "మోసం చేసి గెలవడమా! నాకు ఇష్టంలేదు. అనగా! శ్రీకృష్ణుడు నవ్వి. నువ్వు ప్రతిజ్ఞ చేసావు. సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుడిని సంహరిస్తాను అని. ఎలా కుదురుతుంది అని అడిగితే నామీద భారం వేశావు. మరి నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం. నేను చెప్పినట్లు నడుచుకో అని తిమిరం ఏర్పాటు చేసి చీకటి పడిందని భ్రమపడేలా చేసాడు. సూర్యుడు అస్తమించాడు అని సైంధవుడు పడమటి దిక్కువైపు చూడడానికి పైకి లేవగానే అర్జునుడు సైంధవుడి తల నరికేస్తాడు. ఇక్కడే అసలు ఘట్టం ప్రారంభం అయింది.
తల కింద పడకూడదు. బాణం సంధించు అనగా సంధిస్తాడు. అలా నాలుగైదు బాణాలు వేస్తాడు. తల కిందపడకుండా అలా ఆకాశంలోనే నిలబెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. ఎంతసేపు నిలబెట్టాలి? ఎందుకు నిలబెట్టాలి? అని అడిగాడు.
అర్జునా! యితడు వృద్ధక్షత్రుడు యొక్క కుమారుడు. ఒకప్పుడు బిడ్డలు లేని వృద్ధక్షత్రుడు తపస్సు చేసి జయద్రథుడు అనే బిడ్డని పొందాడు. అప్పుడు ఆకాశవాణి "ఇతడు యుద్ధంలో తల తెగి మరణిస్తాడు" అనగా ఎవరైనా ఇతడి తలని నేల కూల్చుతారో అతడి తల నూరు వ్రక్కలై మరణిస్తాడు" అని శపించాడు. అందువలన ఇతడి తల కిందపడకూడదు. శివుడు నీకు ఇచ్చిన పాశుపతాస్త్రం తో ఈతల వెళ్లి జపం చేస్తున్న వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా చెయ్యమనగానే వెంటనే పాశుపతాస్త్రం అభిమంత్రించి ప్రయోగించాడు. పాశుపతాస్త్రం వృద్ధక్షత్రుడిని వెదుక్కుంటూ వెళ్లి ఒడిలో పడేసింది. ఉలిక్కిపడిన వృద్ధక్షత్రుడు వెంటనే దానిని నేలపై పడేయగానే తల నూరు వ్రక్కలై మరణించాడు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భక్తి ఉంటె సరిపోదు. అలాగే మనం కోరిన కోర్కేకి తగుదుమా! అని కూడా ప్రశ్నించుకోవాలి. అదే ఇప్పుడు జరిగింది. అర్జునుడు శ్రీకృష్ణుడిని అండ చూసుకొని ప్రతిజ్ఞ చేసాడు. అంతే కాకుండా అతడు మహావీరుడు. ఎలాంటి ప్రతిజ్ఞ చేసినా నెరవేర్చగల ధీరుడు. శ్రీకృష్ణుడు అండ చూసుకున్నా ఆ తరువాతి పరిణామాలు అర్జునుడికి కూడా తెలియదు. ఒకవిధంగా ఆర్జునుడిని ఎవరిని అడిగి ప్రతిజ్ఞ చేశావు? అని అడిక్షేపించడం ఎందుకంటే చంపడం వరకు బాగానే ఉంది కానీ తదనంతర పరిణామాలు (తల నేల కూలితే కూల్చినవాడి తల వంద ముక్కలు అవుతుంది అని) అర్జునుడికి కూడా తెలియదు. పొరబాటున కిందపడితే బ్రతికించడం శ్రీకృష్ణుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది బ్రాహ్మణ శాపం. దానికి తిరుగులేదు. శాపాన్ని తిప్పలేరు. ఇది సృష్టి ఆరంభంలో బ్రాహ్మణులకు దేవతలు ఇచ్చిన వరం. అయినా తల తీసిన అనంతరం దాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చగల సత్తాకూడా ఉంది.
అలాగే మనం ఒక కోరిక కోరినా, ప్రతిజ్ఞ చేసినా దానివలన తదనంతరం ఎదురయ్యే పరిణామాలు కూడా ఎదుర్కొనే శక్తి మనదగ్గర ఉండాలి. అప్పుడే దేవుడు సహకరిస్తాడు. ఎదో కోరిక కోరాం. అది నెరవేరితే దేవుడు ఉన్నట్లు, లేకపోతె లేనట్లు జనాలు తయారయ్యారు. ఎందుకు నేరవేరడంలేదు అంటే నువ్వు దానికి తగినవాడివా? తదనంతర పరిణామాలు ఎదుర్కొనే శక్తి ఉందా? అనేది నువ్వు చూడకపోయినా దైవం చూస్తుంది. అందుకే మనకి ఏది ఇవ్వాలో ఇవ్వకూడదో దైవానికి బాగా తెలుసు. కనుక మన మితిమీరిన కోరికలు, వాటికి మితిమీరిన అంచనాలు వదిలేసి భవిష్యత్తులో జరగబోతే మంచి చెడు ఆలోచించగలిగితే సగం పైనే సమాధానం దొరికినట్లే.ఉదాహరణకి ప్రేమ విషయాలు తీసుకోండి. ఇలా చేసుకొని మంచిది/మంచివాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తారనుకోలేదు అని విడిపోవడం, నిరంతరం కొట్టుకుచావదం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం, వ్యాపారం ప్రతి విషయంలో ఇలాగె చేస్తున్నాం. కనుక అలోచించి అడుగు వేయండి. దైవబలం తప్పకుండా ఉంటుంది. ఇలా ప్రతి ప్రశ్నకి భారతంలో సమాధానం దొరుకుతుంది. వెదికితే! వేదకగలిగే జ్ఞానం ఉంటే!


Read More

అఖండ భారతం.. అనాది వాస్తవం!అఖండ భారతం.. అనాది వాస్తవం!

నాటకీయతవల్ల సంచలనాలు సంభవించవచ్చు.. కేవలం నాటకీయతవల్ల సమస్యలు పరిష్కారం కావు! ప్రధానమంత్రి హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లడం అందువల్ల గొప్ప సంచలనం.. మతోన్మాది అయిన, ‘వెన్నుపోటు’ పొడవడం స్వభావమైన పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌కు మోదీ పర్యటనవల్ల అంతర్జాతీయ సమాజంలో గొప్ప గౌరవం లభించింది! ఇదీ సంచలనం.. కానీ నాటకంలో అంతర్నాటకంవలె ప్రచార మాధ్యమాలవారు మరో సంచలనాన్ని సృష్టించారు!! అఖండ భారతదేశం గురించి మాట్లాడటం తెలియనివారికి వివరించడం మహాపరాధమైన భ్రాంతిని కల్పించడానికి మాధ్యమంలో జరిగిన ప్రయత్నం ఈ రెండవ సంచలనం! ‘అఖండ భారతదేశం’ ప్రముఖుల ఆలోచనలపై, రాజకీయ పక్షాల అభిప్రాయాలపై, నిరసనలపై, నిరాకరణలపై ఆధారపడి లేదు. ‘అఖండ భారతం’ సహజమైన చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సనాతన వాస్తవం! రాజకీయ హరిహద్దులు తాత్కాలికమైనవి.. సంస్కృతి, జాతీయత సనాతనమైనవి, అంటే శాశ్వతమైనవి! సమాన జాతీయతగల ప్రజలను రాజకీయమైన సరిహద్దులు ఎక్కువకాలం విభజించి ఉంచలేవని అనేక అంతర్జాతీయ ఘటనలు నిరూపించాయి! క్రీస్తుశకం 1945లో రెండు దేశాలుగా ‘విభజన’కు గురైన జర్మనీ ప్రజలు 1989లో మళ్లీ ఒకటిగా ఏర్పడడం ఒక ఉదాహరణ మాత్రమే!! సమాన సంస్కృతికల ప్రజలను విడదీయడానికై బెర్లిన్ నగరంలో ఏర్పడిన రాజకీయపు ‘గోడ’ను ప్రజలే కూల్చివేశారు! రెండుగా చీలిన ‘వియత్నాం’ మళ్లీ ఏకీకృతమైంది!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందిన వరిష్ఠ ప్రచారక్ రామ్‌మాధవ్ ‘అఖండ భారత’ ఆకాంక్షను వ్యక్తం చేయడం, అందువల్ల ఈ సాంస్కృతిక వాస్తవానికి అనుగుణమైన వ్యవహారం! ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కాక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యుని హోదాలో ‘‘ఖండిత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు మళ్లీ ఏకమై అఖండ భారత్ ఏదో ఒక రోజున మళ్లీ ఏర్పడుతుందని ‘సంఘం’ విశ్వసిస్తున్నట్టు’’ మాధ్యమాలవారికి చెప్పాడట! అందువల్ల ఆయన చెప్పినది ‘తప్పు’ అయితే నిరాకరించవలసింది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ ప్రతినిధులు మాత్రమే, ‘ఒప్పు’ అయితే సమర్థించవలసిందీ వారే! కానీ అనవసరంగా ముందుగానే అందుకున్న భారతీయ జనతాపార్టీ ప్రతినిధులు ‘అఖండ భారత్’ స్ఫూర్తిని నిరసించడం విచిత్రమైన పరిణామం! ‘అఖండ భారత్’ పునరుద్ధరణను ఆకాక్షించడం భారత్ పాకిస్తాన్ మైత్రికి కానీ భారత బంగ్లాదేశ్ మైత్రికి కాని ఎలా భంగకరం? ‘అఖండ భారత్’ మళ్లీ ఏర్పడాలంటున్న ‘సాంస్కృంతిక జాతీయవాదులు’ పాకిస్తాన్‌లో కూడా ఉన్నారు. ‘అఖండ భారత్’ను ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ కొత్తగా కనిపెట్టలేదు. ‘అఖండ భారత్’ యుగాలుగా కొనసాగుతున్న వాస్తవం! సూర్యుని వెలుగు వంటి ఈ వాస్తవాన్ని ఈ దేశంలోని అధికాధికులు గుర్తించారు... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించింది, అంగీకరించింది!! ‘వెలుగు’ను, వాస్తవాల వెలుగును చూడబోమని కళ్లు మూసుకునే ‘గుడ్లగూబలు’ సహజమైన పరిణామక్రమాన్ని నిరోధించలేవు! ఒకప్పటి ‘అఖండ భారత్’ మళ్లీ వాస్తవం కావడం, వైకల్యగ్రస్త అయిన భారత మాత మళ్లీ సర్వసమగ్ర స్వరూపాన్ని సంతరించుకొనడం ఈ ‘పరిణామక్రమం’! ‘అఖండ భారత్’ పునర్‌ఘటితం కావడానికి యుద్ధాలు చేయవలసిన పనిలేదు, ‘అఖండ భారత్’ ద్వారా యుద్ధాలను నిరోధించవచ్చు! స్వతంత్ర దేశాలుగా ఉన్నంతవరకు ఒకప్పటి ‘అఖండ భారత’ ప్రాంతాలు పరస్పరం కలహించడం సంభవించవచ్చు. అన్ని దేశాలూ ఒక్క దేశం అయినపుడు యుద్ధాలు ఉండవు, సైనిక వ్యయ రక్షణ వ్యయం బాగా తగ్గిపోయి లక్షలాది కోట్ల రూపాయలను ప్రగతి కలాపాలకు ఖర్చుపెట్టవచ్చు!! ‘అఖండ భారత్’ ఇలా ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న ఒకప్పటి ‘ప్రాంతాల’ సాంస్కృతిక సుగతికి మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి కూడా దోహదకరం!!
ప్రస్తుత ‘ఖండిత భారత్’, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకీకృతం కావడం ‘అఖండ భారత్’లో సగం మాత్రమే! మరో సగం నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, అప్ఘానిస్తాన్‌లుగా ఏర్పడి ఉన్న అఖండ భారత ప్రాంతాలు.. క్రీస్తుశకం 1947 ఆగస్టు 14న మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం గురించి మనకు ధ్యాస ఉంది. కానీ అంతకుపూర్వం శతాబ్దులపాటు మిగిలిన ప్రాంతాలు అఖండ భారత్‌నుండి విడిపోవడం గురించి మనకు ధ్యాస లేదు! మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కలియుగం ఆరంభమయ్యేనాటికి ‘జంబూద్వీపం’ తొమ్మిది ‘వర్షా’లు- కాంటినెంట్స్‌గా ఏర్పడి ఉంది. పాశ్చాత్యులు ‘కనిపెట్టి’ భూగోళాన్ని ఖండాలుగా విభజించడానికి వేల ఏళ్ళ పూర్వం నుండి భారతీయులు ధరాతలాన్ని ద్వీపాలుగా వర్షాలుగా, ఖండాలుగా గుర్తించారు. ఎటొచ్చీ ఈ పేర్లు ఆంగ్ల భాషలో లేవు కనుక, ప్రాచీన కాలంలో ఆంగ్ల భాష లేదు కనుక భారతీయుల ‘గుర్తింపు’ను పాశ్చాత్యులు గుర్తించలేదు, మన దేశంలోని పాశ్చాత్య భావదాస్యగ్రస్తులు గుర్తించడం లేదు! కానీ జంబూద్వీపంలోని తొమ్మిది ‘వర్షాల’లో భారత వర్షం నేటి పశ్చిమాసియా మొదలు తూర్పున ఫిలిప్పీన్స్ వరకూ, ఇండోనేసియా వరకూ జపాన్ వరకూ విస్తరించి ఉండేది. ఈ భారత వర్షమంతటా సనాతన వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది! ఐరోపా వారు రచించిన చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని ధ్రువీకరించింది! ఈ ‘్భరత వర్షం’లో ‘సమీకృత రా జ్యాం గ’ వ్యవస్థ ఏర్పడి ఉండిన ప్రాంతం ‘్భరత ఖండం’! భారత వర్షాన్ని పాశ్చాత్యులు ‘గ్రేటర్ ఇండియా’ అని పిలిచారు, ఇది కేవలం హిందూ సంస్కృతికి ఆలవాలమైన ప్రాంతం! సాంస్కృతిక అద్వితీయతతోపాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండిన ప్రాంతం భారత ఖండం! ఈ ‘్భరత ఖండమే’ అఖండ భారత్! ఈ అఖండ భారత్ కైలాసం నుండి కొలంబో వరకూ విస్తరించింది. కైలాసం ఇపుడు టిబెట్‌లో ఉంది, కొలంబో శ్రీలంకలో వుంది! అలాగే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా వరకూ ‘అఖండ భారత్’ వ్యాపించి ఉండేది! కలియుగం ఆరంభమై ఇప్పటికి 5116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది! కానీ ‘కలి’లో 2600 ఏళ్లు గడిచిన తరువాత అంటే ‘పారశీక రాజు’ సైరస్ మన దేశాన్ని ఆక్రమించడానికి యత్నించిన నాటినుండి ‘అఖండ భారత్’ విచ్ఛిన్నం కావడం ఆరంభమైంది. ఈ సైరస్ క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దినాటివాడు! అఖండ భారతీయుల దృష్టి ఇలా పడమటి దురాక్రమణను నిరోధించేందుకు కేంద్రీకృతమయింది. అందువల్ల తూర్పున ఉన్న టిబెట్, బర్మాలు ‘అఖండ భారత్’ రాజ్యాంగ వ్యవస్థ నుండి దూరమయ్యాయి! ఆ తరువాత క్రీస్తుశకం 1959 వరకూ దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు టిబెట్ స్వతంత్రదేశమైంది! బర్మా అర్థస్వతంత్ర దేశమైంది. 1959లో చైనావారు టిబెట్‌ను దురాక్రమించారు!
రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటి అఖండ భారత్ అప్పటి ‘చైనా’తో సమాన వైశాల్యం కలిగిన దేశం. కానీ ‘అఖండ భారత్’ క్రమంగా ముక్కలైంది, ‘చైనా’ క్రమంగా ఇరుగు పొరుగు దేశాలను కబళించింది. చైనా ఇలా టిబెట్‌ను, ‘సింకియాంగ్’ అన్న మధ్య ఆసియా దేశాలను, మంగోలియాలో కొంత భాగాన్ని మంచూరియాను ఆక్రమించి కలుపుకొంది. ఫలితంగా ప్రస్తుత ‘ఖండిత’ భారత్ కంటే చైనా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల ఏర్పడిన భౌగోళిక విపరిణామం ఇది! చైనాకు మనకూ మధ్య అతి పెద్ద సరిహద్దు ఏర్పడటానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా దురాక్రమించడం. టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండిన సమయంలో రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు చైనాతో మన దేశానికి సరిహద్దు లేదు. అంతకుపూర్వం టిబెట్ ‘అఖండ భారత్’లో భాగం! ‘సింకియాంగ్’ లేదా ‘జింఝియాంగ్’గా మారిన తూర్పు తుర్కీస్థాన్‌లో ‘ఇస్లాం’కు పూర్వం వైదిక మతాలు, బౌద్ధమతం విలసిల్లాయి. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దులో సింకియాంగ్ చైనాలో కలిసిపోయిన తరువాత మాత్రమే చైనాకూ మనకూ మరో సరిహద్దు ఏర్పడింది! ఇలా సహస్రాబ్దులపాటు బర్మాకు ఉత్తరంగా ఈశాన్యంగా మాత్రమే చైనాతో మనకు కొద్దిపాటు సరిహద్దు ఉండేది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల చైనా దురాక్రమణ మన సరిహద్దులకు చేరింది!! చైనా ‘విస్తరణ’ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో అఖండ భారత్ మళ్లీ ఏర్పడడం ఒక్కటే దురాక్రమణ నిరోధానికి మార్గం...
బర్మా ప్రాంతాన్ని బ్రిటీష్ వారు 1885 వరకూ దురాక్రమించలేకపోయారు. మిగిలిన భారతదేశం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభం నాటికే బ్రిటీష్ వారికి స్వాధీనం అయింది. అలా 1885వరకూ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం బర్మా! 1885లో బర్మా-మ్యాన్‌మార్- బ్రిటీష్ దురాక్రమిత ‘్భరత్’లో కలిసిపోయింది! ఈ కథ అలాగే కొనసాగి ఉండినట్టయితే 1947 ఆగస్టు 15 తరువాత ‘బర్మా’ స్వతంత్ర భారత్‌లో కొనసాగి ఉండేది! బ్రిటీష్ వారు కొనసాగనివ్వలేదు, 1937లోనే బర్మాను భారత్ నుంచి విడగొట్టారు!!
సింహళం అఖండ భారత అంతర్భాగమన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం. సింహళ ద్వీపవాసులు తమిళనాడు దక్షిణ ప్రాంతాలను పాలించడం, తమిళ రాజులు సింహళాన్ని పాలించడం అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మాలా ద్వీపాలను మహిళా ద్వీపాలని కూడా ఐరోపా చరిత్రకారులు అభివర్ణించారు!! భారతీయుల సాంస్కృతిక ధార్మిక కేంద్రాలు భారతదేశం వెలుపల లేవు.. ‘సింహళం’- శ్రీలంకలో శక్తిపీఠం ఉంది. ‘‘లంకాయాం శాంకరీ దేవీ..’’! అలాగే మాలా ద్వీపాలలో వైదిక బౌద్ధమతాలు నెలకొని ఉండేవి. ఇస్లాం ‘జిహాదీ’ల దండయాత్రల ఫలితంగా ‘మాలా ద్వీపాలు’ అఖండ భారత్‌కు దూరమయ్యాయి. సింహళ, ‘్ధనేహీ’ భాషలు సంస్కృత భాషా రూపాంతాలు! మాల్‌దీవుల ప్రజల భాష ‘్ధనేహీ’!
నేటి ఆఫ్ఘనిస్తాన్ గాంధార, యోన, రామఠ, జ్యోతిష, దరద, ఉరగ వంటి అనేక ప్రాచీన భారతీయ రాజ్యాల సమూహం! జిహాదీల దాడుల ఫలితంగా ఈ మొత్తం ప్రాంతం ‘అఖండ భారత్’ నుండి విడిపోయింది. యావత్ భారతదేశాన్ని ఆంగ్లేయులు దురాక్రమించినప్పటికీ చివరివరకూ అంటే 1947లో ఆంగ్లేయులు నిష్క్రమించేవరకూ స్వతంత్రంగా మనగలిగిన భారత ప్రాంతాలు నేపాల్, భూటాన్!! ఇలా ‘అఖండ భారతం’ ప్రస్తుత భారత్, బంగ్లా, బర్మా, సింహళ, మాలాద్వీప, పాకిస్తాన్, ఆఫ్ఘన్, నేపాల్, భూటాన్, త్రివిష్టప- టిబెట్ దేశాల సమాహారం! ఇదీ అనాది వాస్తవం!!
Read More

Powered By Blogger | Template Created By Lord HTML