గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

శ్రీరామ చంద్రుడికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు గుహుడు. గుహుడు పల్లెకారుడు.

శ్రీరామ చంద్రుడికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు గుహుడు. గుహుడు పల్లెకారుడు. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీరాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది. మహాభారతంలో దాసీ పుత్రుడైన విదురుడు మంత్రి. మన చరిత్ర తిరగేస్తే అనేకమంది శూద్రులు రాజ్యాలు పాలించినట్లు అర్థం అవుతుంది. మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివాడు. మన తెలుగు భాషకు పట్టంగట్టిన శ్రీకృష్ణదేవరాయలు బలిజ, మన భారత జాతికి అధ్భుత ఆధ్యాత్మిక విద్యనందించిన శ్రకృష్ణుడు గొల్లవాడు, మౌర్యసామ్రాజ్యాన్ని నేలమట్టంచేసి గుప్తసామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు వైశ్యుడు. చాణుక్యుడుగా ప్రసిద్దిగాంచిన అర్థశాస్త్ర ప్రవర్తకుడు విష్ణుగుప్తుడు వైశ్యుడు. ఇలా చెప్పుకుంటూపోతే భారతదేశాన్ని నేడు శూద్రులనేవారే పరిపాలించారు. శూద్రశబ్దాన్ని చాలా నీచంగా చిత్రీకరించారు నేటి మహానుభావులు. విశ్వకర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాఈబ్రాహ్మలు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML