గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలి? అది ఏవిధంగా శాస్త్రీయమైనది-

సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలి?
అది ఏవిధంగా శాస్త్రీయమైనది- అని ఒకరు నన్ను ప్రశ్నించారు. మొదటగా సంప్రదాయం అనే మాటకు అర్ధం ఏమని చెప్పారో తెలుసుకుందాం.
‘సమ్యక్ ప్రకర్షణే దీయతే ఇతి సంప్రదాయః’
సమ్యక్ అంటే క్షుణ్ణంగా ఆలోచించినది. ప్రకర్షేణ అంటే అర్థవంతమైనదిగా నిగ్గు తేల్చినది. దీయతే అంటే అందివ్వబడినది.
క్షుణ్ణంగా ఆలోచించి, అర్థవంతమైనదిగా నిర్థారించుకుని అందించేదే సంప్రదాయం అని భావం. సంప్రదాయాలను గౌరవించడం అంటే పూర్వీకుల అనుభవసారాన్ని ఉపయోగించుకుని జ్ఞానమార్గంలో కొత్తపుంతలు తొక్కడం. ఇది శాస్త్రీయమా? లేక ప్లగ్గులో ఎందుకు వేలు పెట్టకూడదు? మేం వేలు పెట్టుకుని చూసి, ప్రమాదమనిపిస్తేనే దానికి దూరంగా ఉంటామని అనడం శాస్త్రీయమా? మద్యపానానికి దూరంగా ఉండాలన్నది సంప్రదాయం. మద్యపానం చేసి, దాని వల్ల కలిగే కష్టనష్టాలన్నీ ప్రయోగాత్మకంగా రుజువు చేసుకుని, అప్పుడు దానికి దూరంగా ఉండడం శాస్త్రీయమైన మార్గమని అనుకుంటే, మనుషులుగా కాక, మనని మనమే గినీపిగ్స్ గా చేసుకున్నట్లవుతుంది.
ప్రతిదీ పరీక్షించుకోవలసి వస్తే ఇలా ఒకటా, రెండా? జీవితం చాలదు. దంతధావనానికి పందుంపుల్లను ఉపయోగించేవారు. ఎనభై ఏళ్ల వయసు వచ్చినా పన్ను కదిలేది కాదు. నేడు నైలాన్ బ్రష్షులు, పేస్టులు వాడుతున్నారు. దంత వైద్యులకు గిరాకీ పెరిగిపోయింది. తులసి చెట్టు చూట్టూ చేసే ప్రదక్షిణలు ఆరోగ్యాన్ని సూచించే తేజస్సును పెంచుతున్నాయని సశాస్త్రీయంగా కనుగొన్నారు. ఇటువంటి వన్నీ గమనిస్తే సంప్రదాయం విలువను ఇంతింతని అనగలమా? సంప్రదాయాన్ని నెలకొల్పే ముందు మన పూర్వీకులు వ్యాపార దృష్టికి తావ్వివ్వకుండా ప్రకృతికి, మానవ శ్రేయస్సుకు పెద్దపీట వేయడం దీనికి మూలకారణం.
వారు అందించిన పద్దతిలో పరంపరగా విజ్ఞాన వివేకాలను ప్రసారం చేసుకునే సంప్రదాయమే
మన భారతీయత
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML