గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

జగతికి వెలుగు సూర్యుడు

జగతికి వెలుగు సూర్యుడు

Surya Bhagavan gives glow
అదితి, కశ్యపుల కుమారుడు సూర్యుడు. సూర్యుని భార్య సంజ్ఞ. వీరిరువురి సంతానం యముడు, యమున. సూర్యుని వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్ళిపోతుంది సంజ్ఞ.
అశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమెకు జన్మించిన వారే అశ్వనీదేవతలు. సూర్యుని వద్ద మారురూపంలో ఉన్న స్త్రీ ఛాయ. వీరి సంతానం శని, సావర్ణి, తపతి. మోహినీ అవతారంలో విష్ణుమూర్తి రాక్షసులకు అమృతము పంచుతూ, దేవతల రూపంలో ఉన్న రాహుకేతువులకూ అమృత మిచ్చినప్పుడు దానిని సూర్యుడు, చంద్రుడు గుర్తిస్తారు. ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పగా, అతడు సుదర్శనంతో రాహుకేతువుల శిరస్సులు ఖండిస్తాడు.
సూర్య చంద్రులపై పగబూనిన రాహుకేతువులు అప్పుడప్పుడూ సూర్యుడినీ, చంద్రుడినీ మింగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు వస్తాయని పురాణాల కథనం. మహాభారతంలో కుంతికి సూర్యునికి జన్మించిన వాడే కర్ణుడు. ఇంకా సూర్యుని గురించి పురాణాలలో అనేక సందర్భాలలో కనిపిస్తుంది.


సూర్యుడి కాంతిలోని విశేషగుణాలు
Majestic Sun Rays
పొద్దెక్కేదాకా ముసుగుతన్ని పడుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని, సూర్యోదయానికి ముందే లేవమని మన పెద్దలు పదేపదే చెప్పారు. తీరిక ఉంటే, అలసట తగ్గకపోతే, మధ్యాహ్నం కాసేపు విశ్రమించవచ్చు కానీ, ఉదయం మట్టుకు పెందలాడే లేవడం మంచి అలవాటు.
సూర్యకాంతి సోకితేనే మనసుకు, శరీరానికీ కూడా హాయిగా ఉంటుంది. ఉల్లాసం, ఉత్సాహం చేకూరుతాయి. ఎప్పుడైనా మబ్బుపట్టి సూర్యుడు కనుక కనిపించకపోతే వాతావరణం మారిపోవడమే కాదు, మనసును కూడా దిగులు మేఘాలు కమ్మినట్టుగా ఉంటుంది.
సూర్యోదయ వేళలో బాలభానుడి కిరణాలు ప్రసరిస్తూ ఉండగా నదిలో స్నానం చేయడం చాలా మంచిది. సాధారణ దినాల్లో నదీ స్నానం వీలు కాకున్నా పర్వదినాల్లో ముఖ్యంగా రథసప్తమి నాడు నదిలో స్నానం చేయడం శ్రేష్ఠం.
సూర్యునికి అత్యంత ప్రియమైంది ఆదిత్యహృదయం (Aditya Hrudayam). ఉదయం స్నానం చేయగానే ఆదిత్యహృదయం చదవడం శ్రేయస్కరం. మామూలు దినాల్లో ఒకసారి, పర్వదినాల్లో మూడుసార్లు, సూర్యభగవానుని పుట్టినరోజైన రథసప్తమి నాడు పన్నెండుసార్లు ఆదిత్యహృదయం చదవాలి.
పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు (Sun Salutation) చేయడం ఆరోగ్యానికి శ్రేష్టం. ఉదయానే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాం.
సూర్యుడు గనుక లేకపోతే మనకు మనుగడే లేదు. వర్షాకాలంలో రెండురోజులు మబ్బు పట్టిఉంటే లోకమే అంధకార బంధురంగా ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే, ఉదయానే ప్రసరించే సూర్యకిరణాల్లో ఔషధ గుణాలు ఉంటాయి.
ఉదయానే మనసు, శరీరం తాజాగా ఉంటాయి. దానికి తోడు పొద్దున్నే వచ్చే బాల భానుని కిరణాలు ఆరోగ్యాన్నిమానసిక తేజస్సును ఇస్తాయి.
సూర్యుని వేడిమికి హాని చేసే క్రిమి కీటకాలు నశిస్తాయి. దాంతో వైరల్ ఫీవర్లు, అంటు వ్యాధులు రావు.
ఉదయ కిరణాల్లో విటమిన్ ఏ, డీ పుష్కలంగా ఉంటాయి. పొద్దున్నే కాసేపు సూర్యకాంతిని చూట్టంవల్ల కళ్ళకు మంచిది. కంటి వ్యాధులు, దోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
సూర్య కిరణాలు శరీరంపై ప్రసరించడంవల్ల చర్మ వ్యాధులు రావు. నరాలు బలహీన పడవు. గుండె జబ్బులు తగ్గుతాయి.
ప్రకృతి వైద్యంలో రోజులో కొంతసేపు తప్పకుండా ఎండలో కూర్చోబెడతారు. అలాగే రంగు సీసాల్లో నీళ్ళు పోసి, వాటిని ఎండలో ఉంచి, ఆ నీటిని తాగిస్తారు. అలా సూర్యకిరణాలు ప్రసరించిన నీరు శరీరానికి హితవు చేస్తుందని చెప్తారు.
ఎండలో ధాన్యపు గింజలను రెండుమూడు రోజులపాటు ఎండపెట్టినట్లయితే అవి పుచ్చిపోకుండా ఉంటాయి.
పత్రహరితం తయారవడానికి సూర్యరశ్మి అవసరం. ఏ రకంగా చూసినా సూర్యుడు లేనిదే మనుగడే లేదు.

సూర్యగ్రహ జపం (Surya Graha Japam)
ఆవాహనము:
ఓం హ్రీం తిగ్మరశ్మేయే ఆరోగ్యదాయ స్వాహా అస్య శ్రీ సూర్యగ్రహ మహామంత్రస్య
హిరణ్య స్తూప ఋషిః తిష్టుప్చదం: శ్రీ సూర్యగ్రహ దేవతా సూర్యగ్రహ ప్రసాద సిద్దర్థ్యే
మంత్ర జపం కరిష్యే! కరన్యాసము: ఓం ఆకృష్ణేన - అంగుష్టాభ్యాం నమః
ఓం రజసేతి - తర్జనీభ్యాం నమః ఓం వర్తమానో నివేశయన్నితి - మధ్యమాభ్యాం నమః
ఓం అమృతం మర్త్యంచేతి - అనామికాభ్యాం నమః ఓం హిరణ్యయేన
సవితారధేనేతి - కనిష్టికాభ్యాసం నమః ఓం ఆదేవోయాతి
భువనావిపశ్యన్నితి - కరతలకర వృష్యాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం ఆకృష్ణేన - హృదయాయ నమః ఓం రజసేతి - శివసేస్వాహా
ఓం వర్తమానో నివేశయన్నితి - శిఖాయైపషట్ ఓం అమృతం
మర్త్యంచేతి - కవచాయ హుం ఓం హిరణ్యయేన సవితారధేనేతి - నేత్రత్రయాయ నౌషట్
ఓం ఆదేవోయాతి భువనావిపశ్యన్నితి - అస్త్రాయ ఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః ఆదిదేవతాః అగ్ని దూతం వృణీమహే అస్య యజ్ఞస్య సుకృతం!!
ప్రత్యథి దేవతా: కదృదాయ ప్రచేతనే మీధుష్టమాయ తవ్యసే! హోచేమశంతమంగ్ హృదే!!
సూర్యగ్రహ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు!! వేదమంత్రం:
ఓం అకృష్ణేన రాజస్వార్తమానో వివేశయన్న మృతం మర్త్యం ఛ!
హిరణ్యయేన సివతారదేనా దేహోయాతి భువనాని పశ్యన్!!
సూర్యకవచ స్తోత్రము
1. ఘ్రుణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్!
ఆదిత్య లోచనఏపాతు! శ్రుతీ పాతు దివాకరః
2. ఘ్రూణం పాతు సదాభాను:! ముఖంపాతు సదారవి:!!
జిహ్యం పాతు జగన్నేత్రం కంఠంపాతు విభావసు:!
3. స్కంధౌ గ్రహపతి: పాతు: భుజౌపాతు ప్రభాకరః!
కరావబ్ధకరః పాతు: హృదయం పాతు భానుమాన్!
4. ద్వాదశాత్మా కంటిపాతు! సవితాపాతు సక్దీనీ!
ఊరు: పాతు సురశ్రేస్తో! జానునీపాతు భాస్కరః!
5. జంఘేమేపాతు మార్తాండో! గుల్భౌపాతు త్విషాంపతి:!
పాదౌ దినమణి: పాతు! మిత్రో భిలం వపు:!
ఫలశ్రుతి:
ఆదిత్యకవచంపుణ్య! మభేద్యం వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిత్య!
ముచ్యతే నాత్ర సంశయః! సంవత్సర ముపాసిత్యా! సామ్రాజ్య పదవీం లభతే!
సూర్యగ్రహ మంగళాష్టకమ్ భాస్వన్ కాస్యపగోత్రజో రుణరుచిస్సింహపోర్కస్సమి త్వట్త్రిస్థో
దశశోభానో గురుశశీ భౌమ స్సుమిత్రాస్సదా శుక్రో మస్టరిపు: కలిబ్గజన పశ్చాగ్నీశ్వరో
దేవతా మధ్యేవర్తుల పూర్వదిగ్ధనకరః కుర్యాత్సదా మంగళమ్!!
శ్రీ సూర్యాస్తోత్తరశతమామావళి: ఓం అరుణాయ నమః ఓం శరణ్యాయ నమః
ఓం కరుణారససిన్దవే నమః ఓం అసమానబలాయ నమః
ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమః
ఓం అఖిలగమవేదినే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అఖిలజ్ఞాయ నమః
ఓం అనన్తాయ నమః ఓం ఇనాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం ఇజ్యఆయ నమః
ఓం ఇన్ద్రాయ నమః ఓం భానవే నమః ఓం ఇన్దనీయాయ నమః ఓం ఈశాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సువర్చసే నమః
ఓం వసుప్రదాయ నమః ఓం పసవే నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః ఓం ఊర్ధ్యగాయ నమః ఓం వివస్వతే నమః ఓం ఉద్యత్కిరణజాలయ నమః
ఓం హృషికేశాయ నమః ఓం ఉర్ధ్యస్వలాయ నమః ఓం వీరాయ నమః ఓం నిర్జరాయ నమః
ఓం జయాయ నమః ఓం ఈదుద్వయాభావరూపకయుక్త సారధియే నమః ఓం ఋషి వస్ధ్యాయ నమః
ఓం రుగ్ఘన్ర్త్తే నమః ఓం ఋక్ష చక్రచరాయ నమః ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
ఓం నిత్య స్తుత్యాయ నమః ఓం ఉజ్వలతేజసే నమః ఓం ఋక్షా ధినాథమిత్త్రాయ నమః
ఓం పుష్యరాక్షాయ నమః ఓం లుప్తధన్తాయ నమః ఓం శాన్తాయ నమః ఓం కాంతిదాయ నమః
ఓం ఘనాయ నమః ఓం కనత్కనక భూషాయ నమః ఓం ఖద్యోతాయ నమః
ఓం లూనితాఖిలదైత్యాయ నమః ఓం సత్యానన్దస్వరూపినే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః
ఓం భగవతే నమః ఓం సృష్టి స్తిత్యన్తకారిణే నమః ఓం గుణాత్మనే నమః
ఓం ఘ్రుణిభ్రుతే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యదాయ నమః
ఓం హరిదాశ్వాయ నమః ఓం శౌరయే నమః ఓం దశదిక్సంప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః ఓం జస్యరాయ నమః ఓం జయినే నమః
ఓం జగదానన్దహేతవే నమః ఓం జన్మమఋత్యుజరావ్యాధివర్ధితాయ నమః
ఓం ఉచ్చ స్థానసమారూఢ రథస్తాయ నమః ఓం అనురాయయే నమః
ఓం కమనీయకరాయ నమః ఓం అబ్జవల్లభాయ నమః ఓం అన్తర్బహి: ప్రకాశాయ నమః
ఓం అచిన్త్యాయ నమః ఓం ఆత్మస్వరూపినే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేశాయ నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః ఓం అహన్కరాయ నమః ఓం రపయే నమః ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం పరేణ్యాయ నమః
ఓం గ్రహాణాంపతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః
ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సకలజగతాంపతయే నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః ఓం పారేశాయ నమః ఓం తెజోరూపాయ నమః ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః
ఓం హ్రీం సంపత్కరాయ నమః ఓం ఐం ఇష్టార్దదాయ నమః ఓం అను ప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః ఓం శ్రేయసే నమః ఓం భక్తకోటి సౌఖ్య ప్రదాయినే నమః
ఓం నిఖిలాగమ వేద్యాయ నమః ఓం నిత్యానన్ధాయ నమః
ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామినే నమః సూర్య స్తోత్రమ్
అస్యశ్రీ భగవదాదిత్య స్తోత్రమహామంత్రస్య అగస్త్య ఋషిః అనుష్టుప్చంద: సూర్యనారాయనో దేవతా.
సూం బీజం యం శక్తి: మం కీలకం. మమ ఆదిత్య ప్రసాదసిద్ద్యర్దే జపే వినియోగః
ఆదిత్యాయ అంగుష్టాభ్యాం నమః అరారయే తర్జనీభ్యాం నమః
దివాకరాయ మధ్యమాభ్యాం నమః ప్రభాకరాయ అనామి కాభ్యాం నమః
సహస్రకిరణాయ కనిష్టీకాభ్యాం నమః మార్తాన్ధాయ కరతలకరపృష్టాభ్యాసం నమః
ఏవం హృదయా దిన్యాసః భూర్భువస్సువరోమితి దిగ్భంధః
ధ్యానమ్:
ధ్యాయేత్సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం భక్త్యానామభయప్రదం
దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ఆదిత్యం జగదీశ మచ్యుత మజం త్రైలోక్య చూడామణిం
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మర్త్యాన్దమాద్యం శుభమ్. కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా
విశ్వతోముఖః జన్మ మృత్యుజరావ్యాధి సంసారభయనాశనః
బ్రహ్మస్వరూపో ఉదయే మధ్యాహ్నేతు మహేవ్వరః ఆస్తకాలే స్వయం విష్ణు:
త్రయీ మూర్తిర్దివాకరః ఏకచక్రరధో యస్య దివ్యః కనకబూషితః సోయం భవతు సః ప్రీతః
పద్మహస్తో దివాకరః పద్మహస్తః పరంజ్యోతి: పారేశాయ నమో నమః
అందయోనిర్మహోసాక్షి ఆదిత్యా నమో నమః కమలాసనదేవేశ ఆదిత్యాయ నమో నమః
ధర్మమూర్తిర్ధయామూర్తి స్తత్వమూర్తిర్నమో నమః సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః క్షయాపస్మారగుల్మాదిదుర్దోషవ్యాధినాశనం సర్వజ్వరహరం దైవ కుక్షిరోగనివారణం
ఏతత్ స్తోత్రం శివపరోక్తం సర్వసిద్దికరం పరమ్ సర్వసంపత్కరం దైవ సర్వాభీష్ట ప్రదాయకమ్
సూర్యదోషం – పరిహారము – శాంతులు
1. మీ దగ్గరలో ఉన్న శివాలయమునకు వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటలవరకూ ప్రదక్షిణలు చేయండి.
2. 6 ఆదివారములు నవగ్ర్హములకు 60 ప్రదక్షిణలు చేసి 1.25కే.జి. గోధుమలు దానం చేయండి.
3. శీకాకుళం జిల్లాలోని హర్షవల్లి దేవస్థానమును ఒక ఆదివారం దర్శించి సూర్య నమస్కారములతో 60 ప్రదక్షిణలు చేయండి.
4. ఆదివారం చపాతీలు పేదలకు, సాధువులకు పంచిపెట్టండి.
5. తూర్పుగోదావరి జిల్లా గొల్లమామిడ, పెద్దాపురం దేవస్థానములు దర్శించి ఎర్రని వస్త్రములో గోధుమలు దానం చేయండి.
6. కెంపును ఎడమచేతి ఉంగరపు వేలికి వెండిలో ఆదివారం ఉదయం 6 గంటలకు ధరించండి. 1.25 కే,జీ, గోధుమలు దానం చేయండి.
7. బ్రాహ్మణుడితో రవి జపము చేయించి గోధుమలు దానం చేయండి.
8. సూర్యగ్రహము వద్ద ఆదివారము 6 ఎర్రరంగు వత్తులతో దీపారాధన చేసి ఎర్రని వస్త్రములు దానం చేయండి.
9. 7 ఆదివారములు ఉపవాసము ఉండి చివరి ఆదివారం శివుని అభిషేకం, సూర్యుని అష్టోత్తర పూజ చేయండి.
10. తమిళనాడులోని సూర్యనార్ దేవస్థానము దర్శించి సూర్య హోమము చేయండి.
11. శ్రీరామ, శివ దేవాలయముల యందు పేదలకు ఆదివారం అన్నదానం చేసి, ప్రసాదం పంచండి.
12. రవి ధ్యాన శ్లోకమును ప్రతిరోజూ 60 మార్ల చొప్పున 60 రోజులు పారాయణ చేయండి. లేదా ఆదిత్య హృదయము ఒకసారి చదవండి.
13. రవిగాయత్రీ మంత్రమును 6 ఆదివారములు 60 మార్లు పారాయణ చేయండి. లేదా సూర్యాష్టకం ఒకసారి చదవండి.
14. రవి మంత్రంను 40 రోజులలో 6000 సార్లు జపం చేయండి. లేదా ప్రతిరోజూ సూర్యాష్టకం పారాయణం చేయండి.
15. తీరికలేనివారు కనీసం శ్లోకం 6 మార్లు గాని మంత్రము 60 మార్లు పారాయణ చేయండి. లేదా ప్రతిరోజూ సూర్య సనస్కారం చేయండి.
16. రథసప్తమి రోజున సూర్యాష్టకం 6 మార్లు పారాయణ చేయండి.
సూర్యసూక్తం
ఓం విభ్రాడ్ నృహత్సివరతు సోమ్య మధ్వాయుర్ధధ ధ్యజ్ఞపతి పవివ్రాతం
వాత జూతో యో అభిరక్షతి త్మనా ప్రజాః పుపోష పురుధా విరాజాత !!1!!
ఉదుత్యం జాతవేదనం దేవం వహంతి కేతవః! నేశే విశ్యాయ సూర్యం !!
యేనా పాపక చక్షుసా ధురణ్యం తం జనాం అసుత్వం వరుణ పశ్యసి!!2!!
దివ్యావద్వర్యూ అగతగ్ రథేన సూర్యత్వాదా!
మద్వా యజ్ఞగ్ సమాంజాధే! తంప్రత్నధాయం వేస శ్చిత్రం దేవానాం !!3!!
అస ఇదాబ్ది ర్విదధే సుశక్తి ర్విశ్వాసరః సవితా దేవ ఏతు!
అపి యధా యువానో మత్సథానో విశ్వం జగదభి పిత్యే మనిషా !!4!!
యదద్య కచ్చ వృత్రహ న్నుదగా అ
భిసూర్యం సర్వం తదింద్ర తేవశే !!5!!
తరణి ర్విశ్వదా ర్రీతో జ్యోతిష్కుదసి సూర్యో విశ్వమమాసి రోచనం!
యత్సూర్యస్య దేవ త్వం మధ్యా కర్తో ర్వితతగ్ సంజభార !!6!!
యదెదయుక్త హరితః సదస్థాదా
ద్రాత్రే వస స్తనుతేసి మస్తె !!7!!
తన్మిత్రస్య వరుణ స్యాసిచక్షే సూర్యోరూపం కృణుతే ద్యో రువస్టే!
అనంత మంగదృశదస్యపాజః కృష్ణ మస్య ద్ధరితః సంభరంతి !!8!!
శ్రాయంత ఇవ సూర్య విశ్వే దిందస్య భక్షత!
జాతే జనమాన ఓజసా ప్రయిభాగ న దీధం !!9!!
ఆద్యో దేవా ఉదితా సూర్యస్య నిరగ్ హసః పిపృతా నివద్యాత్!
తన్నో మిత్రా వరుణో ఆ ఆమ హంతా మదితి: సింధు: పృథివీ ఉతద్యో !!10!!
ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయ న్నమృత మర్త్యంచ!
హిరణ్యాయయేన సవితే రథేన దేవో ద్యాతి భువనాని పశ్యన్ !!11!!
సూర్యఅష్టోత్తర శతనామ స్తోత్రం
ధౌమ్య ఉవాచ: శ్లో!! సూర్యో అర్యమా భగస్యష్టా పూషార్య
సవితా రవి: గభస్తిమా సజ: కాలో మృత్యుర్ధాతా ప్రభాకరః !!1!!
పృథివ్యాపశ్చ తేజశ్చఖం వాయుశ్చ పారాయణం
సోమో బృహస్పతి: శుక్రో బుధో అంగారక ఏవచ !!2!!
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశు: శుచి: శౌరి: శనైశ్చర
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః !!3!!
విద్యుతో జాఠరశ్చాగ్ని రైంధస సైజసాంపతి:
ధర్మ ధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః !!4!!
కృతం త్రేతా ద్వాపరశ్చ కలి: సర్వమాలాశ్రయః
కలాకాష్టా ముహూర్తాశ్చక్షపా యామ స్తధా క్షణః !!5!!
సంవత్సరకరో అశవత్ద: కాలచక్రో విభావసు:
పురుషః శాశ్వతో యోగీ వ్య క్తావృక్షం సనాతనః !!6!!
కాలాధ్యక్ష: ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోసుదః వరుణః
సాగరో అంశశ్చ జీమూతో జీవనో అరిహా !!7!!
భూతాశ్రయో భూతపతి: సర్వలోక సమస్మ తః
స్రష్టా సంవర్తకో నహ్ని: సర్వస్యాది రలోలుపః !!8!!
అనంతః కపిలో భాను: కామదః సర్వతోముఖః
జయో విశాలో వరదః సర్వధాతు నిషేచితా !!9!!
మసః సుపర్ణో భూతాది: శీఘ్రగు ప్రాణాధారకః
ధన్వంతరి: ధూమకేతు: ఆదిదేవో దితే: సుతః !!10!!
ద్వాదశాత్యా అరవిందాక్షః పితామాతా పితామాతా:
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం !!11!!
దేహకర్తా ప్రశాంతార్మ విశ్వాత్మా విశ్వతోముఖః
చరాచరాత్మ సూక్ష్మా త్యా మైత్రేయః కరుణాన్వితః !!12!!
ఏతద్వై కీర్తనీయస్య స్యామిత తేజసః నామాష్ట శతకం
చేదం ప్రోక్తమేతత్ స్వయంభువా !!13!!
సురగణ పితృ యక్ష సేవితంహ్యసుర నిశాచర సిద్దవందితం
వర కనక హ్తాశన ప్రభంప్రణి పాతితో కన్మీ హితాయ భాస్కరం !!14!!
సూర్యోదయే యః సుసనహితః పఠేత్, సపుత్ర దారాన్ ధనరత్న సంచయాన్ !!
లభేత జాతిస్మరశాం సరః సదా! దృతించ మేధాంచ న విందతే పూమాన్ !!15!!
ఇస్టుం స్తవం దేవ పరిస్య యో సరః! ప్రకీర్తితయే చ్చుచి సుమనాః సుమాహితః!
నిముచ్యతే శోక దావాగ్ని సాగరాత్ లభత్ కామాన్ మనసా యదీప్సితాన్ !!16!!
ఇది సాంబపురానే రోగాపనయనే సూర్యాష్టకం సంపూర్ణమ్ ఆదిత్య హృదయమ్
తతోయుద్ధపరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్ట్యా
యుద్దాయ సముపస్థితమ్ దైవతైశ్చ సమాగమ్య దృష్టు మభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీ ద్రామ మగస్త్రోభగవాన్ ఋషి: రామ రామ మహోబాహో శ్రుణ గుహ్యం
సనాతనం యేన సర్వా నదీ స్వత్స సమరే విహయిసహ్యసి ఆదిత్య హృదయ పుణ్యం
సర్వశత్రు వినాశనం జయావాహం హపేన్నిత్య మక్షయ్యం పరమం శుభం
సర్వ మంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చిన్తాశోక ప్రశమన
మాయిర్వర్దనముత్తమమ్ రశ్మిమస్తం సముధ్యస్తమ్ దేవాసుర సమన్వితం

సూర్యాష్టకం (Suryashtakam)
ఆదిదేవ నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే
సప్త్యాశ్వ రథ మారూఢం - ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం - త సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథ మారూఢం - సర్వలోక పితామహం
మహా పాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
బంధూక పుష్ప సంకాశం - హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
తం సూర్యం లోకకర్తారం - మహాతేజ ప్రదీపనం
మహా పాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
సూర్యాష్టకం పఠేన్నిత్యం - గ్రహ పీడా ప్రనాసనం
అపుత్రో లభతే పుత్రం - దరిద్రో ధనవా స్ఫవేత్
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ - జన్మ జన్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని - యే త్యజంతి రవేర్దినే
నవ్యాధిః శోక దారిద్ర్యం - సూర్యలోకం చ గచ్చతి

సూర్య కవచ స్తోత్రము (Suryakavacha Stotram)
ఘృణి: పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్
ఆదిత్య లోచనే పాతు శృతీ పాతు దివాకరః
ఘ్రాణం పాతు సదా భాను: ముఖంపాతు సదారవి:
జిహ్వాం పాతు జగన్నేత్రం: కంఠంపాతు విభావసు:
స్కంధౌ గ్రహపతి భుజౌపాతు ప్రభాకరః
కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్
ద్వాదశాత్మా కటింపాతు సవితాపాతు సక్ధినీ
ఊరు: పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః
జంఘేమేపాతు మార్తాండో గుల్భౌపాతు త్విషాంపతి:
పాదౌ దినమణి: పాతు మిత్రో ఖిలం వపు:
ఫలశృతి
ఆదిత్య కవచం పుణ్యం మభేద్యం వజ్రం సన్నిభం
సర్వరోగ భయాదిత్యో ముచ్యతే నాత్ర సంశయం:
సంవత్సర ముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభేత్

భాస్కర దండకమ్
(Bhaskara Dandakam)
ఓం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి యాత్మరక్షామణీ త్వం నమోపాపశిక్షా, నమో విశ్వభర్తా నమో విశ్వకర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత భేదంబులున్నీవయై, బ్రోతువెల్లప్పుడన్ భాస్కరా! పద్మినీ వల్లభా, గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా, మహా దివ్యగాత్రా, అచింత్యావతారా, నిరాకార, ధీరా పరాకయ్య మోయయ్య తాపత్రయా భీలదావాగ్ని రుద్రాతనూద్భూత మింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుందాక నేకాకినై చిక్కి, యేదిక్కున నుంగానగాలేక యున్నాడ, నీవాడనో తండ్రి జేగీయమానా కటాక్షంబులన్ నన్ను గృపాదృష్టి వీక్షించి వేగన్ మునీంద్రాది వంద్యాజగన్నేత్రమూర్తీ ప్రచండ స్వరూపుండవైయొంటి సారధ్యమున్ గుంటి యశ్వంబులేడింటినిన్నొంటి చక్రంబుదాల్చి మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగా దోషజాలంబులన్ ద్రుంచి కీర్తిన్ అప్రతాపంబులన్ మించి, నీ దాసులంగాచి యిష్టార్దముల్ గూర్తువో దృష్టివేల్పా! మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబైనా భారంబుగానీక శూరోత్తమా మోప్పులుంతప్పులుంనేరముల్ మాని సహస్రంశువైనట్టి నీ కీర్తి కీర్తింపనేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వాన్ జూపినాయాత్మ భేడంబులన్ బాపి పోషింప నీవంతునిన్ శేషబహాషాధిపుల్ పొగడగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు గానంగ నేనెంత మొల్లప్పుడన్ స్వల్ప జీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులేసాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతతన్ చేయవే కామితార్ధ ప్రదాయీ మహిన్ నిన్ను గీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నయి ఫలించున్ భాస్కరా ద్యుతే సమస్తే నమస్తే నమః

సూర్యదోషం – పరిహారము , శాంతులు

(Suryadosham – Pariharam, Shanthi)మీకు గానీ, మీ బంధుమిత్రులకు గానీ సూర్యదోషం ఉన్నట్లయితే కింది సూచనలు పాటించి, ఆ దోషం నుండి విముక్తి పొందండి.

1. ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటలవరకు ప్రదక్షిణాలు చేయండి.

2. 6 ఆదివారాలు నవగ్రహములకు 60 ప్రదక్షిణాలు చేసి 1.25 కిలోలు గోధుమలు దానం చేయండి.

3. ఆదివారంనాడు శ్రీకాకుళం జిల్లాలోని వార్షపల్లి దేవస్థానాన్ని దర్శించి సూర్య నమస్కారాలు చేసి, 60 ప్రదక్షిణాలు చేయండి.

4. ఆదివారం రోజున పేదలకు, సాధువులకు చపాతీలు పంచి పెట్టండి.

5. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆలయానికి వెళ్ళి ఎర్రని వస్త్రములో గోధుమలు దానం చేయండి.

6. వెండిలో కెంపును పెట్టించి ఉంగరం చేయించి, ఆదివారం ఉదయం 6 గంటలకు ఎడమచేతి వేలికి ధరించండి. తర్వాత 1.25 కిలోల గోధుమలు దానం చేయండి.

7. బ్రాహ్మణుడితో రవి గ్రహ జపం చేయించి గోధుమలు దానం చేయండి.

8. నవగ్రహములలో సూర్యగ్రహణము వద్ద ఆదివారం ఎర్రరంగు వస్త్రంతో 6 వత్తులు వేసి, దీపారాధన చేసి ఎర్రని వస్త్రములు దానం చేయండి.

9. 7 ఆదివారములు ఉపవాసము ఉండి చివరి ఆదివారం సూర్యునికి అష్టోత్తర పూజ చేయించండి. అలాగే, శివునికి అభిషేకం చేయించండి.

10. తమిళనాడులోని సూర్యవార్ దేవస్థానము దర్శించి సూర్య హోమము చేయించండి.

11. ఆదివారంనాడు శ్రీరామ, శివాలయాల్లో పేదలకు అన్నదానం చేసి, ప్రసాదం పంచండి.

12. రవి ధ్యాన శ్లోకమును లేదా ఆదిత్య హృదయము రోజుకు 60 సార్ల చొప్పున 60 రోజులు పారాయణ చేయండి.

13. రవిగాయత్రీమంత్రమును 6 ఆదివారములు 60 మార్లు పారాయణం చేయండి.

14. రవి మంత్రమును 40 రోజుల్లో 6వేలసార్లు జపం చేయాలి, లేదా ప్రతి రోజూ సూర్యాష్టకం పారాయణ చేయాలి.

15. తీరికలేని వారు రవి శ్లోకము కనీసం 6 మార్లుగాని, రవి మంత్రం 60 మార్లు గానీ పారాయణ చేయాలి. లేదా నిత్యం సూర్య నమస్కారాలు చేయాలి.

16. రథసప్తమి రోజున 6 మార్లు సూర్యాష్టకం జపించాలి.

సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం?

A healing and protective mantra is a prayer to God Surya to protect and heal all parts of the body from all kinds of diseases, Healing Mantras In Praise Of The Sun God ... It is also advocated to ensure relief from eye disease and heart problemsశ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|

ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !

నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|

అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !

కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !

త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|

సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే-


శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|

శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!

త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|

చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|

చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !

యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !

యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.

వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|

వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.

ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|

ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !

త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|

సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి............

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML