గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

హిందువుగా మారిన అమెరికా అద్యక్షుడు ఒబామా. హనుమంతుని ఆరాధనే ఒబామా విజయ రహస్యం. అందుకే మంగళ వారం ప్రమాణ స్వీకారం
హనుమంతునిపై ఒబామా విశ్వాసం!

వాషింగ్టన్, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కూడా హనుమంతుడంటే ఎంతో ఇష్టం. హనుమంతుని ప్రతిమను ఎప్పుడూ తన కోటు జేబులో పెట్టుకుంటారు. ఉదాసీనంగా ఉన్నపుడు హనుమయ్యను చూసి సాంత్వన పొందుతారు. హనుమంతుని బొమ్మ తనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. దేశాధ్యక్షునిగా తన పదవీకాలం ముగుస్తున్న తరుణంలో దేశ ప్రజలనుద్దేశించి ఆఖరి ప్రసంగం చేసిన సందర్భంగా ఆయన యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. హనుమంతునిపై తనకున్న విశ్వాసం గురించి యూట్యూబ్ సృష్టికర్త నీల్సన్‌కు చెప్పారు. తనకు అలసటగా అనిపించినపుడు, నిరుత్సాహంతో ఉన్నపుడు వెంటనే జేబులో ఉన్న ఆంజనేయుని బొమ్మను తీసి చూసి ప్రేరణ పొందుతానని ఒబామా వివరించారు. ఒబామా జేబులో హనుమంతుని బొమ్మతోపాటు, పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన రోజరీ బీడ్స్, బౌద్ధ సన్యాసి కానుకగా ఇచ్చిన బుద్ధ ప్రతిమ, ఇథియోపియా నుంచి తెచ్చుకొన్న కాప్టిక్ క్రాస్ తదితర ప్రతిమలున్నాయి. వీటినీ ఎప్పుడూ తనదగ్గరే పెట్టుకుంటానని ఒబామా చెప్పారు.

అయితే తనది మూఢనమ్మకం అనుకోరాదని, ఆ పతిమలను చూస్తే సమస్యలను అధిగమించవచ్చునన్న ఆత్మైస్థెర్యం కలుగుతుందని అన్నారు. ఒబామా తండ్రి కెన్యా దేశీయుడు, తల్లి కాన్సాస్‌కు చెందిన శ్వేతజాతి మహిళ. ఈ ఇద్దరూ వేర్వేరు జాతులు, మతాలకుచెందినవారు కావడంతో కావచ్చు ఇతర మతాలను కూడా గౌరవించే గుణం ఒబామాకు అలవడింది. ఆయన బాల్యంలో కొంతకాలం ఇండోనేషియా దేశంలో గడిపారు. ఇండోనేషియాలో హిందూ మతస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హిందూమతాచారాలను అక్కడ ఇతర మతస్థులు కూడా గౌరవిస్తారు. హనుమంతుడిని అందరూ పూజిస్తారు. ఇండోనేషియాలో కొంతకాలం ఉన్నందు వల్ల ఆ ప్రభావం ఒబామాపై కూడా బలంగా పడింది.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML