గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి ,నారద ,తుమ్బురులను తమ గానాన్ని విన్పించమని కోరాడుహనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి ,నారద ,తుమ్బురులను తమ గానాన్ని విన్పించమని కోరాడు .ఇద్దరు వీణెలు సారించారు .గమక యుక్తం గా అలంకారాలు ,గీతాలు మధురం గా పలికించారు .స్వర సందర్భం ,శ్రుతులు ,ఆలాపన ,గమకాలూ గీత సరణి ,ముక్తాయింపు భలే గా ,అమోఘం గా వున్నాయని మెచ్చుకున్నాడు .ఇంతటి ఉద్దండ పండితుల గానాన్ని తాను తేల్చి చెప్పటం సాధ్యం కాదేమో అన్నాడు ..తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు విని పిస్తానని ,వారిద్దరిని కూడా వినమని కోరాడు .
వారిద్దరి గానాన్ని మెచ్చిన హనుమ తన గానం వినమనటం లో అర్ధ మేమిటో వారికి అర్ధం కాలేదు .”కోతులు సంగీత సభ చేస్తే కొండ ముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లున్తుంది హనుమ గానం అనుకొన్నారు .అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే ,ఇంకా హనుమకు ఏం మిగిలిందివిని పించాటానికి అని విసుక్కున్నారు .తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం .ఏమీ చేయ లేక తమ వీణలను హనుమకు అందించారు .నారదుని వీణను తీసుకొని హనుమ పలికించటం ప్రారంభించాడు .
ఓంకారం త్రిగునాత్మకము ,త్రి మూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు .ఇందులో అ ,ఉ ,మఉన్నాయని మనకు తెలుసు .ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ .ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు .మ కారం తమో గుణాత్మకం -రుద్రుడు .అ కారం ఎడమ నాసిక పుట -ఇడ .ఉ కారం కుడి నాసా పుట .పింగళ ..మ కారం వాటి మధ్య లో వున్న సుషుమ్న .ఈ విధం గా ఓంకారం మూడు నాడుల సమాహారమే .ఇడా నాడి-చంద్రుడు .పింగళ నాడి -సూర్యుడు .
సుషుమ్న నాడి యే అగ్ని .ఈ విధం గా ఓంకారం త్రయాగ్న మైంది .ఓంకారం లో దశ విధ నాదాలు జన్మించాయి .నాభి ,ఉదర,కంత ,స్తానానాలు వాటి ఉత్పత్తి స్థానాలు .ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ ,కంత ,శిరః స్తానా ల నుండి అభి వ్యక్తమై ,మందార ,మధ్యమ ,తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి . .
ఆ స్వరాల నుండి” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ”అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ ,ఈశ్వర ,సద్యోజాత ,వామ దేవ ,అఘోర ,తత్పురుష ,ఈశాన ” అనే ఏడు ముఖాల నుండి ,పుట్టి ”,షడ్జ ,రిషభ ,గాంధార ,మధ్యమ ,పంచమ ,దైవత ,నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి .వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత ,శిర ,నాస ,హృదయ ,ముఖ ,నాలుక ,పూర్వాంగాలు .మయూర ,రిషభ ,అజ ,సింహ ,కోకిల ,అశ్వ ,మద గజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు .
షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు ,రిషభం నుంచి మూడు ,గాంధారం నుండి రెండు ,మధ్యమ నుంచి నాలుగు ,పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు ,నిషాదం నుంచి రెండు -సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి .ఈ శ్రుతులకుఇరవై రెండు శృతి గమకాలూ ,ఏడు దేశీ గమ కాలు వున్నాయి .ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు ,ఆ రాగాలకు గ్రామ త్రయం ,దాని వల్ల పది హీను రాగాలు -వాటికి ఆరు జాతులు ,వాటికి ముప్ఫై ఆరు రాగాలు ,-వాటికి నాలుగు అంగాలు ,వాటికినూట ఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్త రించింది .ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకం లో ప్రసిద్ధ మైనవి .
వాద్యాలలో తథా ,ఆనద్ధ ,సుషిర ,ఘన అనే నాలుగు వున్నాయి .కాహల ,పటహ ,శంఖ ,భేరి జయ , ,ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు .వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు .త కారం రుద్రుడు .ల కారం పార్వతి .ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు .తాళానికి కాల ,మార్గ ,క్రియ ,అంగ ,జాతి ,గ్రహ కళ ,లయ ,యతి ,ప్రస్తారం అనేవి పది ప్రాణాలు .
హనుమ భరత శాస్త్రం లో కూడా నిష్ణాతుడు .,ప్రవర్త కుడు ,దర్శన కారుడు కూడా .భ అంటే భావం .ర అంటే రాగం .త అంటే తాళం .భావ ,రాగ ,తాళాలు అంటే సాహిత్య ,సంగీతా ,నాట్య ముల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం ”.అని పేరు వచ్చింది .రసాలు ,భావాలు ,అభినయాలు ,ధర్ములు ,వృత్తులు ,ప్రవృత్తులు ,సిద్ధులు ,స్వరాలు ,ఆతోద్యమములు ,గానాలు ,రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”.అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే .
గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకొన్నాడు .శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్య ను మనో ధర్మం గా అమోఘం గా ప్రదర్శించాడు హనుమ .ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి .చంద్ర కాంత శిలలు కరిగాయి .మ్రోడులు చిగిర్చాయి .లోకం సంమోహ మైంది .అతని వల్లకీ (వీణ)
వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి .సభ్యులు పరవశించి పోయారు .బొమ్మల్లా అచేతను లైనారు .
వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనం గా విని పించాడు .అతను ప్రదర్శించిన మెళకువలు ,ప్రౌధిమ ,రాగాలాపన ,గ్రామ స్ఫూర్తి ,తార లో అంతర స్ఫురిత నాద ప్రౌధి ,మీటు ,కంపితం ,ఆన్దోలితం ,మూర్చన ,శ్రుతులు ,డాలు ,అనేక మైన తాళ మానాలు విని జనం మై మరచి పోయారు .ఆకాశం మేఘాలతో నిండి పోయింది .కొంగలు బారులు తీరాయి .చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తున్నాయి నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేస్తున్నాయి .పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి .వర్షం పుష్ప వర్షం గా పడింది .సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగి పోయాయి .శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి .విమానం నడిపే వారు గతి తప్పారు ..దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి .హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చి కోలు గా ”ఓహ్ ,ఔరా ,భళా ,మజ్జ్హారే ,బాపురే ”అని అభినందిస్తూనే వున్నాడు .హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది .సభలోని వారంతా ఆశ్చర్యం లో ముక్కున వేలు వేసుకున్నారు ..
నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణా పై పలికించాడు .మళ్ళీ ఆ రాయి కఠిన శిల గా మారి పోయింది .తన చేతి లోని వీణేను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించ గల వాడే విద్యా దికుడని ,ఈ తాళాలను తీసుకోవా టానికి అర్హుడు అని చెప్పాడు ..ఇద్దరు విశ్వ ప్రయత్నం చేశారు .రాయి కరగ లేదు .వీణ లను నెల పై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిల బడ్డారు .”మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించ లేము కదా .తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది మీరు .అది వాగ్గేయ కారు లైన మీకు ఆవ వమానం కదా ”అన్నాడు హనుమ .పాపం వారిద్దరూ మరింత సిగ్గు పడి ”గాయక సార్వ భౌమా ! హనుమా !మా గర్వమ్ అణగి పోయింది .మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము .మీ ముందు మా గానం ఎంత .పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేదు .కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు .మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ల్ని కనికరించండి .”అని పశ్చాత్తాపం తో కుంగి విన్న విన్చుకొన్నారు నారద ,తుమ్బురులు ఇద్దరు .
దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహం తో క్షమించి ,వారివీణలు ,తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు .హనుమ కీర్తి గానం చేసు కొంటు ,వాళ్ళిద్దరూ శలవు తీసుకొని వెళ్లి పోయారు .హనుమ సీతా రాముల వద్ద సెలవు తీసుకొని మళ్ళీ గంధ మాదనం చేరాడు .శ్రీ కృష్ణుడు -సత్య భామా ,గరుడా ,నారద ,తుంబురుల గర్వాని ఈ విధం గా అణ గించాడు .అందరికి అహంకారం పోయేట్లు చేశాడు .జ్ఞానం పొందారు వారందరూ ..


Once Narada and Tumbura approached Maruti to judge who was superior in music between them. Maruti asked them to place their respective veenas on a big granite stone. Maruti began singing Gandakriya raga and the hard stone melted. He suddenly stopped singing and the stone got solidified and the two musical instruments of both narada and Tumbura got stuck up in the solidified stone. Maruti then asked Narada and Tumbura to exhibit their skills, melt the stone and take out their respective instruments. Each of them tried and failed. Maruti took pity on them, sang the raga again and when the stone melted, he asked the sages to take back their respective Veenas. The sages took back their Veenas. Maruti declared that Narada and Tumbura are equal in music and wished them well. They saluted the Lord and took leave of him.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML