గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

ఉదయాన్నే దైవదర్శనం శుభప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే.ఉదయాన్నే దైవదర్శనం శుభప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే. దేవాలయాలను దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది, కోరికలు నెరవేరుతాయి. అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలను దర్శించడం వల్ల అధిక ఫలితాన్ని పొందవచ్చు. స్థితి కారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్నీ,శ్రీ రామునీ, ఆంజనేయుని ఆలయాలని లేదా ఏ వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి. నిత్య జీవనం లో మనకు ఎదురయే అనేక ఆపదలను బాపే శ్రీమన్నారాయణుని ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం అత్యంత శుభస్కరం.

లయకారకుడు, ధ్యానమూర్తి అయిన శంకరుడిని ఆయన అనుచర గణాలనూ రాత్రివేళ లేదా సాయం సమయాలలో దర్శించాలి. పరమ శివుడు మనస్సుకు అధిపతి, జగద్గురువు. అటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తరువాత దర్శించుకోవడం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది. దీనికి కారణం చంద్ర కిరణాలు మానవుని శరీరం లో రక్తప్రసరణ పై (బి.పి.) నేరుగా ప్రభావం చూపుతాయి. చంద్రుడు ఆకాశం లో ఉండగా బుద్ధికి మనసుకూ అధిపతి అయిన శంకరుని ధ్యానించడం వల్ల చంద్ర కాంతి మన మనసుపై మంచి ప్రభావాన్ని చూపి, ఏకాగ్రత,జ్ఞాపక శక్తి, బుద్ధికుశలత పెరుగుతాయి.

అమ్మవారి ఆలయాలను దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఉండదు. ఆమె త్రిలోకాలకూ అమ్మ కనుక అమ్మను ఏ వేళలో అయినా దర్శించవచ్చు,ధ్యానించవచ్చు
వాస్తు: పూజగదిలో రాతి, లోహ విగ్రహాలున్నట్లైతే?

గృహంలో భగవంతుని పూజించేందుకు ఓ ప్రదేశం ఉండాలని భారతీయ వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. అయితే ఈ గది ప్రత్యేకంగా ఉండాలా లేదంటే ఒక అలమరాలో పెట్టుకుంటే సరిపోతుందా అన్న విషయం వారి వారి అభిప్రాయలను బట్టి మారుతుంటుంది. అలాగే గృహ వైశాల్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది.

ఒకవేళ తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేయవచ్చు. పూజ చేసే గదిలో పెద్దసైజు రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఇటువంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజచేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు ఆ విగ్రహాలను పూజ గది నుంచి తొలగించాలి. పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారి గృహస్తులకు హాని కలుగజేస్తాయి.

అయితే పూజ గది వల్ల ఈశాన్యం మూతపడుకూడదు. మన రాష్ట్రంలో కొన్ని పూజగదిని వాయవ్యంలో నిర్మించే సంప్రదాయం ఉంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. ఇక భగవంతునికి ప్రార్థన చేసే విషయానికి వస్తే... తూర్పు దిశకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

అందువల్ల పూజగదిలో చిన్నచిన్న విగ్రహాలను పెట్టి పూజచేసుకోవటం ఎంతో ఉత్తమం. అదేవిధంగా పూజ చేసే విగ్రహాలు ఏవైనప్పటికీ వారానికోసారిగానీ, పండుగల సమయాలలోనూ, గ్రహణాల తర్వాత వారివారి సంప్రదాయాన్ని బట్టి శుభ్రం చేయాలి. నిత్యం ప్రతిరోజూ శుభ్రం చేయాలనుకునేవారు చేసుకోవచ్చు.
మన సంప్రదాయం-నమస్కారం

మన సంప్రదాయం-నమస్కారం
ఏ దేశ సంస్కృతి అయినా ఆ దేశ ఆత్మ అయి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి యొక్క మహత్తు అపారమైనది. ఈ సంస్కృతిలో ఆదికాలం నుంచీ వస్తున్న సంప్రదాయాల వెనుక గొప్ప తాత్త్విక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి.భారతీయ సంస్కృతి యొక్క అపురూప రత్నము నమస్కారము. నమస్కారానికి అర్థము వందనము. నమస్సు లేక ప్రణామము. మన సంస్కృతిలో నమస్కారానికి ఒక స్థానము, మహత్తు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతియందు కరచాలనం (షేక్‌ హ్యాండ్‌) చేసుకున్నట్టుగానే భారతీయ సంస్కృతిలో రెండు చేతులూ జోడించి, తలను వంచి ప్రణమిల్లే ప్రాచీన పద్ధతి ఉంది. దీన్ని కరెక్టుగా చెప్పాలంటే సంస్కారంతో కూడిన నమస్కారం అనాలి. నమస్కారం అనేది ఒక ఉత్తమ సంప్రదాయం. దివ్య జీవితానికి ప్రవేశ ద్వారము. మనకంటే పెద్దలను, మాతా పితరులను, గురువులను, సాధువులను, సజ్జన, మహాత్ములను, ఉత్తములను కలుసుకున్న సమయంలో వారి ఎదుట చేతులు జోడించి, తలను వంచినట్లయితే మనలో ఉండే అహంకారం నశించి, అంత:కరణము నిర్మలమై వినయము అలవడుతుంది. ఆడంబరాలు, ఆర్భాటాలు, డాంబికాలు పోయి పరళ స్వభావులుగా, సాత్వి కులుగా మారతాము. మనస్ఫూర్తిగా చేసిన నమస్కారమే పైన చెప్పిన విధంగా సంస్కారంతో కూడిన నమస్కారం అవుతుంది.రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా ఆనించి, శిరస్సు వంచి చేసే నమస్కారము సరైన పద్ధతిలో చేసే నమస్కారము. ఈ నమ స్కారానికి జేజే, దండం, అంజలి వంటి పర్యాయ పదాలుగా చెప్పుకునే పేర్లు కూడా ఉన్నాయి.దేవుడి ముందు నిలబడి చేసే నమస్కారం శ్రేష్ఠమైనది. రెండు చేతులూ జోడించటం చేత జీవన శక్తిని, తేజో వలయాన్ని రక్షించే ఒక చక్రము ఏర్పడుతుంది. ఆ వందనం విశేష లాభదా యకమైనది. ఇక వందనము చందనము వలే శీతలమైనది. వందనం వలన వినయము, శాంతి, ఉత్తమత్వ్తం సిద్ధిస్తాయి. ఆలోచనలలో సంయమనాన్ని, ప్రవృత్తికి నియంత్రణనూ, విశ్వాసాన్ని పొందగలం. ఉత్తమ వ్యక్తిత్త్వం అలవడుతుంది. వినయశీలి అందరకు ఇష్టుడుఒక్క చేత్తో చేసే నమస్కారం నమస్కారంగా పరిగణింపబడదు. మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సం ప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు. తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు.నమస్కారం భారతీయ సంప్రదాయమై తరతరాల నుంచి వస్తున్నది. ఎదుటి వారికి, పెద్దలకు నమస్కారం చేయటం ద్వారా వారి పట్ల మనకున్న గౌరవ మర్యాదలను, వినయ విధేయతలను, భక్తి, శ్రద్ధలను తెలుపవచ్చు. తప్పును మన్నించమని అడగటాన్ని, వేడుకోవటాన్ని నమస్కారం తెలుపుతుంది. మన నమస్కారానికి ఎదుటి వారు చేసే నమస్కారాన్నిప్రతి నమస్కారం అంటాము. నమస్కారానికిప్రతి నమస్కారం చేయటం మన సంస్కారాన్ని తెలుపుతుంది.ఇటువంటి ఉత్తమమైన మన భారతీయ సంస్కృతిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి కరచాలనం చేయటం వలన ఒకరి చేతులు మరొకరు అందుకోవటం మూలాన చాలా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జీవశక్తి నశించి ఇన్ఫెక్షన్‌ ఉన్నటువంటి వారితో కరచాలనం చేస్తే, వారికుండే ఇన్ఫెక్షన్‌ ఎదుటివారికి సోకవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఏదైనా ‘టచ్‌’ చేయకుండా చేసే నమస్కారమే అన్ని విధాలా శ్రేయస్కరము.స్వచ్ఛమైన నమస్కారానికి సాటి, పోటీ లేదు, రాదు. మరి మరుగైపోతున్న భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను, నమస్కారాన్ని మళ్లి అలవాటు చేసుకుందామా

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML