
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 24 January 2016
తల్లి తండ్రుల గొప్పతనం-:
తల్లి తండ్రుల గొప్పతనం-:
" మాతా పితృ
సమం దైవం న దైవం పితృ మర్చయేత్ !
సర్వతీర్థ ఫలం జ్ఞేయం
మాతా వందనతాం సదా "
"తల్లి తండ్రుల" గొప్పతనం గురించి "శాస్త్రాలలో" చెప్పబడిన విధానం:
ఈ సమస్త "భూమితో" సమానమైనది "తల్లి"
"ఆకాశము" అంత "ఔన్నత్యం" కలవాడు "తండ్రి"
ఒక్కసారి "తల్లికి,తండ్రికి" నమస్కరించినచో "10,000 వేల
గోదానములు" చేసిన "పుణ్యము" వచ్చును.
"తల్లి, తండ్రి సత్యం జ్ఞానం" వంటి స్వరుపములు
"తండ్రి" కంటే గొప్పది జన్మనిచ్చిన "తల్లి"
"తల్లితండ్రులకు" సేవ చేస్తే "ఆరుసార్లు భూప్రదక్షిణ" చేసిన ఫలమూ, "వందసార్లు సముద్ర స్నానము" చేసిన ఫలమూ "వెయ్యిసార్లు కాశీయాత్ర" చేసిన ఫలమూ దక్కుతాయి.
ఎవరు "తల్లిని" సుఖముగ (( వుంచరొ, సేవించరో )) వారి శరీర మాంసాలు "శునక" మాంసము కన్నా హీనం.
ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, "కన్నతల్లి" కంట "కన్నీరు" తెప్పించిన "లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు" చేసినా ఆ "పాపం" పోదు.
"తను" చెడి "తన బిడ్డలను" చెడగొట్టిన "తండ్రిని" అసహ్యించుకున్నా "పుత్రునికి మహా పాపములు" సంక్రమిస్తాయి.
చెడు నడవడికతో ఉన్న "తల్లిని" నిరాదరించినా, నిందించినా అది "తప్పే" అని "ధర్మశాస్త్రం" చెబుతోంది.
"తల్లిని, తండ్రిని, ఆచార్యుడిని" మించిన "దైవం" లేదు. అని "ఉపనిషత్తులు" చెపుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment