గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

"శివుడి" యొక్క రూపం "విష్ణువు", "విష్ణువు" యొక్క రూపం "శివుడు"శ్లో:- " ఆకాశాత్ పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి !


సర్వ వెదేషు యత్ పుణ్యం సర్వ తిర్దేషు యత్ ఫలం తత్ ఫలం పుర్శమప్నోతి స్తుత్వా దేవం జనర్ధనం "

శ్లో:- అర్ధం ఏంటంటే "ఆకాశము" నుండి వొచ్చే "వర్షపు" నీరు "పర్వతాల" పైనుండి జాలువారి "నదిలోకి" ప్రవేశించి ఆ "నది" నుండి ఏలాగైతే "సముద్రంలోకి" వెళ్ళి కలుస్తాయో అలాగే ఏ "దేవుడికి" నమస్కారం చివరికి ఆ "పరమేశ్వరుడి" (( పరమేశ్వరుడు" అంటే "శివుడు" కాని "విష్ణువు" కాని మీ "భావన" ఏవరు అనుకుంటే వారు ))
చెంతకు చేరుతాయి. మీరు ఏన్ని "పూజలు" చేసిన ఏన్ని "తీర్థాలు" తిరగిన రాని "పుణ్యం" కేవలం ఆ "హరి" లేదా "హర" నామ "సంకీర్తనలు" చేసినంత మాత్రానే వొస్తుంది.

ఎందుకంటే.. {{ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివః }} అని వేదం చెపుతుంది. అంటే
{{ "శివుడి" యొక్క రూపం "విష్ణువు", "విష్ణువు" యొక్క రూపం "శివుడు" }}

( హరి హరులకు బేధం లేదు శివ, కేశవులు ఇద్దరు ఒకటే)

అందుకే మీరు ఎల్లప్పుడు "విష్ణు" నామం కాని "శివ" నామం కాని భక్తి స్మరిస్తూవుండండి.


{{ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ }}

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML