గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 24 January 2016

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ.

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

మను స్మృతి ప్రకారం ఉపనయనం (ఒడుగు) జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు (పితృ సంస్కారాలతో సహా) అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని వాడుకలో జందెం, జందియం, జంద్యంఅని కూడా అంటారు.
యజ్ఞోపవీతం బ్రాహ్మణకన్య చేత భమిడి ప్రత్తితో వడక బడి బ్రాహ్మణుడి చేత మెలికలు వేయబడుతుంది. జంద్యం యొక్క ప్రతి విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జంద్యం పొడవు నాలుగు వ్రేళ్ళ వెడల్పుకి 24 రెట్లు అంటే సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది (ఆరు అడుగులు). నాలుగు వ్రేళ్ళు మనిషి యొక్క జాగరణ, స్వప్న, నిస్వపన, బ్రాహ్మ(తురీయ ) స్థితులు అనే నాలుగు ఆత్మ స్థితులను తెలియజేస్తాయి. ప్రతి జంద్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది.
మామూలు సమయములోను, శుభ కార్యాలలోను యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్లు (సవ్యంగా) వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్లు (ప్రాచీనావీతిగా) వేసుకుంటారు. మూత్ర, మల విసర్జన సమయాలలో మెడలో దండ లేదా తావళం (నివీతం) లాగా ఉండేటట్లు వేసుకుంటారు. సంవత్సరానికి ఒక సారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. అందుకే ఆ రోజుకు జంద్యాల పూర్ణిమ అని పేరుకూడా వచ్చింది. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు.[1]
“యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి. ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.


ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.
శ్లోకముఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప. ధర్మసూత్రం.
అనగా వేదాధ్యాయనౌ కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము. అనబడును.
శ్లోఅగ్ని కార్య త్పరిభ్రష్టాః తే సార్వే వృషలాస్మృతాః.||. పరాశర స్మృతి వేదాద్యయనము చేయై బ్రాహ్మణునకు 'వృష్లుడు.' అని పేరు. కనుక బ్రాహ్మణ బ్రాహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనది.,. అవశ్యకమైనదీ కూడాను.

"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"

"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి? బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు. బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి, బూడు ముళ్ళు, ఐదు ముళ్ళుగల మొలత్రాళ్ళను వరసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించవలెను. బ్రాహ్మణుడు ప్రత్తి నూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టిన తొమ్మిది పోగులుగల యజ్ఞోపవీతమును భుజమునందు ధరించాలి బ్రాహ్మణుడు బిల్వముగానీ, మోదుగగానీ దండముగా ధరించాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రి కొమ్మగానీ, చండ్ర కొమ్మగానీ దండముగ ధరించాలి. వైశ్య బ్రహ్మచారి జివి కొమ్మనుగానీ, మేడికొమ్మనుగానీ దండముగా ధరించాలి. ఆ ముగ్గురు బ్రహ్మచారులు వరసగా కేశము వరకుని, నొసటి వరకును, ముక్కు వరకును ఉండునట్లు దండమును ధరించాలి. ఆ దండములు వంకర లేనివియు, గంట్లు గలిగింపనివియు, పై పట్టతో కూడినవియు, అగ్నిలో కాలనివై ఉండవలెను. వారు దండమును గైకొని సూర్యోపస్థానము చేసి, అగ్నికి ప్రదక్షిణము చేసి యధావిధిగా భిక్షాటనము గావించాలి.

ఉపవీతుడైన బ్రాహ్మణుడు 'భవతీ భిక్షాందేహీ అని భవ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాటన చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు 'భిక్షాం భవతీ దేహీ అని భవ శబ్దాన్ని మధ్యన చెబుతూ భిక్షాటన చేయాలి. వైశ్య బ్రహ్మచారి 'భిక్షాం దేహి భవతీ అని భవతి శబ్దం చివరనుంచి భిక్షాటన చేయాలి. తల్లినిగాని, తోడబుట్టినదానినిగాని, తల్లితోడవుట్టినదానిని గాని ఎవరు తనను అవమానింపదో అట్టివానిని యాచించాలి. ఈవిధంగా మధూకరము తెచ్చి వలసినంతవరకు గురువునకు మంచి అన్నమును నివేదించి, ఆతని అనుజ్ఞను పొంది యాచమించి తూర్పు ముఖంగా కూర్చుండి పరిశుద్ధుడై యవశిష్టాన్ని భుజించాలి. వేరు చింత లేకుండా భుజించి భోజనమైన పిమ్మట చేతులు, కాళ్ళు కడిక్కొని శాస్త్రరీతిని ఆచమనం కావించి నీటితో అన్ని ఇంద్రియాలు తుడుచుకోవాలి. చౌలము (పంచ శిఖలు పెట్టుట) ఉపనయన సమయంలో జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలము విధిగా మంత్రయుక్తంగా చేయాలి. చౌలము వలన అందం, ఆయుష్షు, తేజస్సు అభివృద్ధి అవుతాయి. ఈ చౌలములో పంచ శిఖలు పెడతారు. శాస్త్ర ప్రకారం వటుని ప్రవరలో ఎంత మంది ఋషులు ఉంటారో అన్ని శిఖలు శిరముపై ఉంచి మిగిలిన జుట్టు తీయించాలి. కాని అయిదు శిఖలు ఉంచుట శిష్టాచారంగా ఉంది. వటుని తండ్రి లేక ఉపనయనం చేసె వ్యక్తిని ఆచార్యుడు అంటారు. ఆచార్యుడు మూడు దర్భలను వేడి నీటిలో చన్నీటిని పోసి ఆ నీటిని తూర్పు దిక్కున ఉంచి ఉత్తర దిక్కు వరకు సవ్యంగా వటుని జుట్టును మంత్రయుక్తంగా తడపాలి. తరువాత కత్తిని వటుని శిరమునందుంచి సవ్యంగా నాలుగు దిక్కులనుంచి శిరస్సు మధ్యనుంచి కేశాలు తుంచాలి. ఎద్దు పేడను ప్రమిదగా చేసి దానియందు యవధాన్యమునుంచి ఆ ప్రమిదలో ఐదువైపులా వపనము చేసిన కేశాలనుంచి 'ఉప్త్వాకేశాన్ ' అను మంత్రోచ్చారణతో మేడిచెట్టుయొక్క మూలమందుగాని, దర్భలను స్తంభంగా చేసి దానియందుగాని ఉంచాలి. ఎద్దుపేడ బదులు నేడు వరి పిండితో ప్రమిద చేస్తున్నరు.లోకాచారం ప్రకారం ధాన్యముపై పీటవేసి వటుని కూర్చుండబెట్టి క్షురకునిచే ఆచార్యుడు చేసిన విధంగానే వపనము చేయించి పంచశిఖలు ఉంచాలి. ఆ కత్తిని మూడు రోజులవరకు దేనికీ వాడరాదు. ఉపనయనం వలన ఆశ్రమాధికారం సిద్ధిన్స్తుంది. వేదాధ్యయనము, ధర్మ శాస్త్రాధ్యయనము చేయడానికి ఆయువు, తేజస్సు, యశస్సు, సిరి, పుష్టికామ్యాల అభివృద్ధిని కలగజేసే 24 అక్షరాలుగల గాయత్రి మంత్రోపాసనకు వీలవుతుంది. యజ్ఞోపవీత మంత్రార్ధము: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్| ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తా|| వేదోక్త కర్మలు చేయు అధికారము పొందుటకు తయారుచేయబడిన, పరమ పవిత్రమయినది, బ్రహ్మ దేవునికి సహజముగా సిద్ధించినదియు, మొదట పుట్టినదియునగు ఈ యజ్ఞోపవీతము నేను ధరించుచున్నాను. యజ్ఞోపవీతము నాకు ఆయుర్వృద్ధి, నిర్మలత్వము, బలమును, పుష్టి, తేజస్సును ఇచ్చుగాక. నందీసమారాధన : శోభన దేవత స్వరూపులైన ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనిచ్చుట ఆచారము. శ్లో|| వటురక్షార లవణం సప్రాణాహుతి ముత్తమమ్| ఏక ఏవమి భుంజీత వ్రతే క్రమ పీడయన్|| తా|| బ్రహ్మచారి కారము, ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాత్రకమైన, ఉత్తమైన ఆహారమును ఈ వ్రతమందు వ్రతభంగము కాకుండా భుజించవలెను. అనగా బ్రహ్మచారి తన బ్రహ్మచర్య దీక్షా వ్రతము పూర్తి అగువరకు ఉప్పు, కారంలేని భోజనం చేయవలెను. శ్లో|| మాత్రసహకుమారం భోజయేత్ తా|| గాయత్రీమంత్ర ప్రోక్షణతో సహా సహపంక్తి లో వటుడు భోజనము చేయవలెను. మాత్రాసహ అంటే తల్లితో కలిసి అని భావించి మధ్వులు ఆవిధంగా ఆచరిస్తున్నారు. కాని మాత్రాసహా అంటే గాయత్రీ మంత్రముతో సహా అని అర్ధము.ఆ సమయమున ఆచార్యుడు గాయత్రీ మంత్రము చెప్పగా వటుడు అన్నముపై ఉదకము ప్రోక్షించును. అమృతో పస్తరణమసి అనుచోట ఉదకము బదులు నేయి వేయవలెను.

అశ్వారోహణము: అగ్నిహోత్రమునకు ఉత్తరపువైపున ఆచార్యుని వలే తూర్పు తిరిగి కూర్చొనవలెను. దక్షిణ దిశగా శానము (సన్నికల్లు లేక రాయి) ఉంచి, ఉపనయనము చేయుచున్న వ్యక్తి (ఆచార్యుడు)"అతిష్టేమ" అను మంత్రమును చెప్పి, సన్నికల్లును త్రొక్కించవలెను. ఈ రాయివలె చాలాకాలము బ్రహ్మచర్య నిష్ఠలో స్థిరుడవై యుండుమని దీని యర్ధము. వస్త్రధారణ: పంచల చాపు ఉత్తరించి ఆచార్యుడు వాటిని అభిమంత్రణచేసి రాతిమీదనే మంత్రయుక్తముగా వటువనకు కట్టవలెను. ఈ వస్త్రములు దేవతలు తయారుచేసినవి. నీవు నిండు నూరేళ్ళు సుఖముగాయుండుటకు ధనము సంపాదించి ఆప్తులకు, అర్ధులకు యివ్వవలెను అని మంత్రార్ధము. మౌంజీ మేఖల ధారణ: ఆచార్యుడు "ఇయందురుక్తా....సుభగామేఖలేయం" అను మంత్రమును జెప్పి ముంజగడ్డితో పేని ముప్పిరవేసిన త్రాడును వటువు మొలకు ప్రదక్షిణముగా మూడు చుట్లు త్రిప్పి కట్టవలెను. వటువుచే కూడ ఈ పైమంత్రము చెప్పించవలెను. ఈ మంత్రార్ధమేమనగా ఈ మౌంజీ దేవతలకు ప్రియమైనది. ఉఛ్ఛ్వాసనిశ్శ్వాసములచేత ఆత్మ బలమును శరీర బలమును కూడా కలిగించునది. దీనిని ధరించుటచే ఆపదలు రావు. మిత్రస్య అను మంత్రముచే కృష్ణాజినమును ఆచార్యుడు వటుడు మెడలో ఉపవస్త్రముగా వేయవలెను.ఈ కృష్ణాజినము విశేష తేజస్సు, కీర్తి, వృద్ధిగలది. ధూర్తులకు ఉపయోగపడనిది. అన్నమును యిచ్చునది. స్తోత్ర పాత్రమైనది. సూర్యుని నేత్రమయినది. దీనిని వస్త్రముగా ధరించుచున్నాను అని మంత్రార్ధము. గమనిక: మౌంజీ, మేఖలలు క్షత్రియ వైశ్య ులకు వేరువేరుగాయున్నవి.ఆచార్యుడు వటువును దగ్గరకు తీసుకొని పంచల చావు (నూతన వస్త్రము) యిద్దరిపై కప్పి"సుప్రజ" అను మంత్రమును వటుని చెవిలో చెప్పవలెను. సుప్రజాః ప్రజయా భూయాస్సువీరో వీరై సువర్చా వర్చసా సుపోషః పోషైః| తా|| మంచి సంతానము గలవాడవై పుత్ర పౌత్రాదులచే మంచి వర్చస్సు గలవాడవై పోషకులగు పుత్రులచే వృద్ది చెందుము. వటువు చెప్పవలసిన మంత్రము: మం|| బ్రహ్మచర్య మాగా ముపమానయస్య దేవేన సనితా ప్రసూతః తా|| నేను బ్రహ్మ చర్యవ్రతమును వేదాధ్యయనము కొరకు స్వీకరించితిని. ఓ ఆచార్యా! మీరు సూర్యుని అనుమతితో వేదోపదేశము చేయుటకై మీ దగ్గర ఉంచుకొనుమని వటువు చెప్పును. బ్రహ్మోపదేశం: తూర్పు దిక్కుగా ఆచార్యుడు కూర్చుండగా కుమారుడు అభిముఖముగా ఆచార్యుని కుడిపాదమును కుడిచేతితో పట్టుకొని అయ్యా! గాయత్రీ మంత్రోపదేశమును ఆచార్యుడు వటువు కుడి చెవిలో చేయవలెను. ఉపదేశ విధానము: మం|| ఓం భూః తత్సవితురువరేణ్యం | ఓం భువః భర్గోదేవస్య ధీమహి ఓ గుం సువః ధీయోయోనః ప్రచోదయాత్|| ఓం భూః తత్స వితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ఓం భువ: ధీయోయోనః ప్రచోదయాత్| గోదానము: ఓ ఆచార్యుడా నీకు వరమును (వరమనగా గోవు అని వేదమున గలదు) ఇచ్చుచున్నానని గురువునకు వటువు శేష్ఠమైన గోవు నీయవలెను. గురువు 17సార్లు ప్రణవము చేయవలెను. లేచి "దేవస్యత్వా" అను మంత్రమును చదివి గోవును స్వీకరించవలెను.పిమ్మట ఆచార్యుడు పడమట దిక్కుగా కూర్చొన్న వటుని 'ఉదాయుషా' అను మంత్రము చదువుచు లేవదీసి వానిచే చెప్పించవలెను. ఉదాయుషా మంత్ర భావము: నూరు వత్సరముల ఆయువుతో బలకరమైన ఔషధముల రసముతో మేధుని యొక్క బలముతో దేవతలను ధ్యానము చేయుటకులేచి నిలబడుచున్నాను. సూర్యుని దర్శించుట: "తచ్చక్షుః" అను మంత్రము మొదలుకొని - సూర్యం దృశే అని ఆచార్యునిచే చెప్పబడిన పదిమంత్రములతో వటుకు సూర్యుని సేవించవలెను. అవి: 1. తచ్చక్షుర్దే వహితం పురస్తాచ్ఛు క్రముచ్చరత్ తా|| నేత్రములయందు ఇంద్రునిచే యుంచబడినదియు తూర్పుదిక్కున బయలుదేరి వెళ్ళునదియు శుభ్రమైనదియునగు ఆ ప్రసిద్ధమైన సూర్య తేజస్సును. 2. పశ్యేమ శరదశ్శతమ్| తా|| నూరు సంవత్సరములు చూచెదను(జీవింతును). 3. మం||జీవమ శరదశ్శతమ్|| తా|| నూరు సంవత్సరములు జీవించగలను. 4. మం|| నందామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు ఆనందంగా ఉండగలము. 5. మం|| మోదామ శరదశ్శతమ్ తా||నూరు సంవత్సరములకు బ్రహ్మానందమును పొందుచుందుము. 6. మం|| భవామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు సంపదగలవారమై యుందుము. 7. శృణవామ శరదశ్శతమ్|| తా|| నూరు సంవత్సరముల వరకు వేద శాస్త్రములలు వినుచుందుము. 8. మం|| ప్రబ్రవామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు చక్కగా మాట్లాడు చుండగలము. 9. మం|| అజీతాశ్యామ శరదశ్శతం తా|| నూరు సంవత్సరముల వరకు హింసలేని వారమై యుందుము. 10. మం|| జ్యోక్చసూర్యం దృశే|| తా|| జీవించినంతకాలము అంధత్వము లేక మంచి దృష్టిగలవారమై యుందుము. సూ|| యంకామయేత............... విధిమాహ|| స్నాతకవ్రత పర్యంతము ఈ వటువు నన్ను విడువకుండ నుండవలెనని ఆచార్యుడు కోరుచు క్రింది యస్మిన్ భూతంచ అను మంత్రమును చెప్పి అతని కుడిచేతితో వటువు కుడిచేయి పట్టుకొనవలెను. మం|| యస్మిన్ భూతంచ-------- గృహ్ణామి నారాయణశర్మన్|| తా|| జరిగినదియు, జరుగుచున్నదియు, జరుగబోవుచున్నదియునగు ప్రపంచమునకు సృష్టికర్తయగుయే బ్రహ్మయందు సమస్తలోకములు నిలిచియున్నవో ఆ బ్రహ్మయొక్క అనుమతిచే నిన్ను నామనసునందెపుడును ధ్యానము చేయచుండెదను.వటువు మూడు అహోరాత్రములు ఈ అగ్ని అవిచ్ఛన్నముగా నిలుపుకొనవలెను. ఈ అగ్నిలోనే ఉదయము, సాయంకాలము హోమము చేయవలెను. మూడు రోజుల తరువాత నుండి సమావర్తనము వరకు రెండుపూటల లౌకికాగ్నిలో సమిధలు హోమము చేయవలెను. భిక్షా కార్యము: ఆచార్యుడు వటువునకు ఏదైనా ఒక వస్తువుతో కూడిన పాత్రను యిచ్చి ముందుగా తల్లిని యాచించమని చెప్పవలెను. కుడి చెవిని ఎడమ చేతితోను ఎడమ చెవిని కుడి చేతితోను పట్టుకోని ఈ క్రింది మంత్రమును చెప్పవలెను.చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు-----------ఋషులపేర్లు సంఖ్య చెప్పి-- గోత్రస్య (గోత్రం పేరు చెప్పాలి) ---- శర్మ (తనపేరు చెప్పాలి) అహంభో అభివాదయే అని చెప్పి పాదములకు నమస్కరించి స్త్రీలనయితే భవతి భిక్షాందేహి అని పురుషులనైతే భవాన్ భిక్షాందదాతు అని భిక్ష అడిగి నడుముకు కట్టుకున్న వస్త్రము కొనను రెండు చేతులతోను పట్టుకొని అందులో భిక్ష స్వీకరించాలి.మొదట తల్లి పళ్ళెములో బియ్యము తెచ్చివెండి గిన్నెతో రెండు సార్లు బియ్యం వటువు యొక్క వస్త్రములో వేసి మూడవసారి గిన్నెతోసహా బియ్యమును వేయవలెను. ఈ వెండిగిన్నె బ్రహ్మగారు తీసుకొనుచున్నారు. ఉంగరము(భటువు)వేలికి తొడుగుట కొందరి ఆచారముగా యున్నది. వస్త్రమునిచ్చుట: సూ|| వానశ్చరుర్ధీ ముత్తరయా దత్తే దతృదావ్యః | గురోవానస్తేదదామీతి దద్యాత్||వటువు ఉపనయనమునాడు తనకు గట్టిన వస్త్రమును ఓ గురువర్యా ఈ వస్త్రమును నీకు యిచ్చుచున్నాను అనుచు ఈయవలెను. ఉపాకర్మ: ఉపనయనమైన తర్వాత వచ్చు మొదటి శ్రావణ పూర్ణిమరోజున గ్రహణం సంభవించిన భాద్రపద పూర్ణిమనాడు ఉపాకర్మ చేయాలి. కాని ఉపాకర్మయిపుడు ఎవరు చేయటంలేదు. బ్రహ్మచర్య ధర్మములు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము అయినది మొదలు బ్రహ్మచర్య వ్రతము ప్రాంభమగును. ఉపనయనమైన తర్వాత గురుకులమున 12 సంవత్సరములు బ్రహ్మచర్యమును పాటించుచు ఒక వేదమునైనను పూర్తి చేయవలయును. సూ|| ద్వాదశ వర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యం చరేత్| ఒక్కొక్క వేదమునకు, 12 సంవత్సరములు చొప్పున బ్రహ్మచర్యము జరుపవచ్చును. కానియది విధికాదు. మరియు ఋషుల మతమున కలియుగములో దీర్ఘబ్రహ్మచర్యము పనికిరాదు. కాబట్టి 12 సంవత్సరములే బ్రహ్మచర్యము చాలును, దీనిని బట్టి బ్రాహ్మణుడు కనీసము 20 సంవత్సరములవయస్సులోను, క్షత్రియుడు 23 సంవత్సరముల వయస్సులోను, వైశ్యుడు 24 సంవత్సరముల వయస్సులోను వివాహము చేసికొనుట శాస్త్రసమ్మతమని తెలియును. శూద్రుడు గురుకులమున కేగనక్కరలేదు. కావున ఆయుర్దాయములో నాల్గవవంతు అనగా 25 ఏండ్లు వయస్సు వరకు ఆతడు అవివాహితుడుగానుండి పిమ్మట వివాహమాడవలయును. బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి. ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట. ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట. శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట. శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట. దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట. మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు. బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను. బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను. బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను. బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను. బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు. బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును. బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును. ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు. బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును. బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే. ఇతర నియమములు: చివరకు వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది. బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు. బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు. ఏ పరిస్థితిలో ఉపనయనం చెయ్యకూడదు? వటువు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు సంవత్సరంపాటు ఈ ఉపనయన కార్యం చేయకూడదు. ముహూర్త నిర్ణయము ఇది తండ్రి, వటువు జాతకాలనుబట్టి నిర్ణయించాలి. వారిద్దరి తారాబలం, చంద్రబలం కుదరాలి. తిధులు అధ్యయనరహితమైన విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి. వారములు సోమ, బుధ, గురు మరియు శుక్ర వారాలు. నక్షత్రములు అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. లగ్నములు వృషభ, కర్కాటక, కన్య, తుల, ధను, మకర, కుంభ, మీనములు. లగ్నానికి కేంద్రంలో పాపులుగాని, చతుర్ధమందు రవిగానీ ఉండరాదు. అష్టమశుద్ధి అత్యంత ముఖ్యం మూఢమి, దక్షిణాయనములలో ఉపనయనము చేయరాదు. గురుబల నిర్ణయము కర్కాటక, ధనుర్మీన రాశులయందైనను, వటుని జన్మ రాశియందైనను, ఉపనయన లగ్నమునకు 12వ యింటనైననూ గురుడుండిన వటువు సంపూర్ణ విద్యాంతుడు, భాగ్యవంతుడు అగును. వృషభ, మిధున, కన్య, తుల, మకర, రాశులయందైనను, ఈ అంశలందు ఎక్కడైననూ గురుడుండిన విద్య, ఆచార, సుఖ, ఆయుర్దాయములలో ఒకటైననూ పొందును. గ్రహబలము చంద్రుడు మాతృ కారకుడు, రవి పితృకారకుడు, గురుడు ప్రాణకారకుడు అగుటవలన ఉపనయన లగ్నమందైనను, గ్రహచారమందైనను చంద్ర, రవి, గురు బలములు చూడవలెను.గురు బలము ఆచార్య, వటువులకు అవశ్యంగా ఉండవలెను. గురుడు వటుని నక్షత్ర రాశికి 2, 5, 7, 9 స్థానములందుండగాను, అష్టమ శుద్ధి లగ్నములో ఉపనయనము చేయవలెను. చంద్రరాశి స్థితి ఫలము ఉపనయన ముహూర్తమున చంద్రుదు సిమ్హరాశియందున్న వటువు పాపవందుడును, కర్కాటకమందున్న దరిద్రుడుని, మేష మరియు వృశ్చీక రాశులయందున్న ఆయుధధరుడును, కన్య, మిధున రాశులయందున్న పండితుడును, ధనుర్మీన రాశులందున్న సోమయాజియు, తుల, వృభషమందున్న సత్వర వివాహితుడు, చందాల సేవకుడును అగును. త్రిస్రోష్టకములు మార్గశిర, పుష్య,మాఘ, ఫాల్గుణ మాసాలలో బహుళ్ సప్తమి, అష్టమి, నవమి తిధులను త్రిస్రోష్టకాలంటారు. ఇవి ఉపనయానైకి పనికిరావు. ఉపనయన ముహూర్త దోషములు చంద్రుడు ఉపనయన లగ్నమందున్న స్వకీయుడగు తన ఉచ్చ రాశి అయినను వటుని క్షయ రోగవంతునిజేయును. లగ్నమునకు 12వ ఇంట రవికి కుజ వీక్షణయున్న తండ్రికి నేత్ర హాని, వర్ణాధిపతులును, గురుశుక్రులుని, వేదాఢిపతులుని, వీరు నీచ రాశులయందుండగను, నీచ గ్రహములు అస్తమించియుండగాను ఉపనయనము చేసిన దోషము. లగ్నమునకు కేంద్ర స్థానములందు అనగా 1, 4, 7, 10 స్థానములందు ఎక్కడైననూ రవియున్న స్పృజితమను దోషము, కుజుడున్న కుజితము దోషము, శనియున్న రుధిరమను దోషము కలుగును. దోషభంగము లగ్నమునకు 1, 4, 7, 10 స్థానములలో బుధ, గురు, శుక్రలలో ఎవరైన ఉన్న సమస్త దోషములు నశించును.లగ్నమునకు 11వ యింట సూర్య, చంద్రులలో ఎవరైనయున్న సమస్త దోషములు హరించును. లగ్నమునకు 3, 6, 11 స్థానములలో కవి, కుజ, శనిలలో ఎవరైనయున్న సర్వ దోషములు నశించును. లగ్నమునకు కేంద్ర త్రికోణములందు శుభ గ్రహములైన గురు, చంద్ర, బుధులలో ఒకరైన యున్న సృజితమను దోషము పోవును. చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటమందుండి కర్కాటకమునుంచి బుధ, గురు, శుక్ర అంశపొందియుండగాను, శ్రవణ, పునర్వసులు నాలుగవ పాదమందుండగాను, చంద్రుడు లనై లగ్నములందును 8వ యింట ఏ గ్రహము లేకుండగను ఉండుట ఉపనయనమునకు యోగ్య కాలము. ఉపనయన ముహూర్తము రోజునకు పూర్వ రోజున 4వ రోజున వీనిలో ఒక రోజుయైన అనధ్వయ దినమైయుండగాను, వటుని తల్లి నాందీముఖమునకు పూర్వమే రజస్వల అయినను, 6 మాసములు గర్భిణి అయినను వటును తల్లితండ్రులు, తాత నాయనమ్మ చనిపోయిన సంవతరమందును, రవియున్న రాశియందును, అభిజిత్ రాశియందును, వటునికి చెవులు కుట్టకుండగను ఉపనయనము చేయరాదు. భార్య 6 మాసములు పైబడిన గర్భముతో యుండగా భర్త గృహ నిర్మాణ, గృహ ఆరంభ, ఉపనయనములను చేయరాదు. అంతకు పూర్వమందు చేయవచ్చును లేదా నెల పురుడు వెళ్ళిన తరువాత చేయవచ్చును. నిశ్చయించుకొన్న మంచి ముహూర్తమునకు వటుని తల్లి రజస్వల అయిన వేరే ముహూర్తము దొరకకుండిన ఒక సువాసినిని వస్త్ర మాల్యాదులచే పూజించి ఆ ముహూర్తమునకుఉపనయమును చేయవచ్చును. వటుని తల్లి ఉపనయనము జరుగుచుండగా నాందీ ముఖమునకు పూర్వము రజస్వల అయినచో ఉపనయనము చేయరాదు. ఒకే తల్లికి జలిగిన కవలలు కాని మగపిల్లలకు ఒకే సంవత్సరంలో ఉపనయనము చేయరాదు. సంవత్సరమనగా 12 నెలలు కాదు. సంవత్సర నామభేదమని గ్రహించవలెను. కవలలకు ఒకేసారి ఒకే ముహూర్తమునకు ఉపనయనము చేయవలెను.

Upanayana

In Hinduism, Upanayana is the initiation ritual by which initiates are invested with a sacred thread, to symbolize the transference of spiritual knowledge.

In Hinduism, the "sacred thread" (Sanskrit: यज्ञोपवीतम् yajñopavītam or upavīta) is a thin, consecrated cord, composed of distinct cotton strands, worn to symbolize the permission given to the wearer to perform sandhyavandanam and recite the Gayatri Mantra.[1][2] The sacred Yajñopavītam is known by many names (varying by region and community), such as Bratabandha, Janivaara, Jandhyam, Poita, Pūṇūl, Janeu, Lagun, Yajnopavita, Yagyopavit, Yonya and Zunnar.[3][4] The other Sanskrit term for it is Avyanga.
The ceremony that invests the wearer with the sacred thread is often considered a socially and spiritually significant rite (or samskara). It has varying formats across Hindu communities and is also called by varying names, including brahmopadesham, munji, munj, janeu rasm and bratabandha.[5][6] Among Hindus, the ceremony is associated with the higher varṇas.[7]
Though far less common, it is sometimes conducted for girls.[7] At a village in Bihar, girls, irrespective of caste, undergo upanayana and wear the sacred thread.[8]
In some regions of modern North India and also among a few South Indian castes, the ceremony is often conducted as an immediate precursor to wedding ceremonies instead of during adolescence. In other regions it is almost always associated with adolescence;[9] with regards to this, it is very important.

The strands of the sacred thread have symbolic meaning that varies by community and region. The sacred thread has three strands. A bachelor wears only one sacred thread; a married man wears two of them making it six strands. If the man has married and has fathered a child, he wears three, which makes nine strands.
The three strands sometimes symbolize three debts (ऋण, rin) that must never be forgotten:
the debt to one's teachers (गुरु ऋण, guru rin), i.e., those who have taught the wearer;
the debt to one's parents and ancestors (पितृ ऋण, pitr rin), i.e., those who have nurtured the wearer and made possible his existence;
the debt to the sages/scholars (ऋषि ऋण, rishi rin), i.e., those who discovered knowledge, both spiritual and secular, over the ages, which now enriches the wearer's life.
In some versions, the debt to the sages is replaced with debt to God (देव ऋण, dev rin). Upon marriage, sometimes the number of strands increases to six, because the man is expected to assume the debts of his wife as well.[10][11][12]
The three strands does symbolize:
Maa Parvati ( Goddess of strength )
Maa Lakshmi ( Goddess of wealth )
Maa Saraswati ( Goddess of knowledge )[13]

The strands could represent purity in thought, word and deed expected from the wearer.

A Tulu Madhwa Brahmin boy during his upanayana ritual. The thin, yellowed, Yajnopavita thread runs from left shoulder to waist. Note the munja grass girdle around the waist. The peepal tree twig in his right hand marks his entry into the Brahmacharya stage of life.
Upanayana (lit. "leading closer" to the Brahma) is a version of the sacred thread ceremony which initiates the boy into the study of brahman or the Vedas. The word brahman is the ancient word for Vedas or, specifically, Vedic hymns and shall not be confused with the later philosophical concept of Brahman. Traditionally, the ceremony was performed to mark the point at which boys began their formal education. The ceremony is performed when the boy is seven years old (Gharbheshu ashtame varshe) in the Brahmin varna, at least 13 years in the Kshatriya varna. The youngster is taught during the ceremony the secret of life through Brahmopadesam (revealing the nature of Brahman, the Ultimate Reality) or the Gayatri mantra. The child then becomes qualified for life as a student or Brahmachari, as prescribed in the Manusmriti. According to an appendix of the Manusmriti,[citation needed] girls were allowed to study the Vedas in the previous kalpa (Creation). Orthodox Hindus, however, do not accept this reference, because no Hindu canonical text allows this ceremony for a girl in the present kalpa. However, some sects, especially Arya Samaj, perform this ceremony for girls as well on the basis of this statement.
Brahmins, vaishya and Kshatriyas are called dvijas meaning "twice born". A man of these castes is born once in the womb of his mother and again during the Upanayana when he learns the Gayatri Mantra. The Upnayanam is practiced by the three higher castes in India[brahmin,vaishya,kshatriyas].
The main point of having gone through the Upanayana ceremony is the wearing of the Yajñopavītam on the body. The Yajñopavītam is circular, being tied end-to-end (only one knot is permissible); it is normally supported on the left shoulder (savya) and wrapped around the body, falling underneath the right arm. The length of the Yajñopavītam is generally 96 times the breadth of four fingers of a man, which is believed to be equal to his height. Each of the fingers represents one of the four states that the soul of a man experiences: waking, dreaming, dreamless sleep and knowledge of the absolute.
It denotes that one who wears the sacred Yajñopavītam should be pure in his thought, word and deed. The sacred Yajñopavītam reminds a Brahmachari to lead a regulated life with purity in his thought, word and deed. This Yajñopavītam also represents the debt that is owed to the guru, parents and society.
The knot in the middle represent the formless Brahman, the pure form of energy which pervades all. The three strands of Yajñopavītam again represent the manifestation of Brahman as Srishti, Sthithi and Vinasa. The sacred strands of Yajñopavītam illustrates the fact that everything in the universe emerge from and then merge with Brahman.
Ancient texts refer to the wearing of the Yajñopavītam in three forms:
Upavītam, where the Yajñopavītam is worn over the left shoulder and under the right arm. This is for Gods. Upavītam is also called savya (Katyayana Shrauta Sutra, etc.).
Nivītam, where the Yajñopavītam is worn around the neck and over the chest. Nivīta form is to be used during Rishi Tharpana, sexual intercourse, answering the calls of nature, etc., and during ancestor worship/funeral rites (Shadvimsha Brahmana, Latyayana, etc.).
Prachīnavītam is where the Yajñopavītam is worn above the right shoulder and under the left arm. This is for Spirits and is used by men when performing the death ceremonies of an elder. Prachīnavītam is also called apsavya (Katyayana Shrauta Sutra, Manusmriti, etc.).
In some communities, later, at the occasion of wedding, a further three strands of Yajñopavītam are added to make for a six-strand bunch. In some communities, the custom is of one thread more being added at the birth of every child. In some interpretations, these strands of Yajñopavītam are intended to constantly remind the man of his worldly responsibilities. Three original strands of Yajñopavītam (each consisting of three) make up nine strands of Yajñopavītam, to which three are added for wife and one for children, making a total of 13 individual strands of Yajñopavītam in some communities.
Ancient Hindu texts specify an age for the Upanayana ceremony based on the caste (8 for Brahmins, 11 for Kshathriyas, 12 for Vaishyas (Manu Smriti sloka 2:36)). Upanayanam marks the start of learning of "Brahman" and Vedic texts. The age for Upanayanam supports this as Brahmins devote their life in pursuing the knowledge of "Brahman" and hence makes sense to start early and continue for a longer time. Kshathriyas, on the other hand, study additional skills and go through the brahmin stage of life, studying. In the communities where three strands of Yajñopavītam are added at the time of wedding, there is another interpretation.
Once a student achieves a certain level of Brahma knowledge ("Brahma Vidya"), the guru adds three more strings signifying "graduation" and the student goes on to study. In South Indian wedding ceremonies, the addition of the three more strings is followed by "Kashi Yatra". This signifies the Yatra student intends for advanced study. At this point, the father of the bride convinces the youth to get married and then go to Kashi (Varanasi) with his new bride. In modern days, the ceremony is packaged in the wedding ceremony.
The sacred Yajñopavītam is supposed to be worn for the rest of one's life after the ceremony has been performed. A new Yajñopavītam is worn and the old Yajñopavītam discarded every year; the change-over ceremony is held on a specific date calculated as per the Hindu lunar calendar. Among Brahmins, this date varies depending on which of four Vedic Shakhas one belongs to.
The sacred Yajñopavītam has close and essential connection with the concept of pravaras related to brahmin gotra system, which reflects the number of most excellent Vedic rishis belonging to the particular gotra to which the wearer of sacred Yajñopavītam belongs.
Generally, there are either three or five pravaras. While tying the knots of sacred strands of Yajñopavītam, an oath is taken in the name of these excellent sages. The full affiliation of a Vedic brāhamana consists of
gotra
sutra (of Kalpa)
shakha
pravaras.
For example, a brahmana named 'X' introduces himself as follows: I am 'X', of Shrivatsa gotra, of Āpastamba sutra, of Taittiriya shākha of Yajurveda, of five pravaras named Bhārgava, Chyāvana, Āpnavan, Aurva and Jāmdagnya (This example is based upon the example given by Pattābhirām Shastri in the introduction to Vedārtha-Pārijata, cf. ref.)[citation needed]

The ceremony is called Munja or Mounji-Bandhana (lit. Tying of munja) in the state of Maharashtra. This name finds its origin in the name of a grass variety called Saccharum munja (Bengal cane[14]). This grass is used to make a girdle that is tied around the waist of the child.[15] In Gujarat, the sacred thread is known as the "janoi."
# Language Name of the ceremony Word for "Sacred Thread"
1 Sanskrit Upanayanam
उपनयनम् Yajñopavītam
यज्ञोपवीतम्
(also Braḥma sūtram
ब्रह्मसूत्रम्)
2 Malayalam Upanayanam
ഉപനയനം Poonool (IAST: Pūnūl)
പൂണൂല്‍
3 Tamil pūṇūl/Upanayanam
பூணூல்/உபநயனம் Pūnūl(IAST: Pūnūl)
பூணூல்
4 Telugu Odugu,Upanayanamu
ఒడుగు,ఉపనయనము Jandhyamu
జంధ్యము
5 Kannada Upanayana, Munji
ಉಪನಯನ,ಮುಂಜಿ Janivaara
ಜನಿವಾರ
6 Hindi Janeu
जनेऊ Janeu
जनेऊ
7 Marathi Munja
मुंज Zaanaway
जानवे
8 Konkani Munji
मुंज,मुंजि,ಮುಂಜಿ Jannuvey
जानवें,जानुवें
9 Assamese Lagundeoni
লগুণদিয়নি Lagun
লগুন
10 Bengali Uponayon
উপনয়ন Upabeet, Poité
উপবীত, পৈতে
11 Oriya Bratopanayan,Brata Ghara
ବ୍ରତୋପନୟନ, ବ୍ରତଘର Poitaa
ପଇତା
12 Nepali Bratabandha
ब्रतबंध Janai
जनई, जनै
13 Kashmiri Mekhal
معخل,मेखल Yonya
يoنيآ,योनया
14 Tulu Brahmopadesha, Upanayana, Noola Madimme
ಮುಂಜಿ,ನೂಲ ಮದಿಮ್ಮೆ Yagnopaveeta
ನಿವಾ
15 Gujarati Janoi
જનોઈ Yagnopavit
યજ્ઞોપવીત
16 Pahari Janeyu
जनेयु Janeyu
जनेयु
17 Sindhi Janya
जानया Janya
जानया
18 Punjabi Janju
जनजू Janju
जनजू
19 Sourashtra Oduvam
Jenjam
20 Maithili Upanayana
Janeu

A ceremony which combines chudakarma and upanayana is called Bratabandha (Sanskrit brata = promise, bandhan = to be bound) among the hill communities in Nepal.
Bratabandha is a Hindu ceremony held for boys from 8 to 12 years old. It is the beginning of learning the traditional laws, ceremonial roles and rituals of their caste. It is considered as the beginning of their manhood. Boys who have not performed their Bratabandha cannot marry.[16] It is a symbolic representation that a boy is mature enough to perform his duties as a brahmachari (i.e., to learn)
Red, white, yellow patterns, and Swasti are made around a fire for protection. They indicate where each god should sit as they join the ceremony.[16] Offerings of fruit, money, cloth, and rice are made. At least two Bhramin priests are required to perform the complex rituals.
The boy's head is shaved by his mother's brother for purification. All of his hair is collected to protect the boys from anyone who might use them for harm. These hair will be later disposed of. After a boy's head is shaved completely, his mother, aunts, and sisters come to him to rinse any hair from their necks.Mothers never consider their boys to be men.
Boys who belong to the Brahmin caste were dressed in orange and given a deer skin bag to signify the traditional roles of Brahmins as priests. Boys of other castes use different objects instead.
Much of the ceremony is done under the cover of a shawl. This is secret only to the boy and his new Guru. Occasionally one of the boys comes out from the cover to add elements to the fire.The Guru later gives his students a sacred string to wear and a secret mantra, which they are not to share with anyone. This mantra comes from the holy Hindu book, Ved. It is said that if a boy repeats this mantra every day, he will be protected from misfortune and his matra will promote prosperity.[16] Also, the mantra is seen as the only companion in the metaphysical journey towards becoming a Bramhan.[17]
The ceremony ends as the boys ask their relatives for rice and receive Tika from their aunts. This practice is done to signify the traditional life of a monk and give the boys a spiritual grounding for their first life lesson.[16] At this point, the boys who want to renounce family life and get to the gurus by running (they only pretend to run) are stopped by the maternal uncle who lures them to the material world or grihastha by offering his daughter's hand in marriage. In that process the boy tries to run away by running towards the other side of the road. The boy promises to stay home and at the same time perform the karmas of a brahmachari (studying, earning a living, and performing religious rites).
Traditionally these boys were sent to ashrams of gurus to learn in a Gurukul system of education.
After the ceremony the boys are considered men (though not physically). They are given the Janai, a sash made of strings, and are expected to keep with the rules and norms of full-age men. This promise, taken by wearing the Janai, holds them in a bond. This gives its name Bratabhandha. From this point onward they are permitted to take an active part in religious ceremonies (pujas, last rituals, marriages, etc.). Non-veg is not allowed to the boy for a week or so who has just gone through his Bratabandha. Brahmins are given six strings and are taught the secret gayatri mantra which is not to be repeated aloud. Chettris are also given six strings. Some other castes, like giri and puri, are given three strings.
The Bratahbanda, like other Nepali festivals, is about a family recognizing an important day in someone's life.
Upanayana also means taking somebody near (upain) knowledge. In ancient times, after the ceremony was performed, the child was sent to the guru's house (gurukul) for education, where the child remained until completion of education. Even today, there are many Vedic gurukulas (traditional Vedic schools) which follow this practice with and without government help, without taking any fees from students (who must be brahmacharis).

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML