మనం అమ్మయొక్క దివ్య చరణ కమలాలని భావన చేద్దాం. ఆ పాదాల గురించి శంకరులవారు ఎంతో వర్ణించి, ఎన్నో భావనలు చేశారు. మూకకవి పంచశతిలో కూదా పాదారవింద శతకం ఉంది. ఆయన పాదాల మీదే వంద పద్యాలు వ్రాశారు. శంకరుల వారు "దదానాం దీనేభ్యం శ్రియమనిసమాసాను సదృశే-దీనులకి కూడా వాళ్ళు ఎంత కోరుకుంటే అంతిస్తాయట ఆ పాదాలు" అన్నారు. అందుకే దేవతాస్త్రీలు అమ్మవారి పాదాల దగ్గర రెండు చేతులూ జోడించి నమస్కరిస్తుంటే అమ్మ పాదాల వేళ్ళు గోళ్ళు పరిహాసంగా నవ్వుతున్నట్లు నిపిస్తున్నాయట. ఎందుకు నవ్వుతున్నాయంటే ఆ దేవతా స్త్రీలకి గొప్ప అవకాశం ఒకటి ఉంది. అదేమిటంటే కల్పవృక్షకుసుమాలని వాళ్ళు కోసి తీసుకోగలరు. ఒక కల్పవృక్షం ఉంటే చాలు మనకి దేవుడు అక్కర్లేదు, ఎవరూ అక్కర్లేదు అనుకుంటారు మానవులు. మన కోరికలన్నీ కల్పవృక్షం తీరుస్తుంది. కోరికలే మనకి ప్రధానం. అవి తీరిపోతే ఇంక అమ్మవారు అక్కర్లేదు.
కోరిన వారందరికీ అమ్మవారు దర్శనమివ్వరు. అమ్మవారి పాదాలు చూడడమంటే సామాన్యమైన విషయం కాదు. అమ్మవారి భక్తులం అని చెప్పి అమ్మవారిని ఆశ్రయిమ్చిన వారు కూడా అమ్మవారిని చూడలేరు. ఎందుకంటే అమ్మవారు జగదేక సార్వభౌముడు-త్రిపురాసుర సంహారకుడైన ఆ విశ్వేశ్వరుని అంతఃపురమట. అయ్యవారి అంతఃపురంలోకి వెళ్ళి అమ్మవారిని మనం ఎలా చూడగలం!
అందరూ అమ్మవారిని ఆరాధన చేస్తారు. మరి అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తారా? ఇవ్వరట. శంకరులవారు "ఇంద్రాది దేవతలు కూడా నీ ద్వారం దగ్గర నువ్విచ్చే సంపదలతో తృప్తిపడి వెనక్కి వెళ్తున్నారమ్మా" అన్నారు. ద్వారం దగ్గర అంటే అమ్మవారు ఆవరణలలో మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం, అణిమాది అష్టశక్తులూ అక్కడే ఉన్నాయి. సర్వదేవతలకూ మూలమైన బ్రాహ్మీ వైష్ణవీ మొదలైన మాతృకాశక్తులూ అక్కడే ఉన్నాయి; కావలసినవన్నీ అక్కడే దొరుకుతున్నాయి. అందుకు ఇంద్రాది దేవతలు వాటితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా కావల్సినది వాళ్ళ రాజ్యాలు క్షేమంగా ఉండడం. వాళ్ళ లోకాలు బాగుండడం, వాళ్ళ పదవులు పదిలంగా ఉండడం అంతే! అవన్నీ అక్కడే ఇచ్చేస్తోంది. వాళ్ళు అక్కడే తృప్తి పడి వెళ్ళిపోతున్నారు. అమ్మని చూడాలి అంటే ఇవన్నీ దాటి పోవాలి. అమ్మని అందుకోవాలంటే లౌకికమైనఈ విషయ వాంచలన్నీ దాటి నాకు ఆత్మతత్త్వమే కావాలి అనాలి. మనలో 99మందికి అమ్మ ఇచ్చేవే కావాలి కానీ అమ్మ అక్కరలేదు. ఎవరైతే "అమ్మా నువ్వే కావాలమ్మా" అని బిడ్డలాగ రోదిస్తారో వారిని అమ్మ తప్పకుండా అంతఃపురంలోకి తీసుకెళ్ళి ఆదరిస్తుంది, అందులో సందేహంలేదు. ఈ విధంగా అమ్మ ఎంత దయామయో శంకరుల వారు భావన చేశారు. ఆ భావనలో అమ్మ చరణాలని ఒకసారి ధ్యానించితే చాలు, మనకి కావలసినవన్నీ లభిస్తాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment