గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలుమార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు
పాడ్యమి : గంగాసాన్నం
మార్గశిరమాసం - శుక్లపక్షం :
పాడ్యమి : గంగాసాన్నం
విదియ :
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం
చవితి : వరద చతుర్థి, నక్త చతుర్థి – వినాయకపూజ
పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి)
షష్ఠి : సుబ్బారాయుడి షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ
సప్తమి : మిత్ర సప్తమి "ఆదిత్య ఆరాధన " ( నీలమత పురాణం )
అష్టమి : కాలాష్టమీ వ్రతం
నవమి :
దశమి :
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదా ఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి : ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి : హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం
చతుర్దశి : చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి
పూర్ణిమ : కోరల పున్నమి, దత్త జయంతి - చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం.
మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి : శిలావ్యాప్తి వ్రతం
విదియ :
తదియ :
చవితి : సంకష్ట హర చతుర్థి
పంచమి :
షష్ఠి :
సప్తమి : ఫలసప్తమీ వ్రతం
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ
నవమి : రూపనవమి వ్రతం
దశమి :
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతం
ద్వాదశి : మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి
చతుర్దశి :
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం
ధనుర్మాసం : సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన నాటి నుండి – మకర రాశిలోకి ప్రవేశించే ( వరకు ధనుర్మాసంగా పిలుస్తారు. సంక్రాంతి నెలపెట్టుట అని కూడా పేర్కొంటారు. సాధారణంగా ప్రతీనెలా 14,15 తేదీలలో సూర్యుడు ఒకరాశినుండి మరో రాశికి ప్రవేశిస్తుంటాడు. ఈ మాసంలో "తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను చేస్తారు. గోదా దేవిని ( సాక్షాత్తు లక్ష్మీదేవి ) పూజిస్తారు. తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం ఇది. ఈ ధనుర్మాసం నెలరోజులూ కన్నె పిల్లలు తెల్లవారుజ్హామునే లేచి ఇళ్ళముందు కలాపి చల్లి చక్కని రంగవల్లులతో, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళ కళ లాడుతూ ఉంటాయి.
తీర్థ దినం : ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు, మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ (సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని పురాణ ప్రమాణం. అందుకే, స్వామి పుష్కరిణి "తీర్థ దినం" గా పూజిస్తారు
మోక్షదా ఏకాదశి : ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశిగా పేర్కొంటారు. ఈరోజు ‘ఏకాదశీవ్రతం’ ఆచరిస్తారు. పూర్వం వైఖానసుడు అని ఒకరాజు ఉండేవాడు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి ‘మోక్షదా ఏకాదశి’ అని పేరువచ్చింది.
తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉంది. కురుక్షేత్రంలో తాతలనూ, తండ్రులనూ, బంధుగణాల్నీ చూసి అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును "గీతాజయంతి" గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి, గీతా పారాయణ చేయడం నిర్దేసించబడింది.
మనం అందరం ఈ మాసంలో చేయవలసిన విధులను ఆచరించి తరించెదము గాక!
16th December 2015Subramanya Sashti.
Sashti is the sixth day of the lunar fort night. Sashti in the bright fortnight is dedicated to Lord Subrahmanya. This day in the Hindu lunar month of Margashirsha is observed as the Subrahmanya Sashti. It usually falls in the November - December in the Gregorian calender. This year, Subramanya Sashti is on Wednesday, 16th December 2015.
Hanumanth Vratam 2015 date is December 23. Pampa Puja and Hanuman Pooja are observed on the day.
Datta Jayanti is observed to celebrate the birth of Guru Dattatreya, the Trimurti Avatar – the united and single incarnation of Brahma, Vishnu and Shiva. Dattatreya was born as the son of Atri Maharshi and Anasuya. Datta Jayanti 2015 date is December 24. It is observed on the full moon day in the month of Margasheersh as per traditional Hindu calendar.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML