గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

శివలింగానికి ఏ నీటితో అభిషేకించాలి?శివలింగానికి ఏ నీటితో అభిషేకించాలి?

సహజంగా మనం పూజలు చేసేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి. మనం తప్పుఛేస్తే భగవంతుడు ఏమి అనుకుంటాడో? పాపం చేస్తున్నమేమో లాంటి సందేహాలు కలుగుతాయి. అసలు ఆ పరమేశ్వరుడుని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఆడవాళ్ళు మట్టితో చేసిన శివలింగాన్ని పూజించాలి, మగవారు రాతితో చేసిన శివలింగాన్ని, వ్యాపారాభివృద్ధికి బంగారు శివలింగాన్ని పూజించాలి అని శివపురాణం చెపుతున్నది. ఇక శివుడు అభిషేక ప్రియుడు, శివలింగాన్ని పాతాళ జలంతో అభిషేకించాలి. అంటే నూతినుంచి తీసిన నీరు, ఆ నీరు లో కుదిరితే గంగా జలాన్ని లేదా ఏదైనా నది నుంచి తీసుకువచ్చిన నీటిని కొంచెం కలిపి అభిషేకించాలి. ఇలా 41 రోజులు శివలింగాన్ని అభిషేకిస్తే ఆ ఇంట సిరిసంపదలు కలుగుతాయి.
ఇక అభిషేకం తరువాత మారేడు దళార్చన, ఈ మారేడు దళాలు,పద్మాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. సంపెంగ, మొగలి పూవులతో మాత్రం శివుడిని ఆరాధించకూడదు.
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
అసలు ఇవన్నీ చేయలేని పక్షంలో ఒక చెంబుడునీళ్ళు ఆ శివలింగం మీద పోసి ఒక నమస్కారం చేసి శివపంచాక్షరి మంత్రం చదువుకొన్నా కూడా ఆ బోళాశంకరుడు అనుగ్రహిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML