గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

మార్గశిర శుద్ధ పాడ్యమి కధమార్గశిర శుద్ధ పాడ్యమి కధ

ఒక చాకలి ముసలి ఆవిడకు అయిదుగురు కోడళ్ళు ఉన్నారట .ఆమె ఆశ్వ యుజ బహుళ అమావాశ్య నుంచి కార్తీక బహుళ అమావాశ్య వరకు తెల్ల వారు ఝామునే లేచి ,ఏటి లో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టు కొనేది .ఇలా ఒక నెల గడి చిన తర్వాత కార్తీక అమావాశ్య నాడు చిన్న కోడలు ”పోలి”ని ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్ళను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది .చిన్న కోడలు పెరుగు చిలికి వెన్న తీసి ,కవ్వానికి అంటిన వెన్న తీసి ,పత్తి చెట్టు కింద రాలిన పత్తి తో వత్తి చేసి ,ప్రమిదలో పెట్టి ,శుభ్రం గా నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది .అత్త గారు వచ్చి తిట్టు తుందనే భయం తో ఆ దీపం కనపడ కుండా దానిపై చాకలి బాన బోర్లించింది .దేవతలు ఆమె భక్తికి సంతోషించి ,దివ్య విమానాన్ని తెచ్చి ,ఆమెను బొందె తో కైలాసానికి తీసుకు వెళ్ళారు .వూళ్ళో వున్న వారంతా ”,చాకలి పోలి స్వర్గానికి వెడుతోంది ”అను కుంటు వింత గా చూశారు .విమానం బాగా క్రిందు గా పోతూ వుండటం తో ఆమె కాళ్ళు పట్టు కోని వూరి జనం కూడా ఆమెతో స్వర్గానికి వెళ్తున్నారు .విష్ణు దూతలు ”ఈ పోలి అధిక భక్తీ తో జ్యోతిని వెలి గించింది .కనుక స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాం .మీకు ఆ అదృష్టం లేదు ”అని వాళ్ళను కిందకు తోసే శారు .పోలి శరీరం తో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ము రాలు .అందుకే ఆమె ను తలచు కుంటు కార్తీక అమావాశ్య తెల్ల వారుజ్హామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమె ను గుర్తు చేసు కొంటు ,ఆమె కధను చెప్పు కొంటు ,నీటి లో దీపాలు వదిలి పెడ తారు స్త్రీలు అంతా .స్త్రీలు అందరు ఈ కధ చెప్పు కోని అక్షంతలు నెత్తినా వేసుకొని ఇంటికి తిరిగి వస్తారు .అరటి దొప్ప లలో ఆవు నీతి దీపాలు వెలిగించి నీటి లో వదులు తారు .అదీ పోలి స్వర్గానికి పోవటం అంటే .ఇందు లో రెండు ముఖ్య విషయాలున్నాయి .ఒకటి భక్తికి కులం అడ్డు రాదు .అందుకే అందరు అన్ని కులాల స్త్రీలు ”పోలి తల్లి ”ని గుర్తుంచు కోని దీపాలు పెట్టి సాగ నమ్పటం .రెండోది కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత వుంది అని తెలియ జేయటం .నిశ్చల భక్తీ తో చేసింది ఏదైనా పర మేశ్వరుడు మెచ్సుతాడు .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML