గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 20 December 2015

హనుమాన్‌ దీక్ష స్వీకరించిన దీక్ష పరులుహనుమాన్‌ దీక్ష స్వీకరించిన దీక్ష పరులు ఉదయం నాలుగు గంటలకు లేచి సంధ్యవేళ ప్రార్థన చేసుకొని పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట పూజ నిర్వహిస్తారు. అనంతరం దీక్ష స్వాములు వారి వారి ఇండ్లలో పిఠ పూజను ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దీక్ష స్వీకరించిన స్వాములు అందరు కలిసి హనుమాన్‌ మందిరంలో సన్నిదానం ఏర్పాటు చేసుకొని కలశంపెట్టి 41 రోజులు కఠినమైన పూజలు నిర్వహిస్తారు. దీక్ష విరమణ అయినంత వరకు కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కడతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు.


హనుమాన్‌ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హరితి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్‌ జీ’, 'జై శ్రీరాం' , అని పలుకరించి రామనామ స్మర ణం చేయటం ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. హనుమాన్‌ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీక్ష స్వీకరించిన స్వాముల్లో అధిక శాతం యువకులు ఉండడంతో వారిలో మార్పు రావడం ఎంతగానో దోహదపడుతుంది.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML