గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

శ్రీ దత్తాత్రేయ వ్రతంశ్రీ దత్తాత్రేయ వ్రతం .. అనసూయ - అత్రి మహర్షి దంపతుల ప్రార్ధన మేరకు 'మార్గశిర శుద్ధ పౌర్ణమి' రోజున త్రిమూర్తుల అంశతో శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఈ రోజున స్వామివారి వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


దత్తాత్రేయ స్వామి అవతరించిన ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి నైవేద్యంగా సమర్పించిన పాలు - పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం చేయాలి. గురుచరిత్రను పారాయణం చేస్తూ ... దత్తానామాన్ని స్మరిస్తూ వుండాలి. సాయంత్రం కాగానే సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే మంటపంతో సహా దత్తాత్రేయ స్వామి పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి.

దత్తాత్రేయ స్వామిని పూజించి ఆ తరువాత వ్రతంలో భాగమైన అయిదు అధ్యాయాలుగల కథలు చదవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమలను ... ఆయన అనుగ్రహాన్ని ఈ కథలు కళ్లకి కడతాయి. పూజ పూర్తికాగానే , గోధుమ పిండి ... పంచదార .. ఆవునెయ్యి ... యాలకుల పొడి ... ఎండు ద్రాక్ష కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి.

తీర్థ ప్రసాదాల వినియోగం తరువాత, స్వామివారి పాదాల చెంతనున్న అక్షింతలు తలపై ధరించాలి. వ్రతాన్ని జరిపించిన బ్రాహ్మణుడికి శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించడమంటే, త్రిమూర్తులను ఆరాధించడం వంటిది. దత్తాత్త్రేయ వ్రతం కారణంగా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. సమస్త పాపాలు నశించి .. ఆయురారోగ్యాలు ... సిరిసంపదలు కలుగుతాయి.

అనఘాష్టమి వ్రతము - ఫూజ విదానం

గణపతిపూజ
ఓం శ్రీ గురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః,
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే

ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం

విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః

సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప

సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః

కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

ధ్యానం:
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
శుద్దోదక స్నానం:
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
వస్త్రం:
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం:
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం |
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం:
మం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి ||
తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం:
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షణ నమస్కారం:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

శ్రీ అనఘాష్టమి వ్రత పూజా విధానము
కలశ స్థాపన :
" అదౌ కల్పోక్త ద్దేవతా ఆవాహనం, ప్రాణప్రతిష్టాపనం చ కరిష్యే " అని సంకల్పము చేసి.

అష్టదళ పద్మే ఈశాన్య దళే కలశే ఆణిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే నైరృతి దళే కలశే ప్రాప్తి దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దక్షిణ భాగస్థ దళే కలశే ఈశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దేవస్య వామ భాగస్థ దళే కలశే వశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పురస్తాద్దళే దళే కలశే మహిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలశే శ్రీమదనఘస్వామిన మావాహయామి స్థపయామి పూజయామి.
కర్ణికాయాం అనఘ స్వామినః పార్శ్వే శ్రీమతీం అనఘా దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.

ప్రాణప్రతిష్ఠా :

ఈశాన్య మణీమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిధే |
ప్రాప్తినామని నైరృత్యాం ప్రాకామాఖ్యే నిలస్థలే |
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి |
కామవసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్ |
మహమ్ని పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః |
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ |
అనఘ శ్చానఘాదేవీ ప్రాణచేష్టా విరాజితౌ |
చరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ ||

ఈశాన్యమున అణిముడును, ఆగ్నేయమున లఘివుడును, నైరుతి దిక్కున ప్రాప్తియు, వాయువ్యమున ప్రాకామ్యుడను, ఎడమ కుడి భాగములందు ఈశ్వితుడు వశ్వితుడును, వెనుక భాగమున అంగరక్షకుని వలె కామావసాయితయు, ముందు పాదముల దగ్గర మహిముడను, ఇట్లే ఎనిమిది దళముల ఎనిమిది మంది నిత్యము నిలచియుండగా ఆ దళముల మధ్యగల కర్ణిక యందు కొలువుదీర్చి యుండు గురు సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీ అనఘ దంపతులు ప్రాణములతోనూ, చేష్టలతోనూ ఒప్పుచూ, నా హృదయమున చరించుచుందురు గాక, అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః - - సర్వెంద్రియాణి వాఙ్మనశ్చక్షు శ్శ్రోత జిహ్వ ఘ్రాణరేతో బుధ్యాదీని ఇహైవాగత్య సుఖంచిరంతిష్టంతు స్వాహా, ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు, స్థిరోభవ, వరదోభవ, స్థిరాసనం కురు.

స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం |
తావత్త్వం ప్రీతిభావేన కుంభస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానమ్ :

పద్మాసనోత్తాన మనోజ్ఞ పాదం
పద్మం దధానం నభయంచ పాణ్యోః |
యోగ స్థిరం నిర్భర కాంతి పుంజం
దత్తం ప్రపద్యే నఘ నామధేయం ||

పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం
పద్మం దధానా మభయంచ పాణ్యోః |
యోగేర్థ సమ్మీలిత విశ్చలాక్షీం
దత్తాను రక్తా మనఘాం ప్రపద్యే || శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనమ్ :
శ్లో: క్రుపయాత్రి గుణాదేవి, గుణాతీత వశిత్వాతు ,
అనఘా మనఘం దేవం దేవీం ఆవాహయామ్యాహం.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనమ్ :
శ్లో; స్వర్ణ సింహాసనం దివ్యం, భక్త్యాత్మానుకూలత,
మయార్పిత మనఘాదేవా, గృహ్యాతాం ధీరమానసే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ఆసనం సమర్పయామి.

పాద్యం :
శ్లో: అనఘాదేవీ దివ్యా, అహం తవపాదపూజయేత్ ,
తవపాదక్షాలయో రణఘో, అహం హృద్యేన పద్యచ.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం :
శ్లో: పద్మమాలాంచ సద్భక్తిం తవపూజాం సమర్పతిం
శిశిరాత్కీరేణార్ఘేనా, అనఘా దేవతాకరే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః హస్త్యోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనమ్ :
శ్లో:బ్రాహ్మీబ్రాహ్మీమాయీ జ్యోతీ, వేదవేదాంత రూపిణి,
ముఖాద్యుక్తం యతోదేవి, తాతరా చమనమర్పితం.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :
శ్లో: మయానీతాం మధుహ్ప్రీతం దేవదేవి సమార్పితం,
త్వత్పాదాబ్జం మధుపర్కం, సమర్పయామితే సతీ.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతస్నానం:
శ్లో: పయోడది ఘ్రుతోపెతం శర్కరా మధు సంయుతం,
పంచామృత మిదం స్నానం గృహాణ సురపూజితే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి.

స్నానం :
శ్లో: గంగాజలం మయానీతం మహాదేవశిరః స్థితం,
శుద్దోదక స్నానం మిదం గృహాణ విదు సోదరి.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః స్నానం సమర్పయామి.

వస్త్రం :
శ్లో: రుచిరేవుల్కలేనాపి మయాసాధ్విం మసార్పితం,
అనఘామాయా వ్రుతిచ్చేడా సదామోదాన్విత సతీ.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమఃవస్త్రం సమర్పయామి.

ఉపవీతం :
శ్లో: తప్తహేక్రుతం సూత్రం ముక్తాదామా విభూషితం,
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభప్రదే.
శ్లో: సపవిత్రం సహజం దివ్యం, ఉపవీతం యత్ప్రజాపతే,
శుబ్రం మయార్పితం అనఘం, ప్రతిమున్చాత్మనాత్మానా.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ఉపవీతం సమర్పయామి.

గంధం :
శ్లో: కర్పూరమిశ్రిటై గాంధి, అనులిప్తానఘామతి,
అళికే ముఖ్యో కుర్యం, పాలక్షీవ సదాముదే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః గంధం ధారయామి ||

అక్షతాన్:
శ్లో: కర్పూరాగరు కస్తూరి రోచానాదిభిరంవితం,
గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
శ్లో: అక్షతాన్ దవళాన్, దేవి శాలియాన్ స్థాన్డులాన్ శుభాన్,
హరిద్రా కుమ్కుమోపెతాన్ గృహ్యాతా మబ్దిపుత్రికే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః మంగళ ద్రవ్యాని సమర్పయామి.

ఆభరణం :
శ్లో: తభూశార్ధం అక్షమాలాం, వివిదాన్కల్వ యానఘే
భూశార్ది మక్షమాలతే, అనఘా వివిధా సతీ.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ఆభరణాని సమర్పయామి.

పుష్పం :
శ్లో: అనఘాదేవతా దేవీ, కాలోస్థ పుష్పమాలాభి,
ఆపాదమస్తకం భూషయం, పుష్పార్చయ పునః పునః .
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః పుష్పాణి సమర్పయామి.

కుంకుమపూజా :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః కుంకుమపూజాం సమర్పయామి.

అంగ పూజ :

( దత్త స్వామికి )

ఓం స్మర్త్రుగామి సనోవతాయ నమః - పాదౌ పూజయామి.
ఓం వరదాయ నమః - జంఘే పూజయామి.
ఓం కార్తవీరాజ్జున రాజ్య ప్రదాయనాయ నమః - జానునీ పూజయామి.
ఓం అనఘాయనమః - ఊరూ పూజయామి.
ఓం విశ్వా శ్లాఘ్యాయనమః - వళిత్రయం పూజయామి.
ఓం అమితాచారాయనమః - ఉదరం పూజయామి.
ఓం దత్తాత్రేయ నమః - హృదయం పూజయామి.
ఓం మునీశ్వరాయ నమః - భాహూ పూజయామి.
ఓం పరాశక్తి పదా శ్లిష్టాయ నమః - కంఠం పూజయామి.
ఓం యోగానందాయనమః నమః - మందస్మితం పూజయామి.
ఓం సదోన్మత్తాయ నమః - నాసికాం పూజయామి.
ఓం సమస్త్తవైరి తేజోహృతాయ నమః - శ్రోత్రే పూజయామి.
ఓం పరమామృత సాగరాయ నమః - నేత్రద్వయం పూజయామి.
ఓం అనసూయ గర్భారత్నాయ నమః - ఫాలం పూజయామి.
ఓం భోగామోక్షసుఖప్రదాయ నమః - శిరః పూజయామి.
ఓం స్మరణ మాత్రసంతుష్టాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.

( అమ్మవారికి )

ఓం అనఘాదేవ్యై నమః - పాదౌ పూజయామి.
ఓం అనఘాస్వామి పత్న్యై నమః - జంఘే పూజయామి.
ఓం మహీన్ద్రాది సురపూజితాయై నమః - జానునీ పూజయామి.
ఓం త్రిమూర్తి పూజితాయై నమః - ఊరూ పూజయామి.
ఓం దత్తనామాంక సంస్థితాయై నమః - వళిత్రయం పూజయామి.
ఓం త్రిలోక ఆరాధ్యాయై నమః - ఉదరం పూజయామి.
ఓం త్రిసంధ్యా రూపిన్యై నమః - హృదయం పూజయామి.
ఓం త్రేతాగ్ని రూపిన్యై నమః - భాహూ పూజయామి.
ఓం కుంకుమారుణ వస్త్రదారిన్యై నమః - కంఠం పూజయామి.
ఓం సంకుమదారిన్యై నమః - మందస్మితం పూజయామి.
ఓం కార్తవీరార్జ్జున కృతస్తోత్రై నమః - నాసికాం పూజయామి.
ఓం సిద్ద విద్యా రూపిణియై నమః - శ్రోత్రే పూజయామి.
ఓం కవిత శక్తిదాయై నమః - నేత్రద్వయం పూజయామి.
ఓం బ్రాహ్మీరూపిణియై నమః - ఫాలం పూజయామి.
ఓం సర్వ సిద్దిదారిన్యై నమః - శిరః పూజయామి.
ఓం అనఘాయై నమః - సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి.
ఓం దత్తాత్రేయ నమః
ఓం శ్రీ అనఘాయై నమః
ఓం అనఘాయ నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం త్రివిదాఘ నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం లక్ష్మీ రూపాన ఘేశాయ నమః
ఓం అనఘస్వామి పత్న్యై నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగేశాయై నమః
ఓం ద్రాంబీజ ధ్యాన గమ్యాయ నమః
ఓం త్రివిదాఘ విదారిణ్యై నమః
ఓం విజ్ఞేయాయ నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం గర్భాది తారణాయ నమః
ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం సిద్ధ సేవ్య పదే నమః
ఓం బీజస్థ వట తుల్యాయ నమః
ఓం ఆత్రేయ గృహదీపాయై నమః
ఓం ఏకార్ణ మను గామినే నమః
ఓం వినీతాయై నమః
ఓం షడర్ణ మను పాలయ నమః
ఓం అనసూయా ప్రీతిదాయై నమః
ఓం యోగ సంత్కరాయ నమః
ఓం మనోజ్ఞాయై నమః
ఓం అష్టార్ణమను గమ్యాయ నమః
ఓం యోగశక్తి స్వరూపిణ్యై నమః
ఓం పూర్ణానంద వపుష్మతే నమః
ఓం యోగాతీత హృదే నమః
ఓం ద్వాదశాక్షర మంత్రస్థాయ నమః
ఓం చిత్రాసనోప విష్టాయై నమః
ఓం ఆత్మసాయుజ్య దాయినే నమః
ఓం పద్మాసన యుజే నమః
ఓం షోడశార్ణ మను స్థాయ నమః
ఓం రత్నాంగుళీయక లసత్పాదాం గుళ్యై నమః
ఓం సచ్చిదానంద శాలినే నమః
ఓం పద్మ గర్భోపమానాంఘ్రి తలాయై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం భర్తృ శుశ్రూషణోత్కాయై నమః
ఓం హరయే నమః
ఓం మతిమత్యై నమః
ఓం కృష్ణాయ నమః
ఓం తాపసీవేష ధారిణ్యై నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం తాపత్రయ నుదే నమః
ఓం ఆనందదాయకాయ నమః
ఓం హరిద్రాంచ త్ప్రపాదాయై నమః
ఓం దిగంబరాయ నమః
ఓం మంజీర కలజత్రవే నమః
ఓం మునయే నమః
ఓం శుచివల్కల ధారిణ్యై నమః
ఓం బాలాయ నమః
ఓం కాంచీదామ యుజే నమః
ఓం పిశాచాయ నమః
ఓం గలే మాంగల్య సూత్రాయై నమః
ఓం జ్ఞానసాగరాయ నమః
ఓం గ్రైవేయాళీ ధృతే నమః
ఓం ఆబ్రహ్మ జన్మదోషాఘ ప్రణశాయ నమఃఓం క్వణ ట్కంకణ యుక్తాయై నమః
ఓం సర్వోపకారిణే నమః
ఓం పుష్పాలంకృతాయే నమః
ఓం మోక్షదాయినే నమః
ఓం అభీతిముద్రా హస్తాయై నమః
ఓం రూపిణే నమః
ఓం లీలాంభోజ ధీతే నమః
ఓం భగవతే నమః
ఓం తాటంకయుగ దీప్తాయై నమః
ఓం దత్తాత్రేయాయస్మృతిమాత్ర సుతుష్టాయ నమఃఓం నానారత్న సుదీప్తాయే నమః
ఓం మహాభయ నివారిణే నమః
ఓం ధ్యాన స్థిరాక్ష్యై నమః
ఓం మహాజ్ఞాన ప్రదాయ నమః
ఓం ఫాలామ్చత్తిలకాయై నమః
ఓం చిదానందాత్మనే నమః
ఓం మూర్ధాబద్ధ జటా రాజ త్సుమ దామాఅళయే నమః
ఓం బాలోన్మత్త పిశాచాది వేషాయ నమః
ఓం భర్తాజ్ఞా పాలనాయై నమః
ఓం మహాయోగినే నమః
ఓం నానావేష ధృతే నమః
ఓం అవధూతాయ నమః
ఓం పంచపర్వాన్వితా విద్యా రూపికాయై నమః
ఓం అనసూయా నందనాయ నమః
ఓం సర్వావరణ శీలాయై నమః
ఓం అత్రిపుత్రాయ నమః
ఓం స్వబలావృత వేధసే నమః
ఓం సర్వకామ ఫలానీక ప్రదాత్రే నమఃఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రణవాక్షర వేదయాయ నమః
ఓం వేద మాత్రే నమః
ఓం భవబంధ విమోచినే నమః
ఓం స్వచ్ఛ శంఖ ధృతే నమః
ఓం హ్రీం బీజాక్షర పారాయ నమః
ఓం మందహాస మనోజ్ఞాయై నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయినే నమః
ఓం మంత్రతత్వ విదే నమః
ఓం క్రోబీజ జప తుష్టాయ నమః
ఓం దత్తపార్శ్వ నివాసాయై నమః
ఓం సాధ్యాకర్షణ దాయినే నమః
ఓం రేణుకేష్ట కృతే నమః
ఓం సౌర్బీజ ప్రీత మనసే నమః
ఓం ముఖనిస్పృత శంపాభ త్రయీదీప్త్యై నమః
ఓం మనస్సంక్షోభ కారిణే నమః
ఓం విధాతృవేద సంధాత్ర్యై నమః
ఓం ఐంబీజ పరితుష్టాయ నమః
ఓం సృష్టి శక్త్యై నమః
ఓం వాక్ప్రదాయ నమః
ఓం శాంతి లక్ష్మ్యై నమః
ఓం క్లీంబీజ సముపాస్యాయ నమః
ఓం గాయకాయై నమః
ఓం త్రిజగద్వశ్యకారిణే నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం శ్రీ ముపాసన తుష్టాయ నమః
ఓం యోగచర్యా రతాయై ఓం నర్తికాయై నమః
ఓం మహా సంవత్ప్రదాయ నమః
ఓం దత్తనామాంక సంస్థాయై నమః
ఓం గ్లౌమక్షర సువేద్యాయ నమః
ఓం జగదిష్ట కృతే నమః
ఓం భూసామ్రాజ్య ప్రదాయినే నమః
ఓం శుభాయై నమః
ఓం ద్రాంబీజాక్షర వాసాయ నమః
ఓం చారు సర్వాంగ్యై నమః
ఓం మహతే నమః
ఓం చంద్రాస్యాయై నమః
ఓం చిరజీవినే నమః
ఓం దుర్మానస క్షోభకర్యై నమః
ఓం నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః
ఓం సాధు హృచ్ఛాంతయే నమః
ఓం సమస్త గుణసంపన్నాయ నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం అంతశ్శత్రు విదాహినే నమః
ఓం పాద స్థితాయై నమః
ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః
ఓం పద్మాయై నమః
ఓం సర్వవ్యాధి హరాయ నమః
ఓం గృహదాయై నమః
ఓం పరాభిచార శమనాయ నమః
ఓం సక్తిస్థితాయై నమః
ఓం ఆధి వ్యాధి నివారిణే నమః
ఓం సద్రత్న వస్త్రదాయై నమః
ఓం దుఃఖ త్రయ హరాయ నమః
ఓం గుహ్య స్థాన స్థితాయై నమః
ఓం దారిద్ర్య ద్రావిణే నమః
ఓం పత్నీ దాయై నమః
ఓం దేహ దార్ధ్యాభి పోషాయ నమః
ఓం క్రోడ స్థాయై నమః
ఓం చిత్త సంతోషకారిణే నమః
ఓం పుత్రదాయై నమః
ఓం సర్వమంత్ర స్వరూపాయ నమః
ఓం వంశ వృద్ధికృతే నమః
ఓం సర్వయంత్ర స్వరూపిణే నమః
ఓం హృద్గతాయై నమః
ఓం సర్వ తంత్రాత్మకాయ నమః
ఓం సర్వకామ పూరణాయై నమః
ఓం సర్వపల్లవ రూపిణే నమః
ఓం కంఠ స్థితాయై నమః
ఓం శివాయ నమః
ఓం హారాది భూషా దాత్ర్యై నమః
ఓం ఉపనిషద్వేద్యాయ నమః
ఓం ప్రవా సిబంధు సంయోగ దాయికాయై నమః
ఓం దత్తాయ నమః
ఓం మిష్టాన్నదాయై నమః
ఓం భగవతే నమః
ఓం వాక్చక్తిదాయై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం మహాగంభీర రూపాయ నమః
ఓం అజ్ఞాబల ప్రదాత్యై నమః
ఓం వైకుంఠ వాసినే నమః
ఓం సదైశ్వర్య కృతే నమః
ఓం శంఖ గదా శూల దారిణే నమః
ఓం ముఖ స్థితాయై నమః
ఓం వేణు నాదినే నమః
ఓం కవితాశక్తిదాయై నమః
ఓం దుష్ట సంహారకాయ నమః
ఓం శిరోగతాయై నమః
ఓం శిష్ట సంపాలకాయ నమః
ఓం నిర్దాహ కర్యై నమః
ఓం నారాయణాయ అస్త్రధరాయ నమఃఓం రౌద్ర్యై నమః
ఓం చిద్రూపిణే నమః
ఓం బంభాసుర విదాహిన్యై నమః
ఓం ప్రజ్ఞారూపాయ నమః
ఓం జంభ వంశ హృతే నమః
ఓం ఆనంద రూపిణే నమః
ఓం దత్తాంక సంస్థితాయై నమః
ఓం బ్రహ్మ రూపిణే నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం మహావాక్య ప్రబోధాయ నమః
ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః
ఓం తత్వాయ నమః
ఓం దేవప్రీతి కృతే నమః
ఓం సకల కర్మౌషు నిర్మితాయ నమఃఓం నహుషాత్మజ దాత్ర్యై నమః
ఓం సచ్చిదానంద రూపాయ నమః
ఓం లోక మాత్రే నమః
ఓం సకల లోకౌఘ సమ్చరాయ నమఃఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః
ఓం సకల దేవౌఘ వశీకృతి కరాయ నమఃఓం శాస్త్ర మాత్రే నమః
ఓం కుటుంబ వృద్ధిదాయ నమః
ఓం భార్గవ క్షిప్రతుష్టాయై నమః
ఓం గుడపానక తోషిణే నమః
ఓం కాలత్రయ విదే నమః
ఓం పంచకర్జాయ సుప్రీతాయ నమః
ఓం కార్తవీర్య ప్రసన్నాయై నమః
ఓం కంద ఫలాదినే నమః
ఓం సర్వసిద్ధికృతే నమః
ఓం సద్గురవే నమః
ఓం శ్రీ మద్దత్తాత్రేయాయ నమః

శ్రీ అనఘా దేవి అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ అనఘాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం అనఘాస్వామి పత్న్యై నమః
ఓం యోగీశాయై నమః
ఓం త్రివిదాఘ విదారిన్యై నమః
ఓం త్రిగునాయై నమః
ఓం అష్టపుత్రకుటుమ్బిన్యై నమః
ఓం సిద్ద సేవ్య పదే నమః
ఓం ఆత్రేయగ్రుహదీప్తాయై నమః
ఓం వినీతాయై నమః
ఓం అనసూయాత్రి ప్రీతిదాయై నమః
ఓం మనోజ్ఞాయై నమః
ఓం యోగశక్తి స్వరూపిన్యై నమః
ఓం యోగాతీతహృదే నమః
ఓం భత్రుశుశ్రూష నోత్కరా నమః
ఓం మతిమత్యై నమః
ఓం తాపసి వేశాదారిన్యై నమః
ఓం తాపత్రయప్రదే నమః
ఓం చిత్రాసనోప విశిష్టాయై నమః
ఓం పద్మాసనయుజే నమః
ఓం రాత్నాంగులీయ కలసత్పాదాన్గుల్యై నమః
ఓం పద్మగర్భ సమానాన్ఘ్రితలాయై నమః
ఓం హరిదాన్చాత్ప్రదాయై నమః
ఓం మంజీరా కలజత్రవే నమః
ఓం శుచివల్కల దారిన్యై నమః
ఓం కాన్చీదామయుజే నమః
ఓం గళే మాంగల్య సూత్రాయై నమః
ఓం గ్రైవేయాలీ ద్రుతే నమః
ఓం క్వనాట్కంకణ యుక్తాయై నమః
ఓం పుష్పాలన్క్రుతయే నమః
ఓం అభీతిముద్రహస్తాయై నమః
ఓం లీలామ్భోజ ద్రుతే నమః
ఓం తాతంగాయుగళీ దీప్తాయై నమః
ఓం నానారత్న సుదీప్తాయే నమః
ఓం ధాన్య స్తిరాక్ష్యై నమః
ఓం ఫాలాన్చత్తిలకాయై నమః
ఓం మూర్ధా బద్ద జతారాజ త్సుమదా మాళయే నమః
ఓం భతృరాజ్ఞ పాలనాయై నమః
ఓం నానావేశద్రుతే నమః
ఓం పంచాపర్వాన్వితాయై నమః
ఓం విద్యారూపికాయై నమః
ఓం సర్వావరణ శీలాయై నమః
ఓం స్వబలావృతవేధసే నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం స్వచ్చ శంఖద్రుతే నమః
ఓం మందహాస మనోజ్ఞానాయ నమః
ఓం దత్త పార్శ్వ నివాసాయై నమః
ఓం ముఖ నిస్సృత శంపాభత్రయి దీప్యై నమః
ఓం రేనుకేష్ట కృతే నమః
ఓం విదాత్రు వేద సందాత్ర్యై నమః
ఓం సృష్టి శక్త్యై నమః
ఓం శాంతి లక్ష్మై నమః
ఓం గాయకాయై నమః
ఓం బ్రహ్మన్యై నమః
ఓం యోగాచారరతాయై నమః
ఓం నర్తికాయై నమః
ఓం దత్తవామాంక సంస్థితాయై నమః
ఓం జగదిష్ట కృతే నమః
ఓం శుభాయై నమః
ఓం చారు సర్వాన్గ్యై నమః
ఓం చంద్రాస్యాయై నమః
ఓం దుర్మానస క్షోభాకర్యై నమః
ఓం సాదుహృచ్చాన్తయే నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం పాదస్తితాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం గృహదాయై నమః
ఓం శక్తిస్థితాయై నమః
ఓం సద్రత్న వస్త్రదాయై నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం గుహ్యస్తాన స్థితాయై నమః
ఓం పత్నీదాయై నమః
ఓం క్రోదస్తాయై నమః
ఓం పుత్రదాయై నమః
ఓం వంశవృద్ది కృతే నమః
ఓం హృద్గ్తాయై నమః
ఓం సర్వకామ పురాణాయై నమః
ఓం కంట స్థితాయై నమః
ఓం హారాది భూషణ ధాత్రి నమః
ఓం ప్రవాసి బంధు సంయోగ దాయికాయై నమః
ఓం ఇష్టాన్నదాయై నమః
ఓం వాక్చక్తిదాయి నమః
ఓం బ్రాహ్మయై నమః
ఓం అజ్ఞాన బలప్రదాత్ర్యై నమః
ఓం సదైశ్వర్య కృతే నమః
ఓం ముఖస్థితాయై నమః
ఓం కవితాశక్తి దాయి నమః
ఓం శిరోగతాయై నమః
ఓం నిర్ధాహ కర్తయై నమః
ఓం రౌద్రయై నమః
ఓం జంభాసుర విదాహిన్యై నమః
ఓం జమ్భవంశ హృతే నమః
ఓం దత్తంక సంస్థితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః
ఓం దేవప్రీతి కృతే నమః
ఓం సహుశాత్మజ దాత్ర్యై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః
ఓం శాస్త్రమాత్రే నమః
ఓం భార్ఘవ క్షిప్రతుష్టాయై నమః
ఓం ఓం కాలత్రయ విదే నమః
ఓం కార్త వీర్య ప్రసంనాయై నమః
ఓం సర్వ సిద్ది కృతే నమః
శ్రీ అనఘా దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం.

ధూపం :
శ్లో: మనోహర పరిమళం దివ్యం, సమ్మేళన మహోసతీ
దేవా సమర్పితం ధూపం, నిత్యం భక్తి మానసా.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ధూప మాఘ్రాపయామి.

దీపం :
శ్లో: భక్తానుకూల మార్యాత్వాం మమాత్మానాం ప్రసాదతః
అనఘా దత్త స్వామీ దీపైరుద్దీపయామ్యాహం
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః దీపం దర్శయామి
- దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

నైవేద్యం :
శ్లో; భోజ్యం సరసరాజాన్నం, నానోపస్కార సంయుక్తం
దివ్య నైవేద్య సంవేద్యౌ, అనఘో గృహ్యాతా ముదా.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం :
శ్లో: తంత్రకే ప్రోద్రుతాయుశ్యం, పితృపాదాన ఘస్వామిన
తాంబూలం ప్రపడే దేవీ, మయార్పితమిదం సతీ.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం :
శ్లో: దాస్యామి విన్దేయ పురుశానహంటే,
దత్తాయ దేవాయ పరివర్తి తశ్రీషి.
నీరాజనం దీప మాలైసకర్పూర
పరివేశ పంక్తి యుశ్న్మ మహార్చి .
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం :
శ్లో: దేవేశామామ్ప్రబాల దివ్యాత్మదోశాం
అభాసయాయ మున్మూల్యవేదన్
శ్రీ వేదజాతౌ శునకీక్రుతస్య
శ్రీ మంత్రపుష్ప నచయై రనఘా విషక్తే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణం :
శ్లో: నమః కమలవాసిన్యై నారాయణి నమోస్తుతే నమః
కృష్ణ ప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమోనమః
భార్ఘవేన్ద్రాది తుశ్యేతాం పితాశా అనఘాత్మకే.
శ్రీ దత్తస్వామి సమేత శ్రీ అనఘదేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

ప్రార్థనమ్ :

మనోవాక్కాయోత్థం క్షపితు మఘ మాత్మీయ వితతే
ర్థృతం నూనం యాభ్యాం విమల మిహ దాంపత్యలసనమ్ |
తయోః పాద ద్వంద్వం మహిమ ముఖ పుత్రాష్టక

శ్రీ అనఘాష్టమి వ్రతకథ

మొదటి అధ్యాయము

దీపకుడు ఈ విధంగా పలికెను: ఓ గురుదేవా ! పూర్వము జంభాసరుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించాడని నేను విన్నాను. మరి ఆయన యుద్ధము చేశాడా? లేక తనకున్నయోగ బలము చేత గెలిచాడ? తెలుసుకోవలయునని నాకు చాలా ఆసక్తిగా ఉన్నది. కావున నాయందు దయవుంచి ఆవిషయమును వివరించండి.

శ్రీ గురువు ఈ విధంగా చెప్పసాగెను :నాయనా! పూర్వము ధర్మరాజు యీ విషయమనే శ్రీ కృష్ణుని అడిగెను. ఆ విషయములను నీకు చెప్పెదను శ్రద్ధగా, ఏకాగ్రతతో వినుము.

శ్రీ కృష్ణుడు పలికెను :

బ్రహ్మ పుత్రుడగు అత్రియను మహా తేజశాలియైనఒక ఋషి కలడు. ఆయన భార్య అనసూయ. ఆమె గొప్ప పతివ్రత. వారికి చాలా కాలమునకు మహా తపస్వియు, మహా యోగియు అగు దత్తుడు అను కుమారుడు విష్ణ్వంశతో జన్మించెను. ఆ దత్తునకు యీ లోకమున సాటి లేదని ప్రసిద్ధి. ఆయనకు అనఘ అను సహధర్మచారిణియైన భార్య కలదు. ఆమెకు సంతానం ఎనిమిదిమంది కుమారులు. దయ గలది. ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది. ఆ అనఘుడు విష్ణువు అంశ, అనఘ లక్ష్మీ దేవి అంశ. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయుచున్న దత్తుని దగ్గరకు జంభాసరునిచే బాధిమ్పబడిన దేవతలు వచ్చి శరణు కోరినారు. బ్రహ్మ యిచ్చిన వరముచే ఆ జంభాసరుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరముల పాటు యుద్ధము చేసెను. ఆ దేవ దానవ యుద్దమున పాతాళము నుండి ద్వైత్య దానవ రాక్షస జాతుల వారు వచ్చి యుద్ధము. చివరకు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదలి దిక్కులకు పరుగులు పెట్టిరి. దేవతలిట్లు గతిలేక పరుగులు పెట్టుచుండగా జంభుడు మున్నగు రాక్షసులు వెంటబడి తరుముచుండిరి. రాక్షసులు బాణములతోనూ, గదలతోనూ, రోకళ్ళతోనూ, యుద్ధము చేయసాగిరి. వారిలో కొందరు ఎద్దులను, కొందరు దున్నపోతులను, కొందరు శరభములను, గండకములను పులులను , కోతులను, గాడిదలను ఎక్కి, రాళ్ళు విసురుచూ, ఫిరంగులు పేల్చుతూ, తోమరములు బాణములు మొదలైనవి వేయుచూ వెంటపడిరి. వారు అట్లు అనఘ దంపతులు నివసించుచుండు ఆశ్రమము గల వింధ్య పర్వతము వరకు వచ్చిరి. ఆ దేవతలు శరణార్థులై అనఘ దంపతుల దగ్గరకు చేరిరి.

దేవతలు పలికిరి :

దేవదేవ ! జగన్నాధ! శంకచక్ర గదాధర ! జంభ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణు జొచ్చిన మమ్ము కాపాడుము. ఓ బ్రహ్మర్షీ ! నీ భక్తులగు దేవతలకు నీ పాద పద్మముల కన్న వేరు గతిలేదు. కాన నిన్నాశ్రయించిన మమ్ము రక్షించుము.. ఆ అనఘ భగవానుడు వారల యేడ్పును విని అనఘాదేవికి విలాసముగా సంజ్ఞ చేసెను. పిమ్మట ఆ దేవత లందరని ఆశ్రమము లోనికి పంపి, మీరు యిచ్చట నిర్భయముగా ఉండునని పలికెను. వారునూ అంగీకరించి తృప్తిగా ఉండిరి. అంతలో రాక్షసులనూ ఆయుదములు విసురు కొనుచూ అచ్చటికి వచ్చి ( విలాసవతి ఆకారములో నున్న అనఘాదేవిని చూసి ) " యీ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకొనుడు, పూలు, పండ్లు మొదలగు కానుకలు యిండు " అని పల్కిరి. అంతలో వారి ఐశ్వర్యలక్ష్మి వారి నెత్తికెక్కును. దత్తుడునూ, వారిని తన ధ్యానాగ్ని నేత్రముచే చూడగా క్షణములో వారు కాలి పోయిరి. ఇంతలో రాక్శసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకొని వెళ్ళసాగిరి.( దత్త ప్రభావముచే ), తేజోహీనులునూ, (అనఘాదేవి ప్రభావముచే ) లక్ష్మీ హీనులునూ అగు ఆ మద పీడితులగు ఆ రాక్షసులను దేవతలు పట్టి నరుకాగిరి. 25,26. రిష్టులు, కరణములు, శ్లములు, పిరిఘలు, త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలిట్లు తమ్ము నరకు చుండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడ్పులూ, పెడబొబ్బలూ సాగించిరి. ఇట్లు ఆ దత్తప్రభావము వల్ల రాక్షసులు దేవతల శస్త్రములచే నశించిరి. జంభాసురుడునూ ఇంద్రుని చేత మరణించెను.దేవతలు మునుపటి వలె తమ రాజ్యములను పొందిరి. ఇట్లు దేవతలంతటి వారే దేవర్షియగు ఆ దత్తుని మహిమను అనుభవించిరి.

రెండవ అధ్యాయము :

పిమ్మట ఆ దత్తుడు సర్వ లోకములకు క్షేమము కలుగుటకై నిత్యమూ మనోవాక్కాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసెను. చేతులు పై కెత్తి కనులు తెరిచియుంచి, కట్టెవలె నిశ్చలముగా నిలచి మూడు వేల దివ్య సంవత్సరములు 'బ్రహ్మోత్తరము' అను తపస్సు చేసెను.. అట్లు ఊర్థ్వ రేతస్కుడై, రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో నుండగా మాహిష్మతీ ప్రభువగుకార్తవీర్యార్జునుడు వంటరిగా వచ్చి, రాత్రింబవళ్ళుఏమరుపాటు లేకుండా వినయముతో శుశ్రూష చేసెను. ఒళ్ళ ఒత్తుచూ, మనసులో తలచి సపర్యలన్ని చెయుచూ ఆ రాజు అన్ని నియమములను ధృఢమైన సంతుష్టితో ఆచరించెను. అపుడు దత్తుడు తేజశ్శాలి అగు ఆ రాజుకు నాలుగు వరములనిచ్చెను. అతడు వేయి చేతులను మొదటి వరముగా కోరెను. అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషులు తన్ను నివారించవలెను. ఇది రెండవ వరము. మూడవది ధర్మయుద్దము నందు భూమినంతటిని గెలిచి ధర్మ యుక్తముగా పాలన చేయవలెను. నాల్గవది అనేక యుద్దములలో వేలకు వేల వీరులను గెలిచిన తనకు, అందరి కన్నా మినయగు వీరునితో యుద్దము చెయుచుండగా మరణము సంభవిమ్చవలెను. అపుడు ప్రసన్నుడైన ఆ దత్తుడు ఆ రాజునకు రాజ్యమును విపులమగు యోగ విద్యను అనుగ్రహించెను. అష్టసిద్ది సమన్వితమైన సప్తద్వీపాధిత్యమును గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తుడు అనుగ్రహించెను. సహస్రభాహువులతో చతుస్సముద్ర పర్యంతము గల భూమండలము ధర్మముగా జయించి పరిపాలించెను. యోగశక్తిచే రథ గజ తురగ పతకాది యుతుడై ప్రాదుర్భవించెను. ఓ ధర్మరాజా ! సప్తద్వీపములయందు యల్లెడల పదివేల యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా భూరిదక్షిణలు ఇచ్చి రుత్విక్కులను బ్రాహ్మణులను సంతోషపరచెను.ఆ యాగశాలలో బంగారువేదికలు మణీమయఖచిత శోభితములైన స్థంభములు విశేషాలంకారములు యుండ దేవతలు గంధర్వ యక్ష కిన్నరులు కింపురుషులు వారి వారి విమానముల యందు వుండి మిక్కిలి వేడుకతో చూచుచుండిరి. అట్టి ఆ రాజసింహుని చరిత్రనూ, మహిమనూ చూసే నారదడును ఒకానొక గంధర్వుడు ఒక యజ్జమున ఇట్లు గానము చేసెను. "లోకములో యితర రాజులు యజ్జములలో కానీ, పరాక్రమములో కానీ, విద్యలో కానీ కార్తవీర్యుని సాటికి రారు. అతడు కత్తి పట్టి, చేతికి చర్మము తగల్చుకొని, ధనస్సు తాల్చి, యోగ విద్యచే ఆకాశమున గ్రద్ద వలె సంచరించుచూ సప్తద్వీపములందునూ, అందరకూ అల్లంత దూరమున కనిపించుచుండెను. అతని రాజ్యమున వస్తువులు పోవుట లేదు. దుఃఖము లేదు. శ్రమ లేదు.. అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున నలభై వేల సంవత్సరములు పరిపాలించెను. సముద్రము వరకూ గల భూమి కంతకూ అతడే చక్రవర్తి అయ్యెను. అతడే పశుపాలుడు, క్షేత్రపాలుడు అయ్యెను. స్వయముగా వానలు కురిపించుటచే అతడే మేఘుడయ్యెను. యోగ విద్యచే వచ్చిన వేయి బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి క్రీడించుచుండగా వేయి కిరణముల సూర్యునివలె ప్రకాశించు చుండెను. అతడు తన మనుష్యులతో (నాగరాజగు) కర్కోటకుని పట్టి తెప్పించి, తన పట్టణమున నిల్పెను. ఒకప్పుడు వర్షాకాలమున సముద్ర పత్నియగు నర్మదలో క్రీడించుచూ మదోన్మతుడై (చేతులతో అడ్డగించి ) ఆ నది వెనుకకు ప్రవహించునట్లు చేసెను. అపుడు నీటి ఒరిపిడిచే విలాసముగా నడుచుచున్న ఆ నదిని అతడు లాలించుచూ, క్రీడించుచున్నట్లుండెను. నర్మదయు అలల మధ్యలోని సుడి గుండములే కనుబొమ్మల మధ్య ముడిపడిన భృకుటి వలె కనిపించగా భయపడుచూ వెళ్ళినట్లుండెను.. అతడు వేయి చేతులతో సముద్రమును అల్లకల్లోలము చేయగా పాతాళ మందలి రాక్షసులు చేష్టలుడిగి అణిగ్పడి యుండిరి. చేతులతో సముద్రమును కల్లోల పెట్టగా ఆ మహా తరంగములకు తిమింగలములు మున్నగు పెద్ద పెద్ద జలజంతువులు నశించుచుండెడివి. అతడు రావణుని లొంగదీసి మాహీష్మతీ నగరమున బంధించెను. అపుడు పులస్త్యముని వచ్చి అంతఃపురమున కార్తవీర్యని బ్రతిమాలి వానిని విడిపించెను. కాని ఆ రావణుడు ఆయన చెప్పిన బుద్దులు వినక ఆయననే అవమానించెను. ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు యీ భూమి నంతనూ అగ్నికి భిక్షగా వేసెను. ఓ ధర్మరాజా! యోగాచార్యుడగు అనఘాస్వామి అనుగ్రహము వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యెను.

మూడవ అధ్యాయము

అట్లు వరములు పొందిన ఆ కార్తవీర్య యోగిచే యీ అనఘాష్టమీ వ్రతము లోకమున ప్రచారము చేయబడి ప్రసిద్ధి కెక్కినది. అఘము అనగా పాపము. అది మూడు విధములు. మూడు విధముల పాపమును నశింపచేయును కనుక అతడు (దత్తుడు) అనఘుడు అనబడును. ఆ అనఘుని అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజించవలెను. అణిమా, లఘివా, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమా, ఈశ్వితము, వశిత్వము, కామావసాయితా అను ఈ ఎనిమిది యోగ సిద్ధుని అష్టైశ్వర్యములు జనుల విశ్వాసము కొరకై దత్తునకు పుత్రులై జన్మించిరి.ఎవనిని భక్తితో సేవించినచో పాపములు పోవునో, ఎవడీ జగత్తునంతా పాపరహితము చేయగలడో అతనే అనఘుడు. అనఘత్వమే ప్రాణముగా నా (అనాగా విష్ణువు యొక్క ) అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తుడు. శ్రీకృష్ణా! కార్తవీర్యార్జునుడు యీ వ్రతమును ఏ విధానముతో, ఏ నియమములతో ప్రవర్తింప చేసెను? ఏ కాలమున, ఏ రోజున యీ వ్రతమును చేయవలెను? నాకు చెప్పుము అన్నాడు. అలా అడుగగా శ్రీ కృష్ణుడు ఈ విధముగా పలికెను.

శ్రీ కృష్ణుడు పలికెను :

మార్గశిరమాసమున, కృష్ణపక్షమున, అష్టమి నాడు అనఘ దంపతులను అష్ట పుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతములగు ఆ మూర్తులను పీఠమున స్థాపించవలెను. లేదా ఎనిమిది దళములు గల పద్మమున కలశములతో మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలెను.అనఘుని విష్ణువుగానూ, అనఘాదేవిని లక్ష్మీ గానూ, పుత్రవర్గమునూ హరి వంశోక్త విధానమున అర్చించవలెను. శూద్రులు, బ్రాహ్మణులు అందరూ ఆయా కాలములలో వచ్చు ఫలములు, కందమాలాదులు, రేగుపళ్ళు, పైకగుడ్డలు మున్నగు వివిధ నైవేద్యములు పెట్టవలెను. పిమ్మట బంధువులకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను.వ్రతము చివర ఎవనికైనా ఒకనికి యీ వ్రతమును ఇవ్వవలెను. అట్లు వ్రతము తీసుకున్న వారిలో ధృడదీక్ష గలవారు ఈ వ్రత దినమున ఉపవాసము చేసి మరునాడు పారణ చేయుదురు. అట్లు జీవించి యున్నంత కాలమూ చేయవలెనని ముమ్మాటికీ నా అభిప్రాయము. కనీసము ఒక సంవత్సరమైననూ చేయవలెను.ఇట్లు రాత్రి నాట్య, సంగీతాదులతో జాగరణము చెసి తెల్లవారి నవమినాడు ఆ ప్రతిమలను నీళ్ళలో వాలాడించవలెను. ఇట్లు ప్రతి సంవత్సరము శ్రద్ధతో వ్రతము నాచరించు వాని పాపములన్నియు తొలగును.. వారి కుటుంబము వృద్ధి చెందును. వారికి విష్ణువు ప్రసన్నుడగును. ఏడు జన్మలలో మంచి ఆరోగ్యము కల్గును. తరువాత మోక్షము వచ్చును.

నాలుగవ అధ్యాయము:
క్షీర సాగర మదనము జరుగుచున్నపుడు అమలక వృక్షము అందుండి వుద్భవించగా దీనిని శ్రీ మహా విష్ణువుకు సమర్పించిరి. అందువలన ఈ అమలక వృక్షమునకు "కృష్ణా అమలక వృక్షము" అనే పేరు గాంచినది. దీనిచే క్రుష్ణామలక వృక్షమును లక్ష్మిదెవికి ప్రీతికరముగా క్షీరసాగారమందే నిలిపెను.

అత్రి అనసూయ తపస్సునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించు సమయమున ఈ నల్ల ఉసిరిక వృక్షమునకు క్షీరసాగారమునుంది భూలోకమునకు తీసుకొని వచ్చెను. ముందుగా బ్రహ్మ దేవుడు ఈ వృక్షమును రేణుకాదేవి యున్న మాత్రుతీర్ధమున సిద్దులచే నాటబడినది. కావున "సిద్దామలక వృక్షము" అని పేరు గాంచినది. ఈ వృక్షము క్షీరసాగరమున, పాతాళమున, భూలోకమున వెలసి సేవలంది వారాలకు సిద్దులను ప్రసాదిన్చుచున్నది. ఇట్లు దండకారణ్యము నందు దత్త ఆశ్రమము నందు సిద్దామలక వృక్షము వెలసినది. ఈ ప్రాంతము అమలక గ్రామమని, అమలకాశ్రమమని పేరు గాంచినది.

ఈ అమలక వృక్షము క్రింద మనిపీటము వున్నది. దానిపై దత్తుడు ఆసీనుడై వున్నాడు. కంటమున మనిహారములు, మొలలో బంగారు మొలత్రాడు, వామాన్కమున అనఘాదేవిని వెనుక కామదేనువును, నాలుగు కుక్కలు, సనక సనందాది సాదు పురుషులు, నవిధులు పరివేష్టించి వుండగా పరాశక్తి, నాగేశ్వరి, కామప్రద, శ్రీ భువనేశ్వరి, భూత జాలములు, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు, కరములతో నమస్కరించుచున్నారు.

శ్రీ దత్తుడు పద్మాసనముతో నాలుగు చేతులయండు శంఖ, చక్రములను, గదా పద్మములను, డమరు త్రిశూలములను, కమండలమును, జపమాలను ధరించియున్నాడు. తన తల్లి తండ్రులు అత్రి, అనసూయా దేవి వున్నతాసనములపై కూర్చొని వుండగా సోదరులైన చంద్రుడు, దూర్వాసమహాముని, ప్రసన్న వదనములతో నమస్కరించిచూ దత్త మహాప్రభువును స్తుతిన్చుచున్నారు.

ఈ సమయములో చల్లని గాలి వీచుచుండగా గంధర్వులు గానము చేయుచుండగా రంభా, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు నాట్యము చేయుచుండగా ప్రక్రుతి పులకించి మనోహరముగా వున్నది. అచ్చటనున్న భక్తులు అందరూ సర్వమునూ మరచి సమాధి స్థితిలో నుండగా వారి కోరికలు కోరగానే నేరవేరుచుండగా, దత్తుడి కరుణా కటాక్షముల వలన యోగము, జ్ఞానము, మోక్షము పొందుచున్నారు.

కావునా భక్తులందరూ ఈ అధ్యాయమున తెలిపిన విధముగా అనఘాష్టమి వ్రతకల్పము వీలైనచో నల్ల ఉసిరిక వృక్షము క్రింద చేయుట చాలా శ్రేష్టము.

అయిదవ అధ్యాయము.

బ్రహ్మ ఒకనాడు అవిద్య ఆవరించి బుద్దిమాంద్యము ఏర్పడి, వేదములకు గుర్తుకురాలేదు. గాయత్రి మంత్రము సహితము మరిచిపోఎను. పెంతనే సహ్యాద్రి పర్వతము చేరి పరాశక్తి స్వరూపిణి యగు, రేనుకాదేవిని ఇట్లు ప్రార్ధించెను. తల్లి! నేను వేదములను మరచితిని, ఒక్క మంత్రమినాను గుర్తుకురాలేదు. నా దురవస్తాను దుక్కములను తొలగించి, వేదములు గుర్తుకు వచ్చునట్లు చేయు సంర్దురాలివి నీవే! పాహిమాం అని ప్రార్ధించెను. బ్రహ్మదేవుని పరిస్థితిని గమనించి "పూర్వము సోమకాసురుడు వేదముల నపహరించాగా శ్రీ మహావిష్ణువు మస్త్య అవతారము ధరించి నీకు వేదములు ఇచ్చిన విషయము మరచితివా!" అని పలికి శ్రీ మహా విష్ణువును ఆశ్రయించమని చెప్పెను. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంటము చేరి క్షీరసాగరమున చూడగా విష్ణువు దర్శనము లభించలేదు. అచ్చట క్రుష్ణామలక వృక్షము బ్రహ్మదేవునకు కనిపించగా దానిని తీసుకొని రేణుకా మాత వద్దకు జేరగా ఆమె "నేడు విష్ణువు లక్ష్మిదెవితొ సహ్యాద్రి యందె అనఘ సమేతుడై దత్తుడిగా వెలసి యున్నారు. నేను అతనిని నీ కడకు రాప్పించేడను. అని దత్తుని మదిలో తలచినది "స్ముర్త్రుగామి సనోవతు "అను ఆర్యోక్తిని ననుసరించి దత్తుడు అనఘ సమేతుడై వెంటనే ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మదేవుడు దత్తునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి విషాద గాధను తెలిపెను.

ఈ సమయములో దత్తత్రేయునితో కూడియున్న అనఘాదేవి ముఖారవిందము నుండి వేదములు రెప్పపాటు కాలమున వెలువడి దివ్య కాంతులతో రేణుకాదేవి ముఖమున జేరినవి. ఇది చూసిన బ్రహ్మదేవుడు విస్మయుడై భువనేశ్వరిని ఓంకార వాచ్యవు. నీవులేనిదే పరమానువైన లేదు. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, స్వరూపినివి మరియు మానసహంసవు అని ప్రార్ధించెను. బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహముతో దత్తదేవుని ఆశీస్సులతో బ్రహ్మలోకమందు వేదములతో చేరెను.
ధర్మరాజా ! ఇప్పుడు నీకు చెప్పిన యీ పాపహరమగు అనఘాష్టమీ వ్రతము ఏకాగ్రబద్ధులై చేయ్వారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జ్నుని వంటి వారగుదురు. అనఘా దేవి వ్రతము ఆచరిన్చినవారికి ఆయురారోగ్యము, వేదజ్ఞానము, యోగము, ఆయుష్షు, ఐశ్వర్యము, మాంగళ్యము కలిగి చిట్టచివరకు అనఘాదేవి సాన్నిధ్యము పొందగలరు.

అనఘాష్టమి వ్రత విధానము

మార్గశిరమాసము బహుళ పక్షం లో వచ్చే అష్టమి నాడు అనఘ దంపతులను, అష్ట పుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసిన తరువాత ఆ మూర్తులను పీఠమున స్థాపన చేయవలెను. లేదా ఎనిమిది దళములు గల పద్మమున కలశములతో మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలెను. అనఘుని విష్ణువు స్వరూపముగాను, అనఘాదేవిని లక్ష్మీ స్వరూపముగానూ, పుత్రవర్గమునూ హరి వంశోక్త విధాన పూర్వకముగా అర్చించవలెను. అందరూ ఆయా ఋతువు సమయ కాలములలో వచ్చు వివిధ ఫలములు, కందమాలాదులు, రేగుపళ్ళు మొదలైనవి మరియు వివిధ నైవేద్యములు నివిదించాలి.అ తరువాత బంధువులకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. వ్రతము చివర ఎవరికైన ఒకరికిరి ఈ దీక్షగా వ్రతమును ఇవ్వవలెను. అట్లు వ్రతము తీసుకున్న వారిలో ధృడదీక్ష గలవారు ఈ వ్రత చేసే రోజున ఉపవాసము ఉండి. మరునాడు పారణ చేస్టారు. ఆవిధంగా జీవించి ఉన్నంత కాలమూ చేయవలెనని పురానములగా ద్వారా తెలియుచున్నది. అలా చేయలేకపోతే కనీసము ఒక సంవత్సరమైననూ చేయవలెను. ఇట్లు రాత్రి నాట్య, సంగీతాదులతో జాగరణము చెసి తెల్లవారి నవమినాడు ఆ ప్రతిమలను నీళ్ళలో వాలాడించవలెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML