గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 20 December 2015

శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది.శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది. సకల పాతకాలను రూపుమాపి భవబంధాలను తొలగించగల తారకమంత్రము. కలియుగంలో మానవులు తరించగల మార్గము. ‘రా’ అంటే మన పెదవులు విడివడి మనలోని పాపాలన్నీ బయటకుపోయి ‘మ’ అన్నప్పుడు పెదవులు మూసుకుని తిరిగి వాటిని లోపలికిపోకుండా చేస్తుంది. రామనామ జపం సకలార్థ సాధనం, మోక్షప్రదాయం.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే


‘‘రామ రామ రామ అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ చేసినంత ఫలం’’ అని శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం. పరమేశ్వరుడు కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉంటాడట.

‘రామ’ శబ్దం అత్యంత సులభంగా ఉండి ఆబాలగోపాలం నోట పలకటానికి అనువుగా ఉంటుంది. ‘శ్రీరామ’ అనే శబ్దం వల్ల అనేక శుభాలు కలుగుతాయ కనుక ఆ నామాన్ని కోటిసార్లు వ్రాయడం. నేటికీ ఎందరో భక్తులు ‘రామకోటి’ వ్రాస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖంగా జీవించగలుగుతున్నారు. కొన్ని ప్రముఖ రామాలయాలలో రామకోటి రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేసే శ్రీరామనామ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీరామ నామాన్ని నిరంతరం జపించటం వలన శత్రుపీడలు, సకల రోగాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవించగలుగుతారు. ‘శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష!’- తెలిసి పలికినా తెలియక పలికినా రామనామం రక్షిస్తుంది. చంటి పిల్లలకు స్నానం చేయించాక చివరలో ‘శ్రీరామరక్ష’ పెట్టటం తల్లులందరికీ అలవాటు. ఏ కష్టం కలిగినా ‘శ్రీరామచంద్రా! నీవే దిక్కు’ అని అనుకోవటం అనాది నుండి వస్తున్న ఆనవాయితీ! తుమ్మినా ‘రామచంద్రా!’, క్రింద పడినా ‘రామచంద్రా!’, ఆకలి వేసినా ‘అన్నమో రామచంద్రా!’ అంటూ ఉండే సామాన్య జనులకు కూడా అండదండగా ఉండి ఆదుకుని కాపాడేది రామనామమే!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML