గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 13 December 2015

కుజదోష నివారణకు ‘మంగళ చండీదేవి” ని పూజించాలి

కుజదోష నివారణకు ‘మంగళ చండీదేవి” ని పూజించాలి
కుజదోష నివారణకు ‘మంగళ చండీదేవి” ని పూజించాలి అని ‘బ్రహ్మవైవర్త పురాణం’ చెబుతోంది. కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజ దోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే. పెళ్లి కావలసిన అమ్మాయికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులుపడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకుగాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే ‘మంగళచండీ దేవి’ ని పూజించాలని ‘బ్రహ్మవైవర్త పురాణం’ చెబుతోంది. ఏ కుజగ్రహ దోషం వలన అంతా నానాఅవస్థలు పడుతున్నారో … ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే ‘మంగళచండీ దేవి’. కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు … సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, సత్వరమే సత్ఫలి తాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు
శ్రీ మంగళ చండికా స్తోత్రం
ధ్యానం : దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్. శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే. శ్రీ
మహాదేవ ఉవాచ:
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే. హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే. మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్ ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML