ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 11 December 2015

మార్గశిర మాసం



మార్గశిర మాసం
----------------------------------------------------------------------------

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం.'మాసానాం మార్గశీర్షం'- మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.

కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడు. విష్ణువు సూర్యనారాయణుడై ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది. సౌరమానం ప్రకారం ఈనెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యుడు ధనూరాశిలో ఉండగా విష్ణువును మేల్కొలిపే ధనుర్మాస వ్రతం చేయాలని ఆయా గ్రంథాలు చెబుతున్నాయి.

మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.

'స్కంద షష్ఠి':-
-----------------
మార్గశిరం ఎన్నో పర్వాలకు నెలవు. మార్గశిర శుద్ధ 'స్కంద షష్ఠి'- శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని చెబుతారు. తెలుగువారు దీన్ని 'సుబ్రహ్మణ్య షష్ఠి' అని వ్యవహరిస్తారు.

ధనుర్మాసం
-----------------
విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి
-------------------------------------------
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.

దత్తాత్రేయ స్వామి జయంతి
----------------------------

శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML