గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

పంచారామాలు,వాటి వివరాలుపంచారామాలు,వాటి వివరాలు

అమరావతి లోని అమరేశ్వర స్వామి విశేషాలు తెలుసు కొందాం .అమరా వతి గుంటూరు జిల్లాలో ఉంది .దీనిని ‘’అమరా రామం ‘’అంటారు స్వామి ‘’అమరేశ్వర స్వామి ఇంద్రుడు ప్రతిస్టించాడు ‘’ఆయన ముఖం ‘’అఘోరం ‘’స్వరూపం శాంతి స్వరూపం’’ అమ్మ వారు ‘’బాల చాముం డేశ్వరి .రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమ వరం లోని భీమేశ్వరవామి అలాగే ప్రక్కనే గును పూడిలో ఉన్న సోమేశ్వర స్వామి .స్వామి పేరు సోమేశ్వరుడు .’’సద్యో జాత ‘’ముఖం .స్వరూపం ‘’నిత్య నూతనం ‘’.చంద్ర ప్రతిష్టి తం .అమ్మ వారు పార్వతి దేవి ఈ క్షేత్రాన్ని సోమా రామం అంటారు .మూడవది పశ్చిమ గోదావరి లోనే పాలకొల్లు లో ఉన్న ‘’క్షీరా రామం ‘’.స్వామి రామ లింగేశ్వరుడు .’’ఈశాన ముఖం ‘’.’’లోక మంతా తానె అయిన స్వరూపం’’ .’’ఈశాన ముఖం ‘’.శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం .అమ్మవారు పార్వతి దేవి .నాల్గవది ద్రాక్షా రామం .తూర్పు గోదావరి జిల్లాలో ‘’దాక్షారం ‘’లో ఉంది .స్వామి భీమేశ్వరుడు .’’తత్పురుష ముఖం ‘’.స్వరూపం ‘’ఆత్మ ‘’.’’స్వయంభువు ‘’.అమ్మ వారు మాణిక్యాంబ .అయిదవది కొమారా రామం .తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో ఉంది .స్వామి కుమారారామ భీమేశ్వరుడు .’’వామ దేవ ముఖం ‘’.’’సత్య సుందర స్వరూపం ‘’.కుమార స్వామి ప్రతిష్టి తం .అమ్మ వారు బాలా త్రిపుర సుందరి


అమరారామం

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాల్లో అమరారామం ఒకటి. ఇది అమరావతిగా ప్రసిద్ధికెక్కింది. పురాణగాథలు శివునికి సంబంధించిన పంచారామాల గురించి అనేక వివరణలు చెబుతాయి. అమరావతి ఒకప్పుడు దేవతలకు, యక్షులకు, కిన్నెరులకు నెలవు. వీరంతా శివుని కోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షం కాగానే రాక్షసుడయిన తారకాసురుని సంహరించమని వేడుకున్నారు. అప్పుడు శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకుడిని సంహరించాడని పురాణాలు వివరిస్తున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న ముక్కలలోకి అమరావతిలో ఉన్న శివలింగం పెద్దదని భక్తుల విశ్వాసం.
కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెద మద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవిచేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
ఇది 15 అడుగుల పాలరాతి లింగం. ఇక్కడ శివుడు అమరేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. దీనిని దేవతల రాజు ఇంద్రుడు, దేవతల గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడు ప్రతిష్ఠించారని ఒక కథలో ఉంది. అమరావతి క్రౌంచశిల అనే ఒక చిన్న కొండరాతి మీద, కృష్ణానదీ తీరాన ఉంది.
ఇక్కడ అమ్మవారికి ఖడ్గమాలపూజ విశేషం. పూర్వం చక్రవర్తులు విజయం సాధించడానికి "ఖడ్గమాలాస్తోత్రం"తో అమ్మవారిని పూజించేవారని నమ్మకం. నేటికి ఈ స్తోత్రంతో అమ్మవారిని పూజిస్తే ధర్మసిద్ధి - ఙ్ఞానలబ్ధి కలుగుతుంది.ఆలయానికి ఉన్న మెట్లకి పూజ చెయ్యడం ఎంతో మంచిదిగా భావిస్తారు. స్త్రీలు, పిల్లలు కూడా "మెట్లపూజ" చెయ్యడం ఆనవాయితీ. మెట్లు కడిగి, పసుపు కుంకుమ బొట్లు పెడతారు. ప్రతీ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణిమ రోజున ఈ ఆది దంపతులకు బ్రహ్మోత్సవాలలో, వసంత కళ్యాణం జరుపుతారు.
ఇక్కడిలింగం స్పటికంవలే తెల్లగా ఉంటుంది. దీని ఎత్తు 5 గజాలు, చుట్టు కొలత మూడు అడుగులు, ఈ లింగానికి అభిషేకం చేయడానికి మెట్లపై అంతస్థుకు వెళ్లాలి. దీనిపై గల గుంట పూర్వంఅర్జునుడు కిరాతరూపంలో ఉన్నప్పుడు కొట్టగా ఏర్పడిందని, దీనికి గల చారల్లో ఒకటి బాణం దెబ్బ వల్ల ఏర్పడిన రక్త్ధార అని, మరొకటి దేవతాభిషేకానికి సంబంధించిన పాలధార అని చెప్పబడుతోంది. ఇక్కడ గల అమ్మవారు శ్రీ బాలచాముండేశ్వరీ దేవి అని ఆది శంకరాచార్యులు ప్రతిష్టించారని చెబుతారు
మూడు ప్రాకారాలలో సువిశాలంగా ఉన్న ఆవరణలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు కావాల్సిన మానసిక ప్రశాంతతను, చిత్తశుద్ధిని కల్గిస్తుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశే్వశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్తేశ్వరుడు, సోమేశ్వరుడు, వీరభద్రుడు, పార్ధవేశ్వరుడు, నాగేశ్వరుడు, కోసలేశ్వరుడు, త్రిపురసుందరీదేవి ఆలయాలతో పాటు, కల్యాణ మండపం కృష్ణానదితోవలో నిర్మించబడి ఉంది. రెండవ ప్రాకారంలో నైరుతి దిక్కున శ్రీశైల మల్లేశ్వరుడు, వాయువ్య దిశలో కాశీవిశే్వశ్వరుడు, ఈశాన్యాన చండీశ్వరుడు, ఆగ్నేయమున శ్రీ కాళ హస్తీశ్వరుడు, తూర్పున శ్రీ సూర్యనారాయణ ఆలయాలు ఉన్నాయి. శివకేశ బేద నిరూపణకన్నట్టుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం క్షేత్రపాలకునిగా ప్రతిష్టించబడి ఉండటం ఇక్కడి విశేషం. ఆలయ కుడ్యాలమీద వెలుపలి భాగమున శిల్పీకరించిన కోస్టములందు దక్షిణామూర్తి, ఉత్తరమున చతుర్ముఖ బ్రహ్మమూర్తులు అత్యంత ఆకర్షించాయి. సుమారు 15 అడుగుల ఎత్తుగల స్పటికాకార వర్ణపు శివలింగాన్ని వేద బ్రాహ్మణులు పక్కనే నిర్మించిన మెట్లపై నిలబడి అభిషేకించారు. హరహర మహదేవ శంభోశంకర, సాంబ శివ శివ అనే నినాదాలతో భక్త్భివన స్ఫూర్తితో అమరేశ్వరాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. వెంకటాద్రినాయుడు మండపంలో బాలచాముండికా అమ్మవారి దేవాలయం ఉంది. మహాశివరాత్రిన జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతిఏడాది లక్షన్నరకు పైగా భక్తజన సందోహం హాజరవుతూ ఉంటోంది.
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరావతి యొక్క లాటిట్యూడ్ 16 డిగ్రీల 34' ఉత్తరం , లాంగిట్యూడ్ 80 డిగ్రీల 17' తూర్పు. అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరంలో కల భీమారామం పంచారామాలలో మరొకటి. పాలకొల్లుకి పదునాలుగు మైళ్ళ దూరం లో గల ఈ ఆలయాన్ని కూడా చాళుక్య భీముడు నిర్మించాడని చరిత్ర కారులు చెబుతారు.
భీమవర౦, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రముఖ పట్టణము మరియు అదే పేరుగల ఒక మండలము. ఇక్కడి ఈశ్వరుని పేరు "సోమేశ్వరుడు"ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెపుతారు. అందుకేనేమో చంద్రకళలని అనుసరించి శ్వేత వర్ణం లోను గోధుమ వర్ణంలోను ఈ శివలింగం కనపడుతూ వుంటుందిట. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించిన తరువాత, తన పేరు మీద ఒక వూరిని నిర్మించాడు. అదే "భీమవరం".
తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడి లొ ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణం భీమవరం అని పేరు వచ్చింది. క్రీ.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు, ఉండి, పెద్ద అమిరం గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం పట్టణానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రధానం ఛేశారు.
సోమేశ్వరస్వామి దేవాలయం భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది. ఇక్కడి లింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అది దేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
భీమవరం పట్టణానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్శిమ గోదావరి జిల్లా లో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది.


పాలకొల్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదు గానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థలపురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, పాలకొలను అని పిలిచేవారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉంది. గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టిని పోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట. ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). తదనంతరం ప్రతిరోజూ చేయబడే అభిషేకక్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ, ఆ ప్రాంతమునకు కూడా వర్తించి ఉండవచ్చని ఒక కథనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
1. కాలువ మార్గములో షిర్డిసాయినాథుని మందిరము నాలుగెకరాల విస్తీర్ణములో ఉంది. ఆలయము వెనుక భోజనశాల, ధ్యాన మందిరము, ఉద్యాన వనములు ఉన్నాయి. గురువారము రోజున వేలమంది స్వామిని దర్శించేందుకు తరలి వస్తుంటారు. ప్రతి రోజూ ఉచిత భోజన కార్యక్రము జరుగును.
2. సాయినాథుని దేవాలయమునకు ఎదురుగా కాలవ ఇవతలి వైపు నర్సాపురం వెళ్ళే రోడ్డులో రెండు అంతస్తులుగా అద్భుత నిర్మాణముగా అయ్యప్పస్వామి వారి ఆలయము మలచారు.
3. పాలకొల్లు చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయము ఉంది. ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామివారు.
4. అష్ట భుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
5. ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము ఉంది. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
6. పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
7. పాలకొల్లు గ్రామ దేవత దెసాలమ్మ వారు.
క్షేత్రవృత్తాంతం
తారకాసురుని సంహారానికి పూర్వంనుంచే ఇక్కడ శివారాధన జరుగుతూవుండేదని ప్రతీతి. సప్త మహర్షులలో కౌశిక మహర్షి ఒకరు. ఆయన కుమారుడు ఉపమన్యుడు ఇక్కడ శివారాధన చేస్తూ, శివునికి అభిషేకము చేయటానికి పాలు లభించకపోవటంతో ఆ పరమేశ్వరుడినే ప్రార్ధించాడు. ఫరమేశ్వరుడు భక్తునికోరిక తీర్చటానికి తన త్రిశూలంతో నేలపై గ్రుచ్చగా అక్కడ పాలకొలను ఏర్పడింది. అప్పటినుండీ ఆ వూరి పేరు పాలకొలను అయింది. వాడుకలో పాలకొల్లుగా మారింది.
ఐదు భాగాలయిన అమృత లింగంలో ప్రధాన భాగమైన శిరో భాగమిక్కడ పడ్డదని, శివలింగానికి కొప్పు భాగంలో వున్న ఆకారం దీనికి ఋజువంటారు. అంతేగాక అక్కడ లభించిన శాసనాలలో కూడా ఈ స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా వర్ణించారు.
ఒక కధనం ప్రకారం మిగతా నాలుగు ఆరామాలలో అమృత లింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తానికి వివిధ దేవతలచే జరపబడినా, క్షీరారామంలో మటుకూ, శివాదేశంతో ఆ శకలము పెరగకుండా కాపాడబడి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడింది.
దేవస్ధాన ప్రచురణ దివ్య పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామంలో శ్రీ క్షీరారామలింగేశ్వరుడి ప్రతిష్ఠ శ్రీమహావిష్ణువు చే కావింపబడిందని వ్రాశారు. ఆ పుస్తకం ఆధారంగా శ్రీ మహావిష్ణువు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిని త్రిపురసుందరి (పార్వతీదేవి) సమేతంగా ప్రతిష్ఠించి శివుని కోర్కెపై క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీసమేతుడై, శ్రీ జనార్ధనస్వామిగా ఈ క్షీరారామంలో కొలువైనాడు. అంతేగాక వివిధ క్షేత్రాలలో అక్కడి దేవతలను సంవత్సరాల తరబడి భక్తితో సేవిస్తే వచ్చే ఫలితం ఈ క్షేత్రంలో ఒక నిద్రతోనే లభిస్తుందని, ఈ స్వామి దర్శనంతో బ్రహ్మ హత్యాది సకల పాపాలూ పోతాయని శ్రీ మహావిష్ణువు క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠించినప్పుడు ఈ క్షేత్ర విశిష్టతను గూర్చి తెలిపారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ప్రయోగించి సర్వ పాపనాశనకరమైన రామగుండం పుష్కరిణిని ఏర్పరిచారు.
ఆలయ విశేషాలు
ఈ ఆలయ విశేషాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది రాజగోపురం, ప్రజల భాషలో పెద్ద గోపురం. దీనిని 1777 సంవత్సరంలో శ్రీ బచ్చు అమ్మయ్యగారు నిర్మింపచేశారని కొందరంటే రెడ్డి రాజుల కాలంనాటిదని ఇంకొందరి కధనం. దీని ఎత్తు షుమారు 120 అడుగులు. 9 అంతస్తుల నిర్మాణం ఇది. చివరి అంతస్తుదాకా వెళ్ళటానికి లోపలనుంచి మెట్లు వున్నాయి. ఆలయ గోపురాలలో మొదటి లేక రెండవ ఎత్తైన గోపురం ఇదని ఒక రికార్డు వున్నట్లు నేను విన్నాను. కానీ ఆలయంవారు ప్రచురించిన పుస్తకంలో ఈ విశేషాన్ని మరిచారు. ఈ గోపురం మీద అనేక సుందర శిల్పాలు చెక్కబడి వున్నవి. ఈ గోపురాన్ని 2000 సంవత్సరంలో స్ధానిక శాసన సభ్యులు శ్రీ అల్లు వెంకట సత్యనారాయణగారి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో పునరుధ్ధరించారు. ఫ్రాచీన కాల శిల్ప సంపదని కాపాడటానికి ప్రభుత్వం చేసిన కృషి కొనియాడదగింది. అలాగే చరిత్ర గురించి కూడా ఇలాంటి ప్రముఖ ఆలయాల కమిటీలు శ్రధ్ధ తీసుకుని తగు పరిశోధనల తర్వాత సరియైన విశేషాలను పుస్తక రూపంలో ప్రచురిస్తే మన పూర్వీకులు మనకందించిన అద్భుతమైన పౌరాణిక చారిత్రాత్మక కళాఖండాల వారసత్వాన్ని తర తరాలకు అందించగలరు.
ఇప్పుడు ఇక్కడ కొలువైన దేవతల గురించి తెలుసుకుందాము. ఫ్రధాన దైవం క్షీరా రామ లింగేశ్వరుడు తెల్లగా పాలలాగా అద్భుతమైన వర్ణంతో దర్శనమిచ్చే రెండున్నర అడుగుల ఎత్తైన లింగం. స్వామిని చూడగానే భక్తి ప్రపత్తులతో చేతులు జోడించకుండా వుండలేము. ఇంకొక విశేషం. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యని కిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్తునుండి శివలింగంపై పడటం.
స్వామి ఎదురుగా ప్రాకారమండపం మధ్యలో చిరు గంటల పట్టీతో, కాలి మువ్వలతో అందంగా వున్ననల్లరాతి నందీశ్వరుడున్నాడు.
అమ్మవారు పార్వతీ దేవి రామలింగేశ్వరునికు ఎదురుగా వున్న మండపంలో కుడివైపు కొలువు తీరింది. పూర్వం శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇదివరకు ఈవిడని త్రిపుర సుందరీదేవిగా కూడా వ్యవహరించేవారు. ఇక్కడ నిత్య కుంకుమార్చనలు జరుగుతాయి.
క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి అని చెప్పాను కదా. ఆయన చుట్టూవున్న వెండి మకర తోరణం మీద వున్న దశావతారాలనుకూడా చూడండి మరి. ఈయన దేవేరి లక్ష్మీదేవి మందిరంకూడా దర్శించండి. ప్రధానాలయంలో పశ్చిమ ముఖంగా ఋణహర గణపతి వున్నాడు. ఈయన్ని పూజిస్తే ఋణ విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. కానివ్వండి మరి.
రావణ వధానంతరం శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి రామేశ్వరలింగంతోపాటు కాశీ నుంచి తెచ్చిన 106వ శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శిస్తే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినట్లేనని భక్తులు భావిస్తారు. ఇంకా ఈ ప్రాకారంలో వున్న ఆంజనేయస్వామి, వీరభద్రేశ్వరుడు వంటి అనేక దేవీ దేవతా మూర్తులనేకాక ఆలయ స్తంబాలపై చెక్కిన పురాణ ఘట్టాలను, చాళుక్య, రెడ్డి రాజుల, కాకతీయ రాజుల శాసనాలు కూడా వీక్షించండి.
పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.


ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. శివుడు సూర్య ప్రతిష్ఠితుడైన భీమేశ్వర స్వామి. అమ్మవారిని వేశ్యల కులదైవంగా కూడా చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాసకాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటే రకంగా ఉంటుంది.

ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు. 15వ శతాబ్దంలోని ప్రౌఢ కవి మల్లన, రుక్మాంగద చరిత్రమును, కవిసార్వభౌముడు, ఆంధ్ర నైషధకర్త శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణమును, మరి యింకా మల్లి ఖార్జున పండితుడు, సూరన కవి మొదలగు ప్రాచీన కవులెందరో స్వామి మహత్యమును వేనోళ్ళ ప్రశంసించటం జరిగింది.
స్థలపురాణం - క్షేత్ర వైభవం
పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కల్గిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్ధ్హించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కల్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను.
ఇలా భూమింఈద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంతే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండ పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొ దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసెను. ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.
చాటువు
శ్రీనాథమహా కవి చాటువులకు ప్రసిద్ధి. అతడు ద్రాక్షారామానికి సంబంధించి చెప్పిన చాటువు గా దిగువపద్యం ప్రచారంలో ఉంది.
అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్


ఈ ఆలయం వాస్తులో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి వుంటుంది. ఈ దేవాలయం చుట్టూ ఇసుక రాతితో కట్టబడిన రెండు ప్రాకారాలున్నాయి. బయటి ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలున్నాయి. లోపలి ప్రకారంలో రెండు అంతస్తుల భీమేశ్వరాలయం వుంది. క్రింది అంతస్తులో ప్రతిష్టింపబడిన శివ లింగము చాలా ఎతైనది. పూజలు రెండవ అంతస్తులో జరుగుతాయి.
గుడి ప్రాంగణంలో భీమేశ్వరాలయాన్ని పోలిన ఒక చిన్న నమూనా గుడి వుంది. బహుశా గుడి కట్టటానికి ముందు స్ధపతి గుడి నిర్మాణంలో మార్గదర్శకంగా వుంటుందని ఈ నమూనాను చెక్కి వుండవచ్చు. ఆలయంలో ప్రవేశిస్తూనే కనిపించే నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఒక ఆద్భుతసజీవ శిల్పం. ఇక్కడి శిల్పంలో మరో విశేషమేమిటంటే ప్రతి శిలా స్తంబమూ దేనికదే ప్రత్యేకమయినది. ఏ రెండు స్తంబాలూ ఒక్కలా వుండవు. ప్రతి స్తంబములోనూ ఏదో ఒక శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ఈ దేవాలయంలో క్రీ.శ. 1447 నుండి క్రీ.శ. 1494 మధ్య జారీ చేసిన 31 శాసనాలున్నాయి.వీటిలో కొన్నిటి ఆధారంగా తూర్పున వున్న ముఖ మండపం నిర్మాణం క్రీ.శ. 1394 లోనూ, శ్రీ ముఖమండపం నిర్మాణం క్రీ.శ. 1422 లోనూ జరిగినట్లు తెలుస్తోంది. స్వామి దర్శనం కోసం రెండవ అంతస్తుకి వెళ్ళటానికి గర్భగుడికి రెండు వైపులా రెండు ద్వారాలున్నాయి. దక్షిణ ఆగ్నేయం వైపుది సూర్య ద్వారము, ఉత్తర ఈశాన్యం వైపుది చంద్ర ద్వారము. ఈ రెండు మార్గాలూ గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల్లాగా అనిపిస్తాయి. మానవుడి నాసికా రంధ్రాలలో ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగి ఈ రెండు నాడుల ద్వారా చేసే ప్రాణాయామం ప్రక్రియద్వారా తన ప్రాణమును సహస్రారమున చేర్చి, ఆ ప్రాణముతో తన మనస్సుకూడా అక్కడ చేర్చి భగవదనుభవంచేత ఆనందమయుడై విరాజిల్లుతాడు. ఇది యోగమార్గం. ఇక్కడ స్వామి యోగలింగాకృతి ధరించి వున్నాడు. ఈ స్వామి దర్శనం కూడా ఈ యోగ మార్గాన్నే వెల్లడిస్తూంటుంది.

శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవేరి శ్రీ బాలా త్రిపుర సుందరి ఈ తల్లిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆలయంచుట్టూ వున్న చిన్న చిన్న గుళ్ళల్లో బ్రహ్మ, సరస్వతి, సూర్యుడు, మహిషాసుర మర్దని మొదలగు అనేక దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఇక్కడ సరస్వతి సకల విద్యా ప్రదాయిని. మహిషాసురమర్దని విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది. దీనిని కొండవీటి రాజైన కాటయ వేమారెడ్డి 15 వ శతాబ్దిలో ప్రతిష్టించినట్లు చెబుతారు. ఈవిడకే శ్యామలా శక్తి అనే పేరు కూడా వున్నది.

ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం.. చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలనూ తాకుతాయి. ఆలయం పడమటి గోడలో వజ్ర గణపతి విగ్రహం వుంది. పూర్వం ఈయన నాభిలో ఒక వజ్రం వుండేదిట.దానినుంచి వచ్చే ఆద్భుత కాంతులే రాత్రి పూట భక్తులకు మార్గదర్శకంగా వుండేవిట.భీమేశ్వరుని ఆలయం ఎదురుగా తూర్పు దిక్కులో వున్న పుష్కరిణి పేరు భీమ పుష్కరిణి.
ఈ మధ్య ఈ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది. 1964 నుంచీ ఈ ఆలయం కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో వున్నది. ఉత్సవ నిర్వహణ, ఆదాయ వ్యయాలు రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహణలో వున్నాయి. ఆలయాభివృధ్ధికి స్ధానికులతో ఏర్పడిన ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది.

ఉత్సవాలుకార్తీక, మార్గశిర మాసాలలో నిత్యం అభిషేకాలు జరుగుతూంటాయి. కార్తీక మాసంలో దీపాలంకరణ, సంకీర్తన, అన్నదానాది కార్యక్రమాలు జరుగుతూంటాయి. మాఘ బహుళ ఏకాదశినాడు స్వామి వారికి గ్రామోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఆ రోజు నుంచి మహా శివరాత్రి వరకూ ఉత్సవములు, అభిషేకములు, పూజలు పాంచాహ్నిక దీక్షతో జరుపబడతాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML