
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 13 December 2015
ఏ కార్యాన్నైనా సాధించాలంటే మనిషికి ముఖ్యంగా కావలసింది సంకల్పబలం.
ఏ కార్యాన్నైనా సాధించాలంటే మనిషికి ముఖ్యంగా కావలసింది సంకల్పబలం. ఈ సంకల్పబలం ఎవరిలో ఉంటుందో వారు తలపెట్టిన కార్యాన్ని సాధించేవరకూ విశ్రమించరు; ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఉత్సాహంతో ఎదుర్కొని ముందుకు పయనిస్తారు, విజయాన్ని సాధిస్తారు. విజయ సౌధానికి పట్టుదలే పునాది.
కార్య సాధనలో ఉత్సాహంగా పయనిస్తున్న ఆంజనేయుణ్ణి సింహిక అనే రాక్షసి బయటకు కనపడకుండా సముద్రంలోనుంచి తనవైపు లాింది. అందువల్ల త్వరితగతిన వెళుతున్న ఆంజనేయుని వేగం మందగించింది. అప్రమత్తంగా ఉన్న ఆంజనేయుడు వెంటనే తనకు కలిగేఆపదను గ్రహించి సింహికను సంహరించాడు.
కర్తవ్యపాలనలో దృఢచిత్తంలో వెళుతున్న మన వేగాన్ని మందగింపజేసేది మనలో అదృశ్యంగా ఉన్న ’అసూయ’యే సింహిక. ఎవరైనా మనకన్నా అభివృద్ధి సాధించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదిస్తే మనలో తెలియకుండానే వారిపట్ల అసూయ కలుగుతుంది. అసూయాగ్నితో దహించుకుపోతున్న మనసు ఆలోచనా శక్తి కోల్పోయి మన అభివృద్ధిని మందగింప జేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండి అసూయ అనే సింహికను ఎదుర్కోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment