గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

వైద్యులు సాధ్యం కాదన్నతరువాతకూడా ,భోళాశంకరుని అనుగ్రహంతో సంతానం పొందిన దంపతులు.వైద్యులు సాధ్యం కాదన్నతరువాతకూడా ,భోళాశంకరుని అనుగ్రహంతో సంతానం పొందిన దంపతులు.

భగవంతుని కృపకు అవధులుండవు .అసాధ్యాలు అని మనమనుకున్నవి ఆయన అనుగ్రహంతో సుసాధ్యాలవుతుంటాయి.అందుకే అంటారు “మూకం కరోతివాచాలం ,ఫంగుంలంఘయితే గిరిం” అని. అంటే మూగవాడు వాచాలునిగా మారగలడు,కుంటివాడు కొండలనెక్కగలడు భగవంతుని కృప ఉంటే అని అర్ధం . ఇప్పుడు నాకు ప్రత్యక్షనిదర్శనం గా కనిపిస్తున్న అమ్మవారి లీలను మీకొకటి మనవిచేస్తాను.


మా మండలంలో నమశ్శివాయ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక దినపత్రికలో విలేఖరి . పందొమ్మిదివందల తొంభైఒకటిలో వివాహమైంది . అనుకూల దాంపత్యం . ఉన్నంతలో సంతోషకరమైన జీవితమే . కాని ఒక్కటేబాధ. సంతానం లేదు . ఇక మానవప్రయత్నాలన్నీ చేశాడు. విన్ఉకొండ ,నరసరావుపేట, గుంటూరు విజయవాడ ఇలా ఎక్కడ ఈవిషయమై పేరున్న డాక్టర్లుంటే అక్కడకు తిరిగాడు . అతని భార్యకు గర్భసంచిలో ఉన్న లోపంవలన ఇబ్బంది అన్నారు. అనేక రకాలవైద్యాలనంతరం చివరకు చిన్నపాటి శస్త్రచికిత్సకూడా జరిపారు. ఈఅమ్మాయికి గర్భం ధరించే అవకాశం దాదాపు లేనట్లే నని డాక్టర్లు తేల్చి చెప్పారు . ఇక దంపతులిరువురకు దుఃఖం మిక్కుటమైంది . మోడువారిన చెట్లమాదిరిగా గడపాల్సిందేనా జీవితం అని కుమిలిపోతున్నారు . ఇద్దరు దైవభక్తి కలవారే.
ఇక్కడ మొదలైంది భగవంతుని లీలావినోదం. గత మహాశివరాత్రి రోజున ఎప్పుడూ పీఠానికి రానివారు మరొక పాత్రికేయమితృని కుటుంబం తో కలసి వచ్చారు . ఆ వారితో శివాభిషేకం చేపించాను . వీళ్ల సమస్యను నాకు ఆమితృడు చెప్పాడు. మనుషులము మనమేమి చేయగలము . అనుగ్రహించాలన్నా ఆర్తిని తొలగించాలన్నా ఆయనకే సాధ్యం. అనుకోకుండా వచ్చారు . ఎవరుకూడా అమ్మవారి అనుమతి లేకుండా నేనుపిలచినా పీఠానికి రారు. ఇది ఆతల్లిపిలుపే అయి ఉంటుంది. అదీగాక ఈరోజు మహాశివరాత్రి . మనం మనసుపెట్టిపిలిస్తే పలికే భోళాశంకరుడు స్వామి .అడగండి స్వామిని ,మీకేంకావాలో ! మీ దుఃఖాన్నంతా గంగలామార్చి స్వామిని అభిషేకించండి అనిచెప్పాను. మనస్సునిండా భక్తితో ఆర్తితో చేతులారా శివునిపూజించుకునేలా అవకాశం కల్పించాను . మీరు స్వామిని దేవుడనికాదు ,మీతండ్రి అనేభావనతో ప్రార్ధించండి.ఆయన మీస్వంతమన్న నమ్మకంతో పూజించండి అనిచెప్పాను . తీర్ధప్రసాదాలిస్తూ వచ్చే ఈరోజుకు ముగ్గురైవచ్చి ముక్కంటి పూజచేసుకుంటారు అన్నానట నేను [నాకు గుర్తులేదు .వాల్లే చెబుతున్నారు] [స్వామి అలాపలికించాడేమో గాని నాకు గమనిక లేదు]వాల్ల భక్తికి పొంగిపోయాడు కాబోలు ఆ భక్తజనవశంకరుడు , మరలా ఆ అమ్మాయికి నెలసరి రాలేదు . వాల్ల ఆనందానికి అవధులులేవు . చెప్పినవిధంగా స్వామిని స్తుతిస్తూ మరచిపోకుండా ఉన్నారు . నవమసాల అనంతరం శుక్రవారం రోజు వాల్ల ఇంట్లో వెన్నెలజల్లు కురిసింది . ముందుగా అతను నాకే ఫోన్ చేశాడు.
శుభం . లక్ష్మీదేవి అంశమయ్యా .నీకు ఇక అన్నీ శుభాలే అని చెప్పాను . ఫోన్ లో
. మీ అను… మాస్టారూ….అనబోతే వారించాను. ఇక్కడే మనం పొరబడేది . మనిషిద్వారా ఏమీజరుగదు. నీభక్తి స్వామి అనుగ్రహం .అది మరుచి వ్యక్తులనుకారకులుగా భావించకూడదు నీకు ఆయన చూపిన ప్రత్యక్షలీలతో మరింతశ్రధ్ధాశక్తులతో ఆయనను ఆశ్రయించి ఉండాలి అని వివరించాను. పాపకు లక్ష్మీ అనిపేరుపెట్టమన్నాను .

మొన్న జరిగిన కళ్యాణానికి పాపను తీసుకుని వచ్చాడు . ఎంతచక్కగా ఉన్నదో .నవ్వుతూ. ! అమ్మవారిముందు పాపను ఉంచి అమ్మా !ఇది నీప్రసాదం అని దంపతులిద్దరు కళ్లవెంట ఆనందభాష్పాలు పొంగుతుంటే తమఆనందాన్ని తెలియజేసుకున్నారు .
.

ఇది దైవలీల . అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి నమ్మకముంటే . ఆర్తి కలగాలి . ఆశ్రయించాలి
ఎలా గంటే చిన్ననాడు మనం తల్లిని హఠం చేసి మనకుకావలసిన మిఠాయిలను సాధించుకున్నామే !ఆ హఠం .కావాలి.అమ్మఊరెలతానంటే కిందపడి పొర్లి ఏడ్చి, ఏడ్చి అమ్మకాళ్లకుమనచేతులు పెనవేసివదలను అని మొండికేశామే ! అటువంటి ఆర్తి,తపన కావాలి . మన “మాయ” ఏడ్పులు ,మొక్కులు ఆ మహామాయ దగ్గర పనిచేయవు . నిజమైన ప్రేమ ,నమ్మకం కావాలి .అవి ఉంటే జీవితమంతా ప్రత్యక్షలీలలే .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML