గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

కార్తీకమాసం ముగిసిపోయి మార్గశీర్షానికి ఆహ్వానం పలుకుతోంది .కార్తీకమాసం ముగిసిపోయి మార్గశీర్షానికి ఆహ్వానం పలుకుతోంది .

‘‘మాసానాం మార్గశీర్షోస్మి’’ అనే గీతా సూక్తి .ఈ మాసంలో హరి నామాన్ని నోరారా పలికితే సకల శుభాలుకలుగుతాయని గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో పలుమార్లు పేర్కొన్నది. పోతన ‘‘శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’’ అంటూ భగవన్నామాన్ని పలుకని నాలుక నాలు కే కాదని, నోరు నొవ్వంగ భగవన్నామాన్ని పలకాలని ఉపదేశించాడు.


పాపరాశినంతటిని భక్తితో చేసే హరినామ సంకీర్తనమొక్కటియే నశింపజేయునని
‘‘శమాయాలం జలం వహ్నేస్తమసో భాస్కరోదయః
శాన్తిః కలౌ హ్యఘౌఘస్య నామ సంకీర్తనం హరేః॥
అనే శ్లోకము మనకు ఉద్బోధిస్తున్నది.
వేల గంగా స్నానములు, కోటి పుష్కర స్నానముల వల్ల తొలగని పాపములు కూడా హరినామస్మరణ వల్ల నశిస్తాయని, తపస్సు ద్వారా, కర్మానుష్ఠానము ద్వారా చేయు ప్రాయశ్చిత్తములకంటెను శ్రీకృష్ణ నామస్మర ణమే సర్వశ్రేష్ఠమైనదని మన ప్రాచీన వాఙ్మయంలో ఉంది. ఏకాగ్రచిత్తులై మధుసూదనుని స్మరించువారు పుట్టుక, చావు, ముసలితనము అనే మొసళ్లతో కూడిన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటగలుగుతారని, అందుకు వేరొక సులభోపాయమేదీ లేదని
‘‘ఏకమేకాగ్రచిత్తస్సన్ సంస్మరన్మధుసూదనమ్‌
జన్మమృత్యుజరాగ్రాహం సంసారాబ్ధిం తరిష్యతి॥
‘‘నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే’’
వంటి ప్రమాణములు మనకు ఉద్బోధిస్తున్నాయి.
శ్రీ రామచంద్రస్వామి కన్న శ్రీరామ నామ మహి మయే గొప్పదని భావించే మనము నోరారా భగవన్నా మాన్ని పాడి సకల శుభాలను సొంతం చేసుకుందాం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML