గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 11 December 2015

పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయము ......పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయము ......

పూర్వము తారకుడనే రాక్షసుడు శివ పరమ భక్తుడు , ఆ భక్తి తో శివుడిని మెప్పించి వరముగా ఆత్మలింగముని పొందాడు . ఆ ఆత్మలింగమును ధరించి అతడు బలగర్వముతో మానవులను , దేవతలను హింసించ సాగాడు , ఆ హింసాలను భరించలేక దేవతలు పరమ శివుడు దగరకు వేళ్లి ప్రార్ధించగా శివుడు వారి కోరిక మేరకు , తన కుమారుడైన కుమార స్వామి ( సుబ్రమణ్య స్వామి ) ని తారకుసురుడను వధించి రమ్మని చేప్పి పంపించేను .తండ్రీ ఆజ్ఞానుసారము కుమార స్వామి వెళ్ళి తారకాసురుని ఎదురించేను , వారి ఇరువురి మద్య ఘోరమైన యుద్దము జరిగింది , కుమారస్వామి ప్రయోగించే అస్త్రములు విఫలమైనవి , కుమారస్వామి కి ఆత్మలింగా మహత్యము వ్యక్తమైనది . వెంటనే కుమారస్వామి శివునిని ప్రార్దించి ఒక దివ్యమైన అస్త్రమును పొందెను . ఆ అస్త్రము తో తారకాసురుడు ధరించిన ఆత్మ లింగమును కుమారస్వామి 5 ముక్కలుగా ఛేదించేను , ఆ ఐదు ముక్కలు చెదిరి ఐదు వేరు వేరు స్థలములలో పడినవి , ఆ శివలింగము ముక్కలు పడినచోట్ల ఆరామాలుగా పేరు పొందాయి .
ఐదు ఆరామాలలో ఒక ఆరామము ఈ అమరావతి .అమరావతిలో పడిన శివలింగమును ఇంద్రుడు పూజించి ప్రతిష్టించి ఒకా ఆలయమును నిర్మించాడు అదే ఈ అమరేశ్వరస్వామి ఆలయము గా ప్రసిద్ధి చెందినది .
గుంటూరు జిల్లా లో కృష్ణ నాది తీరము నా గల అమరావతీ గ్రామము నందు ఈ అమరేశ్వరుని ఆలయము కలధు.
ఇది చాలా ప్రాచీనమైన ఆలయము . నాల్గువైపుల మహోన్నతమైన గోపురాలతో విరాజిల్లే ఆలయము శ్రీ అమరేశ్వర స్వామి నిలయము . చారిత్రాత్మక ప్రసిద్ద పౌరాణిక పుణ్యస్థలం ఈ అమరావతి . కృష్ణ వేణి నాడీ తీరమున త్రినేత్రుడైన స్వామి వారు మూడు గొప్ప ప్రాకారములతో నిర్మించిన మహాక్షేత్రములో కొలువుదీరి భక్తుల కోరిన కొర్కెలు తీర్చే అమరేశ్వరుడి గా కొలువై వున్నాడు . ఈ ఆలయమునకు నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు వున్నాయి .
తూర్పు వైపు గాలిగోపురము నుండి 20 గజముల దూరములో కృష్ణ ప్రవాహమునకు వెళ్ళుటకు దారికలదు .
దక్షిణ వైపు గాలిగోపురము ద్వారానే ఎవరైనా ఆలయములోకి వెళ్లవలెను .
కొండవీటి రెడ్డి రాజులపై విజయా సంవత్సరము 1517 లో చారిత్రక ప్రాంతము కృష్ణ తీరమును దర్శించి న కృష్ణ దేవరాయులు ఇక్కడి అమరేశ్వరునికి మహా పూజలు చేసి , పెదమద్దూరు గ్రామ పంట భూములన్నీ ఆలయానికి దానము ఇచ్చినట్లు గా ఇక్కడ ఉన్న రాజా శాసనం ద్వార తెలుస్తుంది . ఇక్కడ శ్రీ కృష్ణ దేవారాయలు తులాభారము తూగారు . తన బరువుతో సమానమైన బంగారాన్ని పెదలకు పంచి పెట్టి నట్టు గా ఆ శాసనములో తెలుస్తుంది . అందుకు గుర్తు గా శ్రీ రాయలవారు నిర్మించిన తులాభారము అనే పేరుగల మండపము , దాని ముందు వేయించిన శాసనము నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి . ఇది ఈ ఆలయములో ని దక్షీణ రెండో ప్రాకరములో వుంది .
ఈ ఆలయమునకు మూడు ప్రాకరములు వున్నాయి వానిలో 1-2 ప్రాకారాల మద్య మహిషాసురమర్దిని , కౌసలేశ్వరస్వామి , వీరభద్రస్వామి , కాశీ అన్నపూర్ణే అమ్మవారు , పరణవేశ్వరుడు , దత్తాత్రేయుడు , అమరేశ్వరుడు , జ్వాలాముఖి అమ్మవారు , పార్దికేశ్వరుడు , సోమేశ్వరుడు మొదలైన దేవతామూర్తులు వున్నారు , 2-3 ప్రాకరములలో విఘ్నేశ్వరుడు , కృష్ణ దేవరాయుల తులభారము , నాగ మండపము , కాలభైరవుడు , కుమారస్వామి , ఆంజనేయస్వామి , యాగశాల , నవగ్రహములు మొదలయినవి . వున్నాయి వాటిని మనము దర్శించుకొవొచ్చును .
ఈ అమరావతిలో శివలింగము చాలా పెద్దది , ఇది ఆత్మలింగము కావడము వలన రోజు రోజుకి పేరిగిపోవడముతో ఇంద్రుడు ఆత్మలింగమునకు పరిహరార్దము అర్చనలు , పంచామృతములతో అభిషేకములు , పూజలు చేసి స్వామి వారిని శాంత పరిచినారు అపటి నుండి మామూలు స్థానములో నే వుంది . పెరగలేదు ...
ఈ లింగము 3 అడుగులు చుట్టుకొలత, 60 అడుగుల ఎత్తు వుంటుంది . ...
పుణ్య క్షేత్రము అయిన ఈ పరమ పవిత్రమైన అమరావతి ఆత్మలింగమును దర్శించి తరించండి
రుద్రప్రయాగ
రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినది. ఆ జిల్లాలు చమోలి, పౌరి మరియు తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్ , 1997 లో ప్రకటించారు. ఈ టవున్ మందాకినీ మరియు అలకనంద నదుల సంగమంలో కలదు.
* ఆలయలు ఆకర్షణలు
రుద్రప్రయాగ్ ఆలయ సమీపంలో జగదంబ ఆలయం ఉంది. .అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో ప్రసిద్ధ ఆకర్షణలలో దేవోరియ సరస్సు ఒకటి. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు శిఖర శ్రేణులతో ఇక్కడే కల గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ, యమునోత్రి మరియు నీల కంట శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్(పక్షుల వీక్షణ) వాటర్ బోటింగ్ మరియు యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.
ఇక్కడ కల త్రియుగినారాయన్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేస్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి గుప్తకాశి, ఉఖి మట్, వాసుకి తాల్, జఖోలి మరియు తుంగనాత్ వంటివి కలవు. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు.
* ఘాటులు
ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి కలదు. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశి ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.
* రుద్రప్రయాగ ఆలయం
అలకనంద మరియు మందాకినీ అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ్ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబ దేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ.
* త్రియుగ నారాయణ్ ఆలయం
రుద్ర ప్రయగ్ లో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను ఆశీర్వదిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశ సమీపంలో ఒక విష్ణు ఆలయం ఉంది. దీని శిల్పశైలి కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు రుద్రకుండ్, విష్ణు కుండ్ మరియు బ్రహ్మ కుండ్ లు తప్పక చూడాలి. ఈ మూడు కుండ్ లకు సరస్వతి కుండ్ మూల స్థానం. స్థానికుల నమ్మిక మేరకు ఈ కుండ్ నీరు విష్ణు నాభి స్థానం నుండి వస్తుందని చెపుతారు. ఈ నీరు మహిళల సంతానవిహీనతను లేకుండా పోగొడ్తుందని విశ్వసిస్తున్నారు.
* ప్రయాణ సౌకర్యాలు
రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
* రోడ్డు ప్రయాణం
రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సు లు కలవు. రుద్రప్రయాగ్ వాయు,
* రైలు మార్గం
రుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషను సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషను. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
* వాయుమార్గం
రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML