శ్రీ వైద్యనాధేశ్వరాలయం-పుష్పగిరి
కడపజిల్లా, పుష్పగిరి గ్రామంలో, పినాకినీ నదీ తీరాన ఈ ఆలయం కలదు. ఈ దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి, పరమేశ్వరుని గూర్చి, ఈ పుష్పగిరి యందు తపస్సు చేయగా, ఆయనకు పరమేశ్వరుడు వైద్యనాధునిగా దర్శనమిచ్చి, వైద్యవిద్యను- ఔషద రహస్యాలను లోకాలకు వెల్లడించమని ఆదేశించాడు. తరువాత ధన్వంతరి కోరికపై ఆ ప్రదేశమునందు పరమేశ్వరుడు లింగరూపంలో వెలిసాడు.
ఒకసారి ఆదిశంకరాచార్యులు స్వామివారిని దర్శించి ఈ ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతీష్ఠించారు. తరువాత కాలక్రమంలో ఈ ఆలయ ఆవరణలోనే త్రికూటేశ్వరాలయం, భీమేశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం కూడా నిర్మింపబడ్డాయి. ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు చైత్రబహుళ త్రయోదశి నుండి తొమ్మిది రోజులు జరిగే పుష్పగిరి తిరునాళ్ళ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి.
No comments:
Post a comment