
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Sunday, 20 December 2015
అమ్మవారు-కాళికాదేవి
అమ్మవారు-కాళికాదేవి
లోకకల్యాణం కోసం ఆదిపరాశక్తి అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ... అభయ వరద హస్తాలతో కొలువుదీరి వుంటే, భక్తులు నయనానందకరంగా దర్శించుకుంటూ వుంటారు. ఇక ఆ తల్లి కాళికాదేవిగా కొలువై వుంటే చూడటానికే కొంతమంది సంశయిస్తుంటారు.
నల్లని మేని రంగుతో ... చెదిరిన జుట్టుతో ... వెన్నులో వణుకు పుట్టించే చూపులతో ... రక్తం అంటిన ఎర్రని నాలుకను బయటికి చాపి అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. జగన్మాతగా చెప్పబడుతోన్న అమ్మవారు ఎందుకు ఇంతటి భయంకరమైన రూపాన్ని ధరించిందనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. కాళికాదేవి రూపాన్ని అమ్మవారు ధరించడం వెనుక కూడా లోకకళ్యాణమే కనిపిస్తుంది.
'రక్తబీజుడు' అనే రాక్షసుడు వరబలగర్వంతో దేవతలను ... సాధుసజ్జనులను వేధిస్తుంటాడు. వాళ్ల అభ్యర్థన మేరకు ఆ రాక్షసుడిని సంహరించడానికి కుమారస్వామి రంగంలోకి దిగుతాడు. అయితే ఆ రాక్షసుడి శరీరం నుంచి కిందపడిన ఒక్కో రక్తపు చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తుంటాడు. దాంతో అసహనానికి లోనైన కుమారస్వామి తన తల్లిని ప్రార్ధిస్తాడు.
అప్పుడు పార్వతీదేవి ... కాళికాదేవి రూపాన్ని ధరిస్తుంది. కుమారస్వామి రక్తబీజుడిని సంహరిస్తూ వుండగా, ఆ అసురుడి శరీరం నుంచి చిందిన రక్తం నేలపై పడకుండా తన నాలుకను చాపలా పరుస్తుంది. దాంతో కుమారస్వామితో ఒంటరిగా పోరాడలేకపోయిన రక్తబీజుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోతాడు. అలా లోకకల్యాణం కోసం అమ్మవారు అంతటి భయానకమైన రూపాన్ని ధరించినా, ఆ రూపం వెనుక కన్నతల్లి వంటి ఆమె చల్లని మనసు భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment